24 వ సామాన్య ఆదివారము
యెషయా 50 : 5 - 9
యాకోబు 2 : 14 - 18
మార్కు 8 : 27 - 35
క్రిస్తునాధుని యందు ప్రియా సహోదరి సహోదరులారా !
ఈనాడు తల్లి తిరుసభ 24 వ సామాన్య ఆదివారమును కొనియాడుచియున్నది. ఈనాటి మూడు దివ్య గ్రంథ పఠణములు యేసు మార్గమే మన మార్గము అనే అంశమును ధ్యానించమని తల్లి తిరుసభ మనలను అందరిని ఆహ్వానిస్తుంది. ఈనాటి సువిశేష పఠనములో యేసు ప్రభు మూడు విషయాలను తెలియపరుస్తూ, ధ్యానించమని మనలని అందరిని కూడా ఆహ్వానిస్తున్నారు.
1 . బాధలు
2 . మరణం
3 . పునరుత్ధానం
బాధలు రెండు రకములు. “మొదటిగా మనిషి కొనితెచ్చుకొనేవి”. ఏ విధంగా అంటే దేవునికి అవియధేయతగ ప్రవర్తించటం ద్వారా, లేక పాప మార్గములో నడవడం వలన బాధలు కష్టాలు వ్యాధులు మన జీవితంలోనికి వస్తాయి. మనకు పరిశుద్ధ గ్రంధములో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఎవరైతే దేవునికి ఎదురు సమాధానం చెప్పడం ద్వార వారికి బాధలు కష్టాల లోనికి నెట్టబడతారు. (సంఖ్య 12) లో మిరియం, మోషే, అహరోనులు సోదరి. ఆమె ఏరికోరి వ్యాధిని కొనితెచ్చుకున్నది. ఒకరోజు మిరియం తన సోదరులు దేవునితో సంభాషించడం చూచి, తాను మనసులో గొణుగుకొవడం మొదలుపెట్టింది. ఇది గ్రహించిన యావె దేవుడు తనకు బుద్ధి చెప్పడానికి తనకు భయంకరమైనటువంటి కుస్తీ రోగాన్ని తనకు ఇస్తూ ఉన్నాడు. ఇదే కదా ఏరికోరి జీవితంలో కష్టాలను కొని తెచ్చుకోవడం అంటే?
రెండొవదిగా “దేవుడు ఒసగిన కష్టాలు”. దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయడానికి దేవుడు ఒసగిన కష్టాలు. యేసు ప్రభువు తన యొక్క జీవితంలో కష్టాలను బాధలను యావె దేవుడు ఇచ్చాడు. దేనికోసం అంటే మనందరికీ రక్షణ తీసుకొని రావడంకోసం. క్రైస్తవ జీవితంలో ఎదుర్కొనే కష్టాలు వ్యక్తి గతమైన కష్టాలు కావు, కానీ పరోపకారమైన కష్టము. ఎందుకు అంటే మన కష్టాలు ఇతరులకు జీవమును ఇచ్చే విధంగా ఉంటుంది కాబట్టి క్రైస్తవ బాధలు అనేవి పరోపకారమైన ఇబ్బందులు. యేసు ప్రభువు బాధలు కష్టాలు గురించి కొత్త అర్ధాన్ని ఇస్తున్నారు. ఏ విధంగా అంటే యేసు ప్రభు జన్మించక ముందు వరకు బాధలు కష్టాలు ప్రజల జీవితంలో మనం చేసిన పాపాలకి లేదా మన తల్లిదండ్రుల చేసిన పాపాలకి మనం ఈ బాధలను మన జీవితంలో వస్తాయని ఇశ్రాయేలు ప్రజలు నమ్మేవారు. కానీ యేసు ప్రభు బాధలకు కష్టాలకు కొత్త అర్ధాన్ని ఇచ్చాడు.ఈ కొత్త అర్ధం, మనకు అర్ధం కావాలంటే (యోహాను 9 :1 - 3) లో మనము చూస్తున్నాం. పుట్టి గ్రుడ్డివానికి దృష్టిదానం. అపుడు శిష్యులు ఈ విధంగా అడుగుతున్నారు, బోధకుడా ! వీడు గ్రుడ్డివాముగా పుట్టుటకు ఎవడు చేసిన పాపము? వీడా? వీని తల్లిదండ్రుల? అని యేసుని అడిగిరి. అందుకు యేసు వీడు కానీ వేడు తల్లిదండ్రులుగానీ పాపము చేయలేదు. దేవుని యొక్క కార్యము వీనియందు భయాలుపడుటకై వీడు గ్రుడ్డివానిగా పుట్టెను. యేసు దీనికి ఇచ్చిన అర్ధం ఏమిటంటే బాధలు కష్టాలు మానవుని జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే. వాటిని మానవుడు విశ్వాసం ద్వారా స్వీకరించాలి.
మరణం.
యేసు ప్రభు సువిశేష పఠనములో మరణము గురించి ప్రస్తావించారు. మనిషిని మనం రెండు విధాలుగా చంపవచ్చు
శారీరకంగా
మానసికంగా.
