11, నవంబర్ 2023, శనివారం

 

32 సామాన్య ఆదివారం

సోలో. జ్ఞాన 6: 12-16

1 తెస్సా 4: 13-18

మత్తయి 25: 1-13

 

క్రీస్తు నాధునియందు ప్రియమయిన దేవుని బిడ్డలారా, ఈనాడు తల్లి శ్రీ సభ దేవుని వాక్యాన్ని ఆలకించి, ధ్యానించి, వాక్యాను సారంగా జీవించమని మనందరినీ 32 సామాన్య ఆదివారములోనికి ఆహ్వానిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని ఆలకించడానికి ప్రయతించుదాం. 

ఈనాటి మూడు పఠనాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మరియు ముఖ్య సందేశాన్ని ఈనాటి సువిశేష పఠనంలో చూస్తున్నాము. సువిశేష పఠనము ద్వారా యేసుప్రభు మనందరికీ  సందేశాన్ని తెలియపరుస్తున్నారు. అదేమిటంటే   " దేవుని యొక్క రాకడ - మానవ సిద్ధపాటు".

ప్రియమయిన దేవుని బిడ్డలారా యేసుప్రభు తన చివరి గడియాలలో, తన యొక్క పునరాగమనము, రెండవ రాకడ విధంగా ఉంటుందో అని తెలియపరిచారు. మత్తయి  : 24 అధ్యయంలో మనం చూస్తున్నాము .  యేసుప్రభు తన శిష్యులకు ప్రమాణము చేస్తూ " మీరు భయపడవలదు. నేను మరల తిరిగి వస్తాను. రాకడ ఏనాడు వచ్చునో మీరు ఎరుగరు. కావున సిద్ధపడి వుండండి" అని శిష్యులను హెచ్చరిస్తున్నారు. మత్తయి 24 :26 ' దినము గడియ ఎపుడు వచ్చునో తండ్రి తప్ప, దూతలు తప్ప, కుమారుడు తప్ప, మరెవ్వరు ఎరుగరు. నోవా దినములు ఎట్లుండునో, మనుష్య కుమారుని రాకడయు ఉండును.'

ప్రియమయిన విశ్వాసులారా వాక్యాలనింటిని గమనించినట్లయితే దేవుని రాకడ తప్పనిసరిగా ఉంటుంది. యేసుప్రభు దేవుని రాకడ విధంగా ఉంటుందో చెప్పారు కానీ ఘడియలలో వస్తుందో చెప్పలేదు. కనుక శిష్యులను సిద్ధపడి ఉండమని ప్రభువు హెచ్చరిస్తున్నారు. మన తల్లి శ్రీ సభ కూడా క్రెస్తవులయిన మనందరికీ నేర్పిస్తున్నది కూడా ప్రభుని రాకడ గురించే. రాకడ కోసం మనందరమూ ఎదురు చూడాలి మరియు సిద్ధపడాలి అని తెలియజేస్తుంది.

  ప్రియమయిన విశ్వాసులారా ఈనాటి పది మంది కన్యకలు ఉపమానంలో పెండ్లి కుమారుడు - యేసుప్రభువును, మరియు కన్యకలు శ్రీ సభలో వున్నా సభ్యులను సూచిస్తూవున్నది. అధేవిధంగా కన్యకలు యొక్క కన్యాత్వము పరిశుద్ధతను సూచిస్తూవున్నది. అంటే ప్రభువు యొక్క రాకడకు అందరూ పవిత్రంగా, పరిపూర్ణంగా, మరియు పరిశుద్ధంగా మన హృదయాలను సిద్దపడి  ఉంచాలని  యేసుప్రభు అదేవిధంగా తల్లి శ్రీ సభ బోధిస్తూవున్నది. 

ప్రభుని రాకడ విధంగా  ఉంటుంది అంటే అకస్మాత్తుగాను, ఎవరు ఊహించని సమయానన, ఎవరు అనుభవించని పరిస్థితున దేవుని రాకడ వస్తుంది. అటువంటి రాకడకు ఏవిధంగా మనం సిద్ధపడాలి అని ఇదిగో ప్రభువు నేర్పిస్తున్నారు.

ముందుగా సిద్దపటుకు కావలిసింది వివేకము లేక జ్ఞానము. సువిశేషంలో చూసినట్లయితే వివేకంతో అన్ని సిద్ధపరిచిన ఐదుగురు కన్యకలని మాత్రమే  పెండ్లికుమారుడు ఆహ్వానించాడు. అదేవిధంగా అవివేకంతో వున్నవారిని ఆహ్వానించలేదు. వారిని గెంటివేశారు. ప్రియమయినా విశ్వాసులారా వివేకంతో సిద్ధపడిన వారికీ మాత్రమే ప్రభుని రాజ్యము దొరుకుతుంది. కావున సిద్ధపాటుకి కావలిసింది జ్ఞానము . జ్ఞానం గురించే మొదటి పఠనము మనకు వివరిస్తూ వున్నది. మొదటి పఠనము మనకు ఏమి భోధిస్తుందిఅంటే జ్ఞానం కోసం అన్వేషించాలి అని. మనందరము జ్ఞానం వెతికే వారాలుగా ఉండాలి అని, జ్ఞానాన్ని ప్రేమించే వారాలుగా ఉండాలి అని, జ్ఞానాన్ని అభిలషించే వారాలుగా వుండాలిఅని భోదిస్తూవున్నది.

అధేవిధంగా ఎలా ఎదురు చూడాలి అని రెండవ పఠనము వివరిస్తుంది, అది ఏమిటంటే, ప్రభువు యొక్క రాకడకై ' నిరీక్షణతో ఎదురు చూడాలి.'  పునీత పౌలు గారు తేస్సలోనికా  ప్రజల యొక్క ఆత్యాద్మిక స్థితి ఎలా వున్నదో అని తెలుసుకొని వచ్చుటకు తిమోతిని పంపించారు. ప్రియమయిన విశ్వాసులారా తెస్సలొనీక ప్రజల మధ్య వున్నా కీలకమయిన సమస్యల గురించి, సందేశాల గురించి, మరి ముఖ్యముగా ప్రభు యొక్క రాకడ గురించిన విషయాలు పునీత పౌలు గారు ఈనాటి రెండవ పఠనంలో తెలియపరుస్తున్నారు. ప్రభువు యొక్క రాకడ సమయమున విశ్వాసము, నమ్మకము కలిగి నిరీక్షణతో ఎదురు చూడాలి అని తెలియపరుస్తున్నారు.

కావున ప్రియమయిన దేవుని బిడ్డలారా ప్రభువు యొక్క రాకడకు జ్ఞానము కలిగి విశ్వాసంతో, నమ్మకంతో సిద్ధపడి నిరక్షణతో ఎదురు చూడాలి అని ఈనాటి పఠనాలు బోధిస్తున్నాయి.

 

బ్రదర్. సన్నీ దామాలా. ఓ సి డి

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము  ఆదికాండము 2:18-24 హెబ్రీయులకు 2:9-11 మార్కు 10:2-16 క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డ...