29, అక్టోబర్ 2022, శనివారం
దైవ వాక్కు ధ్యానము : జక్కయ్య యేసు ప్రభువు కలుసుకొనుట (లూకా 19: 1-10 )
22, అక్టోబర్ 2022, శనివారం
30 వ సామాన్య ఆదివారం
30 వ సామాన్య ఆదివారం
సిరాకు 35 : 12-14, 16-18
2 తిమోతి 4: 6-8, 16-18
లూకా 18: 9-14
ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం దీనతతో చేసే
ప్రార్ధనలు దేవుడు ఆలకిస్తారు అనే విషయమును బోధిస్తున్నాయి.
గత రెండు వారాలుగా
ప్రభువు ప్రార్ధన అనే అంశం గురించి
బోధిస్తున్నారు. 28వ ఆదివారం సువిశేష
గ్రంధంలో పది మంది కుష్ఠరోగులు
క్రీస్తు ప్రభువునకు చేసిన ప్రార్ధన గురించి వింటున్నాం. 29వ ఆదివారం సువిశేష
పఠనంలో ఒక వితంతువు చేసిన ప్రార్ధన గురించి వింటున్నాం.
ఈనాటి దివ్య పఠనాలు మరొకసారి ప్రార్ధన గురించియే తెలుపుచున్నాయి. మన యొక్క విశ్వాస
జీవితంలో దేవునికి ప్రార్ధించే సమయంలో వినయం ఉండాలి అని తెలుపుచున్నారు. దేవుడికి
సమస్తము తెలుసు కాబట్టి ఆయన ముందు గొప్పలు
చెప్పుకోకుండా వినయంతో ప్రార్ధించమని కోరారు.
ఈనాటి మొదటి పఠనంలో రచయిత దేవుడు దీనుని యొక్క ప్రార్ధన ఎలా ఆలకిస్తారో తెలుపుచున్నారు.
దేవుడు పక్షపాతము లేనివాడు ఆయన యొక్క దృష్టిలో
అందరూ సరిసమానులే. దేవుడు అందరిని ప్రేమతో తన చెంతకు చేర్చుకుంటారు.
దేవుని యొక్క మాట అనుసారంగా జీవించే
వారందరి యెడల దేవుడు పక్షపాతం
చూపించరు.
దేవుడు అందరి యొక్క మొరలను ఆలకిస్తారు అయన కొందరు మొరలు
ఆలకించి, కొందరి మొరలను ఆలకించకుండా వుండరు. ఎవరైతే ఆయనకు నిజాయితీగా ప్రార్ధిస్తారో వారి ప్రార్ధన దేవుడు
ఆలకిస్తారు.
దేవుడిని ఎవ్వరు డబ్బుతో కొనలేరు. మనం అన్యాయంగా సంపాదిచిన
డబ్బుతో దేవుణ్ణి సంతృప్తి పరచలేము. అన్యాయంగా సంపాదించిన ప్రతిదానిని దేవునికి అర్పించవలదు అని అంటున్నారు.
దేవుడ్ని మన యొక్క మంచితనం,
వినయం ద్వారానే మెప్పించగలము. అన్యాయంగా అర్ధించినది అంటే మన యొక్క
హృదయం పాపం చేసి దానిని
దేవునికి సమర్పిస్తే అది సరిగా ఉండదు.
పేద విధవరాలు నిజాయితీగా
సంపాదించిన రెండు కాసుల వలన దేవుణ్ణి సంతృప్తి
పరచగలిగారు. ధనికులు అన్యాయంగా సంపాదించినది ఆ కానుకల పెట్టెలో
వేసినపుడు అది ప్రభువునకు సంతృప్తి
పరచలేక పోయినది. - మార్కు 12: 41 - 44
ప్రభువు పేదలకు అన్యాయం చేయరు అని వింటున్నాం. దేవుడు
ఎంతో కరుణ, జాలి కలిగిన వారు.
దేవుడు పేదవారి యొక్క ఆక్రందనలు వింటారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో వున్న సమయంలో వారందరు పేదవారే, దేవుడు వారికి న్యాయం చేస్తున్నారు మరియు వారి యొక్క బాధలనుండి
బయటకు తీసుకొని వస్తున్నారు.
పేదవారు అంటే తన యొక్క అవసరంలో
వున్న వారు. దేవుని అవసరం వుండి విశ్వాసంతో ఎవరైతే మొరపెడతారో వారికి దేవుడు న్యాయం చేస్తారు. - కీర్తన 6 : 33 . దేవుడు బాధితులను అశ్రద్ధ చేయరు, అనాధల ప్రార్ధన విడిచిపెట్టారు అని ప్రభువు తెలుపుచున్నారు.
వితంతువు వేడుకోలు ఆలకిస్తారు అని అంటున్నారు.
మనం హృదయ పూర్వకంగా
వినయం కలిగి ప్రార్ధిస్తే దేవుడు మన ప్రార్ధనలు ఆలకిస్తారు
అనే సత్యంను వెల్లడిస్తున్నారు.
ఈ మొదటి పఠనం
ద్వారా మనం తెలుసుకోవలసిన ఇంకొక
విషయం ఏమిటంటే దేవుడు తన ప్రజలను ఎప్పుడు
కూడా ప్రేమతో చూసుకుంటారు, వారి ప్రార్ధనలు ఆలకిస్తారు,
ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు.
దేవుడు నీతిపరుడని, పక్షపాతం లేని వారని, జాలి
ప్రేమ కలిగినవారిని, సమాజంలో గుర్తింపు లేని వారి యెడల
ఆయన వారితో, వారి కోసం నిలబడతారని
తెలుపుచున్నారు.
విశ్వాసులుగా మనందరం మంచి జీవితం జీవించాలి,
పవిత్రంగా ఉండాలి, వినయంతో జీవించాలి.
ఈనాటి రెండవ పఠనంలో పౌలుగారు తన యొక్క పరిచర్య
చివరిభాగం గురించి తెలుపుచున్నారు. పౌలుగారు తాను పొందబోయే మరణం
ఎలాగ ఉంటుందో ముందుగానే తిమోతికి తెలుపుచున్నారు.
క్రీస్తుప్రభువు యొక్క పనికోసం మంచి పోరాటంనే పోరాడితిని
అని పౌలుగారు పలుకుచున్నారు. తనయొక్క పరిచర్య జీవితంలో దేవుడు ఏ విధంగా తన
కొరకు నిలిచారో తన యొక్క వినయంతో
కూడిన ప్రార్ధన ఆలకించారో పౌలుగారు తెలిపారు.
తాను దేవుని పక్షమున
పోరాడిన సందర్భంలో దేవుడు తనకు తోడు నిలిచి
తనకు శక్తిని ఒసగినారు అని తెలిపారు. మనం
క్రీస్తు కొరకు పోరాడాలి. పౌలు గారు ఒకప్పుడు
చాలా గర్వంగా వున్న వ్యక్తియే, కానీ తాను మారిపోయి
వినయంతో జీవించారు.
ఈనాటి సువిశేష పఠనంలో పరిసయ్యుడు-సుంకరి చేసిన ప్రార్ధన గురించి వింటున్నాం. ఈ ఉపమానం చెప్పటానికి
కారణం ఏమిటంటే చాలా మంది ఎన్నుకొనబడిన
యూదులు మనస్తత్వం ఏమిటంటే వారు మాత్రమే పవిత్రులని,
నీతిమంతులని, పరలోకం పొందుటకు అర్హులని, దీవించబడిన వారని, దేవుని వారసులని, వారి ప్రార్ధననే దేవుడు
ఆలకిస్తారని మిగతా వారి ప్రార్ధన ప్రభువు
తృణీకరిస్తారనే ఆలోచనలో వున్న పరిసయ్యుల మనస్తత్వంను మార్చుటకు ప్రభువే ఈ ఉపమానం చెబుతున్నారు.
లూకా సువార్తికుడు తన
యొక్క గ్రంధంలో పేదవారికి ప్రాముఖ్యతను ఇచ్చారు. పరిసయ్యుడు - సుంకరి జీవితం ద్వారా మనం కూడా కొన్ని
విషయాలు నేర్చుకోవాలి.
పరిసయ్యుడు - సుంకరి ఇద్దరు కూడా ఒకే దేవాలయంకు
ప్రార్ధన చేయటానికి వెళ్లారు. దేవాలయంలో చేసిన
ప్రార్థనకు శక్తి చాలా ఉంటుంది. ఇద్దరు కూడా
దేవునికి ప్రార్ధించారు. దేవుడు వారి ప్రార్ధన ఆలకించాలి
అన్నదియే వారి యొక్క ఉద్దేశం.
ఇద్దరు ఒకే దేవునికి ప్రార్ధించారు.
ఇద్దరు ఒకే దేవుని ఆలయంలో
ఉన్నారు. కానీ దేవుడు ఒకరి
ప్రార్ధనయే ఆలకించారు ఎందుకంటే ఆయన దీనతతో ప్రార్ధించారు.
దేవునికి ప్రార్ధించే సందర్భంలో వీరిద్దరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉన్నదో
మనం ధ్యానించాలి. ఎవరిలాగా మనం జీవిస్తే దేవుని
యొక్క అంగీకారం పొందుతాం అనే విషయాన్ని కూడా
గ్రహించాలి.
పరిసయ్యుడు దేవునికి ప్రార్ధించలేదు, తనతో తాను మాట్లాడుకున్నారు.
ఆయన దేవాలయంకు వెళ్ళినది తన యొక్క గొప్పలు
చెప్పుకోవటానికియే. ఒక నిజమైన ప్రార్ధన
మనం దేవునికి మాత్రమే సమర్పించాలి.
పరిసయ్యుడు నేను లోభిని కాను, అన్యాయము
చేయువాడను కాను, వ్యభిచారిని కాను, ఈ సుంకరివంటి వాడను
కాను అని తన గురించి
తాను గర్వ పడుతూ ఇతరులను
కించపరుస్తూ తనకు తానే ప్రార్ధించుకున్నాడు.
ఆయన హృదయంలో మనస్సులో గర్వం మాత్రమే ఉంది.
పరిసయ్యుడు ప్రార్ధించటానికి వెళ్ళలేదు దేవునికి తాను చేసే పుణ్య
కార్యాల గురించి తెలపడానికి వెళ్ళాడు. నిజానికి దేవునికి అంతయు తెలుసు - కీర్తన 139:2. 139వ కీర్తన మొత్తం
కూడా దేవునికి అంతయు తెలుసు అనే విషయాన్ని తెలుపుతుంది.
దేవుని ఆలయంలో దేవుణ్ణి స్తుతించుటకు బదులుగా పరిసయ్యుడు తన్ను తాను పొగుడుకుంటున్నాడు. ఆయన దేవుని
ముంగిట తనను తాను హెచ్చించుకుంటున్నాడు.
తన యొక్క ప్రార్ధనలో ధీనతలేదు, అందుకే దేవుడు ఆయన్ను అంగీకరించలేదు. పరిసయ్యుడు గర్వంతో ఉన్నారు. గర్వం నాశనానికి కారణం. గర్వం దేవదూతలు సైతం సాతానులుగా చేస్తుంది.
వినయం మనుషులను సైతం దేవుదుతలుగా మార్చుతుంది.
ఎవరైనా ప్రార్థిచేటప్పుడు ఇతరులతో పోల్చుకోకూడదు ప్రభువు దానిని అంగీకరించరు. పరిసయ్యుడు ఎదుటివారిని హేళన చేసి, తక్కువ
చూపు చూసి ప్రార్ధిచాడు అందుకే
దేవుడు అంతని ప్రార్ధన ఆలకించలేదు. మన జీవితాలను కేవలం
దేవునితోనే పోల్చుకోవాలి.
