సొలొమోను జ్ఞానం గ్రంధం 7:7-11
హెబ్రియులు 4:12-13
మార్కు 10:17-30
క్రీస్తునాదునియాందు ప్రియా సహోదరి సహోధులరా, ఈనాడు మనమందరం కూడా సామాన్య కాలపు ఇరవై ఎనిమిదవ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాటి మూడు పఠనలను శ్రద్దగా గమనించినట్లయితే, మూడు పఠనలు కూడా ఆధ్యాత్మిక జీవితంలో నిజమైన సంపద, జ్ఞానం మరియు దేవుని వాక్యానికి సంబంధించిన గొప్పతనాన్ని గురించి వివరిస్తాయి. ఎందుకంటే సొలొమోను జ్ఞానగ్రంధంలో జ్ఞానాన్ని భౌతిక సిరి సంపదల కంటే గొప్పగా భావించడం చూస్తున్నాము, రెండవ పఠనంలో హీబ్రీయులకు వ్రాసిన లేఖలో దేవుని వాక్యం, మన జీవితాలను మర్చి పరిశీలించగల శక్తి గురించి చూపిస్తుంది. చివరిగా సువిశేష పఠనములో యేసు ధనవంతులకున్న సవాళ్లను ప్రస్తావించి, *వారినందరిని కూడా హెచ్చరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో సంపదకు నిర్బంధం వద్దని* తెలియజేస్తున్నాడు. ముందుగా మొదటిపఠనమును ద్యానించినట్లయితే, సొలొమోను జ్ఞానగ్రంధంలో చూస్తున్నాము, సొలొమోను తన జీవితంలో జ్ఞానాని ఏవిధంగా దేవుని దగ్గరనుండి పొందడో మరియు దాని విలువ ఎంత గొప్పదో చెప్పే వాక్యాలను చూస్తున్నాము. ఈ గ్రంథంలోని ఈ యొక్క భాగం మనకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక గుణ పాఠాన్ని నేర్పిస్తుంది. సత్యమైన జ్ఞానం లేదా బుద్ధి అనేది దేవుని నుండి లభించేది, మరియు అది భౌతిక సంపదల కంటే చాలా ఇలువైనది మరియు చాలా గొప్పది. ఎందుకంటే, 7:7 లో సొలొమోను జ్ఞానం కోసం ప్రార్థించాను అని చెబుతుంటాడు. దీనిలోని సారాంశం ఏమిటంటే మనం నిజమైన జ్ఞానాన్ని పొందడానికి దేవుని మీద ఆధారపడి జీవించాలి, ఆవిధంగానైతే సొలొమోను తనను తాను తగ్గించుకొని దేవుని మందట మొకరించి భక్తి విశ్వాసలా తోటి జ్ఞానం కోసం, దేవుని దగ్గర ప్రార్థించడం వలన దేవుడు అతని ప్రార్థనను ఆలకించి, తన యొక్క కృపను అయనపై కుమ్మరించి దివించటం చూస్తున్నాము. సొలొమోను తాను పొందినటువంటి జ్ఞానాన్ని గురించి ఎంతో విలువైనదిగా చెప్పడం చూస్తున్నాము, ఎందుకంటే బంగారమును జ్ఞానముతో సమానంగా చూడలేము, సొలొమోను సంపద మరియు భౌతిక వసతులకంటే అయన పొందినటువంటి జ్ఞానం చాలా గొప్పదిగా మరియు విలువైనదిగాను స్పష్టం చేసి యున్నాడు. దీనిని మనం ఒక ఉదాహరణగా తీసుకుంటె మన జీవితంలో నిజమైన సంపద అనేది దేవుని జ్ఞానములోనే ఉందని గుర్తుచేస్తుంది.
రెండొవ పఠనములో హెబ్రీయులకు వ్రాసిన లేఖలో 4:12-13 రెండు వాక్యాలు, దేవుని వాక్యానికి మరియు దాని శక్తికి సంబంధించినవిగా కనిపిస్తున్నాయి. ఈ వాక్యాలు మన ఆధ్యాత్మిక జీవనంలో గంభీరమైన ప్రభావాన్ని చూపుతాయి.
ఇది కేవలం ఒక మానవ జ్ఞానానికి సంబంధించినది కాదు, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్న అత్యంత ఆంతరంగిక భావాలను కూడా పరిశీలించగలిగేది. ఇది మన ఆత్మను మరియు మన జీవితాన్ని పరిశీలించి దేవుని ముందు మన జీవితం ఏవిధంగా ఉందొ తెలియజేస్తుంది. ఎందుకంటే
దేవుని దృష్టిలో ఏది కూడా దాచబడదు, ఎందుకంటే మనకు దేవుని న్యాయ స్థానం ముందు, మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలో స్పష్టతనిస్తుంది. పాపమును మనం దాచుకోవాలనుకున్నా, దేవుని కళ్లకు అది దాగదని ఈ వాక్యం గట్టిగా హెచ్చరిస్తుంది. కాబట్టి, దేవుని ముందు మనము నిజాయితీగా, పవిత్రంగా ఉండేలా మన మనసును పరిశీలించుకోవాలి.
దేవుని వాక్యం మనలోని లోతులు, మనసు, ఆత్మ, మరియు ఆలోచనలను పరిశీలించుకోవడానికి ఒక పిలుపుగా ఉన్నాయి.
చివరిగా సువిశేష పఠనము మార్కు 10:17-30 వచనలలో యేసు మరియు ఒక ధనవంతుడు మధ్య సంభాషణను గురించి చూస్తున్నాము. ఒక ధనవంతుడు యేసు వద్దకు వచ్చి నేను నిత్యజీవం పొందడానికి ఏం చేయాలి? అని ఆడిగినప్పుడు. యేసు ముందుగా ఇచ్చినటువంటి సమాధానం ఆజ్ఞలను పాటించాలని చెబుతాడు, కానీ ధనవంతుడు అన్నీ పాటించానని అంటాడు. దీంతో యేసు అతనికి తన ధనాన్ని పేదలకు ఇచ్చి, స్వర్గంలో నిధులు సొంతం చేసుకోవాలని చెప్పాడు. అయితే, ఆ ధనవంతుడు తన ఆస్తిని విడిచిపెట్టలేక బాధతో వెళ్ళిపోయాడు. ఇక్కడ యేసు ధనవంతులకు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం అని చెబుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలరా మన జీవితంలో ఇది భౌతిక సంపదలను మనం ఎక్కువగా ప్రేమ చూపిస్తే, ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టడం కష్టం అవుతుందని సూచిస్తుంది. ఆస్తి మన మనసును దేవుని నుండి దూరం చేయగలదని తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గమనించలి ఎందుకంటే పేతురు మరియు ఇతర శిష్యులు తమ జీవితాలను యేసు కోసం విడిచిపెట్టినట్లు అని యేసుతో చెప్పినప్పుడు, యేసు వారికి ఒక గొప్ప భరోసాను ఇస్తున్నాడు, అదేమిటంటే ఇహలోకంలోనే వారు ఆశీర్వాదాలు పొందుతారు అని మరియు పునరుత్థానంలో నిత్యజీవం వారికి ఉంటుందని చెప్పారు.
ప్రియా దేవుని బిడ్డలరా మన జీవితాలలో కూడా దేవుని జ్ఞానం, వాక్యం మరియు నిత్య జీవితం అనేవి ఎంతో గొప్పవి కాబట్టి మనం వాటి కొరకై దేవునితో సంఖ్యత కలిగి జీవించాలని ఈ పూజ బలిలో ప్రార్దించుకుందాము.
Fr. Johannes OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి