2, సెప్టెంబర్ 2023, శనివారం

22 వ సామాన్య ఆదివారం

 

22  సామాన్య ఆదివారం

యిర్మియ 20:7-9

 రోమియులు 12:1-2

 మత్తయి 16:21-27

ఈనాటి దివ్య పఠణాలు దేవుని యొక్క శిష్యరికం గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క శిష్యులుగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి కొన్ని లక్షణాలు ఉండాలి, విధముగానయితే ప్రతి ఒక్క ఉద్యోగానికి ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలో అలాగే ఏసుప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి అంటే వారికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి అంశముల గురించే ఈనాడు పఠణాలు మనందరిని కూడా ధ్యానించమని కోరుతున్నాయి. 

ఈనాటి మొదటి పఠణంలో దేవుని యొక్క సేవకుడైన ఇర్మియ ప్రవక్త దైవ సందేశం అందించే సమయములో అనుభవించిన ఒక కష్టతరమైన సమయం గురించి తెలియజేస్తున్నాను.ఇర్మియ ప్రవక్త నీతిగా జీవిస్తూ సత్యమునకు సాక్షిగా ఉంటూ, దేవుని యొక్క సందేశమును రూడీగా ప్రకటించారు. యిర్మియ క్రీస్తుపూర్వం 650 నుండి 580 మధ్య యూదా లో ఉన్న యెరుషలేములో దేవుని యొక్క సందేశాన్ని అందజేశారు. ఇర్మియాను దేవుడు పిలిచిన సందర్భంలో నేను బాలుడను నీ సందేశమును బోధించలేను అని చెప్పిన సందర్భంలో యావే దేవుడు భయపడవలదు, నేను నీకు తోడై యుండును నీ నోటిలో నా మాటలు ఉంచుతాను అని అభయ వచనాలు చెప్పి తనకు ధైర్యం ఇచ్చి ప్రభు యొక్క సందేశమును యూదా ప్రజలకు అందచేయుటకు ఇర్మియాను యావే దేవుడు ఎన్నుకున్నారు

ఇర్మియ ప్రవక్త తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చటంలో ఏమాత్రం వెనుదీయక ప్రభువు యొక్క వాక్కును ప్రజలకు వెలుగెత్తి చాటాడు ప్రజల యొక్క పాపపు జీవితాన్ని ధైర్యముగా ఖండించారు. రాజులకు సైతం నిర్భయంగా దేవుని యొక్క మాటలను బోధించి దేవుని యొక్క ప్రణాళికలు, మార్గములు చూపించాడు. విధముగా ఇర్మియా దేవుని యొక్క పని చేసే సందర్భంలో తన సొంత ప్రజలే తనను అర్థం చేసుకోలేదు. అందుకే ఆయనను విధముగానైనా సరే హతమార్చాలి అని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇర్మియ ప్రవక్త సంఘటనలన్నీ చూసిన సందర్భంలో తన యొక్క మానవ బలహీనత వలన దేవుడు తనను విడిచిపెట్టారు అని తనకు ఇచ్చిన వాగ్దానం మరచిపోయారు అని ఒక విధమైన బాధను వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను ఎటువంటి ఆపద కలగకుండా చేస్తాను అని చెప్పిన ప్రభువు యొక్క మాటలు విశ్వసించిన

అతడికి ఒక చేదు అనుభవము ఎదురైనది అది తన సొంత ప్రజలే తనను అర్థం చేసుకోకపోవడం, దేవుని యొక్క సందేశాన్ని స్వీకరించకపోవడం మరియు తనను హతమార్చాలి అనుకోవడం ఇర్మియ ప్రవక్తను చాలా బాధపెట్టాయి అందుకనే తాను దేవుడిని అడుగుచున్నారడు నన్ను విడిచి పెట్టావా అని ఇలాంటి ఒక సమయములో తాను కూడా పరిచర్యను ఆపివేయాలనుకున్నాడు కానీ దేవుని యొక్క వాక్కుమాత్రం తన యొక్క హృదయములో అగ్ని జ్వాల  రగిలిపోతున్నది. యొక్క వాక్కు తనను ప్రశాంతముగా ఉండనీయలేదు తనకు కష్టంగాఉన్నా సరే తన ప్రజలు నిరాకరించిన సరే దేవుని యొక్క సందేశం మాత్రము ప్రకటించుట ఆపుటలేదు ఇది కేవలం దేవుని యొక్క అనుభవం మాత్రమే

కాబట్టి ఇర్మియా విధముగా అయితే దేవుని యొక్క పని చేస్తూ ఉన్నారో కష్టమైనా, నిందలు ఎదురైనా, తిరస్కరణల ఎదురైనా, బాధలు ఎదురైనా మనం కూడా అలాగే ముందుకు సాగాలి దేవుని యొక్క పనిని కొనసాగించాలి. ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు మనందరిని కూడా పరిశుద్ధ జీవితం జీవించుటకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పఠణంలో పేతురు గారు ఏసుప్రభు యొక్క సిలువ శ్రమల యొక్క పాటులను

 తృణీకరిస్తున్నారు. పోయిన వారం చదివిన సువిశేష పఠణంలో పేతురు గారిని యేసు ప్రభువు మెచ్చుకొనుట మనం చూస్తూ ఉన్నా ఎందుకంటే ఎవరు ఇవ్వనటువంటి గొప్ప సమాధానం పేతురు మాత్రమే ఇచ్చారు కాబట్టి అతడిని ఏసుప్రభు మెచ్చుకుంటున్నారు. తనమీద రాతి సంఘమును నిర్మిస్తాను అని కూడా ప్రభువు పలికారు. కానీ ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు తన యొక్క సిలువ శ్రమల గురించి చెప్పినటువంటి సందర్భంలో పేతురు గారు ఇవి మీకు సంభవింపకుండునుగాక అని దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధముగా ఆయన మాట్లాడుచున్నారు

ఏసు ప్రభు పేతురు గారితో ఛీ!పో! సైతాను అని కోప్పడుచున్నారు ఎందుకంటే పేతురు యొక్క మాటలు మెస్సయ్య యొక్క పనికి ఆటంకముగా ఉన్నవి. ఏసుప్రభువును గురించి ఇంకా శిష్యులకు ఒక పూర్తి అవగాహన రాలేదు అందుకని ఆయనను ఒక పొలిటికల్ మెస్సయ్యగానే అర్థం చేసుకుంటున్నారు రోమీయులను జయించి పాలస్తీనా ప్రజలకు విముక్తిని కలగచేస్తారు అని వారి యొక్క ఆలోచనలు అందుకని ఆయనకు ఇలాంటి మరణము సంభవించకూడదు అని పేతురు గారు ఏసుప్రభుతో సిలువ శ్రమలు మీకు సంభవింపకూడదు అని పలుకుచున్నారు. అందుకనే ఏసుప్రభు మనుష్యకుమారుడు సిలువ శ్రమలో అనుభవించకపోతే రక్షణ కలగదు అని తెలుపుచున్నారు.

చాలా సందర్భాలలో మనం కూడా పేతురు గారి వల్లే శ్రమలు మనకు వద్దు అని భావిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా సంతోషాన్ని కోరుతూ ఉంటాం. కష్టం విలువ తెలియని సంతోషం విలువ కూడా తెలియదు. గోధుమ గింజ భూమిలో పడి నశించకపోతే అది మొక్కగా ఎదగలేదు అలాగే మనం కూడా కష్టాలు అనుభవించకపోతే సంతోషం యొక్క అంతరార్థం గ్రహించలేము.

 క్రీస్తు ప్రభువు ఎవరైతే తన యొక్క నిజమైన శిష్యులుగా ఉండాలి అనుకుంటున్నారో వారు మూడు లక్షణాలు కలిగి ఉండమని చెప్పుచున్నారు.

 మొట్టమొదటిగా తనను అనుసరించేటటువంటి తమ్ముతాము పరిత్యజించుకోమంటున్నారు. పరిత్యజించుట అంటే విడిచిపెట్టుట అనగా లోక సంబంధమైన ఆశలను, కోరికలను, స్వార్థమును అధికారమును, పక్కన పెట్టేసి దేవుని చిత్తము కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించాలని ప్రభువు కోరుతున్నారు. ఏది అయితే దేవుని యొక్క పనికి ఆటంకం గా ఉంటుందో దానిని మనము విడిచిపెట్టటకు సిద్ధపడాలి కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి తల్లిదండ్రుల ప్రీతి కావచ్చు స్నేహితుల ప్రీతి కావచ్చు బంధుమిత్ర కావచ్చు అధికార ప్రతి కావచ్చు వీటన్నిటిని కూడా విడిచిపెట్టినప్పుడే క్రీస్తు ప్రభువుని వెంబడించగలం.

రెండవదిగా తనను అనుసరించే శిష్యులు సిలువను ఎత్తుకొని రమ్మంటున్నారు. సిలువ క్రైస్తవ జీవితంలో శ్రమలకు, అవమానాలకు గుర్తు రక్షణకు గుర్తు, నిందలకు గుర్తు, ఏసుప్రభువుని వెంబడించే వారందరు కూడా సిలువను ఎత్తుకొని రమ్మంటున్నారు అంటే ఎవరు కూడా తమ యొక్క బాధలను అవమానాలను కష్టాలను విడిచిపెట్టకుండా వాటన్నిటినీ చేకొని ప్రభువుని వెంబడించమని కోరుతున్నారు

అనేక సందర్భాలలో మన జీవితంలో సిలువను వదిలి వేస్తుంటాం కానీ క్రీస్తు ప్రభువు తన శిలువను ఎత్తుకొని మనందరి పాపాలు మోస్తూ కల్వరి కొండమీద తన ప్రాణములను త్యాగం చేసి మనకు రక్షణ ప్రసాదించి ఉన్నారు. అదే విధముగా ప్రతి ఒక్కరు కూడా సిలువను ఎత్తుకొని క్రీస్తు ప్రభువుని వెంబడించాలి కొన్నిసార్లు సిలువ భారం కష్టముగా ఉండవచ్చు అయినప్పటికీ కూడా దేవుని యొక్క సహాయంతో దానిని మోయాలి.

మూడవదిగా క్రీస్తు ప్రభువు యొక్క శిష్యులకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఆయనను అనుసరించుట. అనుసరించుట అంటే కేవలం మనకు నచ్చినది మాత్రమే పాటించుట కాదు యేసు క్రీస్తు ప్రభువు తన జీవితములో ఏది అయితే పాటించి జీవించి ఉన్నారు అదేవిధంగా మన జీవితంలో కూడా ఆయన మార్గములో నడుస్తూ ఆయన బోధించిన అంశములను పాటిస్తూ మనము ఒక ఆదర్శవంతమైన జీవితము జీవించాలి. ఏసుప్రభుని అనుసరించేటప్పుడు మనకు శోధనలు ఎదురవుతూ ఉంటాయి కానీ వాటన్నిటిని ఎదుర్కొని ప్రభువుని వెంబడించాలి.

అదే విధముగా ఈనాటి సువిశేషంలో యేసుప్రభు ఎవరైతే తన ప్రాణములను కాపాడుకోవాలని అనుకుంటున్నారో వారు దానిని కోల్పోతారంటున్నారు కానీ తన కొరకు ప్రాణములను సమర్పించేవారు దానిని పొందుతారని పలుకుచున్నారు అంటే విశ్వాస పరముగా ఎటువంటి భయము కూడా లేకుండా దేవుని కొరకు జీవించేవారు ఆయనలో ఎల్లప్పుడూ కూడా జీవిస్తూనే ఉంటారని తెలియచేస్తున్నారు. కొన్నిసార్లు కొంతమంది తమ యొక్క స్వార్థం కోసం విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి సైతం సిద్ధంగా ఉంటారు వారికి ప్రభువు చెప్పేది ఏమిటంటే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు కాబట్టి వారి జీవితమును కోల్పోతారు, దేవుని యొక్క కనికరమును కోల్పోతారు అని తెలుపుచున్నారు. ఈరోజు ప్రభువు మనందరినీ కూడా పఠణాల ద్వారా ఆహ్వానిస్తూ నేర్చుకోమని పలికేటటువంటి అంశములు ఏమిటంటే మన విశ్వాస జీవితంలో దేవునికి సాక్షియ జీవించే తరుణంలో కష్టాలు బాధలు అనుభవించవచ్చు సందర్భంలో దేవుడిని విడిచిపెట్టకుండా నిందించకుండా ప్రభువుని అనుసరించాలి. ఉత్తమ శిష్యులుగా జీవించాలి.

Fr. Bala Yesu OCD

22 వ సామాన్య ఆదివారం

22  వ సామాన్య ఆదివారం
 12:1-2, మత్తయి 16:21-27
ఈనాటి దివ్య పఠణాలు దేవుని యొక్క శిష్యరికం గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క శిష్యులుగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి కొన్ని లక్షణాలు ఉండాలి, ఏ విధముగానయితే ప్రతి ఒక్క ఉద్యోగానికి ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలో అలాగే ఏసుప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి అంటే వారికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి ఆ అంశముల గురించే ఈనాడు పఠణాలు మనందరిని కూడా ధ్యానించమని కోరుతున్నాయి.  
ఈనాటి మొదటి పఠణంలో దేవుని యొక్క సేవకుడైన ఇర్మియ ప్రవక్త దైవ సందేశం అందించే సమయములో అనుభవించిన ఒక కష్టతరమైన సమయం గురించి తెలియజేస్తున్నాను.ఇర్మియ ప్రవక్త నీతిగా జీవిస్తూ సత్యమునకు సాక్షిగా ఉంటూ, దేవుని యొక్క సందేశమును రూడీగా ప్రకటించారు. యిర్మియ క్రీస్తుపూర్వం 650 నుండి 580 మధ్య యూదా లో ఉన్న యెరుషలేములో దేవుని యొక్క సందేశాన్ని అందజేశారు. ఇర్మియాను దేవుడు పిలిచిన సందర్భంలో నేను బాలుడను నీ సందేశమును బోధించలేను అని చెప్పిన సందర్భంలో యావే దేవుడు భయపడవలదు, నేను నీకు తోడై యుండును నీ నోటిలో నా మాటలు ఉంచుతాను అని అభయ వచనాలు చెప్పి తనకు ధైర్యం ఇచ్చి ప్రభు యొక్క సందేశమును యూదా ప్రజలకు అందచేయుటకు ఇర్మియాను యావే దేవుడు ఎన్నుకున్నారు. ఇర్మియ ప్రవక్త తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చటంలో ఏమాత్రం వెనుదీయక ప్రభువు యొక్క వాక్కును ప్రజలకు వెలుగెత్తి చాటాడు ప్రజల యొక్క పాపపు జీవితాన్ని ధైర్యముగా ఖండించారు. రాజులకు సైతం నిర్భయంగా దేవుని యొక్క మాటలను బోధించి దేవుని యొక్క ప్రణాళికలు, మార్గములు చూపించాడు. ఈ విధముగా ఇర్మియా దేవుని యొక్క పని చేసే సందర్భంలో తన సొంత ప్రజలే తనను అర్థం చేసుకోలేదు. అందుకే ఆయనను ఏ విధముగానైనా సరే హతమార్చాలి అని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇర్మియ ప్రవక్త ఈ సంఘటనలన్నీ చూసిన సందర్భంలో తన యొక్క మానవ బలహీనత వలన దేవుడు తనను విడిచిపెట్టారు అని తనకు ఇచ్చిన వాగ్దానం మరచిపోయారు అని ఒక విధమైన బాధను వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను ఎటువంటి ఆపద కలగకుండా చేస్తాను అని చెప్పిన ప్రభువు యొక్క మాటలు విశ్వసించిన 
అతడికి ఒక చేదు అనుభవము ఎదురైనది అది తన సొంత ప్రజలే తనను అర్థం చేసుకోకపోవడం, దేవుని యొక్క సందేశాన్ని స్వీకరించకపోవడం మరియు తనను హతమార్చాలి అనుకోవడం ఇర్మియ ప్రవక్తను చాలా బాధపెట్టాయి అందుకనే తాను దేవుడిని అడుగుచున్నారడు నన్ను విడిచి పెట్టావా అని ఇలాంటి ఒక సమయములో తాను కూడా పరిచర్యను ఆపివేయాలనుకున్నాడు కానీ దేవుని యొక్క వాక్కుమాత్రం తన యొక్క హృదయములో అగ్ని జ్వాల  రగిలిపోతున్నది. ఆ యొక్క వాక్కు తనను ప్రశాంతముగా ఉండనీయలేదు తనకు కష్టంగాఉన్నా సరే తన ప్రజలు నిరాకరించిన సరే దేవుని యొక్క సందేశం మాత్రము ప్రకటించుట ఆపుటలేదు ఇది కేవలం దేవుని యొక్క అనుభవం మాత్రమే. కాబట్టి ఇర్మియా ఏ విధముగా అయితే దేవుని యొక్క పని చేస్తూ ఉన్నారో కష్టమైనా, నిందలు ఎదురైనా, తిరస్కరణల ఎదురైనా, బాధలు ఎదురైనా మనం కూడా అలాగే ముందుకు సాగాలి దేవుని యొక్క పనిని కొనసాగించాలి. ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు మనందరిని కూడా పరిశుద్ధ జీవితం జీవించుటకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పఠణంలో పేతురు గారు ఏసుప్రభు యొక్క సిలువ శ్రమల యొక్క పాటులను
 తృణీకరిస్తున్నారు. పోయిన వారం చదివిన సువిశేష పఠణంలో పేతురు గారిని యేసు ప్రభువు మెచ్చుకొనుట మనం చూస్తూ ఉన్నా ఎందుకంటే ఎవరు ఇవ్వనటువంటి గొప్ప సమాధానం పేతురు మాత్రమే ఇచ్చారు కాబట్టి అతడిని ఏసుప్రభు మెచ్చుకుంటున్నారు. తనమీద రాతి సంఘమును నిర్మిస్తాను అని కూడా ప్రభువు పలికారు. కానీ ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు తన యొక్క సిలువ శ్రమల గురించి చెప్పినటువంటి సందర్భంలో పేతురు గారు ఇవి మీకు సంభవింపకుండునుగాక అని దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధముగా ఆయన మాట్లాడుచున్నారు. ఏసు ప్రభు పేతురు గారితో ఛీ!పో! సైతాను అని కోప్పడుచున్నారు ఎందుకంటే పేతురు యొక్క మాటలు మెస్సయ్య యొక్క పనికి ఆటంకముగా ఉన్నవి. ఏసుప్రభువును గురించి ఇంకా శిష్యులకు ఒక పూర్తి అవగాహన రాలేదు అందుకని ఆయనను ఒక పొలిటికల్ మెస్సయ్యగానే అర్థం చేసుకుంటున్నారు రోమీయులను జయించి పాలస్తీనా ప్రజలకు విముక్తిని కలగచేస్తారు అని వారి యొక్క ఆలోచనలు అందుకని ఆయనకు ఇలాంటి మరణము సంభవించకూడదు అని పేతురు గారు ఏసుప్రభుతో సిలువ శ్రమలు మీకు సంభవింపకూడదు అని పలుకుచున్నారు. అందుకనే ఏసుప్రభు మనుష్యకుమారుడు సిలువ శ్రమలో అనుభవించకపోతే రక్షణ కలగదు అని తెలుపుచున్నారు. 
చాలా సందర్భాలలో మనం కూడా పేతురు గారి వల్లే శ్రమలు మనకు వద్దు అని భావిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా సంతోషాన్ని కోరుతూ ఉంటాం. కష్టం విలువ తెలియని సంతోషం విలువ కూడా తెలియదు. గోధుమ గింజ భూమిలో పడి నశించకపోతే అది మొక్కగా ఎదగలేదు అలాగే మనం కూడా కష్టాలు అనుభవించకపోతే సంతోషం యొక్క అంతరార్థం గ్రహించలేము. 
 క్రీస్తు ప్రభువు ఎవరైతే తన యొక్క నిజమైన శిష్యులుగా ఉండాలి అనుకుంటున్నారో వారు మూడు లక్షణాలు కలిగి ఉండమని చెప్పుచున్నారు.
 మొట్టమొదటిగా తనను అనుసరించేటటువంటి తమ్ముతాము పరిత్యజించుకోమంటున్నారు. పరిత్యజించుట అంటే విడిచిపెట్టుట అనగా ఈ లోక సంబంధమైన ఆశలను, కోరికలను, స్వార్థమును అధికారమును, పక్కన పెట్టేసి దేవుని చిత్తము కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించాలని ప్రభువు కోరుతున్నారు. ఏది అయితే దేవుని యొక్క పనికి ఆటంకం గా ఉంటుందో దానిని మనము విడిచిపెట్టటకు సిద్ధపడాలి కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి తల్లిదండ్రుల ప్రీతి కావచ్చు స్నేహితుల ప్రీతి కావచ్చు బంధుమిత్ర కావచ్చు అధికార ప్రతి కావచ్చు వీటన్నిటిని కూడా విడిచిపెట్టినప్పుడే క్రీస్తు ప్రభువుని వెంబడించగలం.
రెండవదిగా తనను అనుసరించే శిష్యులు సిలువను ఎత్తుకొని రమ్మంటున్నారు. సిలువ క్రైస్తవ జీవితంలో శ్రమలకు, అవమానాలకు గుర్తు రక్షణకు గుర్తు, నిందలకు గుర్తు, ఏసుప్రభువుని వెంబడించే వారందరు కూడా సిలువను ఎత్తుకొని రమ్మంటున్నారు అంటే ఎవరు కూడా తమ యొక్క బాధలను అవమానాలను కష్టాలను విడిచిపెట్టకుండా వాటన్నిటినీ చేకొని ప్రభువుని వెంబడించమని కోరుతున్నారు. అనేక సందర్భాలలో మన జీవితంలో సిలువను వదిలి వేస్తుంటాం కానీ క్రీస్తు ప్రభువు తన శిలువను ఎత్తుకొని మనందరి పాపాలు మోస్తూ ఆ కల్వరి కొండమీద తన ప్రాణములను త్యాగం చేసి మనకు రక్షణ ప్రసాదించి ఉన్నారు. అదే విధముగా ప్రతి ఒక్కరు కూడా సిలువను ఎత్తుకొని క్రీస్తు ప్రభువుని వెంబడించాలి కొన్నిసార్లు సిలువ భారం కష్టముగా ఉండవచ్చు అయినప్పటికీ కూడా దేవుని యొక్క సహాయంతో దానిని మోయాలి. 
మూడవదిగా క్రీస్తు ప్రభువు యొక్క శిష్యులకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఆయనను అనుసరించుట. అనుసరించుట అంటే కేవలం మనకు నచ్చినది మాత్రమే పాటించుట కాదు యేసు క్రీస్తు ప్రభువు తన జీవితములో ఏది అయితే పాటించి జీవించి ఉన్నారు అదేవిధంగా మన జీవితంలో కూడా ఆయన మార్గములో నడుస్తూ ఆయన బోధించిన అంశములను పాటిస్తూ మనము ఒక ఆదర్శవంతమైన జీవితము జీవించాలి. ఏసుప్రభుని అనుసరించేటప్పుడు మనకు శోధనలు ఎదురవుతూ ఉంటాయి కానీ వాటన్నిటిని ఎదుర్కొని ప్రభువుని వెంబడించాలి.అదే విధముగా ఈనాటి సువిశేషంలో యేసుప్రభు ఎవరైతే తన ప్రాణములను కాపాడుకోవాలని అనుకుంటున్నారో వారు దానిని కోల్పోతారంటున్నారు కానీ తన కొరకు ప్రాణములను సమర్పించేవారు దానిని పొందుతారని పలుకుచున్నారు అంటే విశ్వాస పరముగా ఎటువంటి భయము కూడా లేకుండా దేవుని కొరకు జీవించేవారు ఆయనలో ఎల్లప్పుడూ కూడా జీవిస్తూనే ఉంటారని తెలియచేస్తున్నారు. కొన్నిసార్లు కొంతమంది తమ యొక్క స్వార్థం కోసం విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి సైతం సిద్ధంగా ఉంటారు వారికి ప్రభువు చెప్పేది ఏమిటంటే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు కాబట్టి వారి జీవితమును కోల్పోతారు, దేవుని యొక్క కనికరమును కోల్పోతారు అని తెలుపుచున్నారు. ఈరోజు ప్రభువు మనందరినీ కూడా ఈ పఠణాల ద్వారా ఆహ్వానిస్తూ నేర్చుకోమని పలికేటటువంటి అంశములు ఏమిటంటే మన విశ్వాస జీవితంలో దేవునికి సాక్షియ జీవించే తరుణంలో కష్టాలు బాధలు అనుభవించవచ్చు ఆ సందర్భంలో దేవుడిని విడిచిపెట్టకుండా నిందించకుండా ప్రభువుని అనుసరించాలి. ఉత్తమ శిష్యులుగా జీవించాలి.
Fr. Bala Yesu OCD

