24, జూన్ 2023, శనివారం

పన్నెండవ సామాన్య ఆదివారం

 

 

పన్నెండవ సామాన్య ఆదివారం

యిర్మియా 20: 10-13, రోమా 5: 12-15, మత్తయి 10: 26-33

బ్రదర్. సుభాష్ .సి.డి

క్రీస్తుని అంగీకరించిన వారిని దేవుడు అంగీకరించును

నాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనందరిని కూడ సత్యానికి సాక్షులుగా జీవించమని తెలియ చేస్తున్నాయి. అదేవిధంగా దేవుడు తనను నమ్మినవారిని ఎన్నటికిని విడిచిపెట్టడు అని కూడ తెలియచేస్తున్నాయి.

నాటి మొదటి పఠనము యిర్మియా గ్రంధం నుండి తీసుకొనబడింది. వాక్యాలను యిర్మియా ప్రవక్త యొక్క విలాప గీతం అని కూడా అంటారు.

యిర్మియా ప్రవక్త చాల ధైర్యము కలవాడు  ఎందుకంటే ప్రవక్త క్రీ. పూ 626 సంవత్సరం యూదా రాజ్యమును పరిపాలించిన ఐదుగురు రాజులకాలంలో వస్తారు. జోషియా, జెహోయాహాజ్, జెహోయాకీము, జెహోయాకీను మరియు జెదేకయ్య .

కానీ పషూరు అను యాజకుడు యిర్మియా ప్రవక్త చెప్పిన మాటలకూ భయపడి యిర్మియా ను భాదించుచు ప్రవక్తను చంపాలని అనుకున్న సమయంలో యిర్మియా దేవునికి మొరపెట్టుకున్నా సందర్భమే ఈనాటి మొదటి పఠనం.

దీనిని యిర్మియా ప్రవక్తయొక్క విలాప గీతం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే యిర్మియా ప్రవక్త దేవుని నమ్ముకొని, ఆయన ఉన్నాడనే ధైర్యయముతో, దేవుని ఆజ్ఞ మేరకు, అన్యాయంగా పరిపాలిస్తూన్నా యూదా రాజైన జెహోయాకీమును, యాజకులను, చిత్తశుద్ధి లేని, విగ్రహారాదనలు చేస్తున్న యూదా ప్రజలను, వారి దుష్ప్రవర్తనలనూ, దేవుడిని మరిచి పోయన యూదా ప్రజలను ఖండించి, సత్యం కోసం, దేవునికోసం పోరాడుతూ తిరిగి దేవుని చెంతంకు రండు అని భోదించాడు అందుకు గాను ప్రవక్తను తన సొంత ప్రజలే చంపాలని చిత్ర హింసలు చేసారు.

సమయంలోనిదె   మొదటి పఠనం. ఇందు లో రెండు భాగాలను మనం చూడవచ్చు.

మొదటిగ; ప్రవక్తయొక్క ఫిర్యాదు

నీవు నన్ను చెరచితివి, నేను చెడతిని ఎల్లరు నన్ను గేలి చేయుచున్నారు  దినమెల్ల నన్ను చూపి నవ్వుతున్నారు.ని సందేశమును చెప్పినందుకు గాను జనుల నన్ను  అవమానించి,ఎగతాళి చేయుచున్నారు అని దేవుని యందు మొరపెట్టుకుంటాడు.

రెండవ భాగము ప్రవక్తకి ఊరట  ;

దేవుడు తనతోనే ఉన్నాడని తిరిగి ధైర్యమును శక్తిని పుంజుకొనెను. మొదటి పఠనం నుండి మనం గ్రహించవలసినది దేవుడు  తన సేవకులకు ఎన్నటికిని విడిచిపెట్టడు;

 

రెండవ పఠనము

రెండవ పఠనంలో పునీత పౌలు గారు ఇద్దరు వ్యక్తులను మనకు ఉదాహరణలుగ చూపిస్తున్నారు. ఆదాము మరియు యేసు క్రీస్తు.

ఆదాము అవిధేయతవలన, పాపమూ మరియు మరణము సంభవించింది.

కానీ క్రీస్తు విధేయత వలన, ఆయన త్యాగము వలన మనకు నూతన జీవితం లేదా నిత్య జీవితం మనకు లభించింది.

అయితే పునీత పౌలు గారు మనకు ఏమని భోదించాలనుకుంటున్నారు ?

మనము కూడా ఆదాము వలన దేవుని వాక్యాన్ని లేదా దేవుని ఆజ్ఞలను పాటించక పోతే మనకు కూడా పాపము అనే మరణము సంభవిస్తుంది.

కానీ క్రీస్తుని స్వీకరించి, క్రీస్తుని విశ్వసిస్తే మనము కూడా నూతన జీవితమును, లేదా నిత్య జీవితమును , దేవుని ఆశీర్వాదములను పొందుకుంటాం.

సువిశేషము

నాటి సువిశేషములో రెండు విషయాలను మనము గ్రహించవచ్చు

మొదటిగా. వెలుగు జీవితం

దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిచడం, ఇక్కడ వెలుగు అంటే సత్యం కోసం జీవించడం, సైతాను తిరస్కరించడం, చీకటి జీవితాన్ని త్యజించడం.

రెండవదిగా. క్రీస్తుని అంగీకరించిన వారిని, తండ్రి దేవుడు కూడా అంగీకరించును. క్రీస్తుని తృణీకరించిన వారిని తండ్రి దేవుడు కూడా తృణీకరించును.

క్రీస్తు ప్రభువు తన పన్నిద్దరు సిహ్యులను పిలిచి వేద ప్రచారానికి పంపించు సమయములో శిష్యులకు ఇచ్చినటువంటి హెచ్చరికలలోని భాగమే నాటి సువిశేషం. ఎందుకంటే యూదా ప్రజలు క్రీస్తుని తిరస్కరించారు, హింసించారు, వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాటలే సువిశేషం.

శరీరమును నాశనము చేయు మానవులకు భయపడవలదు. కానీ దేవునికి జీవము నిచ్చు శక్తి మరియు  ఆత్మను శరీరమును నాశనము చేయు శక్తికలిగిన దేవునికి భయపడుము అని బోధిస్తున్నారు.

మొదటి పఠనములో కూడా మనము చూస్తున్నాం. యిర్మియా ప్రవక్తను ఎంత హింసించినను ఆయన వెనుకంజ వేయలేదు, లొంగలేదు.

క్రీస్తు ప్రభువు కూడా మరణానికి కూడా భయపడలేదు వీరిద్దరూ కూడా అన్యాయాన్ని ఎదురించారు, సత్యం కోసం ప్రయాసపడ్డారు, కష్టాలలో కూడా దేవుని వాక్యాన్ని భోదించారు.

మనము కూడా భయపడవలసినది న్యాయబద్ధమైన దేవునికి, అన్యాయపు మానవులకు కాదు .

సామెతలు 9 : 10  దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ణానమునకు మొదటి మెట్టు .

కీర్తనలు 130 : 2 మేము నీ పట్ల భయభక్తులు చూపుదము కనుక నీవు మమ్ము క్షమింతువు.

క్రీస్తు ప్రభువు కూడా కొన్నిసార్లు శిష్యులతో భయపడవలదు నేను మీతో ఉన్నాను అని చెప్పటం మనం చూస్తున్నాం.

శిష్యులు సముద్రంలో గాలి తుఫానుకు భయపడినప్పుడు

క్రీస్తు మరణించినతరువాత  సువార్తను బోధించడానికి భయపడి దాక్కొని ఉన్న సందర్భాలలో  కూడా మనం చూస్తున్నాం.

కాబట్టి మూడు పఠనాలు కూడా మనకు దేవుడు మనతోనే ఉన్నాడనే ధైర్యాన్ని ఇస్తున్నాయి. మన కుటుంభ జీవితం లేదా గురు జీవితం, సన్యాస జీవితం, దైవాంకిత జీవితంలో, వ్యాపారాలలో, నిజాయితీగా జీవిస్తున్న సమయాలలో, అన్యాయాన్ని వ్యతిరేకించిన సందర్భాలలో, మనం కూడా యిర్మియా ప్రవక్త వలె, క్రీస్తు వలె ధైర్యాన్ని కలిగి, దేవుడు మనతోనే ఉన్నాడు, మనలను విడిచిపెట్టడు అనే విశ్వాసంతో జీవిద్దాం.

17, జూన్ 2023, శనివారం

11 వ సామాన్య ఆదివారం

11 వ సామాన్య ఆదివారం

నిర్గమ 19:2-6

రోమి 5:6-11

మత్తయి 9:36-10:8

 ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క సేవకుల గురించి తెలియజేస్తున్నాయి. మనందరిని కూడా దేవుని యొక్క సువార్త పరిచర్యకు ప్రభువు ఎన్నుకొన్నారు. మనం కూడా పరిచర్య చేస్తూ ఈ లోకంలో ఉన్న వారిని పరలోకం వైపు నడిపించాలి.

ఈనాటి మొదటి పఠనం లో యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఉన్న ప్రేమను చూపిస్తున్నారు.

యావే  దేవుడు ఇశ్రాయేలును ప్రత్యేకంగా ప్రేమించి, ఎన్నుకొని తన సొంత వారిని గా చేశారు.

ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి విడిపించిన తరువాత ఏ విధంగా వారిని ఎడారిలో నడిపించి వారి యొక్క ప్రతి అవసరంలో తోడుగా ఉన్నారో తెలిపారు.

ఏ విధంగానైతే గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవునో  అలాగే తాను కూడా ఇస్రాయేలు ప్రజలను మోసుకొని వచ్చారు అని తెలిపారు.

ప్రజలందరిలో కన్నా ఇశ్రాయేలు ప్రజలే మొదటిగా ఎక్కువగా ప్రేమించబడ్డారు. అందుకనే దేవుడు  వారికి అంత ప్రాధాన్యత ఇచ్చి వారిని కంటికి రెప్పలాగా కాపాడారు.

గరుడ పక్షి తన బిడ్డలకు ఎటువంటి ఆపద కలగకుండా కాపాడినట్లు దేవుడు కూడా ఇస్రాయిలను కాచి కాపాడారు. ఇస్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణించినప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు దేవుడు వారికి సకాలంలో అంతయు సమకూర్చారు.

ఈ మొదటి పఠనం లో  యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను యాజక రూపమైన రాజ్యాంగాను, పరిశుద్ధమైన జనం గాను ఎన్నిక చేసిన విషయంను వెల్లడిస్తున్నారు.

ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ యాజకులు రూపమైన రాజ్యాంగ చేశారంటే ప్రజలందరిలో ఇశ్రాయేలు ప్రజలు సుమాతృకమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులను దేవుని చెంతకు చేర్చాలని ప్రభువు కోరిక.

యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధమైన జనం ఎందుకంటే ఇస్రాయేలీయులు వెలుగుగా ఉండుట కొరకు, ఆ వెలుగు ఇతరులను యావే దేవుని చెంతకు నడిపించుటకు ప్రభువు వారిని యాజక రాజ్యంగా చేశారు.

యాజకుడు ప్రజలను దేవుని చెంతకు నడిపించిన విధంగా ఇశ్రాయేలీయులు కూడా అన్యులను దేవుని చెంతకు నడిపిస్తారని.

యావే దేవుడు ఇస్రాయేలు ప్రజల పట్ల అంత ప్రేమ చూపటానికి కారణం ఏమిటంటే సమస్త జనుల కంటే వారు లెక్కకు తక్కువే వారికి సైనిక బలం తక్కువే నిరాకరించబడిన వారే  అందుకే తక్కువ కలిగిన వారిని ప్రభువు ప్రేమిస్తూ వారిని విముక్తులను చేసి తన సొంత ప్రజలుగా చేశారు.

దేవుడు అందరినీ ప్రేమించారు అందరూ ఆయనకు చెందినవారే, ఒక ప్రజలను ఎన్నుకొని తన యొక్క గొప్పతనం, ప్రేమను చాటి చెప్పాలన్నది ప్రభువు ప్రణాళిక.

అన్యుల  యొక్క నిమిత్తమే ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నారు, మానవులందరి రక్షణార్థం ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఒక సాధనంగా ఏర్పరుచుకున్నారు.

యాజకులు దేవునికి మానవులకు ఏ విధంగా మధ్యవర్తులుగా ఉన్నారో  అలాగే ఇస్రాయేలు ప్రజలు కూడా అన్యజాతి ప్రజలకు మధ్యవర్తులే, అందుకనే దేవుడు వారిని యాజక రూపమైన రాజ్యమని, పరిశుద్ధమైన రాజ్యమని సంబోధించారు.

ఈనాటి రెండవ పఠనం లో  పౌలు గారు యేసు క్రీస్తు ప్రభువు మన మీద చూపించిన అపారమైన ప్రేమను గురించి తెలుపుచున్నారు.

మనం పాపాత్ములుగా ఉన్నప్పటికీని, బలహీనుల మైనప్పటికిని, దేవుడు మనలను అధికంగా ప్రేమించారు. ఆయన ప్రేమను పొందుటకు అనర్హులమైనప్పటికిని ఆయన తన కుమారుని రక్తం చేత మనలను రక్షించి నీతిమంతులను చేశారు, కాబట్టి మనం కూడా దేవుని యొక్క సొంత ప్రజలం దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలం పవిత్ర జనం కాబట్టి ఆయన యందు మనం ఆనందించాలి.

ఈనాటి సువిశేష పఠనం లో   యేసు ప్రభువు శిష్యులను సువార్త  సేవకు పంపిచ్చుట విధానంను చదువుకుంటునాం. ఈ లోకంలో ఉన్న ప్రజలందరిని సువార్త పరిచర్య ద్వారా పవిత్రపరచుటను దేవుని ప్రజలుగా చేయుటకు శిష్యులను ఎన్నుకొని వారిని వివిధ ప్రాంతాలకు సేవ నిమిత్తమై పంపిస్తున్నారు. ఏసుప్రభువు ఈ 12 మంది శిష్యులను తన యొక్క సాధనములుగా ఎన్నుకుంటున్నారు. వారిని ఎన్నుకొని వారి ద్వారా మిగతా వారిని కూడా తన వారిగా ఎన్నుకుంటున్నారు.

ఈ పన్నిద్దరు  శిష్యులు నూతన యాజక ప్రజలకు పునాది. ఈ సువిశేషంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు కాపరిలేని ప్రజలను చూసి ఆయన కడుపు తరుగుకొని పోయాను అని చెప్పారు తన యొక్క కరుణ వలన ప్రభువు మన వైపు తిరిగి మనలను ప్రేమించారు.

దేవుడు పని ఇద్దరిని ఎన్నుకున్నది పంపించుట కొరకే - మార్కు 3-13-14.

ప్రజల యొక్క అత్యవసరాలను ప్రభువు గుర్తించి వారిని రక్షించుట కొరకు 

ప్రభువు శిష్యులను పంపిస్తున్నారు శిష్యులను రెండు రకాలైన బాధితులను శిష్యులకు అప్పచెప్పుచున్నారు:

1. ప్రకటించుట

2. స్వస్థపరచుట

1. ప్రకటించుట :

మొట్టమొదటిగా ప్రభుశులను దైవ రాజ్యం సమీపించినది అని ప్రకటించమని కోరుచున్నారు. శిష్యులను అన్నింటిలో సంసిద్ధం చేసిన తర్వాత ప్రభువు వారిని దైవ రాజ్యం గురించి ప్రకటించమన్నారు. దైవ ప్రేమ దేవుని యొక్క రక్షణ గురించి అదే విధంగా పవిత్రంగా జీవించుట గురించి ప్రకటించమని ప్రభువు ఆదేశించారు.

జ్ఞానేస్నానం పొందిన మనందరం కూడా ప్రభువును గురించి ప్రకటించాలి. దేవుని యొక్క కరుణ మంచితనం, జాలి, అన్నిటి గురించి ప్రకటించాలి. ఏసుప్రభు యొక్క అపోస్తులు తమ యొక్క వ్యక్తిగత ఆలోచనలు కాదు ప్రకటించవలసింది కేవలం దేవుని సందేశమే దేవుని దగ్గర నుండి స్వీకరించినది మాత్రమే ప్రకటించాలి.

బాప్తిస్మ యోహాను ప్రకటించింది అదియే - మత్తయి 3:2

ఏసుప్రభు సందేశం అదియే - మత్తయి 4:17,23

అలాగే ప్రతి ఒక్కరూ ప్రభువుని యొక్క రక్షణ సందేశంను ప్రకటించాలి.

2. స్వస్థత పరచుట:

ఏసుప్రభు శిష్యునికి అధికారం ఇచ్చి వ్యాధులను నయం చేసి అనుగ్రహంను దయచేసి ప్రభువు శిష్యులను స్వస్థతపరిచె అనుగ్రహం ఇచ్చారు. ఎందుకంటే వారి యొక్క స్వస్థత వరం ద్వారా ప్రజలందరూ కూడా ఏసుప్రభువు శారీరక గాయాలను అనారోగ్యాలను మాన్పుతారు అని. అదేవిధంగా ఆధ్యాత్మిక సంబంధమైన స్వస్థతను కూడా ప్రభు దయచేశారు. మన ఈ నాటి పట్టణాల ద్వారా నేర్చుకోవలసిన అంశాలు ఏమిటంటే.

1. మనం ఎన్నుకొనబడిన ప్రజలు కాబట్టి పవిత్రంగా జీవించాలి.

2. వెలుగుగా ఉంటూ ఇతరులను వెలుగులోనికి నడిపించాలి.

3. క్రీస్తు ప్రభువు గురించి ప్రకటించాలి.

4. స్వస్థత నిచ్చే వ్యక్తులుగా మనం మారాలి.


FR. BALAYESU OCD

16, జూన్ 2023, శుక్రవారం

11 వ సామాన్య ఆదివారం

 11 వ సామాన్య ఆదివారం

నిర్గమ 19:2-6

రోమి 5:6-11

మత్తయి 9:36-10:8


క్రీస్తు కారుణ్యం - శిష్యులను పిలుచుట - దైవ రాజ్య వ్యాప్తి


ఈనాడు తల్లి శ్రీ సభ 11వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈనాటి మూడు పఠనాలు  దేవుని కారుణ్యం, ప్రేమ వ్యాప్తి అంశాలపై ప్రస్తావిస్తున్నాయి.

మొదటి పఠనం: దేవుడు మోషేతో ఇశ్రాయేలు నా నిబంధనలు శ్రద్ధగా పాటించినచో వారు నా వారగుదురు అని నుడువుచున్నారు.

భక్తి కీర్తన:  మనము దేవుని ప్రజలము

రెండవ పఠనం:  మనం పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కోసం మరణించి మనలను దేవునితో సఖ్యపరిచెను.

సువార్త పఠనం: క్రీస్తు ప్రభువు పన్నిద్దరిని  దైవ రాజ్య వ్యాప్తికి పంపుట.

వీటిని మూడు అంశాల రూపేనా ధ్యానిస్తూ అర్థం చేసుకొని మన జీవితాలలో అవలంబింపటానికి ప్రయత్నిద్దాం.

1. క్రీస్తు కారుణ్యం:

గ్రీకు భాషలో కారుణ్యం అనే పదం ఎంతో లోతైన భావం కలిగిన పదం, దీనిని మనం మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో చూస్తున్నాము. ఏసు రద్దుచేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచును (మత్తయి 14: 14), యేసు కనికరించి వారి నేత్రములను తాకేను వెంటనే వారు దృష్టిని పొంది ప్రభువును వెంబడించిరి (20:34), ఏసు జాలిపడి చేయిచాచి వానిని తాకి నాకు ఇష్టమే శుద్ధి పొందుము అనెను (మార్కు 1:41), నాయిను లో వితంతువు కుమారుని చూచి యేసు కనికరించి ఏడవ వద్దమ్మా అని చెప్పి ఆ కుమారునికి జీవాన్ని ప్రసాదించెను (లూకా 7: 13,14). ఇవి యేసు జాలిపడిన, కనికరం చూపిన కొన్ని సన్నివేశాలు.

ఈనాటి సువార్త పఠనం లో కూడా నిస్సహాయులైన బాధలతో కాపరిలేని గొర్రెల వలె చెదిరియున్న జన సమూహమును చూచి జాలితో ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను (మత్తయి 9:36) ఈ సందర్భంలోనే ప్రభువు తన శిష్యులతో పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ కావున పంటను సేకరించడానికి కావలసిన  కోతగాండ్రును పంపవలసినదని పంట యజమానికి మనవి చేయుడు అని పలికెను మత్తయి (9:37,38) పంట దానికై అది కోసుకోలేదు కానీ కొయ్యడానికి దానిని సంరక్షించడానికి ఎవరైనా కోతగాండ్రు కావాలి అదేవిధంగా గొర్రెలు చెదిరి ఉన్నప్పుడు వాటిని తిరిగి క్రమశిక్షణగా మందలోకి చేర్చడానికి కాపరి అవసరం. ఈనాటి ప్రస్తుత సమాజంలో కాపరులేని సంఘాలు ఎన్నో మరెన్నో. కాపరియున్నసరి అయిన కాపరి కాదు అందుకే ప్రభువు పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రులను పంపమని మనవి చెయ్యా మనందరిని ఆహ్వానిస్తున్నాడు దానిని మాత్రమే శిష్యులను పిలిచి అపోస్తులగా సువార్త వ్యాప్తి కోసం పంపుతున్నాడు.

2. శిష్యులను పిలుచుట:

దేవుడు ఎవరిని, ఎక్కడ, ఎలా, ఎప్పుడు పిలుస్తారో తెలియదు, కొంతమందిని పౌలు గారిని పిలిచినట్లు, ఇంకా కొంతమందిని అగస్తీయును గారిని పిలిచినట్లు, మరి కొంతమందిని అస్సిపుర ఫ్రాన్సిస్ గారిని పిలిచినట్లు తన సేవకు పిలవచ్చు, పిలుపు దేవుని నుండి పిలవబడేది. 

మార్కు సువార్త లో ప్రాతఃకాలమన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తుల అని పేరు పెట్టెను. (లూకా 6:13).

అని ఈనాటి సువిశేషంలో యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచాడని శిష్యుల పిలుపు గురించి ఈ మూడు సువార్తల్లో ధ్యానిస్తున్నాము. పిలవబడిన వారు ఎవరి చేత పిలవబడ్డారు, ఎందుకు పిలవబడ్డారు, పిలుపు ఉద్దేశం ఏమిటో గ్రహించాలి. మార్కు సువార్తలో చాలా చక్కగా రాయబడి ఉంది. పిలవబడినది :

1. తనతో ఉండటానికి

2. సువార్త ప్రకటనకు పంపడానికి (మార్కు 3:14)

తనతో ఉండుట అనేది పిలవబడిన వారు మొట్టమొదటిగా ప్రధమముగా చేయవలసిన పని తనతో ఉంటూ తన ఆజ్ఞలను నియమాలను పాటించాలి. ఈనాటి మొదటి పఠనం లో కూడా దేవుడు మోషేతో ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరచమని కోరేది కూడా అదే తన నియమములను పాటిస్తే దేవుని సొంత ప్రజలు రక్షించబడతారు.

తనతో ఉండుట ద్వారా తన ఆజ్ఞలు విధేయించి పాటించుట చాలా సులభం అవుతుంది, తనతో ఉండుట ద్వారా అపర క్రీస్తులా మారగలము, సువార్తను ప్రభావంతంగా శక్తితో అనుగ్రహంతో ప్రకటించగలము అందరిని క్రీస్తు వశం చేయగలం.

3. దైవ రాజ్య వ్యాప్తి:

క్రీస్తు ప్రభువు శిష్యులను పిలుచుటకు  కారణం తనతో ఉండుటకు, అటుపిమ్మట దైవ రాజ్య వ్యాప్తికి, దైవరాజ్య వ్యాప్తి అంటే క్రీస్తు ప్రారంభించిన రక్షణ కార్యాన్ని కొనసాగించడమే పునీత  పౌలు గారు దైవ రాజ్యాన్ని ఈ విధంగా నిర్వహిస్తారు. దేవుని రాజ్యం అనగా తినుట, త్రాగుట కాదు పవిత్రాత్మ ఒసగు నీతి, శాంతి సమాధానములే (రోమి 14:17).

సువార్త పరిచర్య ద్వారా అపోస్తులలు పవిత్రాత్మ ఒసగు శాంతి, సంతోషములు, నీతి ఇవ్వగలగాలి ఈ లోకంలోనే పరలోక రాజ్యాన్ని స్థాపించగలగాలి, ప్రకటించగలగాలి (మత్తయి 10:8), క్రీస్తు ప్రభువు చాలా చక్కగా ఏ విధంగా నీతి శాంతి సమాధానములు వ్యాపింప చేయగలరు తన శిష్యులకు చెబుతున్నారు.

i. వ్యాధిగ్రస్తులు ను స్వస్థపరచుట ద్వారా

ii. మరణించిన వారిని జీవముతో లేపుట ద్వారా

iii. కుష్ఠ రోగులను శుద్దులను గావించుట ద్వారా

iv. దయ్యం లను వెడల గొట్టుట ద్వారా (మత్తయి 10:8)

ఇవన్నీ చేయటానికి ప్రభువు వారికి అధికారాన్ని ఇస్తున్నారు (మత్తయి 10:1)

దీని ద్వారా కేవలం భౌతిక శుద్ధినే కాదు, అంతరంగిక శుద్ధిని కూడా పొందగలరు, ఈ ప్రేషిత  కార్యం బలహీనులకు బలాన్ని, శక్తిహీనులకు శక్తిని బాధలలో అనారోగ్యాలతో, కష్టాలతో, నష్టాలతో ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్లకు సమాజంలో చిన్నచూపు చూడబడే వారికి దేవుడు ఒక ప్రత్యేక స్థానాన్ని వసగుతారు, తన శిలువ మరణం పునరుద్ధానం ద్వారా. (రోమి 5:6-11) ఇదే మనం ఈనాటి రెండో పఠనం లో చూస్తున్నాము దైవరాజ్య వ్యాప్తి కేవలం గురువులకు, కన్య స్త్రీలకు, దైవాంకితులకు, ఉపదేషులకు మాత్రమే పరిమితం కాదు. వారి బాధ్యత మాత్రమే కాదు. మన అందరి బాధ్యత. మన ఆలోచనల ద్వారా  మన కార్యాల ద్వారా మన పరిధిలో మనము సువార్త ప్రకటన చేయగలగాలి సువార్త ప్రకటన అంటే విధులలో బోధించడం, ప్రసంగించడం మాత్రమే కాదు, కుటుంబ జీవితంలో ఒక మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి తల్లిగా, మంచి తండ్రిగా మంచి పిల్లలుగా జీవించి మీ జీవిత విధానం ద్వారా ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండి మీరే ఒక సువార్తికుడిగా మారడం కూడా సువార్త ప్రకటన అవుతుంది, క్రీస్తు ప్రభువు వలే ఇతరుల కష్టాలను, బాధలను, ఇబ్బందులను చూచి చలించగలగాలి, జాలి పడాలి, జాలిపడటం మాత్రమే కాదు మనతో మనకు తోచినంత సహాయం చేయగలగాలి, ఈరోజు నీవు నేను ఈ ప్రేషిత కార్యానికే పిలవబడ్డాం. మన పిలుపునకు తగ్గట్టు జీవించడం సువార్త ప్రకటనకు మన వంతు సహకరిద్దాం. ఈ లోకంలోనేదైవారాజ్య  నిర్మాణానికి మన జీవిత విధానం ద్వారా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ కృషి చేద్దాం. ఆమెన్.

DN. SUNIL INTURI OCD

3, జూన్ 2023, శనివారం

దైవ వాక్కు ధ్యానము : త్రిత్వయిక సర్వేశ్వరుని మహోత్సవం

దైవ వాక్కు ధ్యానము : త్రిత్వయిక సర్వేశ్వరుని మహోత్సవం:  త్రిత్వయిక  సర్వేశ్వరుని మహోత్సవం  సువిశేషము : యేసు అజ్ఞానుసారము పదునొకండుగురు శిష్యులు గలీలియాలోని  పర్వతమునకు వెళ్లిరి. అపుడు వారు ఆయనను ...

27, మే 2023, శనివారం

పెంతుకోస్తు మహోత్సవం

 పెంతుకోస్తు మహోత్సవం

అ. కా. 2 ;1-11
1 కొరింతి 2;3-7,12-13,
యోహాను 20;19-23

ఈరోజు తల్లి శ్రీసభ పెంతుకోస్తు పండుగను కొనియాడుతుంది. ఈరోజును వివిధ రకాలుగా పిలువవచ్చు .  శ్రీసభ ప్రారంభమైన రోజు అని,  పవిత్రాత్మ  శిష్యుల పై వేంచేసి వచ్చిన రోజు అని క్రీస్తునందునికి సాక్షులుగా జీవించమని కోరిన పండుగ. 

Pentecost అనే మాట గ్రీకు నుంచి వచ్చింది. గ్రీకు భాషలో దీనిని Pentekoste  అంటారు.  అనగా 50 వ రోజు అని అర్ధం.

పాస్కా  పండుగ అయిన 50   రోజుల తరువాత జరుపుకునే ఒక విలువైన  పండుగ.  క్రీస్తు ప్రభు యొక్క  పునరుత్తానం అయిన 50 రోజులకు  క్రైస్తవులు భక్తి విశ్వాసంతో జరుపుకునే పండుగ ఇది.
ఈ పండుగను యూదులు కృతజ్ఞత పండుగగా  జరుపుకునే  వారు.    దేవుడు ఇచ్చిన పంటలకు గాను కృతజ్ఞత తెలుపుతూ దేవుని యొక్క గొప్ప కార్యాలు  తలుచుకొని చేసే పండుగ ఇది .

ఈరోజు తల్లి శ్రీసభ పుట్టిన రోజు ఎందుకంటే పవిత్రాత్మ  శక్తిని  పొందుకున్న  తరువాతనే శిష్యులు భహిరంగ సువార్త ప్రకటన చేశారు. దేవుని యొక్క  ఆత్మను స్వీకరించిన అపోస్తులు  భయం విడనాడి దేవుని యొక్క  రక్షణ  ప్రణాళికను కొనసాగించారు. యేసు ప్రభు శిష్యులకు వాగ్దానం చేసిన విధంగా ఆదరణ కర్తను వారి చెంతకు పంపించారు.    మనందరికీ పవిత్రాత్మ రాకడ ఎంతగానో  ఎన్నో విధాలుగా సహాయం చేస్తుంది.

ఈనాటి  మొదటి పఠనములో  పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తుల మీదకి  వేంచేసిన  విధానాన్ని చదువుకుంటున్నం మరియతల్లి  శిష్యులందరు  ఒక గదిలో వుండగా ప్రార్ధించే సమయంలో  పవిత్రాత్మ  దేవుడు వారి మీదకి  దిగి వచ్చారు. 

అప్పటివరకు వరకు భయంతో వున్నారు ప్రాణాలు అరచేతులో పెట్టుకొని జీవించారు  కానీ ఎప్పుడైతే  పవిత్రాత్మను స్వీకరించారో  వారి జీవితములే మారిపోతున్నాయి . బలహీనులు బలవంతులు అవుతున్నారు భయంతో వున్నవారు  ధైర్యవంతులు అగుచున్నారు . 

పవిత్రాత్మ అగ్నిజ్వాలలు రూపంలో శిష్యుల మీదకి  దిగివచ్చారు. యెరుషలేములో సువార్త ప్రారంభించిన సమయంలో అక్కడ దాదాపు   16 భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వారందరు కూడాప్రవచనాలు  వారి యొక్క  సొంత భాషలోనే వింటున్నారు  ఇది కేవలం పవిత్రాత్మ యొక్క పనియే  .(అపో 2 ;9 -10 ). 

బాబెలు గోపురం వల్ల పలు భాషల అడ్డు గోడలు కూలి  పోయాయి .దీని ద్వారా యేసు ప్రభు సందేశం  అందరికి చెందింది దానిని అందరు అర్ధం చేసుకుంటారు అని తెలుస్తుంది  అన్నీ భాషలో దేనువుని సందేశం వింటున్నారు అంటే  ఎన్నుకొన్న  జాతి  , ప్రజా ,అంటూ ప్రత్యకంగా  లేరు అందరూ  కూడా దేవుందని ప్రజలే  దేవుని రాజ్యంలోకి నడరు పిలువా పడినవారు   ఎవరు కూడా ప్రత్యకంగా నియమింప పడిన వారు కాదు అందరు కూడా దేవుని యొక్క సొంత  ప్రజలే .

పవిత్రాత్మను స్వేకరించి తరువాతనే  శిష్యులు  సాక్షులుగా మరి తమ యొక్క  ప్రాణాలు సైతం  దేవునికి ఇవ్వాలి అనుకున్నారు .పెంతుకోస్తు  పండుగ పాత నిబంధన  గ్రంధంలో కూడా చూస్తుంటం  పాత  పెంతుకోస్తు  పండుగకు   క్రొత్త పెంతుకోస్తు  పండుగకు  దెగ్గర సంభందం ఉంది . 

పాత పెంతుకోస్తు పండుగ  సీనాయి పర్వతము దగ్గర  దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను సూచిస్తుంది .ప్రభు  సినాయ్  పర్వతం పైకి వేంచేసి వచ్చినపుడు ఆ పర్వతం మీద ఉరుములు  మెరుపులు  మేఘాలలో  యెహువె  దేవుడు శిష్యులమీదకి  దిగి వచ్చారు . (నిర్గమ 19 ;16 -18 )

నూతన నిబంధన  గ్రధంలో కూడా  శిష్యులమీదకి పవిత్రాత్మ  వేంచేసినపుడు బలమైన గాలులు వచ్చాయి .పవిత్రాత్మను  పవిత్ర  గ్రంధంలో వివిధ చిహ్నాలతో పోల్చుతారు.  

-అగ్నితో 
- పావురంతో 
- గాలితో 
- నీటితో

గ్రీకు భాషలో ఉపిరికి  ఆత్మకు  ఒకే పదాన్ని   ఉపయోగించారు  ఊపిరి దేవుని ఆత్మకు గుర్తు దేవుని జీవానికి  గుర్తు. దేవుడు మట్టితో  చేసిన  మానవ రూపంలోకి  తన జీవం ఊది తొలి మానవ వ్యక్తిని సృష్టించి  క్రొత్త జీవితాన్ని ప్రసాదించాడు పవిత్రాత్మ  అనే  శ్వాసనుది క్రొత్త జీవితం  ప్రసాదించారు.

పవిత్రాత్మను  అగ్నితో  పోలుస్తారు అగ్ని దేవుని స సాన్నిదికి  గుర్తు  అగ్ని అని తనలాగా  మార్చుకుంటుంది  అలాగే  పవిత్రాత్మ అందర్నీ తనలాగా  మార్చుకుంటుంది  అగ్ని దహించును  అలాగే  పవిత్రాత్మ   మన  పాపాలను  దహించి  మనకు  పవిత్రాత్మను  దయచేస్తుంది. 
  
అగ్ని క్రొత్త జీవాన్ని పుట్టిస్తుంది, రగిలించుకుంటుంది. పవిత్రాత్మ కూడా శిష్యులలో  క్రొత్త జీవాన్ని పుట్టించారు. అప్పటివరకు భయంతో మరణించిన వారిలో క్రొత్తజీవం నింపారు. 

అగ్ని  వెలుగును  ఇస్తుంది  దరి చూపుతుంది  అదే విధంగా  పవిత్రాత్మ  దేవుడు   శిష్యుల యొక్క  అంధకారం  అనే  అజ్ఞానం  తొలగించి దేవా జ్ఞానం  అనే వెలుగును  నింపారు .
 
పవిత్రాత్మ శిష్యులకు దారి  చూపించారు     ఎటుయైపు   వెళ్ళి సువార్తను  ప్రకటన చేయాలో తెలిపారు  .

రెండొవ పఠనంలో  పౌలు గారు  ఆత్మ  స్వభావం గురుంచి తెలిపారు  
         
1 .ఆత్మ అందర్నీ  ఒకే  సమాజంగా  ఐక్యపరుస్తుంది
ఆత్మ ప్రత్యేక అనుగ్రహాలను దయచేస్తారు. వాటిని అందరూ పొందుకుంటారు. 
౩ ఆత్మ పరిచర్యకు  ఎన్నుకొంటుంది  సేవకు వారిని పంపిస్తారు

జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరు సువార్త సేవకు అర్హులే. 
పవిత్రాత్మ దేవుడు మనందరినీ క్రీస్తు శరీరంలో ఐక్యపరచి మనలను ముందుకు నడిపిస్తారు.  
సువార్త పఠనంలో కూడా యేసు ప్రభువు శిష్యులకు పవిత్రాత్మను ఒసగి వారిలో ధైర్యం నింపుచున్నారు. వారిలో క్రొత్త జీవం దయ చేశారు. ప్రపంచమంతటా తిరిగి సువార్త సేవచేయుటకు వారిని పంపిస్తున్నారు. 

ఈరోజు పవిత్రాత్మ దేవుని పండుగ కాబట్టి పవిత్రాత్మ చేసే వివిధ పనుల గురించి ధ్యానిద్దాం. 
1 . పవిత్రాత్మ  మనకు సహాయం చేస్తారు - రోమా 8 : 26 
2 . పవిత్రాత్మ  మనల్ని నడిపిస్తారు - యోహాను 16 : 13 
3 . పవిత్రాత్మ  మనకు బోధిస్తారు - యోహాను 14 : 26  
4 . పవిత్రాత్మ  మనతో మాట్లాడతారు - దర్శన 2 : 7 
5 . పవిత్రాత్మ  మనకు బయలు పరుస్తారు - 1  కొరింతి 2 : 10 
6 . పవిత్రాత్మ  మనకు సూచనలిస్తారు - అ. కా. 8 : 29 
7 . పవిత్రాత్మ  క్రీస్తుకు సాక్షమిస్తారు - యోహాను 15 : 26 
8 . పవిత్రాత్మ  మనల్ని శాంతి పరుస్తారు - అ. కా. 9 : 31 
9 . పవిత్రాత్మ  మనల్ని పిలుస్తారు - అ. కా. 13 : 2 
10 . పవిత్రాత్మ  మనలను దైవంతో నింపుతారు - అ. కా. 4 : 31 
11 . పవిత్రాత్మ  మనల్ని బలపరుస్తారు - ఎఫెసీ ౩: 16 
12 . పవిత్రాత్మ  మనకోసం ప్రార్ధిస్తారు - రోమా 8 : 26 
13 . పవిత్రాత్మ  మన ద్వారా సువార్త పరిచర్య చేస్తారు - 2  పేతురు 1 : 21 
14 . పవిత్రాత్మ  సత్యంకు సాక్ష్యమిస్తారు - రోమా 9 : 1 
15 . పవిత్రాత్మ  మనకు ఆనందం దయచేస్తారు - 1 తెస్స  1 : 6 
16 . పవిత్రాత్మ  మనకు స్వేచ్ఛనిస్తారు - 2 కొరింతి 3 : 17 
17 . పవిత్రాత్మ  విధేయించుటకు సహకరిస్తారు - 1  పేతురు 1  : 22 
18 . పవిత్రాత్మ  మనల్ని క్రీస్తు చెంతకు నడిపిస్తారు - దర్శన 22 : 17 
19 . పవిత్రాత్మ  మన జీవితాలను మార్చుతారు - 2  కొరింతి 3 : 18 
20 . పవిత్రాత్మ  మనలో జీవిస్తారు - 1 కొరింతి 3 : 16 

