తపస్సుకాల మొదటి వారం శనివారం
ద్వితీయోపదేశకాండము
26:16-19
మత్తయి
5:43-48
ఒడంబడిక -షరతు- పర్యవసానం
క్రీస్తు
నందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈనాటి పఠనాలు మన జీవితానికి సంబంధించి ఒడంబడిక, షరతు
మరియు పర్యవసానం గురించి ధ్యానించమని ఆహ్వానిస్తాయి.
మొదటి పఠనం
ఈ పఠనం
ఇశ్రాయేలు ప్రజలకు మరియు ఈ రోజు మనకు, దైవ ప్రజలకు స్పష్టమైన వివరణ మరియు గుర్తు చేస్తున్నారు.
దేని గురించి అంటే
ఒడంబడిక: నేను మీ దేవుడును మరియు
మీరు నా ప్రజలు. (ద్వితీయోపదేశకాండము 26:17,18) (యిర్మీయా 30:22; నిర్గమకాండము
6:7)
ఈ వాక్య
సందర్భం ఏమిటంటే, వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ముందు మోషే ఇశ్రాయేలు ప్రజలను సిద్ధం
చేస్తున్నాడు. కావున, వారందరిని ఒకచోట గుమిగూడి ఆలకిస్తున్నారు. మోషే ఒడంబడికను గుర్తుచేస్తూ
మరియు దృఢమైన హృదయంతో ధృవీకరించమని మరియు సంపూర్ణ విశ్వాసంతో దానిని పునరుద్ధరించమని
వారిని ఆహ్వానిస్తున్నారు. ఒడంబడికలో ఉన్న అంశాలు:
●
దేవుడు వారి
దేవుడు మరియు వారు అతని ప్రజలు
●
దేవుడే వారికి
భరోసా, భద్రత మరియు సమృద్ధిగా ఆశీర్వదిస్తారు.
●
ఈ ఒడంబడిక దేవుని
చిత్తాన్ని గుర్తు చేయడాం
●
ఈ ఒడంబడిక మానవునిలో
గల దేవుని ఉద్దేశ్యాన్ని నెరవేర్చడమే
●
ఈ ఒడంబడిక వారు
నడవడానికి, పాటించడానికి మరియు ఒడంబడికను పాటించేలా శక్తిని దయ చేస్తారు.
కాబట్టి,
మోషే వారి పాత్రను వారికి గుర్తుచేసి, వారు దేవునితో చేస్తున్న వాగ్దానానికి మరల నిర్దారించమని
ఆహ్వానిస్తున్నాడు.
షరతు/నిబంధన :
సాధారణంగా,
మేము ఏదైనా ఉత్పత్తి కలనుకున్నపుడు , ఉద్యోగం లేదా ఒప్పందాన్ని ఏర్పడినప్పుడు కొన్ని
నిబంధనలు మరియు షరతులు చూస్తాము. అంటే ఇచ్చిన ఉత్పత్తి లేదా మరేదైనా రకానికి సంబంధించి
కొంత స్పష్టతను అందించడం కోసమే ఈ షరతులు, నిబంధనలు.
17వ
వచనం లో చూసినట్లైయితే: “నేడు మీరు ప్రభువును
మీ దేవునిగా ఎన్నుకొంటిరి. ఆ ప్రభువు ఆజ్ఞలన్నిటిని పాటించి ఆయనకు విధేయులై
ఉండుటకు సమ్మతించిరి.” అలాగే దేవుని
ఒడంబడికకు కూడా షరతులు వర్తిస్తాయి, ఈ షరతులు ప్రజల యొక్క పాత్ర మరియు బాధ్యతపై కొంత వెలుగునిస్తాయి.
"అవును" అని చెప్పడం ద్వారా అంతా ముగిసిపోదు, కానీ దేవుడు ఇచ్చే ప్రయోజనాలను
ఆస్వాదించడానికి ఒక కొనసాగింపు ఉండాలి. వారు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు, ఇది ఒక కట్టుబడి:
➢
దేవుని శాసనాలు,
మరియు ఆజ్ఞలను వారి హృదయంతో మరియు ఆత్మతో పాటించడంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి, ఇది
సంపూర్ణ విధేయతకు ప్రాధాన్యతనిస్తుంది. (నిర్గమకాండము అధ్యాయం 19 నుండి.)
➢
అతని మార్గాలలో
నడుచుట - ఇది జీవన విధానాన్ని మార్చడం ద్వారా
మరియు ఎల్లప్పుడూ దేవుని స్వరానికి కట్టుబడి ఉండటం ద్వారా జీవితకాల నిబద్ధతను వెల్లడి
చేస్తుంది.
పరిణామాలు: ఆశీర్వాదాలు
మరియు
18 మరియు 19
వ వచనంలో ఇలా చెప్పబడింది “ప్రభువు కుడా తాను మాట ఇచ్చినట్లే నేడు మిమ్ము సొంత
ప్రజగా చేసుకొనెను.కానీ మీరు తన ఆజ్ఞలన్నిటిని చేకొనవలెనని ప్రభువు కోరిక. అయన తాను
కలిగించిన జాతులన్నిటికంటే మిమ్ము అధికులను చేయును. దాని వలన మీకు కీర్తి ప్రతిష్టలు
అబ్బును. ప్రభువు చెప్పినట్లే మీరు అతని సొంత ప్రజలగుదురు.”
ప్రభువు
ఏర్పరిచిన ఒడంబడికని అంగీకరించి మరియు వారు సమృద్ధిగా ఆశీర్వదించబడతారని వాగ్దానం చేసాడు,
ఎందుకంటే ప్రభువు విశ్వాస పాత్రుడు మరియు నమ్మదగినవాడు, తన వాగ్దానాల నుండి వెనక్కి
తగ్గడు. అందువల్ల ఒడంబడికకు విధేయత చూపడానికి ప్రాథమికంగా కొన్ని ఆశీర్వాదాలు:
➔
వారు దేవుని
ప్రజలు, చాలా ప్రత్యేకమైనవారు మరియు ప్రియమైనవారు
➔
వారి దేశం మరియు
హోదా అన్ని ఇతర దేశాల కంటే ఉన్నతంగా తీర్చిదిద్ద బడును.
➔
వారి పేరు, కీర్తి
సుదూర ప్రాంతాలకు వ్యాపించి స్తుతింపబడును. (యిర్మీయా 13:11 మరియు 33:9)
ఎందుకంటే
ఒడంబడికను అంగీకరించడం ద్వారా వారు ప్రభువుకు అంకితం చేయబడతారు, కాబట్టి వారి జీవన
విధానం, వ్యవహరించడం మరియు సంబంధం లో దేవుని గుర్తింపు మరియు అతని పవిత్ర స్వభావాన్ని
పోలి ఉంటుంది కాబట్టి ఆశీర్వాదాలు పొందుతారు.
అందువల్ల,
వారు వ్యక్తిగతంగా, సామాజికంగా మరియు మతపరంగా
ప్రార్థన, ప్రేమ మరియు సేవ గుణాలు అలవాటు
చేసుకుంటారు. ఈ కట్టుబాటు ఆశీర్వాదాలకు దారి తీస్తుంది. ఒడంబడికను అనుసరించే ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడతారు,
సువార్త
యేసు,
సువార్తలో కూడా శాసనాల గూర్చిమరియు ఆజ్ఞల గురించి ప్రజలకు గుర్తుచేస్తూ, వారి వ్యక్తిగత,
సామాజిక మరియు మతపరమైన జీవితంలో విస్తరించి ఉన్న దేవునితో ఒడంబడిక సంబంధాన్ని నిజమైన
అర్థాన్ని తెలుసుకోవడానికి మరియు సంపూర్ణంగ పాటించమని వారిని ఆహ్వానిస్తున్నారు . వారికి
భోదిస్తూ, "నీ పొరుగువారిని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు" అని చెప్పబడినట్లు
మీరు విన్నారు. యేసు లో ద్వేషం, ప్రతీకారం లేదా అవమానానికి స్థలం లేదు.
కాబట్టి,
ప్రార్థించడం మరియు ప్రేమించడం అనే రెండు పనులు చేయమని యేసు మనల్ని పిలుస్తున్నారు.
★
ప్రార్థించడమంటే
దేవునితో ఐక్యంగా ఉండడం మరియు ఇతరులతో సంబంధాన్ని బలపర్చుకోవడం.
★
ప్రేమించడం అంటే
ఎదుటివారి పట్ల సాన్నిహిత్యం మరియు శ్రద్ధను వ్యక్తపరచడం. ఇది మరొకరి కోసం త్యాగం చేసే
నిబద్ధత. యేసు పరిపూర్ణ ప్రార్థన మరియు పరిపూర్ణ ప్రేమ రెండింటికీ పరిపూర్ణ స్వరూపుడు.
యేసు
తనను ఎగతాళి చేసిన, తిరస్కరించిన వారిని ప్రేమించాడు మరియు తన సిలువకు కారణమైన వారి
కోసం క్షమించమని ప్రార్థించాడు. మనల్ని ద్వేషించే, ఇష్టపడని, చెడుగా ప్రవర్తించే, వెక్కిరించే
మరియు హింసించే (దగ్గరి వారుమరియు దూరంగా; ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో జరుగుతున్న)
వారి కోసం కూడా అందరి కోసం ప్రేమించాలని మరియు ప్రార్థించాలని ఆయన ఆజ్ఞాపించాడు. మనం
దయగల పరలోకపు తండ్రి బిడ్డలమని ఇది రుజువు చేస్తుంది. క్రైస్తవునికి వ్యక్తిగత శత్రువులు
ఉండరు. మనం మన కుటుంబాన్ని మరియు స్నేహితులను మాత్రమే ప్రేమిస్తే, మనం అన్యమతస్థులు
లేదా నాస్తికుల నుండి భిన్నంగా ఉండము.
తండ్రి
“సజ్జనులపై దుర్జనులపై, సూర్యుని ప్రకాశింప
చేయుచున్నాడు; సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము వర్షింప చేయుచున్నారు. ” అని
చెప్పి యేసు ముగించాడు. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు తన పరిపూర్ణ ప్రేమను మరియు దయను
అందరికీ సమానంగా ప్రసాదిస్తాడు. కానీ కొంతమంది ఆ దయను ఎంచుకుంటారు మరియు మరికొందరు దానిని తిరస్కరిస్తారు.
ప్రియమైన
మిత్రులారా, రెండు పఠనాల ధ్యానాంశం నుండి అది మనకు గుర్తు చేసేది
●
మనం ఈ రోజు జ్ఞానస్నానం ద్వారా ఒడంబడిక ప్రజలు, జ్ఞానస్నానం పొందిన క్షణం నుండి మనము దేవునికి కట్టుబడి ఉంటామని వాగ్దానం చేసాము.
●
పఠనాలలోనిర్దేశించిన
షరతులు అందరిని ప్రేమించడం మరియు ప్రార్థించడం మరియు నడవడానికి మరియు అతని ఆజ్ఞలను
పాటించండి
●
అందువల్ల ఇది
మన జీవితమంతా, వ్యక్తిగత, సామాజిక మరియు మతపరమైన విషయాలలో అన్నిటిలో వర్తిస్తుంది.
●
దేవుని షరతులు
లేని ప్రేమ మరియు దయ నుండి సమృద్ధిగా ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి.
ఈ తపస్సు
కాల సమయంలో మనం ఈ అంశానికి శ్రద్ధ చూపి మరియు
మన జీవితాన్ని పునరుద్ధరించుకొని మరియు భగవంతుని పట్ల, ఇతరుల పట్ల మరియు మన పట్ల మన
నిబద్ధతను మరోసారి నిర్దారించుకొని నడుద్దాం.
"కానీ మీరు ఎన్నుకొనబడిన
జాతి. రాచరికపు యాజక బృందం, పవిత్రమైన జనము. దేవుని సొంత ప్రజలు. దేవుని అద్భుత కార్యములు
ప్రకటింప ఏర్పడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమైన వెలుగులోనికి పిలిచెను."
- 1 పేతురు 2:9
ఉపదేశమును ఆలించువారు విజయము
చేపట్టును. ప్రభుని నమ్మువారు సుఖములు బడయును. సామెతలు 16:20