26, ఆగస్టు 2023, శనివారం

21వ సామాన్య ఆదివారం

21 వ సామాన్య ఆదివారం
యెషయ 22:19-23, రోమియులు 11:33-36, మత్తయి 16:16-20
ఈనాటి దివ్య పఠణాలు అధికారం గురించి బోధిస్తున్నాయి. మానవాళికి దేవుడు అధికారం ఇచ్చినది సరైనటువంటి పాలన చేస్తూ అందరిని కూడా దేవుని వలే సన్మార్గంలో నడిపించాలి అని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చి ఉన్నారు. దేవుడు తన అధికారాన్ని తన దగ్గరే వుంచుకొనకుండా మానవాళితో పంచుకుంటున్నారు. ఒక విధముగా చెప్పాలి అంటే ఈ ఆదివారాన్ని అధికార ఆదివారం అని పిలవవచ్చు ఎందుకంటే మూడు పఠణాలు కూడా ఇదే అంశము గురించి ఈ ప్రస్తావిస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠణంలో దేవుడు అవిశ్వాసులు, స్వార్ధపరులైన అధికారుల పట్ల నిరుత్సాహపడినటువంటి రీతిని, శిక్షించిన రీతిని మనం యెషయా గ్రంథం ద్వారా చదువుకుంటున్నాము. ఎవరైతే తమ అధికారాన్ని స్వార్ధం కోసం వినియోగించుకుంటారో వారిని దేవుడు తమ యొక్క అధికారాన్ని నుండి తొలగిస్తారు. ఈనాటి మొదటి పఠణంలో తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్న ప్రధానమంత్రి షెబ్నా యొక్క జీవిత పరిణామం గురించి, ఆయన్ను దేవుడు శిక్షించిన రీతిని గురించి వింటూ ఉన్నాం . క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దంలో షెబ్నా హెజెకియా రాజు వద్ద గృహ నిర్వాహకుడుగా నియమింపబడ్డాడు. ఆ కాలంలో అస్సిరియా రాజ్యం యూదాపై యుద్ధం చేయటానికి వచ్చే సందర్భంలో హెజెకియా రాజు భయపడుతున్నాడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు ఐగుప్తు రాజ్యం యొక్క సహాయం కోరమని రాజును కోరారు ఆ యొక్క మాటలకు ప్రధానమంత్రి అయిన షెబ్నా ఎక్కువ ప్రోత్సాహాన్ని అందజేశాడు. నిజ దేవుడైన ఈ యావే మీద ఆధారపడి దేవుని సహాయమును కోరమని యెషయా ప్రవక్త తెలియచేశారు. యెషయా అన్య రాజ్యముల మీద ఆధారపడకుండా, వారి సైనిక బలం మీద నమ్మకం ఉంచవద్దని  ముందుగానే హెచ్చరించారు అయినప్పటికీ షెబ్నా గర్వంతో దేవుని యొక్క మాట వినకుండా అన్య రాజుల మీద ఆధారపడాలని కోరుకున్నాడు హెజెకియా రాజును దాని కొరకు ప్రోత్సహించాడు. దేవుని యొక్క మాటను ధిక్కరించి గర్వంతో, అవిశ్వాసిగా జీవించిన షెబ్నాను దేవుడు తన యొక్క అధికారం నుండి తొలగిస్తున్నారు. అదే విధముగా షెబ్నా తనకున్నటువంటి ధనంతో అధికారంతో యెరుషలేము లోనే ఒక మంచి సమాధిని తన కొరకై నిర్మించుకున్నాడు తన మరణించిన తర్వాత దానిలో పాతి పెట్ట పడటానికి కానీ ఆయన తన యొక్క దనమను, అధికారాన్ని దుర్వినియోగం చేసుకొనుట ద్వారా దేవుడు తనని శిక్షిస్తున్న ఆయన బానిసత్వం లోనే చనిపోతున్నారు. దేవునికి విధేయత చూపించకుండా గర్వంతో అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి షెబ్నా నుండి అధికారం తొలగించి హిల్కియా కుమారుడు ఎలియాకీము కు అధికారమును ఇస్తున్నారు. షెబ్నా దేవుని మార్గములకు దూరంగా ఉంటే ఎల్యా కీమా మాత్రం దేవునికి దగ్గరగా ఉన్నారు. ఆయనకు విధేయత చూపించారు, దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభువు ఈ విధంగా పలకు చున్నారు నీ అధికార వస్త్రములను నీ నడికట్టును అతనికి కట్టుబెట్టుదును, నీ అధికారమును అతనికి అప్పగించును అలాగే దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద దాల్చినట్లు చేయుదును (21,22(. షెబ్నా యొక్క పూర్తి బాధ్యతలన్నిటిని దేవుడు ఎలియాకీముకు ఇస్తున్నారు. తాళపు చెవి అధికారాన్ని సూచిస్తూ ఉన్నది. ఎందుకంటే దేవుడే స్వయముగా పేతురు గారికి పరలోకపు తాళంలను అప్పజెప్పి అధికారాన్నిస్తున్నారు. ఒక విచారణ గురువు ఇంకొక విచారణకు బదిలీ అయి వెళ్లేటప్పుడు కొత్తగా వచ్చిన విచారణ గురువుకు ఆయన అప్ప చెప్పేది దివ్య మందసము యొక్క తాళపు చెవి. ఆ తాళపు చెవి తన యొక్క విచారణ బాధ్యతలను అధికారాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ మొదటి పఠణంలో మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే దేవుడు మనకు ప్రసాదించిన అధికారమును మనము మంచి కొరకై వినియోగించుకోవాలి అంతేకానీ దుర్వినియోగం చేసుకోకూడదు స్వార్థంగా జీవించకూడదు. పవిత్ర గ్రంథంలో చాలామంది తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు దాని ప్రతిఫలంగా దేవుని యొక్క శిక్షణ పొందుతున్నారు.
- సౌలును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా చేశారు కానీ తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. దేవుడు అతడిని తన పదవి నుండి తొలగిస్తున్నారు.
- సొలోమోనుకు దేవుడు ఎవరికి ఇవ్వనటువంటి జ్ఞానమిచ్చారు కానీ ఆయన కూడా తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని అనేకమంది అన్యులను వివాహమాడి తన దేశములోనికి అన్య  దేవుళ్ళను ఆహ్వానించారు దాని ప్రతిఫలంగా దేవుడి నుండి దూరమయ్యారు.
-ఆహాబును దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నుకున్నారు కానీ ఆయన యెసబేలు రాణి వివాహమాడి తన రాజ్యంలో బాలుదేవతలను ఆరాధించుట ప్రారంభించారు దాని ప్రతిఫలంగా దేవుని యొక్క కోపమును, శిక్షను పొందుకున్నాడు.
-హామానుకు దేవుడు అధికారము కానీ అతడు హెబ్రీయులను హతమార్చాలనుకున్నాడు కానీ ఆయనే చనిపోయాడు.
-యూదా ఇస్కారియతకు దేవుడు అధికారం ఇచ్చారు కానీ ఆయన తన ధనమును దుర్వినియోగం చేసుకొని దేవుడిని అప్పగించాడు దాని ప్రతిఫలంగా ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ విధంగా చాలామంది పవిత్ర గ్రంథంలో దేవుడు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోకుండా తమ స్వార్థం కోసం దానిని వినియోగించి దేవుని శిక్షకు పాత్రులగు చున్నారు. అధికారమివ్వబడినది మంచి కోసం. కాబట్టి వినయం కలిగి మంచిని చేస్తూ జీవించాలి.
ఈనాటి రెండవ పఠణంలో పౌలు గారు దేవుని యొక్క వివేకం గురించి గొప్పగా చెప్తున్నారు ఎందుకంటే దేవుడు అన్యుల ద్వారా కొంతమంది యూదులు మారే విధముగా చేశారు. పౌలు గారి యొక్క సువార్త పరిచర్య ద్వారా అనేకమంది యొక్క రక్షణకు దేవుడు కారకుడయ్యారు అందుకని దేవుని యొక్క మనసు ఎవరికి తెలుసు దేవుని యొక్క వివేకం చాలా గొప్పది ఆయన అందరి యొక్క రక్షణకు పాత్రుడు అని పౌలు గారు దేవుని యొక్క గొప్పతనం గురించి ఈనాటి రెండవ పఠణంలో తెలియచేస్తున్నారు.
ఈనాటి సువిశేష భాగంలో యేసు ప్రభు శిష్యులను ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు అది ఏమిటంటే ప్రజలు నా గురించి ఏమని భావిస్తున్నారు అని. ఎందుకు ఏసుప్రభు తన గురించి ఏమని అనుకుంటున్నారు అంటే ఆయన ఉన్నటువంటి ప్రదేశం కైసరియా ఫిలిప్పీ ఆ ప్రాంతం రాజకీయపరంగా పేరు ప్రసిద్ధిగాంచినది అక్కడే సీజర్,  సీజర్ ఆగస్టస్ ఇంకా చాలా మంది రాజకీయపరంగా ప్రసిద్ధిగాంచారు అలాగే ఏసుప్రభు యొక్క పుణ్యకార్యాలు చూసినటువంటి ప్రజలు కూడా ఆయనను పొలిటికల్(రాజకీయ) మెస్సేయగానే చూశారు కానీ రక్షకునిగా గ్రహించలేకపోయారు అందుకే ఏసుప్రభు ప్రజలు నన్ను ఏమని భావిస్తున్నారు అని అడుగుతున్నారు అయితే శిష్యులు వివిధ రకాలైనటువంటి సమాధానములు ఇస్తున్నారు. -కొందరు బప్తిస్మ యెహను  అంటున్నారు, ఎందుకంటే బప్తిస్మ యోహానును అన్యాయంగా శిక్షించారు ఆయన  ఎటువంటి పాపం చేయకుండా దేవుడికి విధేయుడై జీవించారు కాబట్టి ఒకవేళ ఆయన మరలా వచ్చి ఉండవచ్చని కొంతమంది యొక్క అభిప్రాయం.
- కొందరు ఏలియా అంటున్నారు ఎందుకంటే ఆయన ప్రవక్తల అందరిలో గొప్ప ప్రవక్త అలాగే మెస్సయ్య కన్నా ముందుగా వస్తాడు అని ఏలియా ముందుగానే చెప్పారు కాబట్టి  కొందరూఏలియా అనుకుంటున్నారు మలాకి 4:5. -కొంతమంది యిర్మీయా అని మరికొందరు యెషయా అని అనుకుంటున్నారు ఎందుకంటే దేవుడు ఇర్మియాను అలాగే యెషయాను సహాయం చేయుటకు పంపిస్తానని తెలియజేస్తున్నారు. అదే విధంగా కొంతమంది ప్రవక్తలలో ఒకరిని భావిస్తున్నారు ఎందుకంటే ఏసుప్రభు యొక్క పరిచర్య కూడా ధైర్యంగా అన్యాయమును ఎదిరించే విధముగా, ప్రజల కొరకు నిలబడే విధంగా ఉన్నది. కాబట్టి ప్రవక్తలలో ఒకరు అని భావిస్తున్నారు ఇది ప్రజల యొక్క అభిప్రాయం అయితే ఏసుప్రభు తన శిష్యులను కూడా అడుగుతూ ఉన్నారు మీరు నన్నే మని భావించుచున్నారు అందుకు పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానం ఇస్తున్నారు ఇది వ్యక్తిగతమైన సమాధానం. పేతురు గారు దేవుని యొక్క ప్రేరణ వలన ఈ సమాధానమిచ్చారు అలాగే పేతురు తన యొక్క వ్యక్తిగత అనుభవమును బట్టి కూడా ఈ సమాధానము చెప్పి ఉండవచ్చు ఎందుకంటే ఆయన జీవితంలో యేసు ప్రభువుతో పనిచేసిన సందర్భంలో అనేక రకములైన అద్భుత కార్యములు, ఎవరూ చేయనటువంటి గొప్ప కార్యములు తన యొక్క కనులారా తాను స్వయంగా చూసి ఉన్నారు కాబట్టి ఇంతటి మహత్తర కార్యములు చేసేది కేవలం దేవుడి అని ఆయన విశ్వసించి ఉన్నారు అందుకని నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన మెస్సయ్య అని అందరికంటే ముందుగా సమాధానమిస్తున్నారు. పేతురు గారిని ఈ సమయంలో ఏసుప్రభు మెచ్చుకుంటూ తనమీద తన యొక్క సంఘమును నిర్మిస్తానని తెలియజేస్తున్నారు ప్రభువు పలికిన విధంగానే పేతురు యొక్క సమాధి మీద తిరుసభ నిర్మించబడినది.(Vatican St. Peter's Basilica). పేతురు గారికి ప్రభువు పరలోకపు తాళపు చెవులను అప్పగిస్తున్నారు అంటే పేతురు గారికి నాయకత్వ బాధ్యతలను అప్పజెప్తున్నారు. పేతురు గారు తన యొక్క బాధ్యతలను అన్నియు కూడా సక్రమముగా నెరవేర్చి దేవునికి విధేయత చూపించారు కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుడు మనకు ఇచ్చిన అధికారమును ఏ విధముగా మనందరం సద్వినియోగం చేసుకుంటున్నాం అని ధ్యానించుకోవాలి 
ఒక తల్లిగా బాధ్యతలు ఇవ్వబడ్డాయి, తండ్రిగ, గురువుగా ఉపాధ్యాయునిగా అనేక విధాలుగా మనకు బాధ్యతలు ఇవ్వబడ్డాయి వాటిని ఏ విధంగా నెరవేరుస్తున్నాం. కేవలము దేవుని యొక్క అనుభూతి ద్వారానే మనందరం ప్రభువు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలం దానికి నిదర్శనం పునీత పేతురు గారి యొక్క జీవితం కాబట్టి వ్యక్తిగతంగా దేవుని యొక్క అనుభూతి పొందుతూ మంచిని చేస్తూ దేవుడికి ఇష్టకరమైన జీవితం జీవించుదాం.
Fr. Bala Yesu OCD

