23, జులై 2022, శనివారం

17వ సామాన్య ఆదివారము

   17వ సామాన్య ఆదివారము                         


ఆది 18 :20 -32 , కోలస్సి 2 :12 - 14, లూకా 11 :1 - 13    

ఎలా ప్రార్దించాలి 

పరలోక ప్రార్ధన  , విజ్ఞాపన ప్రార్ధన

క్రీస్తునాధునియందు ప్రియమైన స్నేహితులారా ఈనాడు మనము 17వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించియున్నాము.     

నాటి పరిశుద్ధగ్రంథ పఠనములు ద్వారా తల్లి శ్రీసభ మనకు ఎలా ప్రార్ధించాలి? అనే అంశముతో, తండ్రి దేవుణ్ణి ఎలా ప్రార్ధించాలి  మరియు ఆయన బిడ్డలు అయిన మనము ఏ విధముగా ప్రార్ధించాలి, విజ్ఞాపనము ఎలా  చేయాలో మనకు తెలియజేస్తున్నాయి.    

మన క్రైస్తవ జీవితములో ప్రార్ధన ఎంతో ముఖ్యమైనది ప్రార్ధన ద్వారా దేవుని పై మనకున్న విశ్వాసాన్నివెల్లడిస్తూ, ఆయన్ని ప్రార్ధిస్తూ, స్తుతిస్తూ ప్రభువునకు కృతజ్ఞత స్తోత్రములు తెలుపుతాము. ప్రార్ధన వలన దేవునితో మనకున్న సంబంధం మరింత సన్నిహితమై, ఆయన నిజమైన బిడ్డలుగా మనము జీవిస్తుంటాము.

పిల్లలు తల్లితండ్రులపై ఆధారపడిజీవిస్తు, తమకు కావలసిన వాని కొరకై అడుగుతూ వుంటారు. మనము కూడా ప్రార్ధన ద్వారా దేవుని  మన తండ్రిగా భావించి ఆయనపై నమ్మకము ఉంచి, మనకు అవసరమైన వానిని అర్ధిస్తుంటాము.  అయితే ఎప్పుడు మన సొంత అవసరాల కొరకు మాత్రమే కాకుండా ఇతరుల అవసరతలను గూర్చి కూడా దేవున్ని ప్రార్ధిస్తుండాలి.  ప్రార్ధనలో స్వార్ధం పనికిరాదు పొరుగు వాణి యెడల ప్రేమఆధారములు ఎంతో అవసరం అని మనకు తెలుసు అట్లే పొరుగువాని కొరకు ప్రార్ధించాలి.  అది మనం ప్రార్ధన పూర్వకంగా ఇతరులకు చేయవలసిన మన సహాయం. ఇతరుల అవసరముల కొరకై మనం దేవునికి చేసే ప్రార్ధనని విజ్ఞాపన ప్రార్ధన అంటారు.  ఈదినం పరిశుద్ధ గ్రంథ పఠణాలు మనకు బోధిస్తున్నాయి.

ఎలా ప్రార్ధించాలి ?

బాల్యములో  సమూయేలు వలె  ప్రార్ధించాలి[1సాము 3 :1 -10 ]

యవ్వనంలో తిమోతి వలె ప్రార్ధించాలి [2 తెస్స  2:22]

ఉదయమున దావీదు వలె ప్రార్ధించాలి [కీర్త  63 :1]

మధ్యాహ్నం దానియేలు వలె ప్రార్ధించాలి [దాని 6 :10 ]

రాత్రి పౌలు సిలాసులు వలె ప్రార్ధించాలి [అపోస్తు 16 :25 ]

దుఃఖములో అన్నా  వలె ప్రార్ధించాలి [1 సమూ 1 :10 ]

శ్రమలలో యోబు వలె ప్రార్ధించాలి[యోబు 42 :10 ]

మరణములో స్టీఫెన్ వలె ప్రార్ధించాలి [అపోస్తులు 7 : 60 ]

అన్ని వేళలలో యేసు క్రీస్తు వలె ప్రార్ధించాలి [యోహాను 6 :38 ]

ప్రార్ధన అంటే ఏమిటి ?

ప్రార్ధన అంటే అడుగుట [మత్త 7  :7 ]

ప్రార్ధన అంటే వేడుకొనుట [8 :21 ]

ప్రార్ధనను అంటే బ్రతిమిలాడుట [ద్వితియో 9 ;20 ]

ప్రార్ధనను అంటే విన్నవించుట [కీర్త 6 :9 ]

ప్రార్ధన అంటే మనవిచేయుట [కీర్త 140 :6 ]

ప్రార్ధన అంటే మొరపెట్టుట [కీర్త 116 :1 ]

ప్రార్ధన అంటే పదే పదే అడుగుట[లూకా 18 :5 ]

ప్రార్ధన ఆంటే విజ్ఞాపనము చేయుట [1 తిమోతి 2 :2 ]

ప్రార్ధన అంటే ప్రాధేయపడుట [మత్త 9 :27 ]        

మొదటి పఠనములో అబ్రాహాము ప్రజల నిమిత్తం చేసినవిజ్ఞాపన ప్రార్ధన 

ఈనాటి మొదటి పఠనములో అబ్రాహాము తండ్రి దేవునికి సొదొమ గోమోర ప్రజల నిమిత్తం చేసిన విజ్ఞాపనను  ఆలకిస్తున్నాము.  సొదొమ గోమోర ప్రజలు, పాపములో పడి  దేవునికి దూరమయ్యారు వారి పాపములు పండిపోయాయి.  ప్రభువైన యావె అది సహించలేక ఆ ప్రజలను ఆ పట్టణములను ధ్వంసం చేయ తలచారు.  ఆ సమయమున అబ్రాహాము ఆ ప్రజల నిమిత్తం తనకు ప్రత్యక్షమైన యావేకు ప్రార్ధన చేసాడు.  అబ్రాహాము 50 మంది నుంచి 10 మంది వరకు తగిస్తూ వచ్చాడు.  అందుకు దేవుడు చివరికి 10 మంది మంచివారున్నా వారిని బట్టి క్షమిస్తాను అని చెప్పాడు.  అబ్రాహాము యొక్క విజ్ఞాపన ప్రార్ధన ఎంతో గొప్పది ఎందుకంటే 50 నుంచి 10  మంది వరకు తగిస్తూ వచ్చాడు .

మొదటి పఠనములో అబ్రాహాము ప్రజల నిమిత్తం చేసిన విజ్ఞాపన ప్రార్ధన :

ఈనాటి మొదటి పఠనములో అబ్రాహాము తండ్రి దేవునికి సొదొమ గోమోర ప్రజల నిమిత్తం చేసిన విజ్ఞాపన ఆలకిస్తున్నాము.  సొదొమ గోమోర ప్రజలు పాపములో పడి  దేవునికి దూరమయ్యారు.  వారి పాపములు పండిపోయాయి.   ప్రభు వైన యావె  అది సహించలేక ఆ  ప్రజలను ఆ పట్టణములను ద్వంసం  చేయ తలచారు. ఆ సమయమున అబ్రాహాము, ఆ ప్రజల నిమిత్తం తనకు ప్రత్యక్షమైన యావేకు ప్రార్ధన చేసాడు.  అబ్రాహాము 50 మంది నుంచి 10 మంది వరకు తగ్గిస్తూవచ్చాడు.  అందుకు దేవుడు చివరికి 10 మంది మంచివారున్నా వున్నా వారిని బట్టి క్షమిస్తాను అని చెప్పాడు.  అబ్రాహాము యొక్క విజ్ఞాపన ప్రార్ధన ఎంతో గొప్పది  ఎందుకంటే 50 నుంచి 10  మంది వరకు తగిస్తూవచ్చాడు .

దేవునికి సొదొమ గోమోర  ప్రజలకు మధ్యవర్తిగా నిలిచి అబ్రాహాము ప్రార్ధన చేసాడు. వారి నిమిత్తము అబ్రాహాము పదే పదే దేవునికి ప్రార్ధించాడు.  దేవుని దయను ఆయన కృప ఆశీర్వాదం పొందటానికి ఆ పట్టణములో కనీసం 10 మంది మంచి వారున్నా అబ్రాహాము చాలనుకున్నాడు. క్కడ మనము గ్రహించాల్సింది ఏమిటి అంటే, దేవునికి అబ్రాహాముకి జరిగిన సంభాషణలో మనం ఓక గొప్ప గమ్మత్తయిన విషయాన్ని గ్రహించాలి. దేవుడు ప్రజలను శిక్షించటానికి బదులుగా రక్షించటానికి సిద్ధంగావున్నాడు. ఆయన కోరేది ప్రజల రక్షణే గాని వినాశనం కాదు [యిర్మీ29 :11] అట్టి ప్రార్ధనను దేవుడు ఆలకించటానికి సిద్ధంగా వున్నారు.

సువిశేషము :

క్రీస్తు నాధునియందు ప్రియమైన స్నేహితులారా, ఈనాటి సువార్త పఠణములో మనము వింటున్నాము, ఏసుక్రీస్తు ప్రభువారిని శిషులు అడుగుచున్నారు, ప్రార్ధన నేర్పించమని, ఏ విధముగా అయితే యోహాను తన శిష్యులకు నేర్పించాడో మీరును మాకు ప్రార్ధన చేయుట నేర్పుడు అని. క్రీస్తు ప్రభువుకు ప్రార్ధన అంటే చాల ఇష్టం. ప్రతిరోజు ప్రార్ధనలో గడిపేవారు శిష్యులు మాకు ప్రార్ధన నేర్పుము అని అడిగినపుడు ప్రభువు , తాను నిత్యమూ చేసుకునే ప్రార్ధనను వారికీ నేర్పుచున్నాడు

ఇదే ప్రార్ధనను మనము కూడా ప్రతిరోజు మన కుటుంబ ప్రార్ధనలో కాని  వ్యక్తిగత ప్రార్ధనలో కాని  సంఘ ప్రార్ధనలో కాని , దివ్యబలిపూజలో కాని  ప్రార్ధిస్తున్నాము

ఈనాటి సువిశేషపఠనంలో యేసుప్రభువు  నేర్పిన ప్రార్ధనలో విన్నపములు వున్నాయి

1 తండ్రి మీ నామము పవిత్ర పరచ బడును గాక.

2 మీ రాజ్యము వచ్చును గాక.

3 మాకు అనుదినాఆహారము దయచేయుము.

4 మా పాపములను క్షమించుము.

5 మమ్ము శోధనలో చిక్కుకొనకుండా కాపాడుము.

అదే విధముగా ఈ విన్నప ప్రార్థనలకు మత్తయి సువిశేషములో మరొక 2 విన్నపములు చేర్చబడాయి అవి ఏమి అనగా.

1 మీ చిత్తము నెరవేరును గాక.

2 దుష్టునినుండి రక్షింపుము.

అయితే లూకా సువార్తలో చుసిన విధముగా మొదటి ఐదు విన్నప ప్రార్ధనలలో  మొదటి రెండు దేవునికి సంబంధించినవి, చివరి మూడు మన అవసరతలకు సంబంధించినవి. ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభు నేర్పిన ప్రార్ధనలో 5 విన్నపములు వున్నాయి.  పరలోక ప్రార్ధనగురించి పునీత మదర్ థెరిస్సా కలకత్తా గారు ఇలా చెప్పారు. పరలోక ప్రార్ధన జపించుట ద్వారా, జీవించుట ద్వారా పునీత తత్వము వైపు నడిపించబడతాము. పరలోక ప్రార్ధన గొప్ప వీలువున్న ప్రార్ధన, శక్తివంతమైన ప్రార్ధన ఎందుకంటే ఈ ప్రార్ధనను నేర్పించింది, మానవులకును దేవదూతలకును, రారాజు ఐన క్రీస్తు ప్రభువును  ప్రార్ధించటానికి మనము మోకాలు వంచినట్లైతే  ఆలకించడానికి అయన తన చెవులను సిద్ధం చేస్తాడు.

పరలోక ప్రార్ధన అంటే

విశ్వాసము -పరలోకమందున్న

సంబంధము -మా యొక్క తండ్రి

ఆరాధనా -మీ నామము పూజింపబడును గాక

నిరీక్షణ -మీ ఆజ్యము లేచును గాక

సమర్పణ -మిచిత్తము నెరవేరును గాక

ప్రార్ధన -మా అనుదిన  ఆహారము

క్షమాపణ -మావద్ద అప్పుబడినవారిని

పశ్చాత్తాపము -మా అప్పులను మీకు క్షమించండి

విజ్ఞాపన -శోధనలో పడనీయక

అవగాహన -రాజ్యము బలము మహిమ నిరంతరము మీవైయున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా! మానవులమైన మనము, మన ప్రతి వసరము కొరకు ఎవరో ఒక్కరిపైనా ఆధారపడి ఉంటాము.  ఎవరు సహాయం చేయకపోతే దేవుని దగ్గరకు వస్తాము. యేసు ప్రభు తన ప్రార్ధనను మనకు నేర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేస్తున్న ప్రార్ధన ఎంతసేపు అన్నది ముఖ్యము కాదు ఎలా చేస్తున్నాము అనునదియే ముఖ్యము .

విసుగక ప్రార్ధించాలి [లూక18:1] యేసుప్రభు మనకు ఎలా ప్రార్ధించాలి  నేర్పించాడు.  ఎలా నమ్మకంతో కృతజ్ఞతతో సంతోషముతో తండ్రి దేవునితో మాట్లాడాలో నేర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా మనము చేస్తున్న ప్రార్ధన ఎంతసేపు అన్నది ముఖ్యము కాదు ఎలా చేస్తున్నాము అనునదియే ముఖ్యము .

విసుగక ప్రార్ధించాలి [లూక 18 :1]

ప్రార్ధనకు  జవాబు ఆలస్యమైనందున నిరాశ పడకూడదు మనము ప్రార్ధించే వా టికీ జవాబు ఎలా ఇవ్వాలో ప్రభువునకు తెలుసు, అందుకోసం ఓపికతో ప్రార్ధించాలి [1పేతురు 5 :6 ; కీర్తన 37 :4 -6 ]

విధేయతతో ప్రార్ధించాలి [2 దిన 7 :14 ]

ప్రభు సన్నిధిలో ప్రార్ధించునప్పుడు మనలో అహం భావండంబము ఉండరాదు తగ్గింపు జీవితం కలిగి విరిగి నలిగిన మనసు ఉండాలి [లూకా 18 :10 -14 ].

విశ్వాసముతో ప్రార్ధించాలి [మత్త 21 :22 ].

ప్రతికూలతులను బట్టి మనము కృంగిపోకుండా ధైర్యముకలిగి విశ్వాసంతో ప్రార్ధించాలి. [మత్త 8 :5 -13 ].

దేవుని చిత్తప్రకారము ప్రార్ధించాలి [ 1యోహాను5 :14 ] 

ప్రార్ధనలో ఏమి కావాలో ఎంత కావాలో విస్తరించి మాట్లాడక ఆత్మ నడిపింపుతో ప్రార్ధించాలి.[1యోహాను  ౩ : 22 ].

పరిశుద్ధాత్మలో ప్రార్ధించాలి[యూదా1 :2o ].

పెదవులతో వచ్చే ప్రార్ధన కాక పరిశుదాత్మ మనలో ఉంటే మనము ఆత్మలో ప్రార్ధించగలము. [రోమి 8 :9 ; 1 కోరిం14 :14 -15 ].

ముగింపు :

శ్రీసభ ద్వారా శ్రీసభ సభ్యులమైన మనము పాపముతో నిండిపోయిన ఈలోకము తరుపున మధ్యవర్తిత్వం వహించాలి. యేసు ప్రభువు ప్రార్ధన చేసిన విధానమును గమనించిన శిష్యులు ప్రేరణ పొంది తమకు కూడా ప్రార్ధన నేర్పమని వచ్చి అడిగారు. మన ప్రార్ధన విధానమును బట్టి మన జీవిత విధానమును బట్టి ఇతరులకు అన్యులకు ప్రేరణ కల్పించాలి. దేవుడు ప్రజలను శిక్షించటానికి బదులుగారక్షించటానికి సిద్ధంగ వున్నాడు అని ఈరోజు పరిశుద్ధ గ్రంధం మొదటి పఠనంలో అబ్రాహాము ప్రార్ధన ద్వారా మనము వినియున్నాము. కాబట్టి ప్రియమైన స్నేహితులారా మనము కూడా అటువంటి గొప్ప ప్రార్ధన శక్తితో దేవుని యెడల విశ్వాసం కలిగి జీవించాలి అని ఆయన ఆశీర్వాదములు దీవెనలు పొందుకోవాలి అని ఎల్లప్పుడు దేవునికి విధేయతభయముకలిగి జీవించాలి అని మన జీవితాలనుకుటుంబాలను ప్రభునికి సమర్పిస్తూ ప్రార్ధన జీవితం కలిగి దేవునిలో ప్రార్దించుదాం.  ఆమెన్.

బ్రదర్. మనోజ్. ఓ సి డి 

 

 

            

 

 

               

                                    

                     

16, జులై 2022, శనివారం

16వ సామాన్య ఆదివారము (2)

                         16  సామాన్య ఆదివారము

ఆది 18 : 1-10, కోలస్సి 1: 24-28, లూకా 10: 38-42

ఈనాటి దివ్య పఠనాలు ఇతరులకు ఆతిధ్యం ఇచ్చుట గురించి తెలియజేస్తున్నాయి

భారతీయ సంప్రదాయం ప్రకారం అతిధులను దైవంగా భావిస్తారు అందుకే అంటారు మాతృదేవోభవ పితృదోవోభవ ఆచార్యదేవోభవ అతిధి దేవోభవ అని అంటారు

అతిధిని ఆదరించి ఆతిధ్యం మంచిగా ఇస్తే దాని ద్వారా మనం దీవెనలు పొందుతాం 

ఈనాటి మొదటి పఠనంలో అబ్రాహాముసారా ఇచ్చిన ఆతిధ్యం గురించి చెప్పబడింది. సిందూరపు వృక్షము వద్ద కూర్చున్న అబ్రాహాము ప్రభువైన దేవుడను చూసారు 

దేవుడు ఇద్దరు దూతలను తన వెంటబెట్టుకొని సొదొమగోమర్రా పట్టణములను శిక్షించుటకు వెళ్లి మార్గములో అబ్రాహామును దర్శనం ఇస్తున్నారు ప్రభువు మానవ రూపంలో  దర్శనం ఇచ్చారు 

అబ్రాహాము  మార్గము గుండా వెళ్లుచున్న  ముగ్గురు దెగ్గరకు వెళ్లి సాగిల పడి నమస్కరిస్తున్నారుఅబ్రాహాము వారు దైవజనులు అని గుర్తించారు అందుకే వెంటనే వారిని తన ఇంటికిపిలుస్తున్నారు ముగ్గురు వ్యక్తులు అబ్రాహాము నీవు మాకు భోజనం సిద్ధం చేయమని అడుగలేదు కానీ ఆబ్రహామే వారిని పిలుస్తున్నాడువారిని ఆహ్వానించుటలో అబ్రాహాము యొక్క సిద్ధపాటుతత్వం చూస్తున్నాము.

అతిధులను చుసిన వెంటనే వారి దెగరకు వెళ్లి వారికీ నమస్కరించి పిలిచి తన ఇంటికి భోజనం చేయుటకు రమ్మనుచున్నాడు.

 ప్రాచీన కాలంలో ఆతిధ్యమును గొప్పగా భావించేవారుఆనాటి యూదులు కానివ్వండి తొలి క్రైస్తవులు కానివ్వండి ఎవరినా సేవకులనుబాటసారులను చుస్తే  వెంటనే వారికీ ఆతిధ్యం సేవ చేసెడి వారుఅందుకే ప్రభువు సువార్త సేవకు శిష్యులను పంపించే ముందు  గృహవమైతే మిమ్ము ఆహ్వానిస్తుందో అక్కడే ఉంది భుజించండి అని ప్రభువు తెలిపారు. లూకా 10 :8

 పరదేశయినబాటసారి అయినా ఎచటికి వెళ్లిన వారికీ తగిన మరియాదలు దక్కేవి. అప్పటి కొంతమంది విశ్వాసులు యొక్క నమ్మకం ఏమిటంటే అతిధులు దేవలోకంనుండి విచ్చేసిన వారు అని అనుకునేవారు ఇది అన్యమతస్తుల యొక్క దృఢ నమ్మకం.

ఇశ్రాయేలు ప్రజలు కూడా అతిధి ఇంటికి వచ్చినపుడు యావే దేవుడే వారిని సందర్శించటానికి వచ్చారు అని భావించేవారు అందుకే వారిని సత్కరించేవారుఆతిధ్య మిచ్చేవారు.

ఆతిధ్యం ఇచ్చేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గుర్తుంచుకునే అంశం ఏమిటంటే వారు కూడా ఒక్కపుడు ఐగుప్తు దేశంలో ఆతిథ్యంను పొందిన వారే కాబట్టి ఇతర అతిదులపట్ల జాలి కలిగి ఉండాలి అని ఎప్పుడు కూడా గుర్తుంచుకొని వారు. ప్రభువే స్వయంగా పరదేశుల పట్ల జాలి కలిగి జీవించమని చెప్పారు. (ద్వితీ 10 :18 -19 ).

అతిథికి సేవ చేస్తే ఆదేవునికి సేవ చేసినట్లే అనే భావన అనేక మందికి ఉండేది ఆరోజుల్లో.

అబ్రాహాము వారి సేవ చేయటం సంతోషంగా భావించారు వెంట వెంటనే వారికీ భోజనం సిద్ధం చేయాలనుకున్నాడుఏది ఏమైనా సరే వారికీ గొప్ప ఆతిధ్యం తనకున్న దానిలో ఇవ్వాలనుకున్నాడుఅందుకే వెంటనే సారా దెగ్గరకు వెళ్లి రొట్టెను చేయమన్నాడుఆవుదూడను తెచ్చి కోసి భోజనం సిద్ధం చేసాడు వారికీ కావలిసిన దంతా సమకూర్చాడు.

అబ్రాహాము దేవునితో చాల సన్నిహితంగా ఉంటూ దేవుని యొక్క సాన్నిద్యంను అనుభవిస్తున్నాడు కాబట్టియే వచ్చిన ముగ్గురును దేవుళ్లుగా భావించి సేవ చేశారు.

అబ్రాహాము వారికీ భోజనం వడ్డించే సమయంలో వారి చెంతనే కూర్చొని వారి యొక్క విలువైన మాటలను ఆలకిస్తున్నారు అబ్రాహాము జీవితంలో  రెండు అంశాలు చుస్తునాంమొదటిగా దేవునికి సేవ చేయుట రెండవది వారి చెంత కూర్చొని చూపిన దంత సావధానంగా వింటూ మననం చేసుకోవటం  రెండు లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉండాలిపొరుగు వారికీ సహాయం చేస్తే  సమయం దీవెనగా మారుతుంది.

షూనేము పట్టణంలో ఉన్న సంపన్నురాలు ఎలీషా ప్రవక్తకు ఒక గది నిర్మించి తాను అటువైపుగా పరిచేర్యకు వెళితే బస చేయుటకు ధాబా ఇంటిలోనే ఒక గదిని ప్రవక్త కోసం ఏర్పరిచారు. 2 రాజు 4 : 8 -10

  సంపన్నురాలు చేసిన సహాయం ఆమె జీవితంలో ఆశిర్వాదంగా మారింది. అదేమిటంటే ఆమెకు సంతానం కలిగింది. 2రాజు 4 :17

సారెఫెతులో ఉన్న వితంతువు కూడా ఏలీయా ప్రవక్తకు ఆతిధ్యమిచ్చి మంచిగా అన్ని ఏర్పరిచినది కావున దేవుడు తనను కూడా కష్టకాలం నుండి కాపాడారు.1 రాజు 17 :7 -16

జక్కయ యేసు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించి యేసు ప్రభువుకు ఆతిధ్యం ఇచ్చారు. ఆయన రక్షణను పొందారు.

ఇంకా చాల మంది దైవ సేవకులకు ఆతిధ్యం ఇచ్చి దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకున్నారు.

మన యొక్క పొరుగు వారికీ సహాయం చేస్తే ఆది దేవునికి చేసినట్లే అని క్రీస్తు ప్రభువే సెలవిచ్చారు. మత్తయి 25 :40

మనం కూడా మన యొక్క పొరుగు వారికీ సహాయం చేస్తే దేవుడు ఆశిర్వదిస్తారు.

అబ్రాహాము దేవునికి ఆతిధ్యమిచ్చారు కాబట్టి అడగక పోయిన సరే దేవుడే అవసరతను గుర్తించి వారికీ సంతానం కలుగజేసారు.

 అసాధ్యమైనది దేవుడు వారి జీవితంలో సాధ్యం చేశారుఅబ్రాహాము వయస్సు 99 సారా వయస్సు 89 ఏళ్ళుఆది17:17 అయినప్పటికీ వారికీ దేవుడు సంతాన వరం కలుగుజేస్తున్నారు

దేవుడు అబ్రాహామును ఇచ్చిన వాగ్దానం  విధంగా నెరవేర్చుతున్నారు ఆది 12 :2 మహా జాతిగా తీర్చిదిద్దుతాను అని ప్రభువు చేసిన వాగ్దానం ప్రారంభమగుచున్నది.

మన యొక్క హృదయాలలో కూడా దేవునికి ఆతిధ్యం ఇచ్చి ఆహ్వానిస్తే దేవుడు మన జీవితాల్లో కూడా అసాధ్యమైనవి సుసాధ్యం చేస్తారు.

అబ్రాహాము తన యొక్క మంచి తనముతో సేవ చేశారు ప్రేమ చూపారు అందుకే దీవెనెలు పొందారు.

 నాటి రెండవ పఠనంలో పౌలు గారు క్రీస్తు ప్రభువు కోసం అనుభవించే శ్రమలు గురించి బోధిస్తున్నారు.

తన శరీరమైన శ్రీసభ కోసం  శిరస్సు అయిన క్రీస్తు ప్రభువు అనేక శ్రమలు అనుభవాయించారు నిజానికి ఆయన అనుభవించిన శ్రమలలో ఎలాంటి కొదవ లేదు. ప్రభువు తనయొక్క శ్రమల, మరణ, పునరుత్తానం ద్వారా అంతా నెరవేర్చారు.

పౌలుగారు  తాను ఇంకా సువార్త వ్యాప్తికోసం ఎన్ని కష్టాలైనా అనుభవించుటకు సిద్ధంగా ఉన్నాను అని తెలుపుచున్నారు.

ప్రభువు సందేశము ప్రకటించుట తనకు అప్పచెప్పబడిన పని అని పౌలు గారు తెలుపుచున్నారుఆయనను దేవుడు ఎన్నుకున్నది అనేక యుగములనుండి దాచబడిన దేవుని పరమ రహస్యం అన్యులకు తెలియజేయుటకొరకే.

సువార్త బోధన చేసేటప్పుడు కష్టాలు అనేవి సర్వ సాధారణం ఎందుకంటె అవి మనలను దేవునికి సాక్షులయేలా చేస్తాయిశ్రములు అనుభవించటానికి సిద్ధంగా లేకపోతె మన యొక్క పరిచర్య ఫలప్రదం కాదుకాబట్టి సువార్తను బోధించుటకు ఎన్ని కష్టాలైనాశ్రమలైన అనుభవించుటకు సిద్ధంగా ఉండాలి.

పునీత పౌలు గారు దేవుని కొరకు జీవించుటలో ఆనందం ఉందని తెలిపారు అదేవిధంగా పౌలుగారు కోలస్సిలో ఉన్నటువంటి విశ్వాసులను దేవుని పరమ రహస్యాన్ని తన యొక్క హృదయమును తెరవమని ఆహ్వానిస్తున్నారు.

హృదయం తెరచి క్రీస్తు ప్రభువుకు ఆహ్వానం పలికితే వారిని కూడా ప్రభువు దీవిస్తారు అని పౌలుగారు తెలిపారు.

 నాటి సువిశేష పఠనంలో బెతానియా గ్రామములో మార్తమ్మమరియమ్మ గార్లు యేసు ప్రభువుకు ఆతిధ్యం ఇచ్చిన విధానం తెలుసుకుంటున్నాం.మార్తమ్మమరియమ్మల కుటుంబం అంటే దేవునికి చాల ఇష్టమైన కుటుంబం  కుటంబంలో ఉన్న లాజరు మరణించినపుడు ఆయన కన్నీరు కార్చారుప్రభువు ఎవరికోసం ఏడ్చినట్లు సువిశేషాలు చెప్పలేదు కేవలం లాజరు మరణ వార్త విన్నప్పుడే ప్రభువు ఏడ్చారు

మనకి చాల దెగ్గరగా ఉన్న వ్యక్తులు మరణిస్తేనే మనం బాధపడతాం, ఏడుస్తాం. మార్తమ్మమరియమ్మల కుటుంబం దేవునికి అంత సన్నిహితంగా ఉన్న కుటుంబం. యొక్క కుటుంబం గురించి కొన్ని అంశాలు మనం తెలుసుకొందాం.

మార్తమ్మ, మరియమ్మల కుటుంబం దేవుడిని ఆదరించిన కుటుంబం 

దేవునికి సేవచేసిన కుటుంబం 

దేవున్నిప్రేమించిన కుటుంబం 

దేవునికి ఆతిధ్యం మిచ్చిన కుటుంబం 

దేవుని కొరకు జీవించిన కుటుంబం 

ప్రభువు నందు ఆనందించు కుటుంబం.

మరియుమమ్మ, మార్తమ్మ గారి జీవితంలో చాల గొప్ప లక్షణాలను చూస్తున్నాము.

చాల సందర్భాలలో మనమందరం కూడా మరియమ్మ వలె ఉండాలని కోరుకుంటాము కానీ మనమందరం మార్తమ్మలాగా కూడా ఉండాలి ఆమెలో కూడా గొప్ప గొప్ప మంచి లక్షణాలు ఉన్నాయి

మార్తమ్మలో ఉన్న లక్షణాలు 

1)మార్తమ్మకు ఇచ్చే ఉదార స్వభావం ఉంది. తనకు ఉన్న దానిలో ప్రభువుకు మేలైనది చేసి ఇవ్వాలన్నది ఆమె కోరిక 

ప్రభువును తన ఇంటిలోకి ఆహ్వానించింది ఆయనతో పాటు శిస్యులుకూడా ఇంటిలోనికి ప్రవేశించారుమాములుగా ప్రభువు ఎక్కడికైనా వెళుతున్నారంటే ఆయనతో పాటు మిగతా సేవకులు కూడా వెళుతుంటారుఅలాంటి వారందరికీ మార్తమ్మ తన ఇంటిలో ఆతిధ్యం ఇచ్చింది.

ఎప్పుడో ఒక రోజున ఒక మంచి వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడు అంటే అతనికి లేదా ఆమెకు మేలైన ఆతిధ్య సేవలు అందిస్తారు.

యేసు ప్రభువు ఇంటిలోనికి ఆహ్వానించి తనకు తోచిన విధంగా రుచికరమైన ఆహారాన్ని ఇవ్వాలనుకొంది అది ఆమెకు ఉన్న ఇచ్చే మనస్సు.

అనేక మందికి ఆతిధ్యం ఇవ్వటమంటే ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ వారికోసం హెచ్చించాలని అనుకున్నదిఇక్కడ ఆమెలో ఉన్న ఉదార స్వభావం తెలుసుకుంటున్నాం.

2) మార్తమ్మ దైర్యం కలిగిన వ్యక్తిఆమెలో ఎంతో దైర్యం ఉంది ఎందుకంటె యెరూషలేములో ప్రభువును చంపాలనుకొని కొంతమంది అనుకున్నారు. యోహాను 7 : 25 , 7 : 30.

ఆయనకు చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు యోహాను- 7: 20, 43  

ఆయనను చాలామంది విడిచి వెళ్లారు యోహాను 5 : 66

  ప్రభువుకు ఆశ్రమిచ్చిందని తన శత్రువుల నుండి ముప్పు వస్తుందని తెలిసినప్పటికిని యేసు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించింది.

క్రీస్తు కొరకు మరణించుటకు సైతం సిద్ధంగా ఉంది ఏది ఏమైనా పర్వాలేదు అని తలంచి ప్రభువును తన ఇంటికి ఆహ్వానించింది.

అదేవిధంగా సోదరుడి మరణ వార్త విని యేసయ్య వస్తాడని తెలుసుకొన్న మార్తమ్మ వెంటనే లేచి దైర్యంగా ఆయన్ను కలుసుకోవడానికి వెళ్ళుతుంది. యోహాను 11:18.

మరియమ్మ యేసు ప్రభువు పిలిస్తేనే వెళ్ళింది యోహాను 11:28. కానీ మార్తమ్మ ఆయన్ను కలుసుకోవడానికి ఆతురతతో దైర్యంగా ముందుకు వెళ్లుచున్నారుఅది ఆమె యొక్క దైర్యం.

మార్తమ్మ యేసు ప్రభువుని విశ్వసించిన వ్యక్తి :మార్తమ్మకు క్రీస్తునందు సంపూర్ణమైన విశ్వాసం ఉందిఆమె వాస్తవానికి చాలా మంచిది, దేవుని చేత ఆదరించబడినది. యోహాను 11:5.

క్రీస్తు ప్రభువు మరణించిన వారికీ సైతం జీవమును ప్రసాదిస్తారని ఆమె విశ్వసించింది. యోహాను 11:27.

ఆమె యొక్క విశ్వాస జీవితం చుసిన ప్రభువు తన యొక్క సోదరునికి జీవ ప్రసాదిస్తున్నారు.

మరణించిన వారు జీవితంలో లేపబడతారు అనే అంశం నమ్మాలంటే దానికి గొప్ప విశ్వాసం కావాలి అలాంటి విశ్వాసం మార్తమ్మలో చుస్తునాం.

క్రీస్తు ప్రభువును ఆమె సంపూర్ణంగా విశ్వసించింది.