సుంకరి ప్రార్ధన కన్నీటి ప్రార్ధన. ఆయన ప్రార్ధనలో నిజాయితీ
వుంది, హృదయవేదన వుంది, ధీనతావుంది, పశ్చాత్తాపం ఉంది. సుంకరి దేవుడు కరుణామయుడని విశ్వశించాడు. దేవుడే తనను మన్నించి శుద్ధీకరిస్తాడని
నమ్మాడు.
సుంకరి ప్రార్ధించేటప్పుడు దేవాలయంలో దూరంగా వున్నారు. ఆయన చేసిన పాపాలకు
పశ్చాత్తాపపడ్డారు, పవిత్రమైన దేవుని సన్నిధిలో నిలుచుటకు యోగ్యత లేదు అని తెలుసుకున్నాడు.
తాను చేసిన పాపం
వలన దేవునికి దూరమయ్యానని పశ్చాత్తాపపడ్డాడు. తన యొక్క పాపమే
తనని ఒంటరిని చేసిందని గ్రహించాడు. తన పాపం చేయుటవలన
పొరుగువారిని కూడా బాధపెట్టానని గ్రహించాడు.
అందుకే అందరికి దూరంగా నిలుచుండి ప్రార్ధన చేసాడు. ఎంత దూరంగా ఉన్నప్పటికీ
ఆయన హృదయపూర్వకంగా ప్రార్ధించాడు.
సుంకరి
కన్నులెత్తి చూడటానికి సైతము ఇష్టపడలేదు. ఆయన యొక్క పశ్చాత్తాప
హృదయం దేవుని వైపు తిప్పారు కానీ
తన యొక్క కన్నులు పైకెత్తలేదు. తన పాపభారం అంత
గట్టిది అని గ్రహించారు.
తన రొమ్మును బాదుకుంటున్నాడు
అంటే తాను చేసిన పాపాలకు
అంతగా పశ్చాత్తాప పడుతున్నాడని అర్ధం. దేవుని పవిత్రతను గుర్తించాడు, తన పాపభారంను గ్రహించాడు
అందుకే పశ్చాత్తాప పడుతూ ప్రార్ధించాడు.
దేవుని కరుణ కొరకు ప్రార్ధించాడు,
దేవుని ముంగిట తాను పాపి అని
ఒప్పుకున్నాడు అదేవిధంగా దేవుని కరుణ కొరకు ప్రార్ధించాడు.
దేవుని యొక్క మంచితనమును, దయను తెలుసుకున్న వ్యక్తి
దేవుడు మన్నిస్తాడని గ్రహించాడు. తన
పాపం దేవుడిని బాధపెట్టానని పశ్చాత్తాపపడ్డాడు. పశ్చాత్తాపంలో
దేవునికి ప్రార్ధిస్తే మన్నిస్తారని ఈ సుంకరి తెలుసుకున్నాడు.
లూకా 1 : 50, మీకా 7 : 18, తీతు
3: 5, 4: 7, ఎఫెసీ 2: 4 - 5
దేవునికి భయపడేవారికి ఎల్లప్పుడూ ఆయన కరుణ దొరుకుతుంది. రక్షణకై
సుంకరి దేవుని మీద ఆధారపడ్డాడు. పరిసయ్యుడు
తు.చ. తప్పకుండా అన్ని
చేసినా దేవుడు అతని ప్రార్ధన అంగీకరించలేదు
కానీ సుంకరి తనను తాను తగ్గించుకొని
హృదయపూర్వకంగా చేసిన ప్రార్ధన ఆలకించారు. మనం చేసే ప్రార్ధనలో
దీనత ఎప్పుడూ ఉండాలి.
BY. FR. BALAYESU OCD
21, అక్టోబర్ 2022, శుక్రవారం
30వ సామాన్య ఆదివారం
30వ సామాన్య ఆదివారం
2 తిమోతి 4:6-8, 16-18
లూకా 18:9-14
క్రీస్తునాదునియందు ప్రియమైనటువంటి పూజ్య గురువులు మరియు దేవుని బిడ్డలైనటువంటి క్రైస్తవ విశ్వాసులారా.
ఈ నాడు తల్లి శ్రీసభ 30వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించియున్నది.ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనములను గ్రహించినట్లైతే మూడు కూడా ముఖ్యమైనటువంటి ప్రార్థన జీవితం గురించి మనకు తెలియజేస్తున్నాయి.
దేవుడు మనలను సమృద్ధిగా మరియు పుష్కలంగా ఆశీర్వదించాడు. ఆయన తన ఆశీర్వాదాలను మనపై కుమ్మరిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో, దేవుడు మనలను తనకు దగ్గరగా ఉండమని మరియు ప్రార్థించమని ఆహ్వానిస్తాడు. క్రైస్తవ మత ఆచరణలో ప్రార్థనకు ప్రముఖ స్థానం ఉంది. నేటి ప్రార్ధన యొక్క కొన్ని అంశాలను మరియు జీవితానికి దాని అన్వయాన్ని చర్చిస్తుంది. దేవుడు ముఖ్యంగా పాపి మరియు వినయస్థుల మాట వింటాడని పఠనాలు చెబుతున్నాయి. మానవులతో వ్యవహరించడంలో దేవుడు ఎందుకు పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడని మనం తరచుగా ఆలోచిస్తాము. నేటి సువార్తలో, యేసు మనకు పరిసయ్యుడు మరియు పన్ను తీసుకొనే వ్యక్తి గురించి చెబుతాడు ఇది దేవునితో సరిగ్గా ఉండడానికి మార్గాన్ని చూపుతుంది.
వారిద్దరూ ప్రార్థన చేయడానికి ప్రత్యేక ప్రదేశానికి వెళ్లారు. దేవుడు తన చట్టాలను నిరంతరం ఉల్లంఘించే వారి కంటే వాటిని పాటించే మంచి వ్యక్తులను ఎక్కువగా వింటాడని కొన్నిసార్లు మనం అనుకుంటాము. ఉపమానంలో సూచించినట్లుగా అది ఖచ్చితంగా పరిసయ్యుని వైఖరి. నిజానికి వినయస్థుల ప్రార్థన మేఘాలను చీల్చుతుంది మరియు అది తన లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించదు.
నేటి మొదటి పఠనం పేదల పట్ల దేవుని శ్రద్ధ గురించి చెబుతుంది మరియు వారి ప్రార్థన స్వర్గ న్యాయస్థానాలకు చేరుకుంటుంది. ప్రభువును సేవించే వారు తమ ప్రార్థనలను ప్రభువు ఆలకిస్తారని ఆశించవచ్చు. మన ప్రార్థన జీవితం అనివార్యంగా మన జీవితాంతం అనుసంధానించబడిందని మొదటి పఠనం చెబుతుంది. ప్రభువు న్యాయాధిపతి, మరియు అతనిలో పక్షపాతము లేదు. అన్యాయానికి గురైన వాని ప్రార్థన వింటాడు. అనాథ లేదా వితంతువులు మొరపెట్టుకున్నప్పుడు వారి విన్నపాన్ని ప్రభువు ఆలకిస్తాడు. భగవంతుని చెవి పేదవారు మరియు వదిలివేయబడిన వారి వైపు మొగ్గు చూపుతుంది. విశ్వాసుల ప్రార్థనలు ప్రభువును సంతోషపరుస్తాయి మరియు అతని స్వర్గపు సింహాసనం ముందు వినబడతాయి. కానీ వినయస్థుల ప్రార్థనలు ప్రభువును తాకుతాయి మరియు నీతిమంతులకు న్యాయం చేయడానికి తీర్పును అమలు చేయడం ద్వారా సర్వోన్నతుడు ప్రతిస్పందించే వరకు అవి అతని హృదయాన్ని గుచ్చుతాయి. సిరాక్
ప్రార్థన ఒక బాణం దాని గుర్తుకు చేరుకోవడం గురించి మాట్లాడుతుంది, దేవుడు దానిని గమనించే వరకు అది మిగిలి ఉంటుంది. బలహీనులు మరియు వినయస్థులు సర్వశక్తిమంతుడైన దేవునితో వినికిడిని పొందుతారు.
పౌలు తిమోతికి వ్రాసిన రెండవ లేఖ నుండి నేటి రెండవ పఠనంలో, పౌలు యొక్క వినయానికి
ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. పౌలు తన నిష్క్రమణ సమయం వచ్చిందని చెప్పినప్పుడు, అతను మరణం యొక్క సామీప్య వాస్తవాన్ని చెబుతున్నాడు. అతని మరణం ఆసన్నమైంది మరియు అతను ఈ జీవితం నుండి నిష్క్రమించడం మరియు క్రీస్తు వద్దకు తిరిగి రావడం ఖాయం. అతను అప్పటికే తన జైలులో ఉన్నాడు. అతని మాటల ద్వారా, అతను జాలి కోరడం లేదు, లేదా అతను యేసు యొక్క పవిత్ర నామంలో చేసిన అన్నిటి గురించి గొప్పగా చెప్పుకోలేదు. మరోవైపు అతను తన డబ్బు,తన పని, తన సమయం మరియు ఇప్పుడు తన జీవితాన్ని దేవుడికి సమర్పించాడు. తాను మంచి పోరాటం చేశానని, మంచి పరుగు పందెం నడిపానని, విశ్వాసాన్ని నిలబెట్టుకున్నానని పౌలు ఇప్పుడు వాళ్లతో చెబుతున్నాడు. పౌలు తనతో లూకాను కలిగి ఉన్నాడు మరియు తిమోతి మరియు మార్కు తన స్థానానికి వస్తారని అతను ఆశించినప్పటికీ, అతను యేసు వలె విడిచిపెట్టబడ్డాడు.
నేటి సువార్తలో, ప్రార్థన సందర్భంలో ఒక పరిసయ్యుడు మరియు పన్ను వసూలు చేసే వ్యక్తి యొక్క విచిత్రమైన ఉదాహరణ మనకు ఉంది. అతను మంచి వ్యక్తి అని నిరూపించడానికి పరిసయ్యుడు మరియు మా దగ్గర స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. అతను యూదుల ధర్మశాస్త్రాన్ని మరియు దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాడు. అతను మంచి యూదుడు బాధ్యతలను నమ్మకంగా గమనించాడు: అతను ప్రార్థించాడు, ఉపవాసం ఉన్నాడు మరియు భిక్ష ఇచ్చాడు. నిజానికి, అతను
దేవుని పట్ల తన వైఖరిలో చాలా ఉదారంగా ఉన్నాడు. అతను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉండేవాడు, అయితే మతపరమైన యూదుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉపవాసం ఉండేవాడు. వ్యవసాయ ఉత్పత్తుల లాభాల్లో దశమభాగాలు ఇవ్వాలని చట్టం ఆదేశించింది, అయితే పరిసయ్యులు అతని వద్ద ఉన్న ప్రతిదానిలో దశమ వంతులు ఇచ్చారు. అతని నీతి మోషే ధర్మశాస్త్రం సూచించిన ప్రమాణాలను గణనీయంగా మించిపోయింది. ఇంకా, దేవుడు అతనితో సంతోషంగా లేడు ఎందుకంటే అతను పూర్తిగా స్వీయ-కేంద్రీకృత వ్యక్తి. అతను ఇతరులలా కాదు, ముఖ్యంగా దేవాలయానికి ప్రార్థన చేయడానికి వచ్చిన భయంకరమైన పన్ను వసూలు చేసే వ్యక్తిని అతను మాటలతో దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. పరిసయ్యుడి వంటి పవిత్రమైన ఉదార వ్యక్తిని దేవుడు రక్షించడం ఎంత అదృష్టమో అతను దేవునికి చెప్పాడు.
సువార్తలో చిత్రీకరించబడిన పన్ను వసూలు చేసే వ్యక్తిని చూస్తే అతను ఖచ్చితంగా పాపాత్ముడే. పన్ను వసూలు చేసేవారిని సామాజిక బహిష్కృతులుగా పరిగణించారు. వారు రోమ్ కోసం దొంగలుగా పరిగణించబడ్డారు.
పన్ను వసూలు చేసేవారు రోమన్లచే అణచివేయబడిన వారి సొంత సంఘం నుండి పన్ను డబ్బు వసూలు చేసి వారికి మంచి వాటాను ఇచ్చారు. ఇక్కడ మనకు యూదుల చట్టాన్ని పాటించని ఒకరు ఉన్నారు. ఇతర పన్నువసూలు చేసేవారిలాగే, అతను కూడా మోసగాడు మరియు దోపిడీదారుడే. అతను నిజంగా ప్రపంచం ముందుపాపి, కానీ దేవుడు అతన్ని ప్రేమించాడు మరియు అతనిని ప్రేమిస్తూనే ఉన్నాడు. పన్ను వసూలు చేసేవాడు
దేవాలయాన్ని విడిచిపెట్టినప్పుడు, అతను దేవుని స్నేహితుడిలా చేశాడని యేసు చెప్పాడు, అయితే పరిసయ్యుడు క్షమాపణ అనుభవం లేకుండా వెళ్లిపోయాడు. పన్ను వసూలు చేసేవాడు పాపి అయినప్పటికీ, అతను తన పాపాలను ఒప్పుకున్నాడు మరియు దేవుని నుండి క్షమాపణ కోరాడని ఉపమానం చెబుతుంది.
పరిసయ్యుడు మరియు పన్ను వసూలు యొక్క ఈ ఉపమానం యొక్క సాధారణ వివరణ ప్రారంభ
పద్యం నుండి దాని సూచనను తీసుకుంటుంది. ఇది తమ సొంత ధర్మాన్ని నమ్మి, అందరినీ తృణీకరించే వారిని ఉద్దేశించి ప్రసంగించబడింది. ఉపమానం కూడా ఒక పరిసయ్యుడు మరియు పన్ను వసూలు చేసే వ్యక్తి యొక్క పాత్రలను ఉపయోగిస్తుంది కానీ సందేశం ప్రత్యేకంగా పరిసయ్యుడు లేదా పన్ను వసూలు చేసే వ్యక్తికి వ్యతిరేకంగా సూచించబడలేదు. ఈ ఉపమానాన్ని చదివిన వారిలో చాలామంది పరిసయ్యుడిని గర్విష్ఠుడని, స్వధర్మపరుడని,అహంభావి అని విమర్శిస్తూ, పన్ను వసూలు చేసే వ్యక్తిని వినయపూర్వకమైన వ్యక్తిగా పొగడాలని షరతు విధించారు. వాస్తవానికి, పరిసయ్యుడు స్వీయ-నీతిమంతుడు కాదు మరియు అతను మంచి పరిసయ్యుడు చేయవలసిన పనిని చేస్తాడు. మరోవైపు పన్ను వసూలు చేసేవాడు భూమి యొక్క శత్రువులకు సహకరించేవాడు. పరిసయ్యుడు చేసిన తప్పు ఏమిటంటే, అతను తన మతపరమైన మరియు వ్యక్తిగత విజయాన్ని తనకు తానుగా జమ చేసుకున్నట్లు అనిపిస్తుంది.
నేటి సువార్తలో లూకా మనకు చెప్పేదేమిటంటే, మనం ఎవరమైన సరే, మనలో ఎవరైనా ఉచ్చరించగల ఏకైక ప్రామాణికమైన ప్రార్థన పన్ను వసూలు చేసే వ్యక్తి ద్వారా మాత్రమే. అప్పుడు కూడా ధర్మానికి హామీ లేదు. ఇక్కడ యేసు సరళత మరియు వినయం గురించి మాట్లాడుతున్నాడు. తమను తాము తగ్గించుకొనేవారందరు హెచ్చించబడతారని ఆయన చెప్పాడు. మత్తయి సువార్తలో, చిన్న పిల్లవాడిలా వినయంగా మారేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అని యేసు చెప్పిన మాటలు మనకు ఉన్నాయి. పరిసయ్యుడు మరియు పన్ను వసూలు చేసేవారి ఉపమానంలో, పరిసయ్యుడు తనను తాను నీతిమంతుడిగా ఎలా భావించుకున్నాడో మరియు పన్ను వసూలు చేసేవారిని ఎలా ఖండించాడో మనం విన్నాము.
ఆయన భూమిపై జీవించిన కాలంలో, పరిసయ్యులకు వ్యతిరేకంగా తప్ప యేసు చెప్పిన కఠినమైన
మాటలేవీ మనం వినలేము. యేసు వారితో కలిసిపోయాడు, అయినప్పటికీ అతను వారి ప్రవర్తన గురించి గట్టిగా మాట్లాడాడు. మత్తయిలో, పరిసయ్యులు మరియు సుంకరులను క్రీస్తు ఖండించడానికి పూర్తి అధ్యాయం అంకితంచేయబడింది. అతను వారిని తెల్లగా కడిగిన సమాధులు అని పిలుస్తాడు, చట్టాలను రూపొందించే వ్యక్తులు కానీ పాటించని వ్యక్తులు మరియు మొదలైనవి. నేటి ఉపమానంలో, అతను వారిని స్వీయ-నీతిమంతులుగా మాట్లాడుతున్నాడు. మనం నేర్చుకునే ఒక విషయం ఏమిటంటే, దేవుడు ఏ పాపాన్ని ఆమోదించడు, వినయంతో ఆయన వైపు తిరిగే పాపులందరికీ ఆయన దయ మరియు క్షమాపణ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఇది మన చిత్తశుద్ధి కోసం మనకు బహుమతిగా ఇవ్వబడిన దేవుని దయ మాత్రమే, ఇది మనలను ఆయన సన్నిధికి తీసుకువస్తుంది, మనకు మోక్షాన్ని తెస్తుంది, ఎందుకంటే మన దేవుడు దయగలవాడు మరియు అతను మానవాళిని ప్రేమిస్తాడు. “వినయుని వ్యక్తి యొక్క ప్రార్థన మేఘాలను చీల్చుతుంది.
పరిసయ్యుల యొక్క ఈ విచారకరమైన కథ నుండి మనం నేర్చుకోవలసిన ఒక విషయం ఏమిటంటే,
దేవుడు ఏ పాపాన్ని ఆమోదించడు, అతని దయ మరియు అతని క్షమాపణ గర్విష్ఠులు తప్ప పాపులందరికీ అందుబాటులో ఉంటుంది. గర్వం అనే పాపాన్ని దేవుడు క్షమించడని కాదు, గర్వించే వ్యక్తి దేవుని క్షమాపణ కోరడు. కాబట్టి ఈ ప్రమాదకరమైన మరియు విధ్వంసక దుర్మార్గానికి వ్యతిరేకంగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రమాదకరమైనది ఎందుకంటే అది మన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత మనల్ని నాశనం చేస్తుంది. ఇది వినాశకరమైనది ఎందుకంటే ఇది మనం ఆచరించే అన్ని మంచి ధర్మాలను మరియు మనం చేసే అన్ని మంచి పనులను నాశనం చేస్తుంది. సోదర ప్రేమ గర్వించె హృదయంలో వర్ధిల్లదు, ఎందుకంటే గర్వించదగిన హృదయం చాలా స్వార్థంతో నిండి ఉంటుంది, అది ఇతరులకు చోటు లేదు. గర్వించదగిన వ్యక్తి తన ఆత్మగౌరవం కోసం మతాన్ని మరియు ధర్మాలను పాటిస్తాడు మరియు దేవుని కోసం కాదు కాబట్టి గర్వించే హృదయంలో దేవుని పట్ల నిజమైన ప్రేమ ఉండదు. ఉపమానంలోని పరిసయ్యుడు ఈ వాస్తవాన్ని ఋజువు చేస్తున్నాడు. అతను తన మంచి పనుల గురించి మాత్రమే ప్రగల్భాలు పలికాడు మరియు ప్రార్థన చేయలేదు. ఇంకా, అతను తన పక్కన ఉన్న వ్యక్తిని విమర్శిస్తూ గడిపాడు మరియు అతనిని తన సొంత సోదరుడిగా అంగీకరించడానికి నిరాకరించాడు. క్రైస్తవులమైన మనం ఆలా జీవించకుండా ఆ యొక్క సుంకరి వలే జీవించాలని, సాటి వారిని గౌరవించాలని ఈయొక్క పూజ బలిలో ప్రార్ధించుకుందాం
బ్రదర్ జోహెన్నెస్ ఓ సి డి
15, అక్టోబర్ 2022, శనివారం
29వ సామాన్య ఆదివారం(2)
29వ సామాన్య ఆదివారం
నిర్గమ 17:8-13
2 తిమోతి 3:14-4:2
లూకా 18 1-8
ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు ప్రార్ధన గురించి తెలియజేస్తున్నాయి. మన యొక్క ప్రార్థనలో పట్టుదల నమ్మకం స్థిరత్వం ఉండాలి అనే అంశాల గురించి ఈనాటి దివ్య పఠనాలు తెలుపుచున్నాయి.
ప్రతి ఒక్క మతంలో విశ్వాసులు అందరూ ప్రార్థిస్తారు. క్రైస్తవులమైన మనము రోజుకు అనేకసార్లు ప్రార్థిస్తాం. ఈనాడు ప్రత్యేకంగా మన యొక్క ప్రార్థన ఎలాగా ఉందో ధ్యానించుకుందాం.
ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట అని పునీత అభిలాపరీతరేసమ్మ గారు తెలిపారు.
ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవునితో ఐక్యమై జీవించుట. మానవులం దేవునికి మన యొక్క కష్టాలు బాధలు తెలుపుటకు ఉన్నా ఏకైక మార్గం ప్రార్థనయే.
సునీత అగస్తీను గారు ప్రార్థన గురించి మాట్లాడిన సందర్భంలో ఆయన ఈ విధంగా అన్నారు "మనిషి శరీరానికి ఆహారం ఎంత అవసరమో, హృదయానికి ప్రార్ధన అంతే అవసరం.
మదర్ తెరిసా గారు కూడా ప్రార్థన లేని జీవితం నిర్జీవీతో సమానం అని అన్నారు. అదేవిధంగా మనిషి బ్రతకటానికి ఆక్సిజన్ ఎంత అవసరమో ఆత్మ జీవించడానికి ప్రార్థన కూడా అంతే అవసరం.
మనం కూడా ప్రార్థన అవసరతను తెలుసుకొని ప్రార్థించాలి.
ప్రార్థన స్వస్థత చేకూర్చను
ప్రార్థన విజయమును తెచ్చాను
ప్రార్థన అద్భుతములను చేయును
ప్రార్థన రక్షణను ఇచ్చెను
ప్రార్థన మారుమనస్సును కలుగజేయును
ప్రార్థన మనలను దేవునితో ఒకటి చేయను.
ఈనాటి మొదటి పఠనం లో మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల కొరకు చేసిన ప్రార్థన గురించి చదువుకున్నాం. అమెలేకు రాజు ఇశ్రాయేలు ప్రజల మీదకు దండెత్తి వచ్చినప్పుడు మోషే ప్రవక్త చేతులెత్తి దేవునికి ప్రార్ధన చేస్తున్నారు.
మోషే ప్రవక్త దండంతో ప్రార్థిస్తున్నారు. ఆ దండనము దేవుని యొక్క గొప్ప శక్తికి సూచకం.
ఈ దైవ దండముతోనే మోషే ప్రవక్త ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేశారు. రాతి నుండి నీటిని పుట్టించారు. దైవ దండనముతో ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తారని మోషే ప్రవక్త గట్టిగా విశ్వసించారు.
మోషే ప్రవక్త రెండు చేతులెత్తి ప్రార్ధించినంతవరకు ఇశ్రాయేలు ప్రజలదే పైచేయి. మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల తరఫున దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు.
తన యొక్క రెండు చేతులను పైకెత్తుట దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడుటను సూచిస్తుంది. దేవుని యొక్క శక్తిని నమ్ముకొని ఆయన తప్ప ఇంకొకరు మేలు చేయరని సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే మనలను ప్రభువు ఆశీర్వదిస్తారు. ఆయన చేతులను దించుట తన యొక్క బలహీనతను సూచిస్తుంది. అదే విధంగా తన యొక్క తక్కువ నమ్మకమును సూచిస్తుంది.మోషే ప్రవక్త దేవుని మీదనే ఆధారపడుట వలనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయమును దయ చేశారు.
మన జీవితంలో కూడా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి జీవించాలి అందుకే ఏసుప్రభు నేర్పిన పరలోక ప్రార్థనలో మనో రోజు చెపుతూ ఉంటాం నానాతికి కావలసిన ఆహారము నేటికీ ఇవ్వమని ప్రతి నిత్యం కూడా దేవుని మేతనే ఆధారపడితే ఆయన తప్పక దీవిస్తారు. ఈ విజయం ద్వారా దేవుడు యెహోషువ విశ్వాసాన్ని బలపరుస్తూ దేవుడు ఇశ్రాయేలు ప్రజల తరఫున పోరాడతారని తెలియజేస్తున్నారు. ఈ విషయం ద్వారా ప్రభు ఇస్రాయేలు ప్రజల పట్ల విశ్వాసనీయుడుగా ఉండి వారిని రక్షిస్తారని వారి తరుపున పోరాడతారని తెలియజేస్తున్నారు. మోషే ప్రవక్త ఎంత కష్టమైనా సరే ప్రజల కొరకు ప్రార్ధించారు. ఈ మొదటి పఠనం ద్వారా మనం గ్రహించవలసిన ఇంకొక్క విషయం ఏమిటి అంటే మనం కూడా గురువులకు సహకరించాలి వారు చేసే పరిచర్యలో సహాయం చేయాలి.
అహరోను, ఊరు అనే ఇద్దరు ప్రవక్త చేతులను పట్టుకొని వారు ప్రార్ధించుటకు సహకరించారు. ఆయన ప్రార్థన చేస్తే విజయం చేకూరుతుందని తెలుసుకున్నారు. కాబట్టి మోషే ప్రవక్తకు సహకరించాలి. విశ్వాసులపై దేవుని ఆశీర్వాదం రావాలంటే మనం కూడా గురువు ప్రార్థించుటకు పరిచర్య చేయుటకు సహకరించాలి. మోషే ప్రవక్త యొక్క ప్రార్థనలో పట్టు విడవటం లేదు అందుకే దేవుడు అతని ప్రార్థన ఆలకించారు. మన యొక్క ప్రార్థనలో కూడా మనం కష్టపడాలి. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు అంటారు "ప్రార్థన, సుఖం ఎప్పుడూ కలిసి వెళ్ళవు అని". Prayer and comfort do not go together.
మోషే ప్రవక్త చేతులు నొప్పి వచ్చిన సరే ప్రార్థించారు మనం కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించాలి కన్నీటి ప్రార్థన చేయాలి.
ఈనాటి రెండవ పఠనంలో తిమోతికి రాసిన లేఖ ద్వారా వాక్యం చదువుటలోనూ, ప్రార్థించుటలోనూ, ప్రకటించుటలోనూ, విశ్వసించుటలోను ఒక పట్టుదల కలిగి జీవించమని పౌలు గారు తెలుపుచున్నారు. తిమోతి ఒక దైవ సేవకుడిగా అన్ని సమయాలలో సత్కారములు చేయుటకు సిద్ధంగా ఉండమని తెలుపుతున్నారు. నేర్చుకున్న ప్రతి దైవ విషయమును బోధించుటకు సిద్ధంగా ఉండమని తెలుపుతున్నారు. పౌలు గారు తిమోతికి వాక్యమును ప్రతి సమయంలో అనుకూల సమయమందు ప్రతికూల సమయమందు బోధించమని తెలుపుచున్నారు. వాక్యము మనకు జ్ఞానమనిచ్చెను. అందుకే తిమోతిని దైవవాక్కును సహనముతో బోధించు అని తెలిపారు. అదేవిధంగా వాక్యం మనకు అనేక పరలోక సత్యములను నేర్పించును కాబట్టి ఆ వాక్కును సహనముతో బోధించు అని పౌలు గారు తిమోతికి తెలిపారు.
దైవ వాక్కు ప్రేరేపించి రాయబడినది కాబట్టి అది ఇతరులను ప్రేరేపిస్తుంది అందుకే ప్రజలను ఒప్పించుచు ప్రోత్సహించి వారి విశ్వాస ఎదుగుదలకు సహకరించమని తెలిపారు.
