9, జులై 2022, శనివారం

15వ సామాన్య ఆదివారము

15 సామాన్య ఆదివారము

ద్వితీ:- 30:- 10-14, కొలిసి:- 1:- 15-20, లూకా:- 10:- 25-37

క్రిస్తునాధునియందు ప్రియా దేవుని బిడ్డలారా  నాడు తల్లి తిరుసభ 15 సామాన్య ఆదివారంలోనికి అడిగిడుతుది.
 నాటి   దివ్య గ్రంథపఠనాలు మనకు తెలియజేసే అంశం ఏమిటంటే దేవుని ప్రేమ మరియు 
మానవుని ప్రేమ. 

మనము దివ్య గ్రంధాన్ని మొదటినుంచి చివరివరకు క్లుప్తంగా పరిశీలించినట్లైతే అనగా ఆదికాండము నుంచి దర్శనగ్రంధం వరకు పరిశీలించినట్లయితే మనకు ముఖ్యముగా అతి ప్రధానముగా తెలిపేది లేదా బోధించేది ఏమిటంటే దేవుని ప్రేమ మరియు పొరుగువాని ప్రేమగురించి బోధిస్తుంది.
ఆదికాండములో ఆదాము మరియు అవ్వ సృష్టిల ద్వారా దేవుని ప్రేమను చూస్తాముదేవుడు ప్రేమతో తన రూపంలో ఆదామును తయారు చేయటం తరువాత తాను ఎన్నుకొన్న మనుషుల ద్వరా ప్రవక్తల ద్వారాన్యాయాధిపతుల ద్వారారాజుల ద్వారా దేవుడు తన యొక్క ప్రేమను తెలియజేస్తున్నాడునూతన నిబంధనలో మానవుల మీద తనకు ఉన్న ప్రేమతో కుమారుని సైతము భూమికి పంపి థన ప్రేమను తెలియజేస్తున్నాడు.

 కుమారుడు భూమికి వచ్చి తన తండ్రి ప్రేమను వెల్లడించి పంచి చివరకు తండ్రి మీద ప్రేమతో మన మీద ప్రేమతో సిలువ శ్రమలను సహితము పొంది సిలువలో తన రెండు చేతులను చాచి మరణించి కుమారుడు మరియు తండ్రి ఎంతగా ప్రేమిస్తున్నారో చూపించాడు.
 ప్రేమతో విడిపోయినతెగిపోయిన బంధాన్ని కలిపాడు యొక్క ప్రేమను  శిస్యులకు పంచాడుకుమారుడు పంచిన  ప్రేమను శిష్యులు అనేక మంది ప్రజలకు పంచి వారుకూడా కుమారునివలె వేదసాక్షి మరణాన్ని పొందారు.

ఇలా ఎవరైతే దేవుణ్ణి మరియు పొరుగువారిని ప్రేమించలేకపోతున్నారో  నాటి మొదటి పటనములో అట్టి వారికీ ప్రభువు పలికే మాటలు " నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతోను, పూర్ణఆత్మతోనుప్రేమింపుము" అని  యొక్క ఆజ్ఞలు ప్రభువు మోషే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినపుడు వాటిని పాటించడములో వారు విఫలమయ్యారు.
విఫలంకావటమేకాకుండా దబ్బర దేవతలను పూజించడం ఆరంభించారు దానికి ఫలితం వారు బానిసత్వానికి తీసుకొనిపోబడినారువారు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రభువు వారిని మందలిస్తూ ఓదార్పు మాటలను చెబుతున్నారుమీరు అన్ని మరచి నా చెంతకు తిరిగి వత్తురేని మిమ్ములను దివిస్తాను అని పలుకుతున్నాడు విధేయతతో ధర్మశాస్త్రములో లికించబడిన వాటిని పాటించమని అడుగుతున్నాడు ఇంతకు ముందులాగ అవిధేయతతో కాకా విధేయతతో పూర్ణ హృదయముతోపూర్ణ మనసుతోపూర్ణ ఆత్మతో పాటించమని ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను కోరుతున్నారు ఎందుకంటే  ఆజ్ఞలుధర్మశాస్త్రము వారికీ క్రొత్త కాదు కాబట్టి అవిధేయతతో కాకవిధేయతతోపాటించమనిప్రభువుచెపుతున్నాడుధర్మశాస్త్రాన్నిజ్ఞలను విధేయతతో పాటిస్తున్నామని చెపుతూ పొరుగువారు ఎవరో కూడ తెలియని ప్రజలకు ఈనాటి సువిశేషములో   ఓకే మంచి సమరియుని ఉపమానం ద్వారా యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు.

ప్రభువు అన్నట్లు "నన్ను ప్రేమించువాడు నా తండ్రిని ప్రేమిస్తున్నాడునా తండ్రిని ప్రేమించువాడు నన్ను ప్రేమిస్తున్నాడు వాడు నా తండ్రిచే ప్రేమించబడుతున్నాడు". దేవున్నీ ప్రేమిస్తున్నానని చెప్పి పొరుగువారు ఎవరో తెలియక పొతే మనం దేవున్నీ ఏవిదంగా ప్రేమించినట్లు అట్టివాడు దేవునితో ఎలా ప్రేమింపబడతాడు. నూతన నిబంధనలో ప్రభువు చెప్పేటటువంటి ముఖ్యమైన రెండు ఆజ్ఞలు నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ మనసుతో ప్రేమించు, నీవలె నీ పొరుగువారిని ప్రేమించు.  రెండు ఆజ్ఞలలో 10 ఆజ్ఞలు ఇమిడిఉన్నాయి. వీటిని పాటించువాడు నిత్యజీవం పొందుతాడు అని ప్రభువు పలుకుతున్నాడు.
పొరుగువారు ఎవరో తెలియని వారికీ మంచి సమరియుని ఉపమానము ద్వారా తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తి మార్గముగుండ పోవుచుండగా వాడు దుండగులతో కొట్టబడ్డాడు అటుగుండా యాజకుడు మరియు లేవీయుడు వెళ్లారుకాని సహాయం మాత్రం చేయలేదు కానీ సమరియుడు వారికీ సహాయం చేసాడు.