 

21వ సామాన్యఆదివారం

మొదటి పఠనం: యెషయా 22:15, 19-23

రెండొవ పఠనం: రోమియులు 11:33-36

సువార్త: మత్తయి 16:13-20

 

 

క్రీస్తునాధునియందు ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా ఈనాడు మనమందరం  కూడా సామాన్యకాలపు 21  ఆదివారంలోనికి ప్రవెశించియున్నాం. ఈనాటి మూడు దివ్యగ్రంధ  పఠనాలను మనం ధ్యానించినట్లైతే  మూడు పఠనాలు మనకు తెలియజేసే అంశం ఏమిటంటే. దేవుడు మనకు ఇచ్చిన అధికారాన్ని విశ్వాసంతో పాటించినట్లయితే మన జీవితాలలో గొప్ప అద్భుతాలు జరుగుతాయని ఈ మూడు పఠనాలు మనకందరికీ తెలియజేస్తున్నాయి. ఆలా కాకుండా దేవునికి వ్యతిరేకంగా లేక ఇష్టానుసారంగా జీవించినట్లైతే షబ్న వాలే మన మందరము కూడా దేవుని యొక్క దండనకు గురి అవుతామని చెబుతున్నాయి.

నేటి సమాజంలో మనం చూస్తుంటాము అనేక మంది ఉన్నత అదికారాలలో ఉన్నపుడు వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయాలలో వారి జీవితంలో  మనశాంతి లేకుండా పోతుంది  దానికి కారణం వారు దేవునికి విధేయులై జీవించకపోవటం. క్రైస్తవులమైన మన జీవితాలలో కూడా అంతే, ఎందుకంటే మనం దేవునికి ఇస్తానుసారంగా జీవిస్తే మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి ఆలా కాకుండా దేవునికి వెతిరేకంగా జీవిస్తే కష్టాలు తప్పవు. దీనికి ఉదాహరణ  మనం ఈ మొదటి పఠనములో చూస్తున్నాము.

యెషయా గ్రంధంలో, యెషయా ప్రవక్తగా ఎన్నిక చేయబడిన రోజులలో షబ్న అనే అధికారి దేవునికి వెతిరేకంగా జీవిస్తున్నపుడు దేవుడు యెషయా ప్రవక్తను అతని యొద్దకు పంపిస్తూ తన అధికారం నుండి తనని తొలగించి ఎల్యాకీమును అతని స్థానములో రాజు యొక్క భవనంలో అధికారిగా చేయటం చూస్తున్నాము.అసలు దేవుడు షబ్నను ఎందుకు అధికారంలోనుండి తీసివేస్తునాడో ఇప్పుడు మనమందరము కూడా ఈ మొదటి పఠనములో చూద్దాము. షబ్న హిజ్కియా రాజు పరిపాలన కాలంలో షబ్న ఒక ఉన్నత అధికారిగా నియమింపబడ్డాడు.

రాజా భవనంలో ఒక అధికారి అంటే ఆటను రాజు తరవాత రాజు వంటి వాడు. అట్టి స్థానాన్ని పొందిన షబ్న, ఒక నాడు అసిరియా రాజు యూదా రాజ్యంపై దండెత్తి వస్తున్న సమయంలో హిజ్కియా రాజు యెషయా ప్రవక్తను పిలిచి యుధం గురించి అడిగినప్పుడు యెషయా ప్రవక్త చెబుతున్నాడు మీరు దేవునిపై ఆధారపడి, దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు బయలుదేరండి అంత మీకు మంచి జరుగును అని చెప్పినప్పుడు, షబ్న ప్రవక్తకు మరియు దేవునికి వెతిరేకంగా వెళుతూవున్నాడు అదేమిటంటే దేవునిపై ఆధారపడకుండా ఐగుప్త  రాజునూ సహాయమాడగమని చెబుతూ హిజ్కియా రాజును తప్పు దారిలో నడిపిస్తున్నాడు అందుకే దేవుడు షబ్నను తన అధికారంనుండి తొలగించి, ఆ అధికారాన్ని ఎల్యాకీముకు యిచ్చియున్నాడు.

ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే మనము కూడా మన జీవితంలో దేవునికి వెతిరేకంగా జీవిస్తూ ఉంటె మన జీవితాలలో కూడా కష్టాలు వస్తాయని మొదటి పఠనం తెలియజేస్తుంది. దేవుడు వివేకమంతుడు, విజ్ఞానవంతుడు కాబట్టి ఆయనయందు ఎవరైతే విశ్వాసంతో జీవిస్తారో అతి వారు దేవుని యొక్క బిడ్డలుగా ఎన్నుకోబడతారని తెలియజేస్తుంది.ఇక్కడ మనం అప్పుడైతే దేవుడు ఇచ్చిన మార్గంలో జీవిస్తామో దేవుడు మనలందరినీ నూరంతలాగా దివిస్తాడని రెండొవ పఠనము మనకు తెలియజేస్తుంది.

చివరిగా సువిశేష పతనాన్ని మనం ధ్యానించినట్లతే క్రీస్తు ప్రభు శిస్యులను అడుగుచున్నాడు, అదేమిటంటే మీరు నన్ను గూర్చి ఏమి అనుకొనుచున్నారు అని. అప్పుడు సీమోను పేతురు ప్రభువుతో అంటున్నారు నీవు సజీవ దేవునియొక్క కుమారుడని. ఇక్కడ మన గమనించాలి ఏవిధంగానైతే క్రీస్తు ప్రభు శిస్యులను అడిగాడో అదేవిధంగా ఈ రోజు నిన్ను నన్ను క్రీస్తుప్రభు అడుగుచున్నారు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని. మరి మన సంధానం ఏమిటి పేతురు వాలే ఉందా లేదా అని మనలను మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే పేతురు క్రీస్తు ప్రభును దేవునిగా అంగికరించి క్రీస్తుపై విశ్వాసం ఉంచి జీవించాడు కాబ్బటి, క్రీస్తు ప్రభు తన అధికారాన్ని పేతురుకు అప్పజెబుతునాడు. మరి అధికారం ఏమిటని మనం ఛుసినట్లతే ఎవిధంగానైతే తండ్రి దేవుడు షెబ్నా యొక్క అధికారాన్ని ఎల్యాకీముకు ఇచ్చాడో  అదే విధంగా క్రీస్తు ప్రభు పరలోక రాజ్యపు యొక్క తాళాలను పేతురు చేతికి ఇస్తున్నాడు.

కాబట్టి క్రిస్తునాధునియందు ప్రియా సహోదయులారా ఈ రోజు మనమందరము కూడా ప్రార్ధించుకుందాం ఎటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని. పేతురు వాలే విశ్వాసం కలిగి ఎల్యాకీము వాలే ఉన్నత అధికారాన్ని అందుకుంటున్నానా లేక షబ్న వాలే అవిశ్వాసంతో జీవిస్తున్నానా అని. మనలను మనం ప్రశ్నించుకుంటూ ఈ యొక్క పూజ బలిలో పాల్గొందము.

 

Dn. Johannes VeeraPogu OCD

19, ఆగస్టు 2023, శనివారం

20 వ సామాన్య ఆదివారం

 

20 వ సామాన్య ఆదివారం

యెషయ 56:1, 6-7

రోమియులు 11:13-15,29-32

మత్తయి: 15:21-28

 

ఈనాటి దివ్య గ్రంథ పఠణాలు దేవుని యొక్క రక్షణము ప్రపంచమంతటకు విస్తరిల్ల చేయబడినది అనే అంశము గురించి. అందరూ కూడా ఆయన రక్షణకు అర్హులే అనే అంశమును ప్రభువు తెలియచేస్తున్నారు. ఆయన అందరిని రక్షించుటకు సంసిద్ధముగా ఉన్నారు. ఎవరైతే ఆయనను తెలుసుకొని ఆయన చెంతకు వచ్చి ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తారో వారందరూ కూడా దీవించబడతారు. చాలా సందర్భాలలో మనందరికీ కూడా ఎదురయ్యేటటువంటి ప్రశ్న ఏమిటంటే నేను రక్షణ పొందగలనా? అదే విధముగా కొన్ని కొన్ని సందర్భాలలో మనము మంచిగా జీవించకపోతే మరణించే సమయంలో రక్షణ పొందుతామా లేదా? అని అలా ఆలోచన చేసే వారందరికీ ఈనాటి దివ్య పఠణాలు రక్షణ అందరూ పొందుతారు అని అంశమును గురించి బోధిస్తున్నాయి. 

కాకపోతే మన జీవితంలో మనము గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఏమిటంటే మొట్టమొదటిగా మన జీవితంలో  అంతట మనము రక్షణ పొందలేము కేవలం దేవుడు మాత్రమే మనకు రక్షణ ప్రసాదించగలరు. రెండవదిగా దేవుని యొక్క రక్షణ అందరికీ చెందుతూ ఉంది. కాబట్టి వినయముతో విశ్వాసముతో జీవించాలి. మూడవదిగా నేనే మాత్రమే రక్షణ పొందగలను అనే అహంతో ఎవరు కూడా ఉండకూడదు వారి యొక్క మతమును బట్టి కానీ, జీవితమును బట్టి గాని, లేదా వారు చేసే కార్యమును బట్టి గాని గర్వంగా ఉండకుండా జీవించినప్పుడే దేవుని యొక్క రక్షణ పొందగలుగుతారు.

దేవునికి ఎవరు నశించి పోవుట ఇష్టము లేదు (2 పేతురు 3:9), యెహెజ్కె 18:23, 33:11.

అదే విధముగా దేవుడికి ఎవ్వరూ కూడా ఏ దేశం కూడా ఒక ప్రత్యేకమైనది కాదు అందరూ కూడా ఆయన దృష్టిలో సరి సమానులే అందుకనే ఆయన అందరి మీద వర్షమును, సూర్యుడిని కురిపింప చేస్తున్నారు.

ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యెషయ‌ప్రవక్త ద్వారా తన యొక్క రక్షణ అందరికీ కూడా చెందుతుంది అనే అంశం గురించి తెలియజేశారు. సృష్టి ప్రారంభంలో మానవుడు దేవుడు యొక్క మాటను అవిధేయించినప్పటి నుండి దేవుడు మానవుడుని రక్షించాలి అని అనుకున్నారు. దానిలో భాగంగానే ఆయన అబ్రహామును ఎన్నుకున్నారు ఆయన ద్వారా మిగతా దేశాలందరినీ రక్షించాలని అనుకున్నారు. అబ్రహాము యొక్క సంతతి తామే దేవుని బిడ్డలం అనేటటువంటి అహంతో జీవించకుండా దేవుడు మిగతా వారిని కూడా తన బిడ్డలగా అంగీకరిస్తున్నారు అనే సత్యమును ఈనాటి మొదటి పఠణం వెల్లడిస్తున్నది. ప్రభువు అంటున్నారు ఎవరైతే తన యొక్క నీతి న్యాయమును పాటిస్తూ ఉంటారో వారందరూ కూడా రక్షణ పొందుతారు అని తెలుపుతున్నారు. యెరుషలేములో ఉన్న దేవుని ఆలయం అందరికీ ప్రార్థనాలయం అవుతుంది అని తెలిపారు. అనగా అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆ ప్రభువుని స్తుతించి ఆరాధిస్తారని దేవుడు కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాకుండా మిగతా వారిని కూడా తన బిడ్డలగా స్వీకరిస్తున్నారు. 

యావే దేవుడు చాలా సందర్భాలలో ప్రవక్తల ద్వారా తెలియచేయాలనుకున్న అంశం ఏమిటంటే ఆయన అందరికీ ప్రభువుని. కేవలం యూదులకు మాత్రమే కాకుండా  అన్యులకు కూడా ఆయన ప్రభువు అని తెలియచేయాలనుకున్నారు దానికి ముఖ్య నిదర్శనం ఈనాటి మొదటి పఠణం. ప్రభువు ఎందుకు అన్యులను ఇశ్రాయేలీలతో కలవకూడదు అన్నారు అంటే ఇశ్రాయేలీయులు దేవునికి దూరమైనా సమయాలు చాలా ఉన్నాయి, విగ్రహారాధన చేసిన సమయాలు చాలా ఉన్నాయి అందుకనే ఈ అన్యుల యొక్క జీవితము వారిలాగా మారకూడదు అనే ఆలోచనతో యావే దేవుడు అన్యులను ఇశ్రాయేలీలతో కలవ వద్దన్నారు.

 కానీ ఈ మాటలను ఇస్రాయేలీయులు తమ స్వంత స్వార్థం కోసం తప్పుగా అర్థం చేసుకున్నారు వారి యొక్క ఆలోచన ఏమిటంటే కేవలం వారు మాత్రమే దేవుని చేత ఎన్నుకొనబడ్డవారని, రక్షణ కేవలం వారికి మాత్రమే చెందినది అని మిగతా  వారు రక్షణ పొందలేరు అనే అంశాన్ని వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది యూదుల యొక్క ఆలోచన ఏమిటంటే అన్యులు కూడా రక్షణ పొందుతారు కానీ వారు మొదటిగా యూదా మతాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే. ఈ మొదటి పఠణము మనకి తెలియచేసే అంశం ఏమిటంటే దేవుని యొక్క రక్షణ అందరికీ చెందినది అందరూ కూడా ఆయనకు ఇష్టమైన వారు కేవలం ఆయనను తెలుసుకొని విశ్వసించి వెంబడించే వారందరూ కూడా ప్రభువుని రక్షణను పొందుతారు.

ఈనాటి రెండవ పఠణంలో కూడా పౌలు గారు ఆయన ఎన్నుకొనబడినది అన్యులకు  సువార్త ప్రకటన చేయుటకు, తన యొక్క సువార్త ప్రారంభంలో పౌలు గారు మొదటిలోనూ యూదులకు సువార్త ప్రకటించినప్పుడు వారు ఎవ్వరు కూడా దానిని అంగీకరించలేదు అందుకని పౌలును అన్యులకు సువార్త బోధించుటకు వివిధ ప్రాంతాలకు ప్రయాణమై వెళ్లారు ఆయన బోధించిన ప్రతి చోట కూడా అన్యులు దేవుని యొక్క సువార్త  అంగీకరించారు దేవుని యొక్క సువార్తను రక్షణను పొందారు. అవును అన్యుల యొక్క అపోస్తులను అని పిలుస్తుంటారు పిలుస్తుంటారు. ఏసుక్రీస్తు నందు అందరూ కూడా రక్షణ పొందుతారు అనే అంశాన్ని పౌలు గారు తెలియజేశారు. 

ఈనాటి సువిశేష పట్టణంలో దేవుడు కననీయ స్త్రీ యొక్క ప్రార్థనను ఆలకించిన విధానం గురించి తెలియజేస్తున్నారు. కననియ స్త్రీ యూదా మతమునకు చెందినటువంటిది కాదు అయినప్పటికీ కూడా ఆమె ఏసుప్రభువును దావీదు కుమారుడా అని సంబోధిస్తున్నది అంటే ఆయన గురించి బహుశా ఆమె విని ఉండవచ్చు, ఆయన గొప్పతనమును అద్భుత కార్యములను తెలుసుకొని ఉండవచ్చు, అందుకని దావీదు కుమారుడా అని ఆమె సంబోధిస్తున్నది. ఏసుప్రభు ఆమె మొరను ఆలకించినప్పటికీ ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసమును బయటకు తీసుకుని రావటకు మరియు మిగతా అక్కడ ఉన్న శిష్యులకు అందరకు అన్యుల యొక్క విశ్వాసము ఎంత గొప్పది అని తెలియజేయుటకు ప్రభువు ఆమె మెరుపు పెడచెవిని పెట్టిన విధంగా ఆయనవ మనందరికీ కూడా కనబడుతున్నారు. కానీ వాస్తవానికి ఏసుప్రభువు అన్యులను ఎక్కువగా ప్రేమించారు ఎందుకంటే ఆయన సువార్తను చాలా అన్య ప్రదేశాలలో బోధించారు, వారితో కలసి భుజించారు,ప్రయాణం చేశారు జీవించారు. ఈమె యొక్క విన్నపమును కూడా దేవుడు గౌరవించారు కేవలము ఆమెను ఒక సుమాతృకగా ఇతరులకు చూపించటకు మాత్రమే ప్రభువు ఆమెను తృణీకరించిన విధముగా ఇక్కడ కనబడుతున్నారు. 

ఈమె యొక్క విశ్వాస జీవితము నుంచి కొన్ని అంశాలు మన ఆధ్యాత్మిక జీవితమునకు తీసుకోవాలి. మొదటిగా ఆమెలో ఉన్న విశ్వాసం- ఆమె విశ్వాసము చాలా గొప్పది ఎందుకంటే ఏసుప్రభువు మాత్రమే తన కుమార్తెకు స్వస్థతను ప్రసాదించగలరు అని ఆమె విశ్వసించినది కాబట్టే యూదులకు అన్యులకు మధ్య ఉన్న భేదాలు ఏమి పట్టించుకోకుండా ఆమె ఏసుక్రీస్తు ప్రభువు చెంతకు రాగలిగినది ఆమె విశ్వాసము ద్వారానే తన కుమార్తెకు స్వస్థతను చేకూర్చుకోగలిగినది.

రెండవదిగా ఆమెలో ఉన్న పట్టుదల-ఏసుప్రభు తనను కొంచెం బాధించే విధంగా మాట్లాడినప్పటికీ ఆమె తన పట్టుదల కోల్పోలేదు పదేపదే అడుగుతూనే ఉంటూ ఉన్నది ఆ యొక్క పట్టుదలను బట్టి తను అనుకున్నది సాధించగలుగుతున్నది. యాకోబుకు కూడా పట్టుదల ఎక్కువగా ఉన్నది కాబట్టే ఆయన దేవునితో కుస్తిపట్టే సందర్భంలో దేవుడి చేతిని విడిచిపెట్టడం లేదు అప్పటికే ఆయన తుంటి ఇరిగినప్పటికీ ఆయన దేవుడిని ఆశీర్వదించమని అడుగుతున్నారు ఆశీర్వదిస్తేనే నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని పట్టుదలతో అడిగాడు కాబట్టే ఆయన అనుకున్నది పొందగలిగాడు కాబట్టి మనం కూడా మన విశ్వాస జీవితంలో పట్టుదలను ఎప్పుడూ మరచిపోకూడదు అడుగుతూనే ఉండాలి ప్రయత్నం చేస్తూనే ఉండాలి కష్టపడుతూనే ఉండాలి అప్పుడు మాత్రమే మన జీవితంలో ఫలితములు చూడగలుగుతుంటాము.

మూడవదిగా ఆమెలో ఉన్న వినయం: ఏసుప్రభు ఆమెతో సంభాషణీ సందర్భంలో బిడ్డల రొట్టెలను కుక్కలకు వెయ్యి తగదు అని ప్రభువు ఆమెతో అన్నారు ఈ మాటలు ఎవరు విన్నా సరే బాధపడుతూ ఉంటారు కానీ ఆమె మాత్రం ఏమి కూడా పట్టించుకోకుండా ఏసుప్రభువుకి ఎంతో వినయముతో సమాధానం చెబుతుంది అది ఆమెలో ఉన్న గొప్ప వినయం. 

కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని ఎవరో తిట్టారు ఏదో అన్నారని మనం నిరాకరించబడ్డామని చాలామంది తాము సాధించాల్సింది మరిచిపోతూ ఉంటారు దేవాలయపు దూరమై వెళుతూ ఉంటారు కానీ ఈమె మాత్రం ఏసుప్రభువు చెప్పిన ప్రతి మాటను వినయముతో అంగీకరించి స్వీకరించినది అందుకని ఏసుప్రభు ఆమె విశ్వాస జీవితమును మెచ్చుకుంటున్నారు. దేవుని యొక్క రక్షణలో అందరూ కూడా భాగస్తులే కాబట్టి ఆయనను విశ్వసించి జీవించాలి.

 

Fr. Bala Yesu OCD

సామాన్యకాలపు 5 వ ఆదివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం   యెషయా 6:1-6  1కొరింథీయన్స్ 15:3-8,11 లూకా 5:1-11 క్రీస్తునాదునియందు  ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా ...