1, అక్టోబర్ 2021, శుక్రవారం

పు. చిన్నతెరేసమ్మగారు

  పు. చిన్నతెరేసమ్మగారు

1.జీవితం

పు. చిన్న తెరేసమ్మ గారు యూరోపు కాండమునందుగల ఫ్రాన్సు దేశము నందు ఆలెన్స్లో నగరంలో జన్మించారు. ఈమె అలెన్సోలో జన్మించింది కానీ లిస్యునగరంలోనే ఎక్కువకాలం ఉన్నారు. అందుకే ఈమెను లిసియు నగరి తెరెసా అని అంటారు.

  తల్లి దండ్రులు:

     లూయిస్ మార్టిన్ 1823 ఆగష్టు 22 బోర్డియు అనే పట్టణములో జన్మించాడు. ఈయన ఫ్రాన్సు దేశములో ఉన్నత అధికారి కుటుంబానికి చెందినటువంటివాడు.1850 లో అలెన్సో నగరం చేరి ఇల్లు కట్టుకొని గడియారం వృత్తిని ప్రారంభించాడు.

 తల్లి: సెలిగ్వేరిన్ 1831 డిసెంబర్ 23 జన్మించారు. ఈమె కూడా మిలిటరీ పరిసరాలలో పుట్టిపెరిగి స్త్రీయే. మె  కుట్టు అల్లిక పనిలో ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తి. దానితో లేసులు తాయారు చేసే వృత్తిని చేపట్టారు. అయితే పనిలో వీరు ఎదురుపడినపుడు ఒకరినొకరో చూసారు. వారి నాలుగు కల్లు క్షణాల్లో కలిసిపోయాయి.  ప్రేమలో పడ్డారు. సెలి యే ఆయనకు భార్య అని నిశ్చయించుకొని మూడు నెలలు తిరగకుండానే వివాహం నిశ్చయించుకున్నారు.

         జులై 13 ,1858 లో వివాహం అలెన్సోలో జరిగింది. అప్పుడు సెలి వయసు 27, మార్టిన్ వయసు 35. 1873 జనవరి 2 తేదీన తెరెసా తొమ్మిదవ పుత్రికగా జన్మించింది. జన్మించిన రెండు వారాలకే కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. బాల్యం లోనే నలుగురు పిల్లలను కోల్పోయిన జ్ఞాపకాను గుర్తుచేసుకొని కనీసం ఈమెనైనా రక్షించు కోవాలనే తపనతో.తెరిసా  ను పెంపుడు తల్లికి అప్పగించింది.రెండు నెలల తరువాత మరల ఆమెను అలెన్సో కి తీసుకొని వచ్చింది. అక్కడ తన తల్లితో మరియు తన అక్కలతో సంతోషంగా జీవించింది.

      1877 లో ఆమె తల్లి మరణించింది. తరువాత నవంబర్ 16 అక్కడినుండి వేరే ప్రాంతానికి వెళ్లారు. 1881 అక్టోబర్ 3 బెనెడిక్టైన్ పాఠశాలకు  వెళ్ళింది. 1883 పవిత్రాత్మ పండుగ రోజున మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా స్వస్థత పొందింది.

      1888 ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఆమె పదిహేను  సంవత్సరాల ప్రాయములో కార్మెల్ మఠవాసంలో చేరింది. 1890 సెప్టెంబర్ 8 ప్రధమ మాటపట్టు స్వీకరించి, పదహారు రోజుల తరువాత ముసుగును తీసుకున్నది. 1893 లో నోవిసులకు తర్ఫీదునిచ్చుటకు అర్హురాలయింది. 1894 జులై 29 తండ్రి మరణించాడు. 1897 జులై 8 తెరెసా అస్వస్థతకు గురైనది.

      1897 సెప్టెంబర్ 30 7:30 నిమిషాలకు గురువారం నా ప్రభువా! నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అని తన పెదాలపై చక్కని చిరునవ్వుతో మరణించింది. కార్మెల్ ఆచారం ప్రకారం శుక్రవారం నుంచి అధివారంవరకు ఆమెను గదిలో వుంచారు.అక్టోబర్ 4 లిస్యు నగర సమాధుల స్థలంలో వుంచారు. "నేను చనిపోవడం లేదు. మరో జీవితంలోకి ప్రవేశిస్తున్నాను. మరణం తరువాత రాబోవు గొప్ప జీవితం మొదలు కానుంది" అని .బెల్లియర్ గారికి వ్రాసింది.   1923 ఏప్రిల్ 29 పదకొండవ భక్తినాధ పోపు గారు తెరిసాకు న్యురాలుగా  ప్రకటించారు. 1925 మే 17 ఆమెను  పునీతరాలుగా   ప్రకటించారు. 1927 డిసెంబర్ 1 రెండవ జాన్ పాల్ పోపు గారు ఈమెను డాక్టర్ అఫ్ హి చర్చి గా ప్రకటించాడు.

 2. ఆమె రచనలు :

      1. జీవిత చరిత్ర 2. రెండువందల ఉత్తరాలు వ్రాసింది.3. ఏబది నాలుగు పద్యాలు రచించింది. 4. ఎనిమిది కధలు వ్రాసింది. 5. ఇరువదికొక్క ప్రార్ధనలు రచించారు.

3 . తెరిసాకు కుటుంబంతో వున్న అన్యోన్య సంబంధం:

          తెరెసా యొక్క తల్లి దండ్రులు పిల్లలపై ఎంతో శ్రద్ధ చూపించేవారు.తన తల్లి నుంచి నష్టపోయిన మమతానురాగాలు ఏవిధంగానైనా నష్టపోరాదని వాంచిన్చేడిది. ఎందుకంటే తల్లి దండ్రుల పెంపకం పైనే బిడ్డలా వ్యక్తిత్వం, స్వభావాలు ఆధారపడి ఉంటాయి.

     తెరెసా తొమ్మిదవ పుత్రికగా జన్మించి ఇంట్లో తల్లి దండ్రుల మరియు అక్కల యొక్క ప్రేమానురాగాలు ఎప్పుడు చవిచూస్తుండేది. తన తల్లికి తెరెసా ప్రాణంగామారింది. తెరెసాను అందరు దేవదూతల భావించేవారు. తెరెసా తన తల్లిని విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండెడిది కాదు. కానీ తన తల్లి మరణానంతరము ఆమెయొక్క భాద్యతలను తన అక్క అయినటువంటి పౌలిన్  స్వీకరించింది. తెరిసాకు ఇతరులతోకంటే తన కుటుంబంతో గడపడానికే ఇష్టపడేది. తన పెద్దక్క అన్ని పనులు చేసేది. ప్రార్ధన నేర్పించేవారు, తల దువ్వే వారు, పాఠాలు నేర్పించేవారు. ఇలా ఆమె చిన్నమ్మ లాగానే ఉండేది. తన తండ్రి తెరెసాను మాత్రం ఒక రాణి లాగా చూసుకునేవాడు. ఎక్కువ సమయం ఆమెతోనే గడిపేవాడు. కానీ పౌలిన్ కార్మెల్ మఠానికి వెళ్తున్నప్పుడు తెరెసా ఎంతో ఏడ్చింది. ఆమె ఎడబాటును తట్టుకోలేక పోయింది. ఇలా తెరెసాకు  తన కుటుంబముతోవున్న సంభంధం వివరించరానిది, వర్ణించలేనిది.

4 .కార్మెల్ మఠములో చేరాలన్న తృష్ట:

 తన అక్క పౌలిన్ కార్మెల్ లో చేరిన  తరువాత ఈమె తొమ్మిది లేక పది సంవత్సరాల అమ్మాయి.పౌలిన్ చెప్పే మాటలను ఎంతోశ్రద్దగా విని చెవులు కోసుకునేది. పౌలిన్ మతాల ద్వారా కార్మెల్ జీవితం సర్వాంయేసుప్రభుని కొరకు అర్పించబడిన ఒక గొప్ప జీవితం అని తెలుసుకుంది. కానీ పౌలిన్ తెరెసాతో ఇది నీకు అసాధ్యం అని చెప్పి నపుడు ఆమెలోవున్న కోరిక ఎక్కువైనది.మే ఏడవ తేదీన మంచిపాపసంకీర్తనం చేసి దివ్యాసప్రసాదమును లోకొన్నది..దాని ఫలితంగా ఆమె మనసులో ప్రశాంతత నెలకొన్నది. అప్పటినుంచి కార్మెల్ మఠములో చేరాలని నినాయించుకుంది. అప్పుడు తెరెసావయసు 12 సంవత్సరములు మాత్రమే.

     ఒకరోజు ఆదివారము దేవాలయమునకు వెళ్లినపుడు తెరెసా సిలువపై ఉన్న యేసుప్రభువుని చూసింది. కరుచున్న రక్తాన్ని పట్టుకునేవారులేరు.అప్పుడు ఆరక్తంతో ఎంతోమంది ఆత్మలను శుద్ధపరిచి, రక్షించాలని గొప్ప వాంఛకలిగింది."నాకు దాహం వేస్తుంది" అన్న యేసు యొక్క మాటలు ఆమెను కుదిపేశాయి.అనడు సమారియా స్త్రీ నే నాకు దాహం వేస్తుంది త్రాగుటకు నీరివ్వు అన్న మాటలు దేవుడు ఆమెతోఅన్నట్లు అనిపించింది. దీనితో  కార్మెల్ లో చేరాలనే  కోరిక మరింత పెరిగింది.1887 మే 29 సాయంత్రం తన తండ్రితో చెప్పినపుడు అతడు ఒప్పుకున్నాడు. కానీ తన మామ అయినటువంటి ఇసిడోర్ గ్వారిన్ ది తో చెబితే ఒప్పుకోలేదు.అప్పుడు తెరెసా గేస్తేమనే తోటలో యేసు ప్రభువు పడిన భాద పడింది. తరువాత ఆమె ప్రార్థన ఫలితం మరియు తన అక్క పౌలిన్ ప్రార్థన ఫలితం అతడు ఒప్పుకున్నాడు.తరువాత కార్మెల్ మఠానికి అధిపతియైన మఠాధిపతి దగ్గరకు వెళ్ళింది.అప్పుడు అతడు 21 సంవత్సరములు వచ్చువరకు చేరకూడదు అన్నాడు.కానీ నియమం ప్రకారం 16 సంవత్సరాలే.అదేవిధంగా అక్కా గురువు కూడా వ్యతిరేకమే.తండ్రి బ్రతిమాలినా ఒప్పుకోలేదు.తారు వాత ఆమె పోపు గారిని కలవాలని నిశ్చయించుకుంది.1887 లో 13 సింహరాయలు పోపుగారియొక్క స్వర్ణ జుబిలీకి వెళ్లి అక్కడ ఆయనను కలిసే టప్పుడు అతని ముందు మోకరించి పాదలకు నమస్కరించింది.తరువాత పోపుగారు తన చేతిని ఇస్తుంటే తెరెసా  ఆచేతులను గట్టిగ పట్టుకొని తనకోరిక విన్నవించింది. అప్పుడు అతను పీఠాధిపతులు చెప్పినది చెయ్యి అని చెప్పాడు.ఇతి లిస్యులో "యూనివర్స్" అనే దిన పత్రికలో వార్త వచ్చింది. చివరిగా  1888 క్రిస్మస్ కు  తొమ్మిది  రోజుల ముందు మంచిగా ఉత్తరాన్ని తయారుచేసి పంపించింది.అందులో ఇలా వ్రాస్తుంది: "తండ్రిగారా! నది చిన్నవయస్సే, నిజమే, కానీ దేవుడు నన్ను పిలచుచున్నాడు". క్రిస్టమస్ అయినా మూడురోజులతరువాత లెటర్ వచ్చింది.కానీ మదర్ ఘోన్సాగా గారు మూడు నెలల తరువాత అనుమతినిచ్చారు. ఎందుకంటే పౌలిన్తె ముందే ఆమెకు చెప్పింది. ఎందుకంటే మూడునెలలు తపస్సు కాలము ప్రారంభమవుతుంది.అప్పుడు ఉపవాసాలు తపో క్రియలు చేయాలి అందుకే ఇలా చేసారు. తెరెసా మాత్రం క్రిస్టమస్ కి  ముందు కార్మెల్ లో  చేరాలని కోరిక కానీ అనుమతి లేదు. ఇది తెలిసిన తెరెసా ఎంతో బాధపడింది. అయినాకానీ ఇంట్లోనే అన్ని తపోకర్యము చేసి మూడు నెలలు తనకు తాను శారీరకంగా, మానసికంగా సంసిద్ధం చేసుకుంది. 4 . తెరిసాకు వున్నా రెండు లక్ష్యాలు:

 5 .1. పాపాత్ములను రక్షించడం:

         ఒకరోజు వార్త పత్రికలో ఒక జుగుప్సాకరమైన వార్త వచ్చింది. అది ప్రసిద్ధి గాంచిన హేన్రి ఫ్రాన్సిస్ గురించి. ఇతను ఎన్నో నరహత్యలు చేసాడు ఎందర్నో చీదరించాడు.1887 జులై 9 అతని కేసు తెరిచినప్పుడు అఃడికి మరణ శిక్ష విధించారు.ఇతనికి దైవమంటే ఏమిటో తెలియదు.తెరెసా ఇతనికోసం ప్రార్ధించడం మొదలు పెట్టింది. ఇంకా తన అక్కలను ప్రార్ధన సహాయము అడిగినది. ఆమెయొక్కతపో క్రియలకు గాను, ప్రార్థనలకు గాను అతడు మరణించబోయే రోజు అక్కడ వున్న గురువుదగ్గర వున్న సిలువను తీసుకొని పశ్చాత్తాపంతో ముద్దుపెట్టుకొని మరణించాడు.ఇది తెలుసు కున్న తెరెసా ఎంతో సంతోషంన్ని పొందింది.."నాకు దాహం వేస్తుంది" అన్న యేసు యొక్క మాటలు ఆమెను కుదిపేశాయి.అనడు సమారియా స్త్రీ నే నాకు దాహం వేస్తుంది త్రాగుటకు నీరివ్వు అన్న మాటలు దేవుడు ఆమెతోఅన్నట్లు అనిపించింది.

5 .2. గురువుల పుణ్య జీవితం కొరకు ప్రార్థించడం:

       తెరెసా గురువులతో ఎంతో దగ్గరగా వుంది జీవించింది. వారి పనులు పూజలు చేయడం, పాపసంకీర్తనలను వినడం,గురుత్వ భాద్యతలను నిర్వర్తించడం. వీటన్నిటిని చూసి గురువులు నిజంగా దేవదూతలలాంటి వారు అని భావిం చింది. అవిలాపురి  థెరెసామ్మగారు గురువులకొరకు ప్రార్ధించమంటే ఏంటో అర్థం కాలేదు.కానీ ఇప్పుడు ఆమెకు అర్ధం అయింది. ఆమె ఇలా వ్రాస్తుంది:"ఎందరో పుణ్యాత్ములైన గురువులతో కలిసి జీవించాను. వారి గురుత్వం వారిని దేవదూతలు మించిన స్థానానికి అధిరోహించిన, వారు ఎప్పటికి మానవులే. మానవ బలహీనతలు వారిని వీడవు". అంటే తెరెసా గురుబుల బలహీనతలను కూడా గమనించగలిగింది.అందుకే ఆమె జీవితాన్ని పాపాత్ములకోసమేకాక గురువుల పవిత్రతకు కూడా సమర్పించింది.

 6. తెరిసాకు మరియమాతపై ఉన్న విశ్వాసం:

            చిన్న తెరెసా యొక్క కుటుంబములో మరియ మాత పైన ఎంతో భక్తిని విశ్వసమును సాలిగివున్నారు. అందుకే వీరి పేర్లకు ముందు మరియ అని తప్పకుండ ఉండేలా చూసుకునేవారు. తెరెసా మే,13 ,1883 పవిత్రాత్మ పండుగ రోజున తెరెసా అనారోగ్యపు పాలయినది.నొప్పి తట్టుకోలేక మూలుగుతూ వుంది.అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ మేరీ మాత స్వరూపము ముందు మోకరించి ప్రార్ధన చేస్తున్నప్పుడుతెరిసా కూడా తన చూపును స్వరూపం పైన లగ్నము చేసింది.వెంటనే మూలగడంతగ్గించిది. ఆమెలో గొప్ప అద్భుతం జరిగింది.ఆమెకు మేరీ మాత స్వరూపము ఎన్నడూ కనిపించనంతటి సౌందర్యముగా కనిపించింది.ఆలా ఆప్యాయముగా చూస్తుంది.పెదాలపై చిరునవ్వు ఉంది. చిరున్నవ్వు తెరెసాయొక్క హృదయాన్ని తాకింది.వెంటనే నెప్పులన్నీ పోయాయి. అప్పటి నుంచి మరియ మాత లాగా నీమాట చొప్పున నాకు జరుగును గాక అని తనను తాను సమర్పించుకున్నది.

 7. తెరిసాకు దివ్య సప్రసాధనాదునిపై ఉన్న భక్తి:

               తెరెసా తన జీవితములో దివ్యసప్రసాద నాధునికి ఎంతో ప్రాధాన్యత నిస్తుంది. తెరెసా 1884 మే 8 దివ్య సప్రసాధనాదుని స్వీకరించింది. దీనికిగాను ఆమె ప్రతిరోజు ప్రార్ధనలు, తపో కార్యములు, ఉపవాసాలు చేస్తూ,తనను తాను సంసిద్ధత చేసుకునేది. దీని ద్వారా సప్రసాదముయొక్క ప్రాముఖ్యతను, దాని అంతరార్థమును తెలుసుకుంది. దీనికి గాను మూడు రోజులు వాడకంలో పాల్గొని, యేసు ప్రభువుని ఎంతత్వరగా స్వంతం చేసుకుందామని మే 7 తేదీన మంచి పాప సంకీర్తనము చేసి,తన మనసును ప్రశాంతముగా, స్వచ్ఛముగా మలచుకొని,ఆయనను స్వీకరించింది. తెరాసా ఇలా వ్రాస్తుంది: యేసునాధుని మొదటి ముద్దు ఎంత మధుర మైనది! అది ఎంతో ప్రేమను ఇచ్చిన ముద్దు నేను ఎంతగానో ప్రేమింపబడినట్లు అనుభవించాను.అప్పుడు ఒకరినొకరు ముక్కా మూకీ చూసుకొని,ఇకనుండి మనం వేరు వేరు కాదు కానీ ఒక్కటే శరీరంలా మారారు.తెరాసా సముద్రములో నేటి బిందువు వాలే దేవునిలో ఐక్యమైనది. ఆమె పు.పౌలు గారి వలె ఇకనుండి నేను కాదు , నాలో జీవించేది యేసువె అని భావించింది. భక్తి తన చిన్ననాటి నుండి తన తల్లి దండ్రులు,అక్కలనుండి అలవరచుకున్నది.తెరెసా 1888 ఏప్రిల్ 9 కార్మెల్ లో చేరిన రోజు ముందుగా దివ్య సప్రసాదం ముందు మోకరించి పూర్తిగా సమర్పించి అయన కోసం జీవించింది. ఆమె ప్రతి రోజు గంటలతరబడి దివ్య సప్రసాద నాధునికి ప్రార్థన చేస్తుండేది

8 .కార్మెల్ మఠములో తెరాసా ఎదుర్కొన్న వివిధ సవాళ్లు:

            1888 ఏప్రిల్ 9 తెరెసా కార్మెల్ కు వెళ్తున్న రోజున కుటుంబము బంధువులు కలిసి దివ్యభళీ పూజను సమర్పించి, విందు చేసారు. అంతముగిసినతరువాత అక్కడఉన్నటువంటి అందరిమూకలలో నీళ్లు తిరగడం ప్రారంభించాయి.అది చూసి తన దుఃఖం లోపలే దాచుకొని వారితో, నేను చనిపోవడానికి వెళ్తున్నానా ఏంటి? అని తనలో తాను అనుకొన్నది. వారందరికీ వీడ్కోలు పలుకుతూ కన్నీరు కారుస్తూ కౌగిలించుకుంది.తండ్రి దగ్గరకు వచ్చే సరికి కాళ్లపై పడి ఆశిర్వాదాన్ని కోరింది. తన ప్రియా చిన్నారిని దీవించు అని ప్రాధేయ పడినది. అప్పుడు మార్టిన్ ఆమెను కౌగిలించుకొని,తన కన్నీళ్లతో,ముఖానంతటిని తడిపి వేసింది.

            కార్మెల్ లో చేరిన తరువాత తెరెసా ఎన్నో కష్టాలకు గురయ్యేది.ముందుగా చలి కాలములో గదిని వేడిచేయడానికి ఏమి ఉండేది కాదు. ఇక్కడి ఇళ్లల్లో వేడిచేసి మార్గం లేదు.దీని కారణముగా తెరెసా ఎన్నోసార్లు స్వస్థతకు  గురైయ్యేది.

      ఇంకా ఆమెను చూసి చిన్నపిల్లగా ప్రవర్తిస్తుంది అనుకొన్నారు కానీ ఆమె పెద్ద వారికి  కలిగిన ఆలోచన నైపుణ్యత  కలిగి  ఉన్నవి.

   పనుల విషయములో తెరెసా తన వయసుకు మించి చేసేది.ఆమెకు పనులల్లో కొంత సడలింపులు కలిగే అవకాశ ఉన్న కానీ ఆమె ఎప్పుడు అందరిలాగానే మంచిమనసు కలిగి  వుంది. తన తండ్రి 65 సంవత్సరంలో  ఆరోగ్యం క్షినించి పోవుటచే  ఎంతో బాధపడుతూ ఉండేది. ఇది ఇలావుంటే మదర్ గోన్స్గా  తరచు తెరిసాపై కఠినంగా ప్రవర్థించేది. ఆమెను ఛీదరించినవారిని కూడా ప్రేమించిన తెరెసమ్మ తెరెసామ్మ. ఇంకా ఒకసారి మదర్ గోన్సా గారు అనారోగ్యముతో బాధపడుచున్నప్పుడు, తెరెసా మరియు మరియొక సిస్టర్ ఇద్దరు కలిసి తాళం చెవికోసం వెళ్తున్నప్పుడు అది వేరే సిస్టర్ చేతి నుండి పడినపుడు శబ్దానికి నిద్రిస్తున్నటువంటి మదర్ గారు లేచినపుడు సిస్టర్ తెరెసా మీదకు నెట్టినప్పుడు ఒక్క మాటకూడా అనకుండా నిందను ఒక మధురమైన చిరునవ్వుతో తనపైన వేసుకొన్నదే కానీ సమర్ధించలేదు.దీనివల్ల తెరెసా ప్రపంచాన్ని గెలిచినంత సంతోషపడినది.  ఒక రోజు తన తోటి వారితో కలిసి బట్టలను బండకేసి బాదు చున్నప్పుడు, మురికి నీళ్లు చింది తెరెసా ముఖంపై బొట్లు బొట్లుగా పడుచున్నపుడు, ఆమె కోపపడకుండా, తుడుచుకోకుండా, మౌనం వహించింది. ఒక వేళా తుడిస్తే ఆమె ఏమైనా భాధపడుతుందా అని అలాగేవుంచి భాధను దేవునికి సమర్పించింది. దాని ద్వారా పాపులను నరకాగ్ని నుండి రక్షించమని వేడుకుంది. అప్పుడు మురికి నీళ్లు ముఖంపై ముత్యాలు వాలుచున్నట్లు అనిపించింది. సిస్టర్ ఉతికిన తరువాతే అక్కడినుండి వెడలిపోయింది.

      ఎన్నోసారులు సిస్టర్ లు  తెరిసాకు చద్దికూరలు వడ్డిస్తుండేవారు.అందుకు గాను తెరెసా ఎప్పుడు,మంచము పట్టేవారు. తుది మాటపట్టు ఎంతో ఘనంగా జరుగుతుందు.కానీ తెరిసాకు మాత్రంకన్నీరుతో నిండిపోయింది. ఒక వైపు తండ్రి రావలిసింది. కానీ అనారోగ్య రీత్యా మార్టిన్ రాలేక పోయాడు.ఇదొక భాద అయితేమరొకటి ఆమెకు కలిగింది.అదేమిటంటే, రావలిసిన  మఠాధిపతి  అనారోగ్యం కారణంగా రాలేక పోయాడు. ఇది ఆమెను ఎంతగానో బాధపెట్టింది.ఇలా ఆమె జీవితములో ఎన్నో కష్టాలు, భాధలు వున్న,ఆమెమాత్రం పైకి చిరునవ్వులని కురిపిస్తూ, వారిని వారితప్పులను క్షమిస్తూ,ప్రార్ధన చేసేది.

 9. పునీత. చిన్న తెరెసమ్మ గారు చేసిన వ్రత వాగ్దానములు:   

       1890 సంవత్సరము సెప్టెంబర్ లో సన్యాసం జీవిత వ్రత వాగ్దానములను (సన్యాసం జీవిత మాటపట్టు) స్వీకరించి పూర్తిగా కార్మెల్ సభ సభ్యురాలుగా మారే సమయం. అయితే అవి 1. కన్యత్వం 2. విధేయత.3.  దారిద్రయం.

1.      కన్యత్వం:

కన్యత్వం నే వాగ్దానం ద్వారా తన శరీరాన్ని మరియు హృదయాన్ని సమర్పిస్తారు. అయితే తెరెసామ్మ గారు వ్రతాన్ని తీసుకునేటప్పుడు తన హృదయములో ప్రధమ స్థానం దేవునికే గాని, మరో వ్యక్తికి గాని,మరో వస్తువుకి గాని ప్రధమ స్థానాన్ని ఇవ్వను. ఎటువంటి మచ్చ లేకుండా నిర్మలమైన శరీరముతో,స్వచ్చమైన  హృదయముతో నన్ను నేను దేవునికి,మరియు అయన సేవకి అంకితము చేసుకుంటాను. అని దృఢ నిశ్చయముతో వాగ్దానాన్ని చేసింది.

  2.విధేయత:

         విధేయత అను వాగ్దానము ద్వారా తన మనస్సుని దేవునిపైన లగ్నము చేసి, తన జీవితాంతము దేవునికి మరియు సభయొక్క నియమాలకు తలవొగ్గి జీవిస్తానని ప్రమాణము చేసింది. తెరెసామ్మ గారు కార్మెల్ లో  అడుగేసినప్పటినుంచి తన సభలో ఉన్నటువంటి మతపెద్దలకు మరియు అందులో వుండే ప్రతివ్యక్తికి విధేయతచుపిస్తు తన జీవితము ద్వారా యేసుప్రభువు చూపిన విధేయతను వారికి కళ్ళకు కట్టినట్లు చూపించింది. ఆమె జీవించినంతకాలము ఎవరికీ అవిధేయతను చూపలేదు. ప్రతిక్షణం విధేయత చూపిస్తూ జీవించింది.

    3.దారిద్రయం:

             వాగ్దానము ద్వారా నాకు దేవుడు ఉంటే చాలు.అయన నాకు స్వంతమయితే నాకు ఎట్టి కొరత ఉండదు అని చాటి చెప్పే దినం. అయితే దీనికి గాని ఆమె ఇంటిదగ్గరనుంచి వచ్చేటప్పుడు తన కిష్టమయిన వాటినన్నిటిని విడిచిపెట్టి వచ్చింది.అంతే కాదు మఠంలో ఎవరికయినా దుస్తులు అవసరముస్తే వెంటనే తన దగ్గర వున్న వస్త్రములను వెనుతిరిగి చూడకుండా ఇచ్చేది. అయితే వాగ్దానము ద్వారా తనను తాను పూర్తిగా దేవునికి చిన్నబిడ్డలాగా సమర్పించుకొని అయన అడుగు జడలలో నడిచింది.

    మూడు వాగ్దానములు సన్యాసం జీవితానికి పునాదులు.ఇవి లేనిదే సన్యాసం జీవితం లేదు.

 

10. కార్మెల్ లో పు. చిన్న తెరెసామ్మ గారు చేసిన వివిధ సేవలు:

  కార్మెల్ లో తెరెసా జీవితం అక్కడ వున్న  సిస్టర్లకు ఎప్పుడు ఏదోఒక సేవ చేస్తూ గడిపింది. తన ఖాళీ సమయాన్ని ఎప్పుడు ఆమెకోసం ఆమె సంతోషం కోసం వినియోగించుకోలేదు కానీ ఎప్పుడు ఇతరులకు వెచ్చించేది. ఒక రోజు మఠములో సిస్టర్ కు సహాయం చేయడానికి ముందుకొచ్చింది. కానీ సిస్టర్ ఎప్పుడు తన దగ్గరకు వచ్చే వారిమీద చేదుగా చెబుతుండేది.అయినా కానీ ఆమెను భోజన శాలకు తీసుకొనిపోయి కుర్చిలో సరిగ్గా కూర్చోబెట్టి వచ్చింది. తరువాత సిస్టరుగారు చపాతీని తుంచుకోలేకపోతే అది గమనించి వెంటనే వెళ్లి చపాతీని ముక్కలు ముక్కలుగా చేసి ఆమెకందించింది. ఇలా ఎన్నోసార్లు ఎంతోమందికి విసుగుచెందకుండా సహాయం చేసింది. ఇతరుల బట్టలను తీసి ఇస్త్రీ చేసి వారికందించడము, గిన్నెలుకడిగేసమయములో తోడుగావుండి,వారికి తోడ్పడటం, పూజా వస్త్రములను శుభ్రపరచడం లాంటి పనులు చేస్తుండేది. ఇలా ఎన్నోరకాలుగా  ఎంతోమందికి విసుగు చెందకుండా సేవలందిస్తుండేది.

11.  పు. చిన్న తెరేసమ్మకు కలిగిన వివిధ దర్శనములు:

తెరెసా మే,13 ,1883 పవిత్రాత్మ పండుగ రోజున తెరెసా అనారోగ్యపు పాలయినది.నొప్పి తట్టుకోలేక మూలుగుతూ వుంది.అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ మేరీ మాత స్వరూపము ముందు మోకరించి ప్రార్ధన చేస్తున్నప్పుడుతెరిసా కూడా తన చూపును స్వరూపం పైన లగ్నము చేసింది.వెంటనే మూలగడంతగ్గించిది. ఆమెలో గొప్ప అద్భుతం జరిగింది.ఆమెకు మేరీ మాత స్వరూపము ఎన్నడూ కనిపించనంతటి సౌందర్యముగా కనిపించింది.ఆలా ఆప్యాయముగా చూస్తుంది.పెదాలపై చిరునవ్వు ఉంది. చిరున్నవ్వు తెరెసాయొక్క హృదయాన్ని తాకింది.వెంటనే నెప్పులన్నీ పోయాయి.   అదేవిధంగా ఒక రోజు తెరెసా కార్మెల్ మఠములో తనకిచ్చినటువంటి గార్డెన్లో పనిచేస్తునపుడు, తనకు ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు, అప్పుడు తెరెసా అతనిని పేరే అడిగినపుడు అతడు తిరిగి నీపేరు ఏమిటని అడిగినపుడు ఆమె అతనికి ఇలా జవాబిచ్చింది:"నేను బాలయేసుయొక్క చిన్న తెరెసా" అని. అప్పుడు ఆబాలుడు "నేను తెరెసా యొక్క బాలయేసును" అని అదృశ్యమయ్యాడు. అప్పుడు ఆమెకు అర్ధం అయ్యింది, అది ఎవరోకాదు సాక్షాత్తు బాలయేసువే అని. ఇంకొక సరి తెరెసా తన గదిలో తన గోడకువున్న యేసుప్రభువు పరిశుద్ధ ముఖమునకు ప్రార్ధన చేస్తుండగా అతడు తెరెసాతో మాట్లాడినట్లు తాను అద్భుతాన్ని చూసినట్లు తాను చెబుతుంది.

12. పు. చిన్న తెరేసమ్మ గారు బోధించిన ప్రవచనములు:

ఒకసారి అక్క అయినటువంటి పౌలిన్ తెరెసా చివరి రోజులలోమాట్లాడుచున్నపుడు, తెరెసా ఆమెతో ఎలా అంటుంది:నా ప్రియుల చిన్న చిన్న కోర్కెలను తీర్చడం, మరియు ఇతర వరములను కురిపింప చేయక పోతే స్వర్గంలో నేనెలా సంతోషంగా ఉండగలను?అంతే గాక 'తప్పక తిరిగి వస్తా.... భూమిపైకి..." అని ఎన్నో వాగ్దానాలు చేసింది. ఇంకా నా భాద్యత ఇప్పుడే మొదలవుతుంది.నేను ప్రేమించినట్లే,ఇతరులు కూడా దేవుని ప్రేమించునట్లు చేయడమే నా కర్తవ్యం.నా చిరు మార్గాన్ని చిన్నారి ఆత్మలకు బోధించాలి. ప్రభువు గనుక నా కోర్కెలను,నా అభిలాషలను మన్నిస్తే, ప్రపంచం అంతమయ్యే వరకూ నా స్వర్గాన్నంతా భూమిపైనే మంచిని చేయడానికి  గడుపుతాను.   ఇది నా తీవ్ర వాంఛ. ఇంకా ఆమెకు పునీతురాలు కావాలని, గురువుకావాలని, ఈలోకమంతా అపోస్తులుగా తిరిగి దేవుని రాజ్యం గురించి బోధించాలనిరక్త సాక్షులవలె దేర్యంగా విశ్వాసముగా జీవించాలని ఎప్పుడూ అంటుండేది.

13. పు. చిన్న తెరేసమ్మ గారి యొక్క  చివరి క్షణములు

1897 జూన్ నెలదాక బాగానే వుంది,కానీ జూన్ ఆరవ తేదీ నుంచి కష్టాలు మొదలయ్యాయి. తెరెసాయొక్క ఆరోగ్యం కొద్ధికొద్దిగా  క్షీనించడం మొదలయ్యింది.నోటివెంట రక్తం ఆగలేదు,ఇంకా కొన్నిసార్లు ముక్కునుండికూడా కారడం ప్రారంభించింది. ఇలా జరుగుచున్నప్పుడు ఆమె యొక్క మరణం దగ్గర పడుచున్నదని ఎంతో సంతోషపడింది. పాపసంకీర్తనం చేసింది. అవస్ధ అభ్యంగనము కూడా  ఇవ్వమని కోరింది. జులై 9 ఆమె గది నుండి అనారోగ్యులకీ ఉండే గదిలోనికి వెళ్ళింది. అందరూ ఆమెపై జాలి పాడుచున్నా ఆమె మాత్రం సంతోషంగా చిరునవ్వు ముఖంతో ఉండేది. తన దగ్గరకు వచ్చినవారిని ఎప్పుడూ నవ్విస్తూఉండేది. ఇది చూసి వారు నివ్వెరపోయేవారు. దొంగవలె వచ్చు గడియ కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుండేది. భాధలు అధికమవుచున్నాయి తలకూడా నొప్పితో బద్దలవుచున్న అనుభవంఅది సెప్టెంబర్ 29 బుధవారం. తెరెసా కష్టంగా గాలి పిలుస్తుంది.అందరి ఆశలు నశించాయి.ఆరోజు గురువు పాపా సంకీర్తనం విన్నాడు. అతడు ఎంతపరిశుద్దమైనదీ ఆత్మ! అనుగ్రహములతో పరిపూర్ణమైనది అన్నారు. తారు వాత ఇద్దరు అక్కలు ఈమెను విడనాడటం లేదు. మరుసటి దినం దివ్యపూజ చూసింది.సెప్టెంబర్ 30 మధ్యాహ్నము స్వయంయా ఎవరిసహాయం లేకుండా మంచం నుంచి లేచింది. నేను మరణించెను ఇప్పుడు బాగానే వున్నాను అనితన అక్కలకు చెప్పింది. తనరెండు చేతులను తన అక్కల చేతులలో ఉంచుతూ,"మన ప్రభువు సిలువపై మరణించింది ఎంతో వేదనతో అయినా ప్రేమ కొరకే అంతా భరించాడు. అదే ప్రేమ కొరకే మరణించాడు. నాది కూడా అదే అనుభవం" అని పలికింది. సాయంత్రం 7: 30 ప్రాంతములో అంతిమ శ్వాస చిరునవ్వుతో నిండిన ముఖముతో ప్రశాంతముగా విడిచింది. మూడు రోజులు గుడిలోవుంచి, అక్టోబర్ 4 తేదీన లిస్యూ నగర సమాధుల స్థలంలో భూస్థాపితం చేశారు

14. పు. చిన్న తెరేసమ్మగారు చూపిన చిన్నారి బాట:

పు. చిన్న తెరేసమ్మ గారు  లోకములో జీవించింది ఇరువది నాలుగు సంవత్సరాలే కానీ ఆమె జీవితము ఎంతో నిగూఢమైనది, ఎంతో పవిత్రమైనది. ఆమె కనుగొనిన బాట చిన్నారి బాట. జీవించిన జీవితము వెలకట్టలేని జీవితము. ఆమె ప్రేమలేకుండా ఏపనీ చేయలేదుఆమె జీవించిన జీవితము దేవుని యొక్క ప్రేమకొరకే. ఆమె ప్రార్ధనలు పాపులను రక్షించడానికి, మరియు గురువుల పరిశుద్ధత కొరకు. ఆమె జీవితము ఎంతోమందికి ఆదర్శం. ఆమె చిరునవ్వులో ఏదో తెలియని రహస్యం ఉంది. ఆమె చేసిన ప్రతిఒక్క పనిలో ఏదోఒక త్యాగం తన ఇష్టాలన్నీ దేవునికి వదిలేసి దేవునియొక్క ఇష్టాలను ఆమె స్వీకరించింది. ఆమె సిస్టర్సు కు సహాయం చేసినా, ఇతరుల తప్పులను క్షమించినా, తనను ద్వేషించిన వారిని చిరునవ్వుతో వారి హృదయాలను గెలిచినా అది కేవలము అది దేవుని యొక్క మహిమకొరకే చేసింది. పు. చిన్న తెరేసమ్మ గారు చూపిన చిరుమార్గం ఆమెలో ఉన్నటు వంటి అపారమైన ప్రేమ అనంత మైన విశ్వాసం, నమ్మిక, నిన్ను నన్ను ప్రతిఒక్కరిని ఆహ్వానిస్తుంది. ఎందుకంటే ఆమెకోరిక అందర్నీ పరలోకవారసులుగా మార్చాలన్నదే ఆమె యొక్క ధేయం. కనుక పు. చిన్నతెరేసమ్మ గారి వలె మనము కూడా జీవించుటకు ప్రయత్నిదాం. ఆమెన్

 

బ్ర. నందిగామ. జోసెఫ్ మారియో అఫ్ సెయింట్తెరెసాఆఫ్ చైల్డ్ జీసస్ 


                                                                                                                   

25, సెప్టెంబర్ 2021, శనివారం

26 వ సామాన్య ఆదివారం(3)

     26 వ సామాన్య ఆదివారం(3)   

క్రీస్తు నాధునియందు ప్రియమైన స్నేహితులారా, ఈ నాడు మనము ఇరవైఆరొవ సామాన్య ఆధివారంలోనికి ప్రవేశించియున్నాము .తల్లి శ్రీసభ మనకు ఇచిన్నటువంటి పఠనములను గ్రహించినట్లయితే, మొదటి పఠనములోతండ్రిఐన యావే దేవుడు తన ఆత్మను డెబ్భై మంది పెద్దలకు ఇచ్చుటను ఇచ్చినతరువాత వారు ప్రవచనములు పలుకునట్లును మనము చూస్తున్నాము. 
రెండవ పఠనములో చూచినట్లై ఐతే యాకోబు గారు భాగ్యవంతులను హెచ్చరించుటను దేవునివైపుకు ఆహ్వానించడాన్ని మనము చూస్తున్నాము.సువిశేష పఠనము మనము గ్రహించినట్లు ఐతే క్రీస్తుని అనుసరింపని ఒక్కడు, క్రీస్తు పేరా దయ్యములను పారద్రోలుటను వింటున్నాము. అదేవిధంగా ప్రభువైన క్రిస్తుమాటలను కూడా మనము  వింటున్నాము, అవి ఏమి మాటలు అంటే పాపమునుడి వైదొలగమని నరకములో పురుగు చావదు అగ్నిఆరదు అనే మాటలను  వింటున్నాము.
  
క్రిస్తునాధునియందు ప్రియమైన స్నేహితులారా పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా తండ్రి దేవుడు, మరియి కుమారుడైన క్రీస్తు, మరియు శిష్యుడును దైవభక్తుడును ఐన యాకోబుగారు, మనకు హెచ్చరికను తెలియ చేస్తున్నారు .ఆ హెచ్చరిక ఏమిటంటే పాపము చేయకు లోకమును అనుసరింపకు వీటిద్వారా దేవుని శిక్షకు గురికాకు అని మనలను హెచ్చరిస్తున్నారు. 
 
 ప్రియమైన దేవుని బిడ్డలారా ,మొదటి పఠనములో మనము చూస్తున్నాము మోషే ప్రవక్త యెహోషువ యొక్క అసూయను గమనించి ఆ ప్రజలకోసమై   దేవుని ఆత్మా కొరకు మాట్లాడటం .అసూయా అనేది కూడా పాపమే అసూయా వలన మనము ఇతరులను నిందిస్తాము, తక్కువ చూపు చూస్తాము వారు మంచిగావుంటే ఇష్టపడము మనకంటే తక్కువగా వుండాలని,మన అంతటివారు కాకూడాదని ,మనలా ఉండ కూడాదని  అసూయా పడతాము ఎందుకు అంటే వారు  మనకన్నా  ఒక గొప్ప స్థాయి లోఉండుటచే .ప్రియమైన స్నేహితులారా  అసూయా అనేది ఒక గోరమైన పాపం ఈ అసూయా వలన మోషే తన శిశుడైన యెహోషువను సరిచేయుటను మనం చూస్తున్నాం అసూయా అనే పదాన్ని గలతీయులకు రాసిన లేఖలో 5 వ ఆద్యం 20 వ వచనములో మనం చూస్తున్నాం అన్ని వర్గాలకు అడ్డా అసూయా ఒక సారీ దాని ఊబిలో పడితే జీవితం ఇక పతనమే.   అనూహ్యంగా  అసహ్యంగా మన నోటి వెంట  ఏమాట రాదు అసూయా   మనహృదయంలో నాటుకు పోతే తప్ప.

 నేడు సమాజములో వృత్తిలో కానీ  ఏరంగములోనైనా ఇది ఉంది అది లేదు అని చెప్పా వచ్చుగాని అసూయా లేదు అని చెప్పలేము.అసూయా అనేది చాల భయంకరమైనది ఎముకల్లో పుటిన  కుళ్ళు అని బైబిల్ గ్రంధం మనకుసెలవిస్తోంది .బైబిల్ లు చరిత్రలో   మొట్టమొతటి  హత్యా అసూయా వలననే జరిగింది (ఆది:4 :8 -9) అసూయకలిగిన కొందరువేక్తులను మనం గుర్తుచేకుందాం కాయిను అసూయా వలన తన తమ్ముడైన ఆబేలు మృతికి కారకుడై శిక్షకు గురయ్యాడు ,రాహేలు అసూయా చెందింది  తన అక్క లేయా గర్భము దాల్చుటవలన యేసేపు సోదరులు అసూయా చెందారు . అసూయా ఆయుషును తగ్గించును  (సామె:14 :౩౦) లో మనము చూస్తున్నాము ఇశ్రాయేలు పెద్దలు అహరోను మోషే సోదరి మిరియం మోషే మీద 
అసూయా పడ్డారు {సంఖ్య 12 }యువకుడైన దావీదుని చూసి ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు అసూయపడ్డాడు .[1  సమువేలు 18 ]

 ఈనాటి మొదటి పఠనములో యెహోషువ ఇశ్రాయేలు డెబ్భై మంది పెద్దలలో ఇద్దరు పెద్దలైనా ఎల్దదు ,మేదాదు అను వారి పై అసూయా చెందటం మనము చుస్తున్నాము.[సంఖ్య 11 :29] లో చూస్తున్నాము .మోషే వృధాప్యంలో నాయకుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చడం కష్టమైంది .అప్పుడు మోషే దేవునికి ప్రాదించి సహాయం అడిగినప్పుడు మోషేకి సహాయంగా డెబ్బది మంది పెద్దలను అనుకోని వారి సహాయంతో ప్రజలను నడిపించామన్నాడు ప్రభుఆవిధముగా మోషే డెబ్బది మంది పెద్దలను ఎన్నుకున్నాడు వారిని ప్రార్ధన గుడారములోనికి తీసుకోమనివెళ్ళి ప్రార్ధించాడు పవిత్రాత్మబలం వారిమీదికి దిగివచ్చింది.

ది తెలిసిన యెహోషువ మోషే దగ్గరికి వీళ్ళు వారిద్దరిమీద ఫిరియాదు చేస్తాడు వారిద్దరూ ప్రార్ధన గుడారములోనికి రాలేదు కాబ్బట్టి వారు ప్రవచనం చెప్పడానికి విలేద్దన్నాడక్రీస్తు నాధునియందు  ప్రియమైన స్నేహితులారా వారములనిచ్చువాడు ఒక దేవుడు పాలురకములైన వరములను కుమ్మరిస్తాడు అని {1 కొరింథీయులు12వ మద్యంలోచూస్తున్నాము}.ఆవిధముగానే డెబ్బదిమంది ప్రవచించే వరము కలిగియున్నారు .మొదటి పఠనములో మోషే అన్నటున్నారు దైవప్రజలందరు ప్రవక్తలుగా తయారుకావలెను ,వారి అందరియందు దేవుని ఆత్మ ఉండవలయును అని నా కోరిక అని [సంఖ్య 11 ;25 -29 ]అని పలికాడు.

అసూయా వలన పొందిన వారముఏదీలేదుగాని దేవునికి దూరమవుతాముప్రియామైన స్నేహితులారా మొదటిపఠనములో మనంచూసినట్లుగా ప్రభు ఆత్మ  ఆవహించినవారు ధన్యులు    దేవుని  సేవకులు వివిధ పరిచరియాలలో నిమగ్నమై వుంటారు .వారు ప్రవచనములు పలుకుతారు  అద్భుతకార్యములు చేస్తారు దుష్ట శక్తులను పారద్రోలుతారు  నిజమైన సేవకులు వారు ఏమి చేసిన అది దేవుని మహిమ కొరకు మాత్రమే చేస్తారు వరములను ఈచు దేవుడు ఒక దేవుడు పాలురకములైన వరములను పవిత్రాత్మచే ఇస్తాడు ప్రవచించే వారము,స్వస్థపరిచే వారము అర్ధము చేసుకునే వారము భాషలు మాట్లాడే వారము .{కొరింథీయులు 12 }లో చూస్తున్నాము ఈ విధముగా మొదటి పెద్దలకి ప్రవచించే వరాన్ని అనుగ్రహిచారు.

  ఈనాటి సువిశేషంలో క్రీస్తుప్రభుతో శిష్యుడైన యోహాన్ గారు అంటునారు మనలని అనుసరిపనివాడు మీ పేరిట దయ్యములను పారద్రోలుతున్నాడు అని అన్నారు ఇక్కడ శిష్యుని యొక్క అసూయను మనం చూస్తున్నాం.ప్రియా దేవుని బిడ్డలారా నిజానికి దుష్టాత్మలు  ప్రభుని నిజమైన నామానికి మాత్రమే భయ పడతాయి .పైన మొదటి పఠనములో మనము చూస్తున్నట్లుగా ,ప్రవచనాలు పలికేవారు దుష్టాత్మలను వెడలగొటేవారు  చాలా ప్రవిత్రముగా దేవునిలో అంట్టుగట్టబడి పరిశుద్ధమైన మలినంలేని జీవితం జీవిస్తారు ఈ శువిశేషములో దయ్యములను పారద్రోలువారుగూర్చిశిషులు అసూయా పాడగాప్రభు వారిని మందలించారు  గమినించవలిసిన విష్యం ఏమనగా ఆధ్యాత్మిక, సామజిక, సంగిక ,రాజకీయ ,మొదలైన వివిధ  రంగాలలో అసూయా అనేది సహజంగానే కనిపిస్తుంది .అయితే సహజంగా వ్యక్తులలో చోటుచేసుకున్న  దేవుని దృష్టిలో సహించరానిది.

     అందుకే ప్రభు అంటున్నారు  మీరు అసూయా పరులుకాగూడదు {రోమా :12 :11 } అంటూ బైబిల్ గ్రoదములో  సెలవిస్తున్నారు . అసూయా పడక  మంచిని అభివృదిని అభినందిస్తూ జీవించడం మంచి  క్రైస్తవుడు యొక్క లక్షణం గురుతించుకోవాలి .మన విరోధికానివాడు మన పక్షమున ఉండువాడు మార్కు శుభవార్త తొమ్మిదో వాద్యము నేలపై వచనంలో చూస్తున్నాము  మంచి చేయు ప్రతివాడు ప్రభువుతో ఉండును .ఆ వ్యక్తి వేరుగా ప్రభువును అనుసరించక పోయినప్పటికీ ప్రభువు అనుచరుడే.శిష్యులకు ప్రభువు  రెండు విషయాలను నేర్పించాడు .1 .శిష్యులకు ఇతరులకు మధ్యన గోడలునిర్మించరాదు .క్రీస్తు నామములో మంచికార్యాలను చేయు ప్రతివారినీ శిష్యులుగా స్వీకరించాలి 2 .శిష్యులు అసూయను ద్వేషమును జయించాలి సత్యాన్వేషణ చేయాలి .   

   దేవుని వాక్య ప్రకటన అనేది పవిత్రాత్మ వరం మనమందరం దేవుని ప్రవక్తలము కనుక దేవుని వాక్కుని ప్రకటించాలి .దైవ రాజ్య స్థాపనకై పాటుపడాలి .పవిత్రాత్మనందు  మనమందరము ఒకే సంఘము మనము దైవసంగము ,మనలోవున్న స్వార్ధని అసూయను ద్వేషాన్ని వీడి అందరితో సఖ్యతగా జీవించాలి ఇతరులను ఆలకించాలి అందరిని గౌరవించాలి కాబట్టి మనజీవిత ప్రయాణములో మార్పుచెందిన వారముగా జీవించాలి మంచిపనులు చేసే ప్రతిఒక్కరు కూడా దేవుని రాజ్యంలోకి అర్హులు. క్రైస్తవులమైన మనము అసూయా ద్వారా ఇతరులమనసులను ఇబ్బందిపెట్టకుండా ఐక్యత కల్గి ప్రేమతో ఆదరించాలి .నిన్ను నిన్నునీవు ప్రేమించినట్లు ని పొరుగువారికి కూడా ప్రేమించాలి. అదేవిధముగా పరలోక రాజ్యం చెర గొప్ప భాగ్యాన్ని దయచేయమని ఈ దివ్యబలిలో ప్రార్ధన చేసుకుందాము ఆమెన్ .


బ్రదర్ .మనోజ్ చౌటపల్లి ఓ .సి. డి


26వ సామాన్య ఆదివారము(2)

26వ సామాన్య ఆదివారము(2)

సంఖ్యా 11:25-29
యాకోబు 5: 1-6
మార్కు 9: 38-43, 45-46
ఈనాటి దివ్య పఠనములు దేవుని యొక్క సువార్తను ప్రకటించటానికి అందరు అర్హులే అనే అంశము గురించి భోదిస్తున్నాయి. అదేవిధముగా దేవుని యొక్క సువార్త ప్రకటించేటప్పుడు మనకు ఇతరుల గురించి అసూయ ఉండకూడదు అలాగే వారిపట్ల అసహనంగా ఉండకూడదు అనే అంశాల గురించి భోదిస్తున్నాయి. దేవుడు తన సేవకు ఎవరినైనా, ఎప్పుడైనా, ఏవిధముగానైనా ఉపయోగించుకుంటారు. తన మీద ఆధారపడి, తన సాన్నిధ్యము అనుభవించించి తన సేవ చేసే వారు ఎవరైనా తనకు ఇష్టమైన వారే. అందరికి దేవుని యొక్క ఆత్మ జ్ఞానస్నాము ద్వారా ఇవ్వబడినది. 
ఈనాటి మొదటి పఠనములో దేవుడు 70 మీద ఆత్మను కుమ్మరించే విధానమును చూస్తున్నాము. ఎందుకు ఇలా 70 మందిని ఎన్నుకున్నారు అంటే సంఖ్యా 11:  14వ వచనములో మోషే తన యొక్క భాధను వ్యక్తపరుస్తున్నారు. ప్రజల బాగోగులను పరామర్శించే భాద్యత తాను ఒక్కడే భరించలేనని, అందరికి పరిచర్య చేయుటకు కష్టముగా ఉంది కాబట్టి దేవుడిని అడుగుతున్నారు. దేవుడు ఎన్నుకునే వారందరు కూడా ఎలాంటి వారో 16 వ వచనంలో చూస్తున్నాము. వారు ప్రజలచేత గౌరవవింపబడేవారు, సమాజములో మంచి పేరున్నవారు, ప్రార్ధించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు. దేవుని యొక్క అభిషేకము ఎంత గొప్పదో ఈరోజు మొదటి పఠనము ద్వారా వింటున్నాము. దేవుడు మోషేకు ఇచ్చిన పరిశుద్ధాత్మను కొంత తీసుకుని మిగతావారికి ఇస్తున్నారు. మోషే ప్రవక్త ఆత్మను స్వీకరించుట ద్వారా పొందిన శక్తులు:
నత్తివాడు అయినా ప్రవచించాడు 
అనేక లక్షల మందిని నడిపించగలిగాడు 
ఫరో ముందు ధైర్యముగా నిలబడ్డాడు
దేవునితో మాట్లాడాడు 
ప్రజలతో ప్రేమగా మెలిగాడు
అనేక అద్భుతాలు చేసాడు 
ఇవన్నీ మోషే దేవుని యొక్క ఆత్మను పొందిన తర్వాత చేసిన పనులే. మోషే డెబ్బది మందిని సమావేశము అవ్వమని చెప్పినప్పుడు అరవై ఎనిమిది మంది మాత్రమే గుడారము వద్ద సమావేశమయ్యారు. వారిలో ఇద్దరు ఎల్దాదు, మేదాదు శిబిరములోనే ఉన్నారు. అయినప్పటికీ వారు కూడా దేవుని యొక్క ఆత్మను పొందారు. ఎందుకంటే అది దేవుని చిత్తము, వారు కూడా ఎన్నుకొనబడినవారే. ఒక్కసారిగా ఆత్మను పొందినప్పుడు వారిలో జరిగిన మార్పు చాల గొప్పది. వెంటనే ప్రవచనాలు పలుకుచున్నారు. పాపులను పుణ్యాత్ములుగా చేస్తుంది దేవుని ఆత్మ. భయస్తులను భయము లేకుండా చేస్తుంది దేవుని ఆత్మ. ఏమిలేనటటువంటి వారిని దేవుని సేవలో గొప్పవారిగా చేస్తుంది దేవుని ఆత్మ.  1 కొరింతి 12 :28 - దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును దయచేసారు. యేసు ప్రభువు యొక్క శిష్యులు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వెంటనే ప్రవచించడము ప్రారంభించారు, భయము వదిలేశారు. అపో 2:8-
దేవుని కోసము మరణించడానికి సైతం సిద్దముగా ఉన్నారు.
దేవుని ఆత్మ వారిని నడిపించింది 
దేవుని ఆత్మ వారిని ప్రేరేపించింది 
దేవుని ఆత్మ వారితో మాట్లాడించింది 
దేవుని ఆత్మ వారితో అద్భుతాలు చేయించింది 
దేవుని ఆత్మ వారితో పరలోక విషయాలు బోధించింది
ఈ యొక్క ఆత్మను మనమందరము మన జీవితములో జ్ఞానస్నానము ద్వారా, భద్రమైన అభ్యంగనము ద్వారా, గురుపట్టాభిషేకము ద్వారా కలిగి ఉన్నాము, కాబట్టి మనము కూడా ప్రవచించాలి. వీరు దేవుని యొక్క ఆత్మను పొందినది వారి కోసము కాదు, పరుల కోసము. ఇరుగుపొరుగువారికి సేవచేయడము కోసము. పొరుగు వారిని పరామర్శించటము కోసము, వారిని సన్మార్గములో నడిపించడము కోసము. ఈ డెబ్బది మంది ఎన్నుకొనబడినది దేవుని ప్రతినిధులుగా ఉండటం కోసమే. మోషే తనకు భారముగా ఉందని చెప్పినప్పుడు తన భారము తగ్గించుటకు అలాగే ఇతరులు కూడా దేవుని సేవకు వినియోగించబడాలని ప్రభువు ఇలా చేసారు. ఇద్దరు గుడారములోనే ఉన్నారు. అయితే ఇక్కడ వారు ఎట్టి పరిస్థితులలో రాలేదో వివరించలేదు, బహుశా అనారోగ్యముతో ఉండవచ్చు లేదా ఇంకేదైనా అయ్యి ఉండవచ్చు దేవుడు వారిని ఎన్నుకొన్నారు. అప్పుడు వెంటనే బలవంతులగుచున్నారు. అది దేవుని యొక్క ఆత్మ శక్తి.
తన మీద ఉన్న ప్రేమ చేత యెహోషువ అసూయపడి మోషేతో ఎల్దాదు, మేదాదు అనువారిని ప్రవచించటము ఆపివేయమని చెప్పారు. ఇది కేవలము అసూయ వల్ల జరిగినది. దేవుని యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరికి ఉంటుందని యేసు ప్రభువు వలె మోషేకు కూడా తెలుసు. దేవుడు మనలను ఎన్నుకున్నది, దీవించినది కేవలము మన కోసమే కాదు, ఇతరుల కోసము కూడా.  దేవునిపై ఎవరికీ హక్కు లేదు, అలాగే ఏ ఒక్కరి ద్వారానో లేక ఏ ఒక్క ప్రజ ద్వారానో మాత్రమే పనిచేయాలని కట్టడి దేవునిపై ఉండదు. అందరు సువార్త ప్రచారము చేస్తే దేవుని రాజ్యము సులువుగా ఉంటుందని చెబుతున్నారు. 
రెండవ పఠనములో యాకోబు గారు ధనవంతులందరిని హెచ్చరిస్తున్నారు. ధనవంతులు పేదవారి పట్ల న్యాయముగా ఉండాలని తెలియజేస్తుంది ఈనాటి రెండవ పఠనము. ధనికుడు పేదవాని యొక్క శ్రమను వినియోగించుకుని ధనము కూడబెట్టుకుంటున్నాడు. ఆ పేదవాని యొక్క ఆక్రందన దేవుని చేరుతుంది. బంగారము వెండి తుప్పు పట్టే వస్తువులు కావు. అయినా యాకోబు గారు తుప్పు పడతాయి అంటున్నారు. అంటే ధనికులు సంపాదించే బంగారము, వెండి అశాశ్వితమైనవి. దేవుని దృష్టిలో అవి నిరుపయోగము. అలాంటి పాడయ్యే వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చి పేదలను నిలువు దోపిడీ చేస్తే దేవుని శిక్షకు గురవుతారు అని తెలుపుచున్నారు. దేవుడు ఇచ్చిన ధనముతో పేదలకు సహాయము చేసి ఆదుకోవాలి. యేసు ప్రభువు కూడా పేదవారి పట్ల ప్రేమతో మెలిగారు.
    ఈనాటి సువిశేష పఠనములో యేసు ప్రభువు యొక్క శిష్యులలో భాగస్థుడు కాని ఒక వ్యక్తి సేవను శిష్యులు నిషేదించిన విధానము గురించి వింటున్నాము. అపొస్తలులు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి, దేవుని ప్రేమను పంచుట వారికి మాత్రమే పరిమితమైనది భావించారు. వాక్యాన్ని ప్రకటించడానికి, దయ్యాలు వెడలగొట్టడానికి వారికి మాత్రమే అధికారము ఇవ్వబడినది అని భావించారు. కానీ ఇక్కడ యేసు ప్రభువు తనతో, తన కొరకు జీవించే ఏ వ్యక్తి అయినా సువార్త ప్రకటన చేయవచ్చు అని తేటతెల్లము చేస్తున్నారు. యోహాను గారు అసూయపడుచున్నారు దేవుని మీద ఉన్న ప్రేమ వలన. మొదటి పఠనములో మోషే ప్రేమించిన శిష్యుడు అలాగే అసూయపడ్డాడు. అదేవిధముగా సువిశేషములో యేసు ప్రేమించిన శిష్యుడు కూడా అసూయపడ్డాడు. ఈ సువార్త ప్రకటన చేసే వ్యక్తిని మనము అభినందించాలి. అయన విన్నది, చూసినది, తెలుసుకున్నది నలుగురితో పంచుకుంటున్నాడు. దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటున్నాడు. దేవునిచే ప్రేరేపించబడ్డాడు. దేవుడు ఆయనను ప్రత్యేకముగా ఆ పనికోసం పిలవలేదు. అయినప్పటికీ యేసు ప్రభువు గొప్పతనము తెలియాలని, దేవుని రాజ్యస్థాపన జరగాలని తపనతో అయన ఈ సువార్త వ్యాప్తి కోసము కష్టపడ్డారు. ఈరోజు ప్రతిఒక్కరు కూడ చేయవలసినది ఇదే . దేవుని యొక్క నామమును చాటిచెప్పాలి. ఆయన గురించి భోదించాలి. ఈ వ్యక్తికి దేవుని భోదించాలి అనే ఘాడమైన కోరిక ఉంది ఉండవచ్చు. 
    దేవుని యొక్క సేవకులను గుర్తించి సహాయము చేస్తే వారికి బహుమానము దొరుకుతుందని చెబుతున్నారు. ఇది చాల సందర్భాలలో చూస్తున్నాము. ఆనాడు అబ్రహాము ముగ్గురు మనుజులను గుర్తించి వారికి సేవ చేసారు., ఆయన దీవించబడ్డాడు (ఆది 18:1-2). ఎలీషాకు షూనేము పట్టణములో ఉన్న సంపన్నురాలు వారికి ఆతిథ్యము ఇచ్చింది దేవుడు ఆమెను దీవించారు. (2రాజుల 4: 8,17) పేతురు ఆతిధ్యము ఇచ్చారు, ఆయన అత్త స్వస్థత పొందినది. ఏలీయాకు సహాయము చేసిన వితంతువు దీవించబడినది. అలాగే మనము కూడా దైవ సేవకులను ఎంతగా ఆదరిస్తే వారు అంతగా మనందరి కోసము ప్రార్థిస్తారు. కాబట్టి దైవ సేవకులకు సహాయము చేయమని ప్రభువు పలుకుతున్నారు. సువిశేష రెండవ భాగములో మనము ఇతరులు పాపము చేయుటకు కారణముగా ఉండకూడదు అని తెలుపుచున్నారు. ఇతరులు మన వల్ల పాపము చేయకూడదు. అసహనం, అసూయవల్ల ఎవరు చిన్నబిడ్డలకు దుర్మాత్రుకగా మారకూడదు. ఇక్కడ చిన్నబిడ్డలంటే చిన్న పిల్లలు కావచ్చు లేదా విశ్వాసపరముగా ప్రారంభ దశలో ఉన్నవారు కావచ్చు, లేదా విశ్వాసములో బలహీనంగా ఉన్నవారు కావచ్చు. ప్రభువు యొక్క ఉద్దేశమేమిటంటే విశ్వాసపరముగా గుర్తింపు ఉన్న పెద్దలు అప్పుడే కొత్తగా విశ్వాసము స్వీకరించి అభివృద్ధి చెందుతున్న వారికి కొన్నిసార్లు పాత విశ్వాసుల దురలవాట్ల వల్ల కొత్తవారి యొక్క ఎదుగుదల ఆటంకంగా మారే  ప్రమాదం ఉందని ప్రభువు తెలుపుచున్నారు.  చాల సందర్భాలలో కొంతమంది ఇతరులను పాపము చేయుటకు ప్రేరేపిస్తారు: 
తల్లిదండ్రులు కావచ్చు
స్నేహితులు కావచ్చు
పెద్దవారు కావచ్చు
ప్రేయసి ప్రియుడు కావచ్చు
    ప్రభువు అంటున్నారు, నీ చేయి నీకు పాప కారణమైనచో దానిని పెరికివేయమని. చేతుల ద్వారా చేసే పాపము - తాకుట, పట్టుకోవడము, లాగుకోవటం, వ్రేలెత్తి చూపుట, కొట్టుట, దొంగిలించుట. మన చేతులతో పాపము చేయుటకన్నా, పాపము చేయకుండా జీవించుటయే మేలు అని చెబుతున్నారు. కళ్ళతో చేసే పాపము - పాపము చేసే స్థలములో ఉండటం ద్వారా, పాపము చేయటానికి వెళ్ళడము ద్వారా, తన్నుట ద్వారా ఇలా మనము పాపము చేస్తాము. ఇలాగ కాళ్ళుండి పాపము చేయుటకన్నా మాములుగా మంచి జీవితము జీవిస్తూ పరలోకము చేరమని ప్రభువు తెలుపుచున్నారు. అలాగే కంటితో చేసే పాపాలు - చూడటము ద్వారా, చూడకూడనటువంటివి చూడటము ద్వారానే మనలో ఆశ కలుగుతుంది. ఈ లోక ఆశలకు గురియై పాపము చేస్తాము కాబట్టి మన యొక్క దేవుడు ఇచ్చిన ప్రతి యొక్క అవయవమును పాపము చేయుటకు కాకా పుణ్యము చేయుటకు వినియోగించాలి. మనమందరము ఆత్మచే నింపబడ్డాము, కాబట్టి దేవుని సేవ చేస్తూ దేవుని రాజ్య స్థాపన కోసము కృషి చేద్దాము. 
ఆమెన్.......... 
By Rev.Fr. BalaYesu OCD

తపస్సుకాలపు రెండొవ ఆదివారము

తపస్సుకాలపు రెండొవ ఆదివారము ఆదికాండము 15:5-12, 17-18 ఫిలిప్పీయులు 3:17-4:1 లూకా 9:28-36           క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ  దేవుని ...