అనేకసార్లు మనం ప్రార్ధించినప్పుడు మనకు అనుగ్రహాలు దొరకకపోతే మనందరం కూడా ప్రార్థన చేయటం ఆపివేస్తాం. ప్రభువు ఉపమానం ద్వారా మనందరికీ తెలిపే అంశం ఏమిటంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ఒక వితంతువు న్యాయాధిపతిని సంప్రదించి తనకు న్యాయం చేయమని పదేపదే అడిగింది. అన్యాయాధిపతి యూదుడు కాదు చిన్న చిన్న సమస్యలు మొత్తం కూడా వారి మధ్యన ఉన్న ఒక పెద్ద పరిష్కరించేవారు. ఒకవేళ ఆ న్యాయాధిపతి యూధుడైతే అతనితో పాటు ఇంకొక ముగ్గురు న్యాయాధిపతులు కూడా ఉండాలి. ఇతడు రోమీయుల వల్ల లేదా ఏరోజు చేత ఎన్నుకో బడిన న్యాయాధిపతి అందుకే అతడు ఎవరినీ లెక్క చేయటం లేదు. ఇలాంటి న్యాయాధిపతులు న్యాయం కోసం పోరాడే వారు కాదు. వారు ధనంకు ఆశపడేవారు అక్రమార్గములు ఎన్నుకునే వారు.
అతడు ఎంత చెడ్డవాడైనప్పటికీ ఏమే పదేపదే అడుగుతవలన ఆమెకు అతడు న్యాయం చేశాడు. ఈ వితంతువు పేదవారికి అదే విధంగా ఎవరైతే తమకోసం పోరాడుతారు వారికి ఒక సుమాత్రుక. ఆమె పేద వితంతువు ఎటువంటి ఆధారం లేదు కనీసం న్యాయాధిపతికి సొమ్ము ఇవ్వటానికి సైతం తన చెంత ఏమీ లేదు. ఆమెకు సమాజంలో ఎటువంటి అధికారం హక్కులు లేవు.ఆమె నిస్సహాయురాలు భర్త లేని వితంతువును ఆనాటి సమాజం గౌరవించడం సహాయం చేయడం తక్కువ. ఆమె శత్రువుల చేత హింసించబడేది అందుకే న్యాయం కోసం పోరాడుతుంది. ఈ వితంతువు యొక్క ప్రార్థనలో మనం కొన్ని విషయాలు గుర్తించాలి.
1. ప్రార్థన చేసేటప్పుడు పట్టుదల కలిగి ఉండాలి- ఆది 32:26.
యాకోబు దేవునితో కృస్తీ పట్టే సందర్భంలో నన్ను దీవిస్తే కానీ నీ చేయి వదలను అని అంటున్నాడు. అప్పటికే తన యొక్క తంటి విరిగిపోయినది అయినప్పటికీ ఆశీర్వదించమని పట్టుదలతో ప్రార్థించాడు. పౌలు గారు కూడా పట్టుదలతో ప్రార్థించమని కోరుచున్నారు - కొలోసి 4:2. ఈ వితంతువు కూడా పట్టుదలతోనే న్యాయాధిపతినే ప్రార్థించింది అందుకే అతడు దేవుడికి భయపడనప్పటికీని ఆయన ఈమెకు న్యాయం చేశారు.
2. ప్రార్థన చేసేటప్పుడు నమ్మకం ఉండాలి:
దేవుడు ఇస్తారని మనం నమ్మకం కలిగి జీవించాలి. కననీయ స్త్రీ క్రీస్తు ప్రభువును తన కుమార్తెకు స్వస్థత ఇవ్వమని విశ్వాసంతో ప్రార్ధించింది. ఆమె గొప్ప విశ్వాసం వల్లనే తన కుమార్తె దీవించబడింది. అదేవిధంగా ఈ వితంతువు కూడా న్యాయాధిపతి ఎడల విశ్వాసం కలిగి పదేపదే అడిగింది, న్యాయం ను పొందింది.
3. ప్రార్థించేటప్పుడు ప్రార్థనలో వినయం ఉండాలి:
తంతువు అనేకసార్లు న్యాయాధిపతి దగ్గరకు విసుగు చెందక వెళ్లి ప్రాదేయపడింది ఆమె ఇతడు కాకపోతే ఇంకొక వ్యక్తి న్యాయం చేస్తాడని వేరే వారి దగ్గరకు వెళ్ళలేదు. ఎంతో వినయంతో సహనంతో ఆ న్యాయాధిపతి దగ్గరకు వెళ్లి అడిగింది కాబట్టి ఆమె లాభం పొందింది.
మన యొక్క ప్రార్ధన దేవుడు వింటారు అనే నమ్మకం మనం ఎప్పుడూ కలిగి ఉండాలి - మార్కు 11:24.
విశ్వాసంతో యెహోషువ ప్రార్థిస్తే దేవుడు సూర్యాచంద్రులను సైతం ఆపివేశారు - యెహోషువ 10:12-13.
ప్రార్థనలో నిరుత్సాహ పడకూడదు. సునీత మౌనిక అగస్తీను గారి తల్లి నిరుత్సాహపడకుండా కుమారుడు భర్త మార్పు కోసం దాదాపు 16 సంవత్సరాలు ప్రార్ధించింది.
మనం సర్వదా ప్రార్థించాలి - రోమీ 12:12.
సదా ప్రార్థించమని పౌలు గారు తెలుపుచున్నారు- 1 తెస్స 5:17.
ఈ సువిశేషం ద్వారా ప్రభువు మనందరి ప్రార్ధన ఆలకిస్తాడని తెలుపుచున్నారు మనం కూడా దేవుడిని న్యాయపూరితంగా అడిగితే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు అదే నమ్మకం కలిగి ఉండాలి. ప్రార్థన ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. మన జీవితంలో దేవుడు మనకు న్యాయం చేస్తారు మన ప్రార్ధన ఆలకిస్తారు అనే నమ్మకం ఎల్లప్పుడూ మనలో ఉండాలి.
నిత్య జీవము ఎలా వస్తుంది
యోహాను 6: 22-29 మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...