శారీరకంగా అంటే పొడచుట , నరుకుట, విషప్రయోగం మరియు పలువిధములుగా మనిషిని చంపవచ్చు. రెండొవదిగా మానసికంగా మన మాటలద్వారా క్రియలద్వారా మనిషిని చంపవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే మనిషిని బ్రతికి ఉండగానే చంపేయడం.
మానసికంగా ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో శారీరక మరణానికి ముందు మానసికంగా పలువిధాలుగా మరనిస్తున్నాడు. .
1 . ప్రత్యక్షంగా పొగుడుతూ పరోక్షంగా కించ పరిచేటువంటి క్రియల ద్వారా.
2 . ఓక వ్యక్తి దగ్గర మేలులు పొంది, అతని నాశనము కోరుట ద్వారా
3 . ఓక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకొని అతనికి వ్యతిరేకముగా చేయుటద్వారా
4 . నమ్మించి మోసము చేయుట ద్వారా
ఇటువంటి పనుల ద్వార మనము మానసికంగా అనేక మందిని నిర్జీవులుగా మారుస్తాము.
పునరుతానము
భారతదేశంలో మనకు అనేకమైన మతాలు ఉన్నవి. ఉదారణకు , హిందువులు, బౌద్దులు, ముస్లింలు, సిక్కులు, జైనులు ఇలా అనేకమైన మతాలు ఉన్నవి. బౌద్దులకు - గౌతమ బుద్దుడు, ముస్లింలకు - మొహమ్మద్, సిక్కులకు - గురునానక్, జైనులకు - వర్ధమాన మహావీర, హిందువులకు - ఎవరు లేరు. వీరి అందరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదు నేను చనిపోయి మళ్ళీ తిరిగి మరణము నుండి లేవబడతాను అని, అలా చెప్పింది కేవలం సజీవుడయినా యేసు ప్రభు. క్రైస్తవ మతానికి వ్యవస్థాపకుడు.ఇదే క్రైస్తవత్వంలో ఉన్నటువంటి విశిష్టత , మరి ఏ మతమునకు లేనటువంటి ప్రత్యేకత. సువిశేష పఠనములో యేసు ప్రభు ఒక ప్రశ్ననే రెండు విధాలుగా అడుగుతున్నారు.
1 . యేసు ప్రభు తన శిష్యులను ప్రజలు తనను గురించి ఎవరు అని భావించుచున్నారు అని అడిగారు?
2 . యేసు తన శిష్యులను నేను ఎవరని మీరు భావించుచున్న్నారు? అని అడిగారు.
ఈ రెండు ప్రశ్నల మధ్య తేడా ఏమిటంటే
1 . మనిషి గురించి తెలుసుకొనుట,
2 మనిషిని తెలుసుకొనుట.
యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే దేవాలయానికి రావడం అవసరంలేదు ఎందుకంటే
a . పరిశుద్ద గ్రంధము చదివి యేసును తెలుసుకొనుట.
b . పుస్తకాలను చదివి తెలుసుకోవచ్చు.
c. లేకపోతే ఇపుడు మన సెల్ ఫోన్ ద్వారా యేసును గురించి ఎక్కడ పుట్టారో ఎం చేసారో తెలుసుకోవచ్చు.
కానీ మనం యేసును తెలుసుకోవాలంటే దేవాలయానికి రావాలి.
1 . ప్రార్ధన - పునీత అవిలాపురి తెరేస్సమ్మగారు ప్రార్ధన గురించి ఇలా చెబుతున్నారు. ప్రార్థన అనేది మనకు తెలిసిన వారితో స్నేహపూర్వక సంభాషణ. పునీత పేతురు గారు కూడా తన యొక్క జీవితంలో యేసు ప్రభుని గురించి ఎరిగియున్నాడు కాబట్టి యేసు అడిగిన వెంటనే “నీవు నిజమైన క్రీస్తువు” అని ప్రత్యుత్తరము యిచ్చియున్నాడు. ఇది కేవలం తన యొక్క ఆత్మసంబంధంతో చెప్పగలిగియున్నాడు.
రెండొవ పఠనంలో మనము చూస్తున్నాం మనయొక్క విశ్వాసం కేవలం మాటల రూపంలో మాత్రమే కాకుండా చేతల రూపంలో ఉండాలని యాకోబు గారు మనకు తెలియపరుస్తున్నారు. పేతురు ఏ విధంగా అయితే దేవునితో ఆత్మీకసంబంధం ఏర్పరచుకొని తనయొక్క విశ్వాసాన్ని బలపరచుకున్నాడో అదేవిధంగా మనం కూడా మన యొక్క విశ్వాసంలో ధృడపడాలి. అంటే అది కేవలం మాట ద్వారా మాత్రమే కాకుండా మనయొక్క చేతల ద్వారా మనము ధ్రువపరుస్తూ ఉండాలి.
బ్రదర్. రవి నరెడ్ల ఓ.సి.డి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి