February 25
సిరా 2:1-11
మార్కు 9:30-37
వారు ఆ స్థలమును వీడి గలిలీయ ప్రాంతమునకు వెళ్లిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికిని తెలియకూడదని ఆయన కోరిక. ఏలయన, "మనుష్యకుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును. వారు ఆయనను చంపుదురు కాని మరణించిన మూడవదినమున ఆయన పునరుత్తానుడగును" అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి. అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతట వారు కఫర్నామునాకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను "మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి?" అని అడిగెను. తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించు కొనియుండుటచే వారు ప్రత్యుత్తరమీయలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబిలిచి, "ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై, అందరకు సేవకుడుగా ఉండవలయును"అని పలికెను. మరియు ఆయన ఒక చిన్నబిడ్డను చేరదీసి వారి మధ్యనుంచి, వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, "ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించినవాడగును. నన్ను స్వీకరించినవాడు నన్నుకాదు , నన్ను పంపినవానిని స్వీకరించుచున్నాడు" అనెను.
యేసు ప్రభువు , పన్నెండు మందిని పిలిచి, మీలో ఎవరైనా మొదటివారిగా ఉండాలనుకుంటే, అతను చివరివాడిగా మరియు అందరికీ సేవకుడిగా ఉండాలని చెబుతున్నాడు. అంతకు ముందు యేసు ప్రభువు తనకి అత్యంత సన్నిహిత శిష్యులను, తీసుకొని ఒక రహస్య ప్రదేశానికి ప్రార్ధించుటకు వెళ్ళాడు, తరువాత వారు కఫర్నముకు వచ్చారు, యేసు ప్రభువు వారిని దారిలో దేని గురించి వాదిస్తున్నారని అడిగాడు. ఎవరు గొప్పవారో వారు వాదించుకుంటున్నారని వారు అంగీకరించడానికి ఇష్టపడలేదు. అది ప్రభువుకు వారు చెప్పలేక పోయారు.
మొదటివారిగా ఉండాలనుకునే ఎవరైనా చివరివారై ఉండాలి, అందరికీ సేవకుడుగా కావాలని ప్రభువు చెప్పాడు. కేవలం అది చెప్పడంతో ఆగిపోకుండా ఒక చిన్న బిడ్డను తీసుకొని , వారి మధ్య ఉంచి తన పేరు మీద ఒక బిడ్డను స్వాగతించేవాడు తనను స్వాగతిస్తాడని చెబుతున్నాడు. చిన్నవాడిని లేక ఇతరుల మీద ఆధారపడేవారిని ఆహ్వానించడం మనలను దైవ స్వభావం కలిగేలా చేస్తుంది. ప్రపంచం తరచుగా నాయకత్వాన్ని, అధికారంతో, శక్తితో సమానం చేస్తుంది.
దేవుని రాజ్యంలో, అధికార సమీకరణం తారుమారు అవుతుంది. మనం సేవ చేయడం ద్వారా నాయకత్వం వహిస్తాము, దిగువకు మారడం ద్వారా ఉన్నతంగా వెళ్తాము, అత్యల్పంగా ఉండటం ద్వారా అధికారాన్ని ఉపయోగిస్తాము. స్వార్థపూరిత నాయకత్వానికి అలవాటుపడిన ప్రపంచంలో ఇది అర్ధవంతం కాదు. దేవుడిని ప్రేమించడం మరియు ఒకరినొకరు ప్రేమించుకోవడం అనే రెండు గొప్ప ఆజ్ఞలు ఉన్న సమాజ మాత్రమే లో, లోక నియమాలను తిప్పికొట్టకలుగుతుంది. .
మనం ఇతరులకు సేవ చేసినప్పుడు నాయకత్వం వస్తుంది. ప్రజలకు సహాయం చేయడంలో ప్రభావం వస్తుంది. అది మనం కోరుకునేది కాదు, ఎందుకంటే మనం కోరుకునేది సేవ చేయడమే. సేవ చేయడంలో అవకాశం నాయకత్వం వహించడానికి రావచ్చు.
Br. Pavan OCD