17, ఆగస్టు 2024, శనివారం

20 వ సామాన్య ఆదివారం

 సామెతల గ్రంధం 9:1-6  ఎఫెసీ 5: 15-20 యోహాను 6: 51-58 

పరలోకమునుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించునో వాడు నిరంతరం జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అనెను. అంతట యూదులు ఒకరితో ఒకరు "మనము భుజించుటకు ఈయన తన శరీరమును  ఎట్లు ఈయగలడు?" అని వాదించుకొనసాగిరి. యేసు వారికి "మీరు మనుష్యకుమారుని శరీరమును భుజించి, ఆయన రక్తమును త్రాగిననే తప్ప , మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి , నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను వానిని అంతిమ దినమున లేపుదును. ఏలయన నా శరీరము నిజమైన ఆహారము. నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును.  జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున  జీవించును. ఇదియే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అటుల కాక, ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడును జీవించును అని సమాధానము ఇచ్చెను. 

ఈనాటి మొదటి పఠనంలో విజ్ఞానమను స్త్రీ మూర్తి ప్రజలను "రమ్ము నేను తయారు చేసిన భోజనమును ఆరగింపుము. జ్ఞానము లేని వారు ఇచ్చటకు రెండు అని ఆహ్వానిస్తుంది. మూర్ఖత్వమును  విడనాడి బ్రతుకుడు.  విజ్ఞాన పథమున నడువుడు అని మనం మొదటి పఠనంలో  విటున్నాం.  ప్రియ విశ్వాసులారా  జ్ఞానము లేని వారు  ఇచటకు రెండు అని విజ్ఞానమను స్త్రీ మూర్తి పిలిచినట్లే దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. మనలను దేవుని వాక్కు అనే భోజనమును ఆరగించమని ఆహ్వానిస్తున్నారు. మానవుడు కేవలం, రొట్టె వలెనే కాక దేవుని నోటి నుండి వచ్చు వాక్కు వలన జీవించును. ఇది అక్షరాల సత్యం. కానీ చాలా మంది ఇంకా మూర్ఖత్వంలోనే జీవిస్తున్నారు. అజ్ఞానములోనే ఉండిపోతున్నారు. నా యొద్దకు రెండు అని పిలిచిన దేవుని మాటను వినలేక పోతున్నారు. దేవుని విజ్ఞాన మార్గంలో నడవమని ఆహ్వానిస్తుంది. మనము జ్ఞానము కలిగిన వారిగా జీవించి విజ్ఞాన పథంలో జీవించుదాం. 

ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారము నేనే. అదే విధంగా ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నాశరీరమే అని క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నాడు. 

అదే విధంగా నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువారు నిత్యజీవము పొందును. నేను వారి యందు వారు నాయందు ఉండును. నేను తండ్రి మూలమున జీవించునట్లే నన్ను భుజించువాడు నా మూలమున ఎల్లప్పుడును జీవించును. ఇది గొప్ప భాగ్యం మానవులమైన మనందరికీ. 

కాబట్టి ప్రియ విశ్వాసులారా మనం నిత్య జీవం పొందాలంటే , మనం మనము దేవుని యందు ఉండాలంటే దేవుని శరీర రక్తాలను నిత్యం స్వికరించాలి. మరి క్రీస్తు ప్రభువుని శరీర రక్తలను స్వీకరించాలంటే పరిశుద్ధతతో జీవించాలి. దేవుని చిత్తాను సారం నీవు నేను మనందరం ఆ ప్రభుని చిత్తం తెలుసుకొని జీవించాలి. పవిత్రతతో నింపబడాలి. 

మనం ఏమి చేయాలంటే? దేవుని పిలుపును , ఆహ్వానాన్ని విని దేవుని దగ్గరకు వెళ్ళాలి. దేవుని యొక్క జ్ఞానమును, జ్ఞాన ఫలములను పొంది దేవుని వాక్కుతోను శరీర రక్తములతోను నింపబడాలి. మన మూర్ఖత్వాన్ని తొలగించమని ఆ దేవుని జ్ఞానము కొరకు ప్రార్ధించాలి. నిత్య జీవం, పొందాలంటే మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని విడనాడి దేవుని త్రోవలో నడవాలి. దేవునితో నిత్యం కలకాలం జీవించడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన: ప్రేమ మయుడైన దేవా మేము ముర్ఖులం, మా మూర్ఖత్వంలో, అజ్ఞానంలో  జీవిస్తున్నాం. నీ జ్ఞానమును, జ్ఞానవరములను పవిత్రత్మను మాపై కుమ్మరించి విజ్ఞానముతో  నింపుము, నిత్యం నీ త్రోవలో నడుస్తూ నిత్య జీవం పొందే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

యెహెఙ్కేలు 18:1-10. 13,30-32 మత్తయి 19:13-15

 యెహెఙ్కేలు 18:1-10. 13,30-32 మత్తయి 19:13-15

ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులుచాచి ప్రార్ధింపుమని యేసు వద్దకు తీసుకొని రాగా, శిష్యులు వారిని ఆటంకపరచిరి. "చిన్న బిడ్డలను నాయొద్దకు  రానిండు. వారలను ఆటంక పరపకుడు. ఏలయన, అట్టి వారిదే పరలోక రాజ్యము" అని పలికిరి, వారి మీద చేతులుంచి యేసు అచట నుండి వెడలిపోయెను. 

ప్రియమైన మిత్రులారా ఈనాటి మొదటి పఠనం యెహెఙ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అంటున్నాడు. ఎవ్వరు చేసిన పాపములకు వారే శిక్షను అనుభవిస్తారు అని దేవుడు చెప్పిన సందేశాన్ని వారికి వినిపిస్తున్నాడు . అదే విధంగా సత్పురుషుడు  చిత్తశుద్ధితో దేవుని చట్టాలను విధులను పాటించును కనుక అతడు కాలకాలము  బ్రతుకును అని దేవుడు పలుకుచున్నాడు. ఎవరైతే న్యాయపరులుగాను, ధర్మ పరులుగాను, జీవిస్తారో వారు దేవుని కృపను పొందుతారని వింటున్నాం. అదే విధంగా ఎవరైతే దుష్ట కార్యాలను పాల్పడుతారో వారు ఖచ్చితముగా చచ్చును. వారి చావునకు వారే బాధ్యులు, అని దేవుడు వారితో చెబుతూ ఎవరు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగదు అని అంటున్నాడు. మన నుండి మన దేవుడు కోరుకొనినది హృదయ పరివర్తన చెంది, పాపముల నుండి వైదొలగి  బ్రతుకుడు అంటున్నాడు. 

ప్రియ విశ్వాసులారా దేవుడు మనలను మన పాపపు క్రియల నుండి పాపపు ఆలోచనలనుండి మారు మనస్సు పొంది, మన పాపముల నుండి వైదొలగాలని ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. మనం పాపంలోనే, పాపం చేస్తూ మరణించడం దేవునికి అసలు ఇష్టం లేదు అదేవిధంగా దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. మీ మీ క్రియలను బట్టి, మీరు శిక్షను పొందుతారు అని చెబుతున్నాడు. మరి మనము ఎలాంటి క్రియలు చేస్తున్నాము. ఎలాంటి పనులు చేస్తున్నాము ఆలోచించండి. మనం చిత్త శుద్దితో న్యాయంగా, ధర్మంగా దేవుని ఆజ్ఞలు పాటించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాని  మన మనలో చాలా మంది దుష్ట బుద్దితో, దుష్ట కార్యములకు పాల్పడుతున్నాం. దేవుని ఆజ్ఞలను పాటించడం లేదు. మరి ఈరోజు మన నుండి దేవుడు ఏమి అడుగుతున్నాడు అంటే మీ పాత పాపపు జీవితమును విడిచి పెట్టి నూత్న మనసును, నూత్న హృదయమును పొందుకోండి అంటున్నాడు. మనం మన పాపపు , చీకటి , చేడు, దుష్ట కార్యాలను వదలి నూత్న జీవితము పొందడానికి సిద్ధముగా ఉన్నామా? లేదా? ఇంకా పాపములోనే ఉండి  జీవిస్తూ, పాపములో మరణిస్తామో ఆలోచించండి. ఇంకా పాపములోనే ఉండి మనము చనిపోయినట్లయితే మనం దేవుని సంతోష పెట్టినవారము కాదు. మనము దేవుని దుఃఖ పరిచినవారము  అవుతాం. కాబట్టి మన జీవితాలు దేవుని చిత్తానుసారాం జీవించడానికి మంచిగా జీవించడానికి ప్రయత్నించుదాం. 

ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం. ఎప్పుడైతె శిష్యులు యేసు వద్దకు వచ్చి త్మమ బిడ్డలను దీవింపమని అడిగిన వారిని ఆటంకపరచడం చూశాడో  అప్పుడు శిష్యులతో చిన్న బిడ్డలను నాయొద్దకు రానివ్వండి. వారిని ఆటంకపరచకండి అట్టి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి వారిని దీవించాడు. ప్రియ విశ్వాసులారా మనం మన మనస్సు నందు చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చిన్న బిడ్డలలో గర్వం, స్వార్ధం, అహంకారం, కోపం, క్రోధం, మొహం, దుష్టత్వం ఇలాంటివి ఏవి వారికి ఉండవు. వారు నిర్మలంగా, పరిశుద్ధంగా, ప్రేమ, మంచి మనస్సుతో ఇతరులను గౌరవిస్తూ వారి తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తుంటారు. ప్రియ విశ్వాసులారా మరి మనం నిర్మలమైన , పరిశుద్ధమైన స్వచ్ఛమైన మనస్సులతో ఉంటేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. దేవుని రాజ్యాన్ని పొందగలం.  కాబట్టి దేవునికి ప్రార్థిస్తే చిన్నపిల్లల మనస్తత్వం పొందుటకు ప్రయత్నించుదాం. 

ప్రార్ధన : పరిశుద్దుడైన దేవా మేము మా పాపపు ఆలోచనలతో పాపము క్రియలు చేస్తూ మా పాపాలలోజీవిస్తున్నాం. దయగల దేవా నీవు అంటున్నాము. పాపాత్ములు మరణించుటలో నీకు సంతోషం లేదని, ప్రభువా నాకు పాప మన్నింపును దయ చేయండి. నా దుష్ట క్రియల నుండి వైదొలగడానికి, శక్తిని బలాన్ని నాకు దయచేయండి. మంచిగా జీవిస్తూ నీ ఆజ్ఞలను పాటించే నూత్న హృదయాన్ని నాకు దయచేయండి. నిన్ను సంతోష పెట్టె బిడ్డగా నేను జీవించేలాగా నన్ను మార్చుము తండ్రి. ఆమెన్. 

ఫా . సురేష్ కొలకలూరి OCD

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...