4) మార్తమ్మ ప్రేమించే వ్యక్తి : మార్తమ్మ సోదర ప్రేమ కలిగి జీవించింది అందుకే లాజరును, మరియమ్మను తన దెగ్గరనే ఉంచుకుంది. యోహాను 11:1.

అదేవిధంగా దేవుడిని ప్రేమించిందిశిష్యులను ప్రేమించింది అందుకే వారికి మేలు చేయాలనీ భావించింది.

5) మార్తమ్మ తను తన యొక్క పనిలో నిమగ్నమై ఉన్న వ్యక్తి అంటే తాను తీసుకున్న బాధ్యతను 100% సక్రమంగా నెరవేర్చలనుకున్న వ్యక్తి అందుకే కుటుంబం బాధ్యతలను తన మీద వేసుకున్నారు అదే విధంగా యేసు ప్రభువుకు ఆతిధ్య ఇచ్చే బాధ్యతను సక్రమంగా చేయాలనుకున్నారుయేసు ప్రభువును  భోజనం ద్వారా సంతృప్తి పరచాలనుకున్నదిచాలా మంచి లక్షణాలు ఉన్న మార్తమ్మలో ఒక చిన్న బలహీనత ఉంది ఏమిటంటే ఆమె అనేక పనులతో సతమతమగుచున్నది.ఆమె ఏమి చేయాలాఎలా చేయాలా అనే ఆలోచనల్లో ఉంది ఎవరిని పట్టించుకోలేనంత పనిలో ఉందిఅందుకే ప్రభువు ఆమెను రెండు సార్లు పిలుస్తున్నారుఒక సారి పలకకపోతే రెండొవ సారి పిలుస్తూ మార్తమ్మ అనేక విషయాలు గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఆమె మొదట సారి పలుక లేదుమార్తమ్మ ఒక విధంగా చెప్పాలంటే పరధ్యానంగా అయ్యింది కలవరపడ్డదిమనం కూడా తొందరగానే కలవరపడతాంపరధ్యానం అవుతుంటాముగుడికి క్రొత్త చీర కట్టుకొని వచ్చానాక్రొత్త నగలు ధరించానాక్రొత్త వాళ్ళు వచ్చిన వారిని చూసి వెంటనే కలవరపడుతుంటాముమనకి facebookలో,whatsappలో చాట్ చేయటానికి సమయం ఉంటుంది కానీ దేవుని దెగ్గర కూర్చోవటానికి సమయం ఉండదు.

 లోక సంబంధమైన పనులలో మనమందరం నిమగ్నమై  ఉంటున్నాము.

మరియమ్మలో ఉన్న లక్షణాలు 

1) మరియమ్మ వినయవంతురాలు:- దేవుని పాదములు చెంత కూర్చొని ఆయన చెప్పే ప్రతి మాటను సావధానంగా విన్నది. దేవుడైన క్రీస్తు ప్రభువును ఆదరించింది.

2) మరియమ్మ వచనాహారం కోసం తపించుచున్నదిమరియమ్మ గారు యేసయ్య చెప్పే పరలోక సత్యములు తెలుసుకొని తన జీవితమును మార్చుకోవాలనుకున్నది.

వాక్యం విని దేవుని వాక్కు మననం చేసుకొని దాని ప్రకారంగా జీవించాలనుకున్నది.

దేవుని యొక్క వాక్కు వలన జీవిస్తాను అని భావించి. మత్తయి 4:4  

దేవుని మాటలు నిత్యా జీవపు మాటలు అని తలంచి వాటిని ఆలకించటానికి ప్రభువు పాదాల చెంత కూర్చున్నది 

మరియమ్మ గారు చేసినది ఉత్తమమే అని ప్రభువు  మెచ్చుకున్నారు వచ్చిన అతిధిని పట్టించుకోకపోతే అది కూడా తప్పే అందుకే మరియమ్మ యేసు ప్రభువు దగ్గర ఉన్నారు.

మన విశ్వాసం జీవితంలో వీరిద్దరిలో ఉన్న లక్షణాలు ఉండాలి 

1. దేవుని దెగ్గర కూర్చోవాలి 

2. దేవునికి సేవ చేయాలి 

మోషే ప్రవక్త దేవుని దెగ్గర 40 రోజులు కూర్చొని ఆయన మాటలు విని దేవుని సేవ చేశారు

యేసు ప్రబువు కూడా 40 రోజులు నిర్జన ప్రదేశంలో తండ్రితో గడిపి తండ్రి పరిచర్య ప్రారంబించారు.

మనం కూడా దేవుని దెగ్గర కూర్చొని ఆయన సేవ చేయాలి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి.

 కుటుంబం ఇచ్చిన ఆతిధ్యం ద్వారా వారు తమ్ముడు పునర్జన్మ పొందాడు కాబట్టి ఇతరులకు ఆతిధ్యం ఇచ్చి దేవుని అనుగ్రహాలు పొందుదాం.

ఫాదర్. బాల యేసు. . సి. డి.

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...