పన్నెండవ సామాన్య ఆదివారం
యిర్మియా 20: 10-13,
రోమా 5: 12-15, మత్తయి 10: 26-33
బ్రదర్. సుభాష్ ఓ.సి.డి
“క్రీస్తుని అంగీకరించిన వారిని దేవుడు అంగీకరించును”
ఈ నాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనందరిని కూడ సత్యానికి సాక్షులుగా జీవించమని తెలియ చేస్తున్నాయి. అదేవిధంగా దేవుడు తనను నమ్మినవారిని ఎన్నటికిని విడిచిపెట్టడు అని కూడ తెలియచేస్తున్నాయి.
ఈ నాటి మొదటి పఠనము యిర్మియా గ్రంధం నుండి తీసుకొనబడింది. ఈ వాక్యాలను యిర్మియా ప్రవక్త యొక్క విలాప గీతం అని కూడా అంటారు.
యిర్మియా ప్రవక్త చాల ధైర్యము కలవాడు ఎందుకంటే ప్రవక్త క్రీ. పూ 626 వ సంవత్సరం యూదా రాజ్యమును పరిపాలించిన ఐదుగురు రాజులకాలంలో వస్తారు. జోషియా, జెహోయాహాజ్, జెహోయాకీము,
జెహోయాకీను మరియు జెదేకయ్య .
కానీ పషూరు అను
యాజకుడు
యిర్మియా
ప్రవక్త
చెప్పిన
మాటలకూ
భయపడి
యిర్మియా ను భాదించుచు ప్రవక్తను చంపాలని అనుకున్న సమయంలో యిర్మియా దేవునికి మొరపెట్టుకున్నా సందర్భమే ఈనాటి మొదటి పఠనం.
దీనిని యిర్మియా ప్రవక్తయొక్క విలాప గీతం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే యిర్మియా
ప్రవక్త
దేవుని
నమ్ముకొని, ఆయన ఉన్నాడనే ధైర్యయముతో, దేవుని ఆజ్ఞ మేరకు, అన్యాయంగా పరిపాలిస్తూన్నా యూదా రాజైన జెహోయాకీమును, యాజకులను, చిత్తశుద్ధి లేని, విగ్రహారాదనలు చేస్తున్న యూదా ప్రజలను, వారి దుష్ప్రవర్తనలనూ, దేవుడిని మరిచి పోయన యూదా ప్రజలను ఖండించి, సత్యం
కోసం,
దేవునికోసం
పోరాడుతూ
తిరిగి
దేవుని
చెంతంకు
రండు
అని
భోదించాడు
అందుకు
గాను
ప్రవక్తను
తన
సొంత
ప్రజలే
చంపాలని
చిత్ర
హింసలు చేసారు.
ఆ సమయంలోనిదె ఈ మొదటి పఠనం. ఇందు లో రెండు భాగాలను మనం చూడవచ్చు.
మొదటిగ; ప్రవక్తయొక్క ఫిర్యాదు
నీవు నన్ను చెరచితివి, నేను చెడతిని ఎల్లరు నన్ను గేలి చేయుచున్నారు దినమెల్ల నన్ను చూపి నవ్వుతున్నారు.ని సందేశమును చెప్పినందుకు గాను జనుల నన్ను అవమానించి,ఎగతాళి చేయుచున్నారు అని దేవుని యందు మొరపెట్టుకుంటాడు.
రెండవ భాగము ప్రవక్తకి ఊరట ;
దేవుడు తనతోనే ఉన్నాడని తిరిగి ధైర్యమును శక్తిని పుంజుకొనెను.ఈ మొదటి పఠనం నుండి మనం గ్రహించవలసినది దేవుడు తన సేవకులకు ఎన్నటికిని విడిచిపెట్టడు;
రెండవ పఠనము
ఈ రెండవ పఠనంలో పునీత పౌలు గారు ఇద్దరు వ్యక్తులను మనకు ఉదాహరణలుగ చూపిస్తున్నారు. ఆదాము మరియు యేసు క్రీస్తు.
ఆదాము అవిధేయతవలన, పాపమూ మరియు మరణము సంభవించింది.
కానీ క్రీస్తు విధేయత వలన, ఆయన త్యాగము వలన మనకు నూతన జీవితం లేదా నిత్య జీవితం మనకు లభించింది.
అయితే పునీత పౌలు గారు మనకు ఏమని భోదించాలనుకుంటున్నారు ?
మనము కూడా ఆదాము వలన దేవుని వాక్యాన్ని లేదా దేవుని ఆజ్ఞలను పాటించక పోతే మనకు కూడా పాపము అనే మరణము సంభవిస్తుంది.
కానీ క్రీస్తుని స్వీకరించి,
క్రీస్తుని విశ్వసిస్తే మనము కూడా నూతన జీవితమును, లేదా నిత్య జీవితమును , దేవుని ఆశీర్వాదములను పొందుకుంటాం.
సువిశేషము
ఈ నాటి సువిశేషములో రెండు విషయాలను మనము గ్రహించవచ్చు
మొదటిగా. వెలుగు జీవితం
దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిచడం, ఇక్కడ వెలుగు అంటే సత్యం కోసం జీవించడం, సైతాను తిరస్కరించడం, చీకటి జీవితాన్ని త్యజించడం.
రెండవదిగా. క్రీస్తుని అంగీకరించిన వారిని, తండ్రి దేవుడు కూడా అంగీకరించును. క్రీస్తుని తృణీకరించిన వారిని తండ్రి దేవుడు కూడా తృణీకరించును.
క్రీస్తు ప్రభువు తన పన్నిద్దరు సిహ్యులను పిలిచి వేద ప్రచారానికి పంపించు సమయములో శిష్యులకు ఇచ్చినటువంటి హెచ్చరికలలోని భాగమే నాటి సువిశేషం. ఎందుకంటే యూదా ప్రజలు క్రీస్తుని తిరస్కరించారు,
హింసించారు,
వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాటలే ఈ సువిశేషం.
శరీరమును నాశనము చేయు మానవులకు భయపడవలదు. కానీ దేవునికి జీవము నిచ్చు శక్తి మరియు ఆత్మను శరీరమును నాశనము చేయు శక్తికలిగిన దేవునికి భయపడుము అని బోధిస్తున్నారు.
మొదటి పఠనములో కూడా మనము చూస్తున్నాం. యిర్మియా ప్రవక్తను ఎంత హింసించినను ఆయన వెనుకంజ వేయలేదు, లొంగలేదు.
క్రీస్తు ప్రభువు కూడా మరణానికి కూడా భయపడలేదు వీరిద్దరూ కూడా అన్యాయాన్ని ఎదురించారు, సత్యం కోసం ప్రయాసపడ్డారు, కష్టాలలో కూడా దేవుని వాక్యాన్ని భోదించారు.
మనము కూడా భయపడవలసినది న్యాయబద్ధమైన దేవునికి, అన్యాయపు మానవులకు కాదు .
సామెతలు 9 : 10 దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ణానమునకు మొదటి మెట్టు .
కీర్తనలు 130 : 2 మేము నీ పట్ల భయభక్తులు చూపుదము కనుక నీవు మమ్ము క్షమింతువు.
క్రీస్తు ప్రభువు కూడా కొన్నిసార్లు శిష్యులతో భయపడవలదు నేను మీతో ఉన్నాను అని చెప్పటం మనం చూస్తున్నాం.
శిష్యులు సముద్రంలో గాలి తుఫానుకు భయపడినప్పుడు
క్రీస్తు మరణించినతరువాత సువార్తను బోధించడానికి భయపడి దాక్కొని ఉన్న సందర్భాలలో కూడా మనం చూస్తున్నాం.
కాబట్టి ఈ మూడు పఠనాలు కూడా మనకు దేవుడు మనతోనే ఉన్నాడనే ధైర్యాన్ని ఇస్తున్నాయి. మన కుటుంభ జీవితం లేదా గురు జీవితం, సన్యాస జీవితం, దైవాంకిత జీవితంలో, వ్యాపారాలలో,
నిజాయితీగా జీవిస్తున్న సమయాలలో, అన్యాయాన్ని వ్యతిరేకించిన సందర్భాలలో,
మనం కూడా యిర్మియా ప్రవక్త వలె, క్రీస్తు వలె ధైర్యాన్ని కలిగి, దేవుడు మనతోనే ఉన్నాడు, మనలను విడిచిపెట్టడు అనే విశ్వాసంతో జీవిద్దాం.