ఒక్క సారి  ప్రాంతం మరియు యూదులు, సమరియుల చరిత్రను పరిశిలించినట్లైతే యూదులకు, సమరియులకు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు ఇష్టపడరుయూధులు  మార్గంగుండా వెళ్ళటానికి ఇష్టపడరు అందులోను  మార్గం చాలా ప్రమాదకరమైనది ముఖ్యముగ చీకటి పడితే  మార్గగుండా పయనించడానికి భయపడతారు ఎందుకంటె దొంగలుదుండగులు వచ్చి కొట్టి ఉన్నవన్నీ తీసుకొని పోతారు  సమయములో ఉన్న పరిస్థితిని బట్టి ప్రభువు  ఉపమానాన్ని చెప్పారు.
మొదటిగా  మార్గంగుండా యాజకుడు పయనించినపుడు పడిపోయి ఉన్న మనిషిని పాటించుకోకుండా వెళ్ళిపోయాడు ఎందుకంటే వాడు చనిపోయాడు అని అనుకోని చనిపోయిన వారిని పట్టుకుంటే మాలినమవుతాడు దేవాలయములో యాజకునిగా నిర్వర్తించవలసిన పని ఆగిపోతుందని అవకాశాన్ని కోల్పోతాను అని యాజకుడు వెళ్ళిపోయాడు. యాజకుడు మలినమై ఉండకూడదు అట్టివారిని ఉద్దేశించి ప్రభువు అంటున్నాడు "స్నానం చేసినవాడు చేతులు కడుగుకొంటే చాలు కానీ మరల స్నానం చేయనవసరంలేదు"

హృదయశుడికావాలి కానీ బాహ్యశుద్ది కాదు
నోటిలోనికివెళ్ళేది కాదు మాలినపరిచేది నోటినుండి వెలువడేది మాలిన పరచేది

సున్నం కొట్టిన సమాధివలె అందంగా ఉన్న లోపల కుళ్ళు, దురవాసన అలానే ఉంటుంది
రెండవదిగా లేవీయుడు  మార్గంగుండా వెళ్లుచు వ్యక్తిని చూసికూడా పాటించుకోకుండా వెళ్ళిపోయాడు. పడిపోయిఉన్న వ్యక్తిని చూడటానికి వెళితే  లోపల దొంగలు వచ్చి ఏమైనా చేస్తారని ముందుగానే తన జాగ్రతను చూసుకొని వెళ్ళిపోయాడు.

మూడవదిగా సమరియుడు నిజానికి అతడు సమరియుడు కాదు ఎందుకంటె సమరియులకు, యూదులకు ఎక్కడ పొత్తుకుదరదు కానీ  వ్యక్తి దయకలిగిన వాడిలా వ్యక్తిని సత్రంలోనికి తీసుకెళ్లాడు. సత్రం అధికారి ఇతనను నమ్మాడు. యూదులు యేసు ప్రభువుని సమరియుడు అని పిలుస్తారు. ధర్మశాస్త్రాన్ని పాటించని వారిని, ఆజ్ఞలను ఊల్లంగించువారిని సమరియుడు అని పిలుస్తారు.
సమరియుడు అనబడు  వ్యక్తి పదిపోయిన వ్యక్తిని బాగుచేయటానికి తన దెగర ఉన్నదంతయు ఇచ్చాడు.

వ్యక్తి ఎవరైనా దేవుని ప్రేమ  తన హృదయంలో ఉన్నది కావున పడిపోయిన వ్యక్తిని పొరుగువానిగా భావించి తనకు సహాయంచేసాడు.
"తన స్నేహితునికొరకు ప్రాణమును సహితము ధారపోయువాడు నిజమైన స్నేహితుడు". ఇటువంటి స్నేహితుడిని మనము ఈనాటి రెండవ పటనములో చూస్తాము.

 నాటి రొండోవ పటనములో పాలుగారు కొలిసి ప్రజలకు క్రీస్తు ప్రభుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరించడం చూస్తున్నాము. దేవుని కుమారుడు, తండ్రి దేవుని ప్రతిరూపము అన్నింటిమీద ఆధిపత్యము కలిగిన వ్యక్తి, ఈయన మరణముద్వారానే మనము రక్షణ పొందాము ఈయన ఉతనముద్వారా తెగిపోయిన ప్రేమను మరల పొందగలిగాము. ఈయనకు పొరుగువారి మీద ఉన్న ప్రేమవలననే తండ్రి దేవునిచే ప్రేమించబడుతున్నాముప్రభువు అంటున్నాడు నీసహోదరునితో ఏమైనా తగాదాలుకలహాలు ఉంటె నీవు తెచ్చిన అర్పణలను అక్కడే వదిలివేసి మొదట నీ సహోదరునితో సఖ్యతపడి అటు తరువాత వచ్చి నీ అర్పణలను సమర్పించు.
దేవుని ప్రేమిస్తున్న అని చెప్పుకొనటం కాదు సహోదరునికుడా ప్రేమించినపుడే దేవునిచే ప్రేమింపబడతావు.

"నీ దేవుడైన ప్రభువుని పూర్ణ మనసుతోపూర్ణ హృదయముతోపూర్ణ ఆత్మతో  ప్రేమింపుము నీ వలె నీ పొరుగువారికి ప్రేమించు".
                                                                                                                బ్రదర్. లూకాస్. ఓసిడి

5, జులై 2022, మంగళవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

మత్తయి సువార్త 9: 32-38

మూగదయ్యమును  వెడలగొట్టుట మరియు క్రీస్తు కారుణ్యము.

32. వారు పోవుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవానిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. 33. పిశాచము వెడలగొట్టబడిన యంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అపుడు అచటి ప్రజలు ఎల్లరు ఆశ్చర్యపడుచు, "ఇశ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడును ఎరుగము" అనిరి. 34. కాని పరిశయ్యులు, "పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టు చున్నాడు" అని ఈసడించిరి. 

35. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి, ప్రార్థన మందిరములలో బోధించుచు, పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు, జనుల వ్యాధి భాదలనెల్ల పోగొట్టుచుండెను. 36. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు, కాపరిలేని గొఱ్ఱెలవలె  చెదరియున్న జనసమూహను చూచి, ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను. 37. అపుడు యేసు తన శిష్యులతో "పంట మిక్కుటము; కాని కోతగాండ్రు తక్కువ. 38. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను  పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు" అని పలికెను.

ధ్యానము: పరిశయ్యులయొక్క నిర్లక్ష్యము, అసూయ, మరియు క్రీస్తు ప్రభువు దేవుని పనిని నెరవేర్చుట.

ప్రియ స్నేహితులారా ! ఈ నాటి సువిశేష పఠనాన్ని మనము ధ్యానించినట్లైతే మనకు రెండు విషయాలు అర్థమవుతాయి. మొదటిగా “పరిశయ్యులయొక్క నిర్లక్ష్యము, అసూయ, మరియు క్రీస్తు ప్రభువు దేవుని పనిని నెరవేర్చుట, లేదా క్రీస్తు తన సువార్త పరిచర్యను” నెరవేరుస్తున్నటువంటి సారాంశమే  మనకు అర్థమవుతుంది.

ఎందుకంటే, మన అందరికి తెలిసిన విధంగా పరిశయ్యులంటే సంఘ కాపరులు, లేదా ప్రజలను అనునిత్యం కాపాడేవారు, వారి బాగోగులు చూసుకునే వారు.

కాని వారిజీవిత నడవడిక మాత్రం, వారి పదవికి వ్యతిరేకంగా ఉంటుంది, లేదా వారు బోధించే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటుంది. వారు ఎప్పుడు కూడా కపట వేషధారులవలె, పేరుకు మాత్రమే భోదకులుగా జీవించే వారు, నిజానికి అమాయక ప్రజలమీద, శాస్త్రాలయొక్క భారాన్ని మోపేవారు, ప్రజలను ఎప్పుడు కూడా సక్రమైన మార్గములో నడిపించే వారు కాదు. ఇశ్రాయేలు ప్రజలు, తమ వ్యక్తి, తమలో ఒకరయినటువంటి క్రీస్తు మీద, ఈర్ష, అసూయ చెందుతున్నారు.

ఎందుకంటే క్రీస్తు ప్రభువుకి వారికంటే, పరిశయ్యులకంటే గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేసే శక్తి ఉంది, ప్రజలుకూడా క్రీస్తు ప్రభువు వైపే వెళుతున్నారు అని అసూయ చెందుతున్నారు.

దేవుని శక్తి మనలో లేనప్పుడు మనము సాతానుని వెళ్ళొగొట్టలేము. సాతాను, సాతానును వెళ్లగొట్టగలడా?

క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు కాబట్టి, దేవుని శక్తి తనలో ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభువుకు ఆ సాతాను లొంగి పోయింది.

పరిశయ్యులు కూడా దేవుని యొక్క బిడ్డలే, కాని వారు ఎప్పుడు క్రీస్తు వలె, నిజమైన దేవుని రాజ్యాన్ని బోధించే వ్యక్తిగా లేదా అధికారులుగా, సంఘ కాపరులుగా జీవించలేదు. అందుకే దేవుని శక్తి, దేవుని మహిమ వారు చేయలేకపోయారు.

మరి పరిశయ్యులు, అంతా తెలిసినవారే కదా, దేవుని ధర్మశాస్త్త్రాన్ని అనుసరించే వారేకదా, దేవునిచే ఎన్నుకొనబడినవారే కదా, మరి వారి ప్రజలలో ఒకరు అస్వస్థతకు గురి అయినప్పుడు, పరిశయ్యులు ఎందుకు అద్భుతాలు చేయలేదు, స్వస్థతలు చేయలేదు? ఎందుకంటే వారు పేరుకు మాత్రమే సంఘపెద్దలు, లేదా కాపరులు.

దేవుని ప్రమేయమున్నపుడే, శాతానును మనము జయించ గలము లేదా ఓడించగలము. సాతాను తనకు తానుగా ఎలా ఓడించుకుంటుంది. పిశాచముల నాయకుడు అంటున్నారు, మరి పిశాచముల నాయకుడు అయితే మంచి కార్యములు, అద్భుతములు ఎలా చేస్తాడు? సాతాను నుండి అయితే మంచి పనులు చేయకూడదు కదా.

రెండవదిగా: క్రీస్తు ప్రభువు కారుణ్యము లేదా క్రీస్తు ప్రజలయొక్క నిస్సహాయతను, అమాయకత్వాన్ని చూసి, వారియొక్క భడాలను చూసి జాలి చెందుతున్నాడు.

క్రీస్తు ప్రభువు, గ్రామాలు గ్రామాలు తిరుగుచున్నారు, దేవుని రాజ్యాన్ని బోధిస్తున్నారు, స్వస్థతలు, అద్భుతాలు, చేస్తున్నారు., కాని ప్రజలందురు కూడా కాపరిలేని గొఱ్ఱెలవలె, త్రోవ తప్పిన వారివలె జీవిస్తున్నారు. సంఘ కాపరులు వారిని పట్టించుకోవట్లేదు, నాయకులు, ప్రజల బాగోగులు చూసుకోవట్లేదు. అందుకే ప్రజల జీవితాలు ఈవిధంగా ఉన్నాయని బాధపడుతున్నాడు.

దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఇంకా చాల గ్రామాలు ఉన్నాయి వాటన్నిటిలో అద్భుతాలు చేయాలి, దేవుని రాజ్యాన్ని బోధించాలి, అందుకనే క్రీస్తు ప్రభువు, పంట విస్తారము, కోతగాండ్రు కావాలి అంటున్నారు, అంటే, తన సువార్త పరిచర్యలో మనలనుకూడా, బాగస్తులను అవమాని ఆహ్వానిస్తున్నారు.

దేవుడంటే తెలియని గ్రామాలు చాలాఉన్నాయి, దేవుని సేవచేయుటకు, దేవుని రాజ్యాన్ని లోకమంతట వ్యాపింప చేయుటకు, శిష్యులు కావాలి, కాబట్టి ఈ నాటి సువిశేష పఠనం ద్వారా క్రీస్తు ప్రభువు మనందరిని ఆహ్వానిస్తున్నారు.

ప్రియ స్నేహితులారా! మనము ఈ సువిశేషాన్ని గమనించినట్లయితే, భాద్యత కలిగినటువంటి అధికారులే(పరిశస్యులు), ఏ భాద్యత లేకుండా, ప్రజలను భాదలతో, కష్టాలలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోవడంలేదు.

కాని దేవుడు కారుణ్యము కలవాడు కాబట్టియే, తనలో దైవత్వం ఉందికాబట్టియే, దేవుని కుమారుడు కాబట్టియే, తన ప్రజలచెంతకు వెళుతున్నాడు, వారికీ స్వస్థతలు, అద్భుతాలు చేస్తున్నాడు. ఒక భాద్యత కలిగి జీవిస్తున్నాడు. దేవుని కార్యాన్ని, చిత్తాన్ని నెరవేరుస్తున్నారు.

ఎందుకంటే తనప్రజలు కష్టాలతో, బాధలతో సతమతమవుతుంటే దేవుడు ఓర్చుకోలేడు, చూస్తూ ఊరుకోడు. తమ ప్రజలకు న్యాయము చేస్తాడు.

ప్రియ స్నేహితులారా ఇప్పుడు మనందరమూ ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము పరిశయ్యుల వలె జీవిస్తున్నామా? లేదా క్రీస్తు వలె ఇతరులకొరకే, దేవునిరాజ్యాన్నిభోధించుటకే జీవిస్తున్నామా?

ఎందుకంటే మనం, మన సాధారణ జీవితంలో, ఇలాంటి సన్నివేషాలను చాల చూస్తూనే ఉంటాం, మన గ్రామాలలో, అనారోగ్యం తో బాధపడేవారిని, కష్టాలలోఉన్నవారిని, నిస్సహాయులును, మానసికంగా, శారీరకంగా బాధపడే వాళ్ళను మనము చూస్తూవుంటాం. కాని అందరమూ కూడా పరిశయ్యులవలె, పట్టించుకోము, నిర్లక్ష్యము చేస్తాము. 

ఆ త్రియేక దేవుడు, మనందరిలో జీవిస్తున్నాడు, మనందరిలో కూడా  దైవత్వం ఉంది. కాని మనము, మనలో ఉన్న దైవత్వానికి ప్రాముఖ్యతను ఇవ్వము. అందుకే మనము స్వస్థతలు, అద్భుతాలు చేయలేక పోతున్నాం, అంతేకాక, దేవుడు చేసిన అద్భుతాలను మనం నమ్మలేక పోతున్నాం, ముందుగా వాటిని గ్రహించలేక పోతున్నాం.

మనంకూడా క్రీస్తు వలె అద్భుతాలు చేయగలము, ఎప్పుడైతే మనం దేవుని విశ్వసిస్తామో, దేవుని పై ఆధారపడి జీవిస్తామో. 

ప్రియ స్నేహితులారా చివరిగా మనం గ్రహించాలిసింది ఏమిటంటే, సాతాను క్రియలు నాశనము చేయడానికే, కాని క్రీస్తు చేసే పనులు దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి.

ప్రార్థన: కరుణామయుడవైన దేవా! మాలో ఉన్నటువంటి మీ దైవత్వాన్ని మేము గ్రహించలేక పొతున్నాం.

మాజీవితాలు కూడా చాలా సార్లు పరిసయ్యులవలె ఉంటున్నాయి, పేరుకు మాత్రమే నేను, క్రైస్తవునిగా, సంఘంలో ఒకవ్యక్తిగా జీవిస్తున్నాను, దేవుని రాజ్యాన్ని, సువార్తను, నా జీవితం ద్వారా ఇతరులకు భోదించలేక పోతున్నాను, నా సహోదరులను నిరాకరిస్తున్నాను. ఇకనుండి అయినను నేను నీవలె జీవించుటకు, ఇతరులుకొరకు జీవించుటకు నాకు శక్తిని, మంచినే చేసే కరుణగల హృదయాన్ని నాకు ప్రసాదింపుము, అని ప్రార్థన. ఆమెన్.

Br. Subhash

3, జులై 2022, ఆదివారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

మత్తయి సువార్త 9 : 18 - 26

18. ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు అధికారి ఒకడు వచ్చి, ఆయన ముందు మోకరించి, "నా కొమార్తె ఇపుడే మరణించినది. కాని, నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై నుంచిన ఆమె బ్రతుకును". అని ప్రార్థించెను. 19. అపుడు యేసు లేచి, శిష్యసమేతముగా అతనిని వెంబడించెను. 20. అప్పుడు పండ్రేండేళ్ల నుండి యెడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్నఒక స్త్రీ వెనుకనుండి వచ్చి యేసు అంగీ అంచును తాకెను. 21. ఏలన, "యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును" అని ఆమె తలంచుచుండెను. 22 . యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, "కుమారీ! ధైర్యము వహింపుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరిచెను". అని పలుకగా ఆమె ఆక్షణముననే ఆరోగ్య వంతురాలాయెను.

23. పిమ్మట యేసు, ఆ అధికారి ఇంటికి వెళ్లెను. అచట వాద్యములు మ్రోయించువారిని, అలజడిగనున్నజన సమూహమును చూచి, 24. "మీరందరు ఆవలికి పొండు. ఈ బాలిక మరణించలేదు. నిదురించుచున్నది" అని పలికెను. అందులకు వారందరు ఆయనను హేళన చేసిరి. 24. మూగియున్న జనసమూహమును వెలుపలకు పంపి యేసు లోపలకు వెళ్లి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. 26. ఆ వార్త ఆ ప్రాంతము అంతట వ్యాపించెను.

ధ్యానము: "నీ విశ్వాసమే నిన్ను స్వస్థ పరుచును".

క్రీస్తు నాధుని యందు ప్రియ స్నేహితులారా, ఈ నాటి సువిశేష పఠనాన్నిమనము ధ్యానించినట్లయితే, మనము ఒక  స్వస్థతను మరియు ఒక అద్భుతము గురించి మనము చదువుతున్నాము. మొదటిగా పండ్రేండేళ్ల నుండి యెడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్నఒక స్త్రీ, తన శారీరక రోగమునుడి స్వస్థత పొందుతుంది.

ఈ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే, ఈ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఆమెకు ఉన్నటువంటి ధైర్యాన్ని, లేదా సాహసాన్ని, విశ్వాసాన్ని క్రీస్తు ప్రభువు అభినందిస్తున్నారు. క్రీస్తు నందు విశ్వాసముంచి, భయం భయంగా దేవుని యొక్క వస్త్రాన్ని తాకిన వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది. క్రీస్తు ప్రభువు, ఆమె యొక్క విశ్వాసముగల సాహసానికి, మెచ్చి, ఆమెతో "కుమారీ! నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని పలికాడు."

ఈ స్త్రీ, క్రీస్తు ప్రభువు యొక్క అంగీ అంచును, ఒకే ఒక్కసారి,  తాకగానే స్వస్థత కలిగింది.

మరి మనము ప్రతి రోజుకూడా క్రీస్తుని మన హృదయములోకి, మన ఆత్మలోకి  దివ్య సత్ప్రసాద రూపంలో, మనం స్వీకరిస్తున్నాం. మరి ఎన్ని సార్లు మనం స్వస్థత పొందాలి, ఎన్ని రోగాలనుండి మనకు స్వస్థతలు, అద్భుతాలు జరగాలి.  మరి మనది నిజమైన  విశ్వాసమా  లేదా పెద్దలు మనకు నేర్పించినటువంటి ఆచారము మాత్రమేనా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం.

రెండవదిగా, క్రీస్తు ప్రభువుకు మరణము పై ఉన్న ఆధిపత్యాన్ని, లేదా జీవాన్ని ఒసగే శక్తి ఉందని మనము గ్రహించవచ్చు.

ఈ వచనంలో మనము రెండు విషయాలు అర్థం చేసుకోవచ్చు, మొదటిగా అధికారికి ఉన్నటువంటి వినయము, విశ్వాసము, రెండవదిగా జనసమూహము యొక్క అవిశ్వాసము. ఇక్కడ అధికారి మోకరించి, క్రీస్తునందు పూర్తి విశ్వాసముంచి, ప్రార్థిస్తున్నారు, కాని జనసమూహము హేళన చేస్తున్నారు, దేవుడిని నమ్ముటలేదు, ఒక పిచ్చివానిగా చూస్తున్నారు. ఎందుకంటే "మరణించిన వారిని నిదురిస్తున్నారు" అంటే ఎవరైనా హేళనచేస్తారు, వెక్కిరిస్తారు, వాస్తవమే. కానీ వారు మాత్రం క్రేస్తుప్రభువు దేవుడన్న సంగతిని గ్రహించుటలేదు.

ఇక్కడ వారు క్రీస్తు ప్రభువుకు, జీవాన్ని ఇచ్చే శక్తి, అధికారం ఉందని గ్రహించలేదు. అందుకు కాబోలు, ఆ జనసమూహము క్రీస్తుని హేళన చేశారు.

కానీ క్రీస్తు ప్రభువు వారి మాటలను హేళనను లెక్క చేయకుండా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. మరణించిన ఆ బాలికను జీవంతో లేపుతున్నారు.

ఆ సన్నివేషాన్ని చూసి జనసమూహము  అశ్చర్యంతో నిండిపోయారు, అవును. సహజంగా ఆ జనసమూహము, ఇప్పటి వరకు మరణించిన వారిని జీవముతో లేపటం, వినివుండరు, బహుశా చూసివుండరు కూడా. అందుకే వారు అలా ప్రవర్తించి ఉండవచ్చు. తరువాత వారు, క్రీస్తు చేసినటువంటి ఆ అద్భుతాన్ని ఆ ప్రాంతమంతయు చాటిచెప్పారు.

ఈ రెండు సన్నివేషాల ద్వారా మనందరమూ గ్రహించవలసినది ఏమిటంటే, ఏవిధంగా నైతే, ఆ అధికారి మరియు జబ్బునపడినటువంటి స్త్రీ వలే,  మన జీవితాలలో అద్భుతాలు, స్వస్థతలు జరగాలంటే, మనము కూడా, ధైర్యము వహించి, దేవుని యందు విశ్వాసము ఉంచి, దేవుని చెంత మోకరించి ప్రార్థించాలి, అప్పుడే, దేవుడు, మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మెచ్చుకొని, మన ప్రార్థనలు, విన్నపాలను ఆశీర్వదిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు.

క్రీస్తునాడుని యందు ప్రియ స్నేహితులారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం.

మన జీవితాలు ఏవిధంగా ఉన్నాయి, ఆ అధికారి, మరియు ఆ స్త్రీ వలే, దేవుని యొక్క మనజీవితాలలో చూడాలనుకుంటున్నాయా లేదా, ఒక వేల ఆ జనసమూహము వలే క్రీస్తుని మనము హేళన చేస్తున్నామా?

ప్రార్థన : ఓ దయా సంపన్నుడా! మా జీవితాలు కూడా ఎన్నో సంవత్సరాలుగా, అనేక విధాలైన రోగములనుండి, కోపము, పగ, ద్వేషము, అసూయా, క్రోధము, వ్యామోహము,  దొంగతనము, గర్వము, సోమరితనం, ఇంకా అనేక విధములైన శారీరక, ఆత్మీయక రోగములనుడి నశించి పోతుంది. మాకు మాత్రం, వాటన్నిటినుండి, బయటకు రావాలని ఉంది, స్వస్థతను పొందాలని ఉంది. కానీ నా బలహీనతలే, నా లోని అవిశ్వాసము, అధైర్యము, గర్వము, నన్ను నీదరికి చేరనీయుట లేదు.

మీ యొక్క దయార్ద హృదయము వలన, నాకు విమోచనము కలుగ చేయుము, నాలొఉన్నటువంటి, అస్వస్తతలను తీసివేయుము. మీరు ఒక్క మాట పలికిన, నా శరీరము, నా ఆత్మకూడా స్వస్థత పొందును. కావున, మాకు కూడా, మిమ్ము హేళన చేసిన జనసమూహము వలే కాకుండా, ఆ అధికారి, మరియు ఆ స్త్రీ వలే, ధైర్యమును, విశ్వాసమును కలుగ చేయుము అని ప్రార్థించుచున్నాము. కావున మేముకూడా మీ యొక్క మహిమను చాటి చెప్పే విధంగా మాకు అనుగ్రహము దయచేయుమని ప్రార్థిస్తున్నాము. ఆమెన్.

Br. Subhash

2, జులై 2022, శనివారం

పునీత తోమాసు గారి పండుగ

పునీత తోమాసు గారి పండుగ

ఈ రోజు తల్లి తిరుసభ అపోస్తులుడైన తోమాసుగారి పండుగను కొనియాడుచున్నది. 

పునీత తోమాసుగారు భారత దేశపు పాలక పునీతుడు ఒకవిధంగా చెప్పాలంటే ఈ నాడు మనం క్రైస్తవులుగా వున్నాం అంటే అది పునీత తోమాసుగారి సువార్త సేవా ఫలితమే.

భారత దేశంలో ఉన్న అనేక మందికి విశ్వాసంను ప్రకటించిన వ్యక్తి , భారత విశ్వాసులకు తండ్రి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే తోమాసుగారు మాత్రం భారత దేశంలో వున్న క్రైస్తవ విశ్వాసులందరికి తండ్రి. 

విశ్వాసుల నమ్మకం ప్రకారం తోమాసుగారు కేరళ రాష్ట్రంలో 7 దేవాలయాలు నిర్మించారు. 

యోహాను సువార్తికుడు తనయొక్క సువార్త చివరి భాగంలో పునీత తోమాసు గారియొక్క అచంచల విశ్వాస జీవితం గురించి తెలిపారు. 

పునీత తోమాసుగారు అందరికి ప్రభువు యొక్క పునరుత్తానంను సందేహించిన వ్యక్తిగానే తెలుసు కాని ఆయన మాత్రమే కాదు మిగతా శిష్యులు కూడా మొదట్లో  ఆయన పునరుత్తానంను  విశ్వసించలేదు. మార్కు 16 : 1 - 8 . 

స్త్రీలు వచ్చి ప్రభువు పునరుత్తానం గురించి వివరించినప్పుడు శిష్యులు తోమాసు గారి వలె నమ్మలేదు. లూకా 24 : 1 -12 .

-తోమసుగారు ప్రభువుయొక్క పునరుత్తానం నమ్మలేదు ఎందుకంటే ఆయనకూడా మిగతా శిష్యుల వలె వ్యక్తిగత అనుభూతి కావలి. అందుకే ప్రభువును చూస్తే కానీ నమ్మను అని అన్నారు. 

తోమాసు గారియొక్క సందేహం గురించి ఒక్క సారి ఆలోచిస్తే ఆయన యొక్క సందేహం చాలా నెగటివ్ గా భావించకూడదు అది పాజిటివ్ గా ఆలోచిస్తే మంచి అర్థం వుంది. పర్షియా సామెత ఒకటి ఉంది "doubt is the key of the knowledge ". సందేహం అనేది జ్ఞానం పొందుటకు దోహద పడుతుంది. 

మనకు సందేహాలు వున్నపుడే తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. తెలుసుకొని మనం జ్ఞానం సంపాదించవచ్చు. మన సందేహాలు మనలను జ్ఞానం వైపునకు నడిపిస్తాయి. 

-దేవుడు సందేహించే వారిపట్ల సహనంతో ఉంటున్నారు. జెకర్యా దేవుని వాగ్దానం గురించి సందేహించారు అయినా కానీ దేవుడు ఆయనను సహించారు. 

-ఆదాము అవ్వ సందేహించారు 

అబ్రహాము భార్య సారా సందేహించింది. 

-బాప్తిస్మ యోహాను గారు కూడా నీవు మెస్సయ్యవా లేక మేము ఇంకొకరికొరకు ఎదురు చూడాలా అని సందేహించారు. ఈ సందేహించిన ప్రతి వారి పట్ల దేవుడు సహనంతో వున్నారు. అలాగే యేసు ప్రభువు యొక్క సందేహించిన తోమాసు గారి పట్ల దేవుడు సహనంతో ఉన్నారు. 

వాస్తవానికి మనకు ఉన్న సందేహాలతో మనకున్న విశ్వాసం పోరాడాలి . అప్పుడే విశ్వాసం గెలుస్తుంది. ఇది ఆయనకు ఉన్న సందేహాలు తన యొక్క విశ్వాసంతో పోరాడినప్పుడు చివరికి ఆయన సంపూర్ణ విశ్వాసం కలిగి, దైవ అనుభూతి కలిగి జీవించారు. 

ఇది కొందరికి నెగటివ్ గా అర్థం అయివుండొచ్చు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో సందేహాలు ఉంటునే ఉంటాయి ఇక్కడ తోమాసు గారు బయటపడ్డారు మిగతా వారు బయట పడలేదు అయినప్పటికీ యేసు ప్రభువు ప్రత్యేకంగా ఆయనకోసమే మరొకసారి ప్రత్యక్షమయ్యారు. 

-పునీత గ్రెగొరీ ద గ్రేట్ అంటారు యేసు ప్రభువు తోమాసు గారి యొక్క సందేహామనే గాయంను మాన్పిన విధంగా ప్రభువు మనలో ఉన్న అనేక గాయాలు మాన్పుతారు  అని అన్నారు. మనందరిలో ఉన్న అపనమ్మకం అనే గాయాన్ని ప్రభువు నయం చేస్తారు. యేసుప్రభువు శిష్యులకు దర్శనం ఇచ్చిన సందర్భాలలో తోమాసు గారు by chance (ఒకవేళ ) అక్కడ లేక పోవడం కాదు దేవుడు తనయొక్క దయను చూపుటకు, ఆయన విశ్వాసం బలపరుచుటకు ఈ విధంగా చేశారని గ్రెగొరీ గారు పలికారు. 

తోమాసుగారికి దైవ దర్శనం కలిగిన తరువాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు కూడా ఆయనకు యేసుప్రభువు అంటే గొప్ప నమ్మకం గౌరవం ఉన్నాయి.

ఈ రోజు ప్రత్యేకంగా ఆయనలో వున్న కొన్ని లక్షణాలు గుర్తుకు చేసుకోవాలి. 

1. తోమసుగారు ధైర్య వంతుడు -   తన యొక్క యజమాని, గురువు అయిన క్రీస్తుప్రభువు కొరకు చనిపోయేటంత ధైర్యం కలిగిన వ్యక్తి. లాజరు చనిపోయిన సందర్భంలో బెతానియాకు వెళ్ళేందుకు నిరాకరించిన వేళలో తోమాసుగారు రండి మనంకూడా వెళ్లి ఆయనతో మరణించుదాం అని పలికారు. మిగతా శిష్యులందరు మరణంకు భయపడ్డారు కాని తోమాసు గారు ధైర్యంతో ముందుకు వెళ్లారు. యోహాను 11 : 7 -16 . 

యేసు ప్రభువు మరణించిన తరువాత యూదుల భయముచే ఒక గదిలో దాగుకొని వున్న సమయంలో తోమాసు గారు మాత్రం బయట దైర్యంగా వున్నారు . యోహాను 20 :24 .

-దేవుని సువార్త కొరకు భారత దేశం వచ్చి  అనేక మందిని క్రైస్తవులుగా చేసి చివరికి వేదసాక్షిగా మరణించారు. తనకు వున్న దైర్యం వల్లనే దేవుని కొరకు జీవించి, మరణించారు. 

ప్రభువును తెలుసుకొవాలనే తృష్ణ కలిగిన వ్యక్తి- కడరాత్రి భోజన సమయంలో యేసు ప్రభువు శిష్యుల కొరకు పరలోకంలో నివాస స్థానం సిద్ధం చేయుటకు నేను మీకన్నా ముందుగా వెళతాను అని చెప్పిన సమయంలో తోమాసు గారు నీవు వెళ్లే మార్గము మాకు తెలియదు నీ మార్గము గురించి తెలుపుము అని తోమాసు గారు యేసు ప్రభువును అడిగారు. యోహాను 14 : 6 .

మిగతా శిష్యులవలె దేవుని మార్గము తెలుసనీ నటించక తనకు తెలియదని ప్రభుని అడిగారు. తనయొక్క అజ్ఞానమును ప్రభువు ముంగిట ఉంచి దైవ జ్ఞానము పొందాలనుకున్నారు, తోమాసుగారు. 

దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తి - పునరుతానమైన ప్రభువు యొక్క గాయాలలో వ్రేలుపెట్టి చూడాలని కోరుకున్న తోమాసుగారు ఒక్క సారిగా ప్రభువు దర్శన మిచ్చిన సమయంలో యేసు ప్రభువును సంపూర్ణంగా విశ్వసించారు. అప్పటివరకు కూడా తోమాసు గారికి యేసుప్రభువు గురించి వివిధ రకాల ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన్ను ఈ భోలోక రాజుగా, మెస్సయ్యగా భావించాడు .

ఈ  భూలోకంలో  తన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడని, ప్రజలయొక్క కష్టాలు తొలగిస్తారనే ఆలోచనలు కలిగివున్నాడు . కాని ప్రభువు మరణ పునరుత్తానం తరువాత మరీ  ముఖ్యంగా తనకు దర్శనం ఇచ్చిన సందర్భంలో ప్రభువు గాయంలో వ్రేలు పెట్టకుండానే ఆయన్ను చూసి సంతృప్తి చెంది విశ్వసించారు . ఆయన్ను విశ్వసించడం మాత్రమే కాదు తన దేవునిగా గుర్తించారు. అందుకే ఆయన "నాదేవ, నాప్రభువా" అని పలికారు. 

మిగతా శిష్యులవలె కాకుండా యేసయ్యను తన సొంత దేవునిగా అంగీకరించిన వ్యక్తి పునీత తోమాసుగారు. 

పట్టు విడువని వ్యక్తి - పునీత తోమాసుగారు తనయొక్క జీవితంలో పట్టువిడువని వ్యక్తి . ఏదైనా సాధించాలనుకుంటే దానిని తప్పనిసరిగా సాధిస్తారు. ఎందుకంటే మిగతా శిష్యులందరు కూడా మేము పునరుత్తాన ప్రభువును చూశాం అని చెప్పినప్పుడు ఆయన దానిని నమ్మి అలా విడిచి పెట్టలేదు వాస్తవానికి ఇద్దరు చెప్పే సాక్ష్యం బైబులు పరంగా నమ్మవచ్చు కాని ఇక్కడ తోమాసు గారికి ఎంత చెప్పినాసరే ప్రభువును చూడాలనే పట్టు విడువలేదు అందుకే ఆయన పట్టుదలవలన ప్రభువును చూడగలిగారు.  

కొందరికిది  మూర్కత్వముగా  అనిపించవచ్చు  కాని తోమాసు  గారికి  ఇది  ఒక  అనుభవం. ఇతరులకు  దక్కిన  వరం  తనకు  కూడా  దక్కాలనుకున్నారు . 

- యాకోబు  దేవుని  ఆశీర్వాదం  కొరకు  పట్టుదల  కలిగి  అడిగిన  విధంగా ,  ప్రభువుని చూడాలనే కోరికతో వున్నారు. ఆది 32 : 26 . 

-కననియ స్త్రీ పదే పదే ప్రభువుని పట్టుదలతో ప్రార్థించినవిధంగా . మత్తయి 15 : 21 -28 .

-పౌలు గారివలె సువార్త పరిచర్యలో పట్టుదల కలిగిన వ్యక్తి లాగ పునీత తోమాసుగారు కూడా ప్రభువును తప్పని సరిగా చూడాలనే పట్టుదల కలిగి వున్నారు.

- ఆయన ఎప్పుడు తన పట్టువిడువ లేదు ప్రభువు సువార్త వ్యాప్తి కొరకు మరణించటానికి సైతం సిద్ధంగా ఉన్నారు. ఇతరులు తాను చెప్పిన మాటలగురించి ఏమని అనుకుంటారు అని భావించలేదు ఏది ఏమైనా సరే ఆయన్ను చూడాలి అనే ఆశ ప్రభువును చూసేలా చేసింది.

బలహీనతను ప్రభువు ముంగిట ఒప్పుకున్న వ్యక్తి:

మూసిన తలుపులు మూసినట్లు ఉండగనే ప్రభువు దర్శనం ఇచ్చిన సమయంలో తోమాసుగారు శిష్యులతో కలిసి ఉన్నప్పుడు ప్రభువు మొదటిగా తోమాసు గారితో మాట్లాడుతున్నారు.

-తోమాసు హృదయం తెలిసిన ప్రభువు ఆయన పలికిన ప్రతి మాట తోమాసుతో చెప్పే సమయంలో ప్రభువు ముందు మోకరించి తనయొక్క అపనమ్మకమును ఒప్పుకున్నారు. తన గురువు పట్ల చేసిన తప్పిదాలు ఒప్పుకున్నారు. యేసు ప్రభువుకు సమస్తము తెలుసు అని గ్రహించారు. 1 యోహాను 3 : 20 , యోహాను 2 :25 , దానియేలు 2 :22 , మత్తయి 10 :30 . 

-ప్రభువుపట్ల చేసిన తప్పిదములను గ్రహించి "నా ప్రభువా, నాదేవా" అని చెప్పారు. యేసు క్రీస్తు చెప్పినది మొత్తం నిజం అని తెలుసుకున్నారు, ఆయన సృష్టి కర్త అని గ్రహించారు. (యోహాను 1 :1 -2 ). ప్రభువు తన దైవంగా భావించి తన పాపాలను ఒప్పుకొని ప్రభువును ఆరాధించి తన దైవంగా చేసుకొన్న గొప్ప పునీతుడు తోమాసుగారు. 

-తన బలహీనతను అంగీకరించుట ద్వారా ప్రభువు తనను బలపరుస్తున్నారు. నూతన వ్యక్తిగా చేస్తున్నారు. తనయొక్క శాంతితో నింపుచున్నారు. 

6. క్రీస్తుప్రభువుని ప్రేమించిన వ్యక్తి:

 మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తి కొరకు ఏదైనా చేస్తాం.  అది ఎంత కష్టమైన ఇష్టంగా , తేలికగా ఉంటుంది. తోమాసు గారు ప్రభువు పట్ల వున్న ప్రేమను తనయొక్క పరిచర్య ద్వారా చూపించారు . తన కొరకు ప్రాణాలు ఇచ్చుటకు సైతం సిద్ధంగా ఉన్నారు. 

-పునీత తోమాసు గారు మనందరికీ ఆదర్శం, మనకు ఎన్ని సందేహాలున్న వాటన్నింటిని విశ్వాసంతో అధిగమించి ప్రభువుని విశ్వసించి అనుసరించాలి .

Doubting Thomas ను దేవుడు Daring Thomas గా మార్చిన విధంగా దేవుడు మన విశ్వాస జీవితాలనుకూడా బలపరచాలని ప్రార్థించుదాం.

Rev. Fr. Bala Yesu OCD


అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 9:14-17 

యోహను శిష్యులు  యేసును సమీపించి , మేము , పరిసయ్యులు  కూడా తరచుగా ఉపవాసము ఉందుము గాని. మీ శిష్యులు ఎన్నడును ఉపవాసము ఉండరేల? అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు?  పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి  కొనిపోబడు దినములు  వచ్చును. అపుడు  వారు ఉపవాసము  చేయుదురు. పాత గుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త  గుడ్డను ఎవడు  ఉపయోగించును? అట్లు ఉపయోగించిన క్రొత్త గుడ్డ కృంగుట వలన  ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త  ద్రాక్షరసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అటుల పోసిన యెడల అవి పిగులును; ఆ ద్రాక్షరసము నేల పాలగును. తిత్తులు నాశనమగును. అందువలన, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తిత్తులలో  పోయుదురు. అపుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమొసగెను. 

యోహను శిష్యులు యేసు ప్రభువు  వద్దకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్న ఏమిటి అంటే మేము మరియు పరిసయ్యులు ఉపవాసము ఉందుము కాని మీ శిష్యులు ఎందుకు ఉపవాసము ఉండరు? వారు ఈ ప్రశ్న అడగడానికి కూడా చాలా కారణాలు ఉండివుండవచ్చు. వాటిలో యేసు ప్రభువు మరియు ఆయన  శిష్యులు అనేక సమయాలలో విందులయందు కనపడుతుంటారు . 

కానా అనే ఊరిలో జరిగిన పెళ్ళిలో వీరు ఉన్నారు, సిమోను అనే పరిసయ్యుడు ఇచ్చిన విందులో ఉన్నారు, ఒక సుంకరి  అయిన జక్కయ్య మార్పు చెందిన తరువాత ఇచ్చే విందులో యేసు ప్రభువు శిష్యులు ఉన్నారు. లెవీ యేసు ప్రభువు అనుచరుడిగా మారిన తరువాత ఇచ్చిన విందులో వీరు ఉన్నారు. ఈ విందులన్నీ చూసి వీరు ఉపవాసం చేయక, ఎప్పుడు విందులు వినోదలతో ఉన్నారు అని వారు భావించి ఈ ప్రశ్న అడిగి ఉండవచ్చు. లేక యేసు ప్రభువు శిష్యులు ఎందుకు ఉపవాసం చేయడం లేదో తెలుసుకోవడానికి  ఈ ప్రశ్న అడిగి ఉండవచ్చు. యోహను శిష్యులు యేసు ప్రభువును తరువాత కూడా ఒక సారి ఓ ప్రశ్న అడుగుతున్నారు. అది ఏమిటి అంటే మా గురువు మిమ్ములను అడగమని పంపించారు, రానున్న రక్షకుడవు నీవేనా? లేక మేము ఇంకోకని కొరకు మేము వేచి చూడలా ? అంటే  యేసు ప్రభువు దగ్గరకు వీరు అప్పుడప్పుడు  వచ్చే వారు, వారి సమస్యలు గురించి చెప్పేవారు, ఆయనను ఒక రకముగా వారు తమ గురువు వలె గౌరవించారు. 

యోహను శిష్యులు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం ఏమిటి అంటే ? పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు?  దీని అర్ధం ఏమిటి? ఇది మనం యోహను నుండి తెలుసుకోవాలి. యోహను యేసు ప్రభువుని సాన్నిధ్యంను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే గమనించి ఆనందంతో గంతులేశాడు. అంటే యేసు ప్రభువు సాన్నిధ్యం మనకు ఆనందం ఇస్తుంది. అది ఆనందించవలసిన సమయమే కాని దుఃఖించవలసిన సమయం కాదు. అంటే మనతో యేసు ప్రభువు మనతో ఉన్నంత కాలం మనం ఆనందించే సమయం. 

 పాత నిబంధనకాలంలో కూడా అనేక విధాలుగా ప్రజలు ఉపవాసం చేశారు, అది దేవుని నుండి, ఆయన ఆజ్ఞల నుండి  దూరంగా వెళ్ళిన వారు అనేక కష్టాలు అనుభవించారు. వారు చేసిన పాపాలకు గాను దైవ సాన్నిధ్యం యెరుషలేము దేవాలయం నుండి వెళ్ళి పోతుంది. దేవుని సాన్నిధ్యం  మన నుండి వెళ్ళిన , మనం దేవుని నుండి దూరంగా వెళ్ళిన దాని పర్యవసానం మనం అనేక కష్టాలకు , నష్టాలకు గురి అవుతాము. ఇది దేవుడు మనకు ఇచ్చే శిక్ష కాదు. మనం దేవుని నుండి దూరంగా వెళ్ళి మనం  తెచ్చుకున్నవి. కాని మరలా దేవుని దగ్గరకు రావడానికి మనం చేసే ఒక పని నేను మీతో ఉండటానికి ఇష్టపడుతున్నాను అని తెలియజేయడం. ఇది   తెలియజెసే ఒక విధానం ఉపవాసం. కాని దేవున్ని వారు దూరం చేసుకోకపోయిన దేవుని కోసం, ఆయన రాక కోసం , ఆయన  వచ్చినప్పుడు యోగ్యరీతిగా ఆయనను స్వీకరించడానికి ఒక సాధనం ఉపవాసం. యోహను ఉపవాసం దీనిలో భాగమే. దేవుని నుండి దూరమై ఆయన కారుణ్యం పొందుటకు కూడా  ఒక సాధనం ఉపవాసం, ఇది పాత నిబంధనలో నినివే ప్రజలు చేశారు. 

యేసు ప్రభువు సమాధానం మనకు ఒక విషయం తెలియ జేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువు శిష్యులు ఏ విధంగా కూడా ఉపవాసం చేయనవసరం లేదు. కారణం వారు ఇప్పుడు దేవునితో కలసి ఉన్నారు. దేవుని సాన్నిధ్యం పొందుతున్నారు. యోహను శిష్యులు యేసు ప్రభువు రాకకై సిద్దపడు ఉపవాసం చేస్తున్నారు. ఆయనను యోగ్యంగా స్వీకరించడానికి.  కాని యేసు ప్రభువు శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు కనుక వారు ఉపవాసం చేయనవసరం లేదు. 

కాని యేసు ప్రభువు చెప్పిన విధంగా "పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి  కొనిపోబడు దినములు  వచ్చును. అపుడు  వారు ఉపవాసము  చేయుదురు." అంటే యేసు ప్రభువు వారి నుండి వెళ్లిపోయినప్పుడు ఖచ్ఛితముగా వారు ఉపవాసం చేస్తారు. వారి నుండి యేసు ప్రభువు వెళ్లిపోతారు. అప్పుడు వారు ఆయన సాన్నిధ్యం పొందుటకు ఉపవాసం చేయాలి. మనం కూడా ఈ రోజు ఆయన సాన్నిధ్యం పొందక పోయిన యెడల ఉపవాసం , పాప సంకీర్తనం ద్వారా మనం ఆయన సాన్నిధ్యం పొందాలి. 

"పాత గుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త  గుడ్డను ఎవడు  ఉపయోగించును? అట్లు ఉపయోగించిన క్రొత్త గుడ్డ కృంగుట వలన  ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును.క్రొత్త  ద్రాక్షరసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అటుల పోసిన యెడల అవి పిగులును; ఆ ద్రాక్షరసము నేల పాలగును. తిత్తులు నాశనమగును. అందువలన, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తిత్తులలో  పోయుదురు. అపుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమొసగెను." ఈ వచనాలలో మనం ఎప్పడూ ఏమి చేయాలో తెలుసుకొని చేయాలి అని నేర్చుకుంటున్నాం. 

ప్రార్ధన : ప్రభువా! మా జీవితంలో అనేక సమయాలలో మీరు మాతో ఉన్న విషయాన్ని గమనించలేక పోతున్నాను. మిమ్ములను మీ సాన్నిధ్యాన్ని పొందాలనే కోరిక మాకు ఎంతో ఉన్నా కాని మేము పొందలేక పోతున్నాము. మేము మిమ్ము గుర్తించే భాగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాము. మేము ఎందుకు ఉపవాసం చేయాలో , ఎప్పుడు ఉపవాసం చేయాలో తెలుసుకునే శక్తిని దయచేయండి. మాలో కొన్ని సార్లు నిజమైన మార్పు లేకున్నా , కేవలం బాహ్యంగా కొద్ది సేపు కనపడే మార్పులకు మేము పూర్తిగా మారిపోయాము అని బ్రమపడుతున్నాము. అటువంటి సమయాలలో మమ్ము మన్నించి మేము నిన్ను పూర్తిగా తెలుసుకొని, మీ సాన్నిధ్యం పొందే భాగ్యం దయచేయండి. ఆమెన్. 

తపస్సుకాలపు రెండొవ ఆదివారము

తపస్సుకాలపు రెండొవ ఆదివారము ఆదికాండము 15:5-12, 17-18 ఫిలిప్పీయులు 3:17-4:1 లూకా 9:28-36           క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ  దేవుని ...