పవిత్రాత్మ మనకు స్వేచ్ఛ నిస్తారు - రోమా 8: 32
పవిత్రాత్మ  మనలను నుతనికరిస్తారు - తీతు 3: 5
పవిత్రాత్మ  మనలో ఆత్మీయ ఫలములను దయచేస్తారు - గలతి5:22-23
పవిత్రాత్మ  మనకు వరాలు దయచేస్తారు - 1 కొరింతి 12:8-10
పవిత్రాత్మ  మనల్ని  ముందుకు తీసుకొనివెళ్తారు - రోమా 8:14 
పవిత్రాత్మ  మనల్ని  నిరపరాధులు చేస్తారు - యోహాను  16:8
పవిత్రాత్మ  మనల్ని  పవిత్ర పరుస్తారు - 2 తెస్స  2:13
పవిత్రాత్మ  మనల్ని  ధృడంగా ఉండేలా చేస్తారు - అ. కా. 1:8
పవిత్రాత్మ  మనల్ని   ఐక్య పరుస్తారు - ఎఫెసీ 4:3- 4
పవిత్రాత్మ  మన మీద దేవుని ముద్ర వేస్తారు - ఎఫేసి 1:13
పవిత్రాత్మ  మనల్ని  తండ్రి చెంతకు నడిపిస్తారు - ఎఫేసి 2:18
పవిత్రాత్మ  మనకు సహనం  దయచేస్తారు - గలతి 5:5
పవిత్రాత్మ  సైతాను శక్తులను పారద్రోలుతారు 

పవిత్రాత్మ దేవుడు మనకు అనేక విధాలుగా దీవెనలు ఒసగుతుంటారు. మనం కూడా పవిత్రాత్మను పొందినవారం కాబట్టి సువార్త సేవ చేస్తూ దేవుని ప్రేమను పంచుదాం.
 
పవిత్రాత్మ   దేవుని యొక్క పాత్ర:
పవిత్రాత్మ దేవుడు మనందరినీ దేవుని నివాస స్ధలం చేశారు. మన హృదయంలో ఉండేలాగా చేస్తారు. కొరింతి మనందరికీ శక్తిని ఇస్తారు. ఈలోక శక్తులను ఎదుర్కొని ముందుకు సాగుటకు, సైతాను  శక్తులను అధిగమించుటకు అదే విధంగా దేవునికి సాక్షులై ఉండుటకు దేవుడు వారికి శక్తిని దయచేస్తారు. 

పవిత్రాత్మ దేవుడు మనల్ని పవిత్ర పరుస్తారు. దివ్య సంస్కారాలు స్వీకరించుట ద్వారా మనల్ని పవిత్రపరుస్తారు.  

- జ్ఞానస్నానం ద్వారా మనల్ని దేవుని బిడ్డలుగా చేస్తారు. 
- భద్రమైన అభ్యంగనం ద్వారా దేవునితో మరియు పొరుగువారితో సఖ్యపడేలా చేస్తారు.
- దివ్య సత్ప్రసాదం ద్వారా ఆధ్యాత్మిక భోజనం దయచేస్తారు. 
-గురుపట్టాభిషేకం మరియు వివాహం ద్వారా మనల్ని పవిత్రపరుస్తారు. 
దేవుని విషయాలు బోధించి మనల్ని పరలోకానికి చేర్చుతారు. 
మన యొక్క బాధలను వింటారు. మనకు ఊరటను దయచేస్తారు. మన యొక్క ప్రార్ధనలు వింటారు, మనల్ని ప్రార్ధించేలా చేస్తారు. 
మనకి వరాలిచ్చి, ఫలాలను ఇచ్చి మనందరికీ కర్తవ్యం గురించి తెలుపుతారు. 

Rev. Fr. Bala Yesu OCD

26, మే 2023, శుక్రవారం

6, మే 2023, శనివారం

పాస్కా 5 వ ఆదివారం

 పాస్కా 5 వ ఆదివారం

అపో 6:1-7

1 పేతురు 2:4-9

యోహాను 14:1-12

    ఈనాటి దివ్య పఠనాలు క్రైస్తవ జీవితం యొక్క ఔన్నత్యమును, గొప్పతనం గురించి వ్యాప్తి గురించి తెలియజేస్తూ ఉన్నాయి. 

ఈనాటి మొదటి పఠనంలో అపోస్తులలు సువార్త పరిచర్యకు సహాయంగా ఉండుటకు ఏడుగురు సోదరులను ఎన్నుకుంటున్నారు. పెంతుకోస్తు పండుగ తర్వాత అపోస్తులలు తమ యొక్క విలువైన సమయమును మొత్తము కూడా సువార్త ప్రకటన చేయుటకు స్వస్థత నిచ్చుటకు కేటాయించిరి. అయితే శ్రీ సభ ప్రారంభమైన సమయంలో గ్రీకులకు యూదులకు మధ్య కొన్ని సాంప్రదాయ ప్రకారంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గ్రీకుల యొక్క వితంతువులు నిరాకరించబడ్డారని నిర్లక్ష్యం చేయబడ్డారని వారి మధ్య వారు సనుగు కొనసాగరి, అయితే దానికి పరిష్కారం ఇచ్చుటకు అపోస్తులలు ఇంకా కొంతమంది సేవకులను ఎన్నుకుంటున్నారు.

 ఏసుప్రభు ఎలాగైతే తన యొక్క సువార్త సేవకు మొదట్లో శిష్యులను సహకరించుటకు పిలిచి ఉన్నారో అదే విధముగా ఈ పనిని ఇద్దరు అపొస్తలులు కూడా ఏడుగురు వ్యక్తులను స్వార్థ సేవ నిమిత్తమై అదేవిధంగా సమాజంలో ఉన్న వితంతువులకు సహాయం చేయుట నిమిత్తమై వారిని ఎన్నుకుంటున్నారు. ఈ పనిని పన్నిద్దరూ శిష్యులు తాము ఎందుకు దైవ పిలుపును పొందాము అనే ఉద్దేశమును అక్కడి విశ్వాసులకు తెలియచేస్తున్నారు అదేమిటంటే "వారి సమయం అంతా ప్రార్ధించుటకు అదే విధముగా వాక్య పరిచర్య చేయుటకు" వినియోగిస్తారు అని పలికారు. ఏసుప్రభు కూడా ఈ ఉద్దేశ్యం కొరకే తన శిష్యులను తన సేవకై పిలిచారు. (మార్కు 3:13-14).

ఇక్కడ మనము గమనించవలసిన అంశం ఏమిటంటే ఈ ఏడుగురు విశ్వాసుల కూడా గ్రీకు దేశస్తులే. వారే తమ ప్రజల గురించి అడిగారు కాబట్టి వారు అయితేనే సక్రమంగా న్యాయం చేస్తారు అనే ఉద్దేశంతో క్రైస్తవులుగా మారిన గ్రీకు వారిని ఎన్నుకుంటున్నారు. ఈ ఏడుగురు విశ్వాసులు అపోస్తుల యొక్క పరిచర్యకు సహకరిస్తున్నారు. మనందరం కూడా తీరు సభ యొక్క కట్టడిలో నేర్చుకుంటున్నాం, ఆరవ శ్రీ సభ కట్టడ మనకు తెలియచేసే అంశం ఏమిటంటే విచారణ గురువులకు సహాయం చేయుదువుగాక. ఈ విశ్వాసులు ఏడుగురు అపోస్తులకు సహకరిస్తున్నారు, వారి యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నారు. దేవుని సేవకై ఉండేవారికి ఎలాంటి లక్షణాలు ఉండాలో అపోస్తులులు తెలియచేస్తున్నారు. అపోస్తులు మూడు ప్రధానమైన అంశాల గురించి తెలియజేస్తున్నారు.

1. వారు పవిత్రాత్మతో నిండిన వ్యక్తులై ఉండాలి.

2. జ్ఞానము కలిగిన వారై ఉండాలి.

3. సమాజంలో మంచి పేరు మరియు గౌరవం కలిగిన వారై ఉండాలి.

ఒక్క దైవ సంఘమును నడిపించుటకు మరియు దేవుని యొక్క స్వార్థ సేవ చేయుటకు సంఘ కాపరులకు ఈ మూడు లక్షణాలు ఉండాలి.

- పవిత్రాత్మతో నింపబడిన వారు అనగా దేవుని యొక్క సేవకు తమను తాము ఎల్లప్పుడూ కూడా  సిద్ధం చేసుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞల పాటిస్తూ జీవించేవారు,  ప్రార్థించేటటువంటి వ్యక్తులు, దేవునికి విధేయత చూపించేటటువంటి వ్యక్తులు, పాపము చేయకుండా ఆదర్శంగా జీవించేవారు అలాగే దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించేటటువంటి వ్యక్తులు.

-  జ్ఞానము కలిగిన వారిని ఎందుకు ఎన్నుకుంటున్నారంటే వారు తమ యొక్క జ్ఞానం వలన మంచినీ -  చెడును, పాపమును,  పుణ్యమును విశ్వాసులకు తెలియచేసి వారి యొక్క దైవ జ్ఞానముతో ప్రజలను దేవుని వైపుకు నడిపిస్తారు. వారి యొక్క జ్ఞానము అవిశ్వాసము అనే అజ్ఞానమును ప్రజల నుండి తొలగించేలాగా చేస్తుంది. ఈ ఎన్నుకొనబడిన వారికి దైవ జ్ఞానము ఉన్నది కాబట్టి వారు అనేకమందిని పరలోకం వైపు నడిపిస్తున్నారు.

- సమాజంలో పేరు ఉన్న వారిని ఎందుకు ఎన్ను కొవాలి అంటే వారు చెప్పేటటువంటి ఒక మాటకు అంత పలుకుబడి అదే విధముగా గౌరవం ఉంటుంది. మన జీవితంలో సమాజంలో సుమాతృకుగా లేనటువంటి వారి మాట మనం వినుము ఎవరైతే మంచినీ బోధిస్తారు మంచి పేరు కలిగి ఉంటారు మంచిగా జీవిస్తారో వారి యొక్క మాటలే మనం ఎక్కువగా పాటిస్తూ ఉంటాం అందుకని అపోస్తులలు దేవుని యొక్క సేవ నిమిత్తమై పవిత్రాత్మ కలిగిన వ్యక్తులను జ్ఞానము కలిగిన వ్యక్తులను సమాజంలో పేరు ఉన్నటువంటి ఏడుగురును ఎన్నుకుంటున్నారు. ఈ ఏడుగురు మీద చేతులుంచి ప్రార్థిస్తూ వారు దేవుని యొక్క ఆత్మను కృపను పొందే లాగా ఈ అపోస్తులు వారికి తోడుగా ఉంటున్నారు.

మోషే ప్రవక్త దేవుని యొక్క సేవ నిమిత్తమై ఏ విధంగానైతే 70 మందిని ఎన్నుకుంటున్నారో అదే విధముగా క్రైస్తవత్వం విస్తరిల్ల చేయుటకు అలాగే క్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనమును చాటిచెప్పుటకు శిష్యులు ఇంకా కొంతమందిని దైవ సేవ నిమిత్తమై ఎన్నుకుంటున్నారు.

ఈనాటి రెండవ పఠనంలో ఏసు క్రీస్తు ప్రభువు ఆయనయే సజీవ శిల అనుయు అలాగే ఇల్లు కట్టడానికి త్రోసి వేయబడిన రాయి మూలరాయిను అని తెలిపారు. దేవుడు యేసు క్రీస్తు ప్రభువును క్రైస్తవ సంఘానికి ఒక మూలరాయిగా ఎన్నుకున్నారు. ఈ క్రైస్తవ సంఘ నిర్మాణం ప్రభు ద్వారానే జరిగింది. తండ్రి దేవుడు పూర్వభేదంలో ఒక మూలరాయిని తన రక్షణ నిమిత్తమై వేసి ఉన్నారు. 

పూర్వ వేదంలో  తండ్రి దేవుడు ఎన్నుకున్న అమూల్యమగు శిల ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ప్రసాదించే రక్షణ. దైవ రక్షణ అనేది ఒక విలువైన రాయి. ఆ రాతిని తండ్రి దేవుడు సీయోనులో మూలరాయిగా స్థాపించారు అనగా ఎరుషలేము నగరంలో స్థాపించబడ్డ దావీదు రాజ్యానికి మరియు అతని వంశానికి తండ్రి దేవుడు తన రక్షణ వాగ్దానం చేస్తున్నారు. ఆయన ఇచ్చే రక్షణయే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన వేసే మూలరాయి. ఎవరైతే ఆయనను విశ్వసిస్తున్నారు వారందరూ రక్షణ పొందుతారు. 

ఈ వాగ్దానం ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు జీవితం ద్వారా నెరవేరింది. ఏసుప్రభు నూతన ఇస్రాయేలు ప్రజలకు రక్షణ తీసుకుని వచ్చారు. ఏసుక్రీస్తు ప్రభువు మొదటిలో నిరాకరించబడిన , తన సొంత ఊరిలోనే, తన సొంత ప్రజలే తనను అర్థం చేసుకోలేదు. ఆయనను నిరాకరించారు, త్రోసివేశారు,  అవమానములకు గురి చేశారు అయినప్పటికీ ఆయన మన అందరి రక్షణ నిమిత్తమై మృతి చెందారు. ఆ నిరాకరించబడిన రాయే ఈనాడు మనందరి రక్షణకు కారణమయ్యారు. ప్రభువు యొక్క మరణం పునరుత్థానము తర్వాత ఆయన యొక్క విలువను గొప్పతనమును తెలుసుకున్నారు అందుకని ఆయనను రక్షకునిగా దేవునిగా అంగీకరించారు. 

ఈ విధముగా క్రైస్తవత్వం రోజురోజుకీ గొప్పగా విస్తరిల్లినది. పేతురు గారు ఈ రెండవ పఠనం లో ఇంకొక గొప్ప సత్యమును తెలియజేస్తున్నారు మనందరం కూడా దేవుని చేత  ఎన్నుకొనబడిన ప్రజలము, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని యొక్క సొంత ప్రజలు. ఈ మాటలన్నీ పూర్వ వేదంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి పలికారు నిర్గమకాండం 19: 5-6. ఇప్పుడు ఈ మాటలన్నీ నూతన క్రైస్తవులందరికీ చెందుతాయి ఎందుకంటే క్రైస్తవులు కూడా ఎన్నుకొనబడిన జాతి. 

ప్రపంచంలోని ప్రజలందరిలో దేవుడు కొందరిని ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముతో ఎన్నుకొని వారితో ఒడంబడిక చేసి వారికి దేవుడు తోడుగా ఉండి వారి ద్వారా అన్యులకు రక్షణను అందచేయదలిచారు. క్రైస్తవులు రాచరికపు గురుకులము అనగా గురువు దేవుని సమీపంలో ఉండి అన్యులను దేవుని దరికి చేర్చగలుగుతారు దేవునికి బలులు సమర్పిస్తూ, అర్పణలను సమర్పిస్తూ, వారి ఉద్దేశములను దేవుని చెంతకు తీసుకొని వెళతారు. 

క్రైస్తవులందరూ కూడా పవిత్రమైన జనం, ఎందుకంటే జ్ఞాన స్నానము ద్వారా వారు శుద్ధి చేయబడుతున్నారు, దేవుని బిడ్డలుగా మారుతున్నారు, పవిత్రులుగా చేయబడుతున్నారు కాబట్టి వారు ఇక దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ తమ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని ఆయన కొరకై ఈ లోకంలో తమ జీవితాన్ని వినియోగించాలి. క్రైస్తవులు దేవుని సొంత ప్రజలు దేవుడు వారిని ప్రేమతో ఎన్నుకున్నారు కాబట్టి వారు దేవుడి యొక్క చిత్తానుసారంగా నడుచుకోవాలి.

మన విశ్వాస జీవితంలో నిరాకరించబడినప్పుడు మనము బాధపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే క్రీస్తు ప్రభువు కూడా నిరాకరించబడ్డారు తరువాత ఆయన గొప్పతనమును అందరూ తెలుసుకున్నారు కాబట్టి మనం కూడా బాధపడకుండా, భయపడకుండా క్రైస్తవ జీవితమును జీవించుదాం. ఎందుకంటే దేవుడు మనలను ప్రత్యేకంగా పిలిచారు ఎన్నుకున్నారు తన బిడ్డలుగా చేశారు. ఈ విధంగా క్రైస్తవత్వం యొక్క ఔన్నత్యం గురించి పేతురు గారు చక్కగా బోధించారు.

ఈనాటి సువిశేషం లో ఏసుప్రభు తోమాసు గారితో అంటున్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని.

పోయిన ఆదివారం శిష్యులతో  ఏసుప్రభు అంటున్నారు నేనే ద్వారమును అని,  I AM THE GATE. ఈవారం సువిశేషంలో ఏసుప్రభు మార్గము, సత్యము, జీవము అని అంటున్నారు.

ఏసుప్రభు అనేక సందర్భాలలో తాను ఏమిటి అని శిష్యులకు తెలుపుచున్నారు.

కొన్ని సందర్భాలలో ప్రభువు అంటున్నారు: 

1. నేను నిజమైన ద్రాక్షావల్లిని

2. నేనే జీవాహారమును

3. నేనే లోకమునకు వెలుగు

4. నేనే పునరుద్దానమును, జీవమును

5. నేను మంచి కాపరిని అని

ఈ విధంగా ఈనాటి శిష్యులతో ప్రభువు మూడు అంశాలు గురించి తెలియజేస్తున్నారు:

1. నేనే మార్గం

2. నేనే సత్యం

3. నేనే జీవం

అంతయు ఏసుక్రీస్తు ద్వారానే మనకు సాధ్యమవుతుంది. తోమస్ ఎ కెంపిస్ గారు 15 వ శతాబ్దంలో ఆయన రాసిన IMITAION OF CHRIST పుస్తకంలో ఈ విధంగా అంటున్నారు: 

- దారి తెలియకుండా మన ప్రయాణం సాగదు, చేయలేము - without way there is no going.

- సత్యం లేకుండా మనం ఏమీ తెలుసుకోలేము - without truth there is no knowing.

- జీవం లేకుండా మానవ మనుగడ లేదు అని తెలుపుచున్నారు - without life there is no living.

- ఏసుప్రభు నేనే మార్గం అని అంటున్నారు, యేసు ప్రభు మన అందరికీ కూడా పరలోకం చేరుటకు ఒక మార్గంగా ఉంటున్నారు, ఆయన ఏది అయితే బోధించారో  అది పాటిస్తూ శిష్యులకు ఒక సుమాతృకగా ఉంటున్నారు.

ఏసుప్రభు మనం పరలోకం ఏ విధంగా చేరాలో ఒక మార్గంగా ఉంటున్నారు, ఇది మాత్రమే కాదు అన్ని విషయాలలో ఆయన మనకు మార్గం చూపిస్తున్నారు.

- శ్రమలు ఏ విధంగా అనుభవించాలి అని

- ఎలాగా సేవ చేయాలని

- ఎలాగ వినయంతో విధేయత తో జీవించాలని

- ఎలాగా తండ్రి ప్రణాళిక నెరవేర్చాలని

- సహనంతో, ప్రేమతో ఎలాగా జీవించాలి అని, అనేక విషయాలలో క్రీస్తు ప్రభువు ఒక మార్గంగా ఉంటున్నారు ఆయన మనకంటే ముందుగా వెళ్లి మనకు సుమాతృకగా నిలిచారు.

ఈరోజు మనం మన తోటి వారికి ఒక మార్గంగా ఉంటున్నామా?

2. ఏసుప్రభువే సత్యము:

ఆయన భూలోకానికి వచ్చినది తండ్రికి సాక్ష్యము ఇచ్చుటకు, ఆయన దేవుని కుమారుడు అనుట సత్యము, తన యొక్క పరిచర్య ద్వారా బోధించిన విషయాలు అన్నియు సత్యము.

ఫిలాతు కూడా ఏసుప్రభు జీవితం చూసి ఆయనలో ఎట్టి అసత్యం లేదు అని పలికారు.

3. ఏసుప్రభువే జీవము: 

సృష్టి ప్రారంభంలో ఏసుప్రభువు వాక్కు రూపంలో ఉండి సృష్టికి జీవం పోశారు, అలాగే ఆయన మానవ రూపంలో ఈ లోకంలో జన్మించినప్పుడు తన పరిచర్య ద్వారా అనేక మందికి జీవమును ప్రసాదించారు.

మరణించిన వారికి సైతం జీవమును ఇచ్చినా గొప్ప దేవుడు యేసు ప్రభువు దివ్య సంస్కారాలు ద్వారా కూడా ప్రభువు మనకు జీవం ప్రసాదిస్తారు.

మనం కూడా ఇతరులకు జీవమును ఇవ్వాలి అనగా నిరాశలో బాధలో ఉన్నవారికి ప్రోత్సాహం ధైర్యమును ఇచ్చుట ఒక విధంగా వారికి జీవము ఇచ్చుటయే.

అదేవిధంగా ఈనాటి సువిశేష పఠనం  లో యేసు ప్రభువు మరియు తండ్రి అన్నిటిలోనూ కలిసి ఉన్నారు అని ప్రభువు తెలుపుచున్నారు, ఇక్కడ తండ్రీ కుమారులకు ఉన్న ఆ ప్రేమ బంధం గురించి మనం ధ్యానించుకోవాలి. వారిది విడదీయరాని బంధం కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ కలిసిమెలిసి జీవించాలి.

క్రైస్తవ జీవితం చాలా గొప్పది ఎందుకంటే ఏసుప్రభువు అన్నింటిలో సుమాతృకగా జీవిస్తూ విశ్వాసులను ముందుకు నడిపించారు ఎందరో క్రైస్తవత్వమును ఆపాలని ప్రయత్నం చేశారు కానీ అది ఈ సాధ్యపడలేదు అందుకు నిదర్శనమే ఈనాటి క్రైస్తవ సంఘం.


FR. BALAYESU OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...