20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

25 వ సామాన్య ఆదివారము

25 వ సామాన్య ఆదివారము 

సొలొమోను జ్ఞాన గ్రంధము 2:17-20, 
యాకోబు 3:16-18, 4:1-3
మార్కు 9:30-37

క్రీస్తునాధుని యందు ప్రియ సహోదరీ సహోదరులారా ఈనాటి మూడు పఠణాలను గ్రహించినట్లయితే మూడు పఠణాలు కూడా మనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక బోధనలు లేదా అంశాలను ఇస్తున్నాయి.  అదేమిటంటే ధర్మంతో నిలబడటం నిజమైనటువంటి జ్ఞానాన్ని మరియు శాంతిని సూచించటం, అంతే కాకుండా దేవుని సేవ చేయడంలో నిజమైన గొప్పతనం ఏమిటో మనకందరికి కూడా క్లుప్తంగా వివరిస్తున్నాయి.
 ముందుగా మొదటి పఠణాని మనం గ్రహించినట్లయితే సొలోమోను జ్ఞాన గ్రంథము రెండవ అధ్యాయము 17 నుండి 20 వచనాలనలలో ధర్మాత్మునిపై లేదా పుణ్యాత్ములపై దుర్మార్గులు చేసేటువంటి కుట్రలు మరియు వారి వంకర బుద్ధులను చూపిస్తున్నాయి. వారు నిజమైన ధర్మాన్ని ద్వేషించటమే కాకుండా, ధర్మాన్ని పాటించే వారిని కూడా ఎగతాళి చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని దూషించడమే కాకుండా దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచే వారందరిని కూడా వారు అవమాన పరుస్తున్నారు. ఇక్కడ ధర్మంతో కూడిన వ్యక్తిని మరియు అతని యొక్క నిజాయితీని కూడా పరీక్షించాలని పన్నాగం పొందుతున్నారు.
అంతేకాకుండా వారు మంచిగా జీవించే వ్యక్తులను,  వారి విశ్వాసాన్ని, వారికి దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకానికి వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే మంచివారిని నాశనం చేయాలని, దేవుని దూషించాలని చూస్తుంటారో వారందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడని మరియు మంచివాని పట్ల దేవుని దయ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ, దేవునికి దగ్గరగా నివసించే వారికి ఎప్పుడు కష్టాలు, బాధలు మరియు అవమానాలు వస్తూనే ఉంటాయి. అటువంటి సమయాలలో మంచివారు దేవునికి దగ్గరగా జీవించినట్లయితే కచ్చితంగా దేవుని చేత దీవించబడతాడు అని మొదటి పఠనం మనకు అందరికీ కూడా తెలియజేస్తుంది. మరి రెండవ పఠనని చూసినట్లయితే యాకోబు రాసినటువంటి లేక మూడవ అధ్యయం ముఖ్యంగా 16 వ వచనంలో చూస్తున్నాము. ఎక్కడైతే ఈర్ష మరియు స్వార్థం ఉంటుందో అక్కడ ఎప్పుడూ అల్లకల్లోలం ఉంటుంది.  అంతేకాకుండా చెడు పనులు,  చెడు వ్యసనాలు  ఉంటాయి, కానీ యాకోబు గారు ఏమి చెబుతున్నారంటే మనకు ఉండవలసినటువంటి మంచి జ్ఞానాన్ని గురించి వివరిస్తున్నాడు. దేవుని నుండి వచ్చే జ్ఞానం ఎంతో స్వచ్ఛమైనది ఎందుకంటే అది శాంతిని మరియు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇది క్రైస్తవుల మైనటువంటి మనకందరికీ కూడా ఒక గొప్ప గుణపాటాన్ని నేర్పిస్తుంది. ఎందుకంటే నిజమైన జ్ఞానం అనేది స్వార్థం, ఈర్ష మరియు అసంతృప్తితో కూడింది కాదు, కానీ జ్ఞానం అనేది ఎప్పుడు ఇతరుల మేలు కోరుకునేది. అంతేకాకుండా, ఎప్పుడు ఒకరికి మేలు చేసేదే కానీ కీడు చేసేది కాదు అని పునిత యాకోబు గారు మనకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. చివరిగా విశేష పఠణని గమనించినట్లయితే, ఏసుప్రభు శిష్యుల మధ్య వచ్చినటువంటి గొప్పతనం యొక్క చర్చల గురించి తెలియజేస్తుంది. గొప్పతనం అంటే మన గురించి మనం గొప్పలు చెప్పుకోవటం కాదు,  కానీ నేటి సమాజంలో మనం చూస్తూనము. మనం ఏదైనా ఒక చిన్న మంచి పని చేస్తే దాని పదిమంది దగ్గర గొప్పలు చెప్పుకుంటమో, అదేవిధంగా ఈనాడు శిష్యులు కూడా వారిలో వారు నేను గొప్పవాడిని నేను గొప్ప వాడిని అని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు, వారి మాటలను ఆలకించినటువంటి క్రీస్తు ప్రభువు వారితో ఈ విధంగా అంటున్నారు. ఒక చిన్న పిల్లవాని ఉదాహరణగా తీసుకొని అంటున్నాడు, మీలో ఎవరైనా గొప్పవాడు కాదల్చిన  వాడు ముందుగా సేవకుని వలే జీవించాలని, ఎప్పుడైతే నీవు సేవకుని వాలే జీవిస్తావో అప్పుడే నీవు గొప్పవాడిగా పరిగణింప పడతావని క్రీస్తు ప్రభు అంటున్నారు. ఎందుకు ఏసుప్రభువు ఈ విధంగా అంటున్నారు అంటే గొప్పతనం అనేది ఏమిటంటే కేవలం సేవ చేయటం. మరి ఈ సేవ చేయాలంటే మనలను మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే అలా మనలని మనం తగ్గించుకొని జీవించగలుగుతామో అప్పుడే మనం దేవుని చేత ఆశీర్వదించబడి గొప్పవాడిగా పరిగణింపబడతామని క్రీస్తు ప్రభువు సువిశేష పఠనంలో సెలవిస్తున్నాడు. 
కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా మన జీవితాలలో కూడా అనేకసార్లు తప్పుడు మార్గాలలో ప్రయాణించి, తప్పుడు ఆలోచనలతో జీవించి, నేనే గొప్పవాని అని బ్రతుకుతుంటాము, అటువంటి వారందరికీ కూడా ఈనాటి మూడు పఠణాలు ఒక గొప్ప గుణపాటాని నేర్పిస్తున్నాయి. కాబట్టి ఇప్పటినుండి దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని, ఎప్పుడు మంచినే ఎంచుకుంటూ ఉండాలని ఈ దివ్య బలి పూజలో భక్తి విశ్వాసాలతోటి ప్రార్థించుకుందాం.  ఆమెన్.

ఫా. జ్వాహాన్నెస్ OCD

14, సెప్టెంబర్ 2024, శనివారం

24 సామాన్య ఆదివారం


యెషయా 50: 4-9, యాకోబు 2:14-18, మార్కు 8: 27-35

ఈనాటి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క సేవకుల/ శిష్యుల జీవితం గురించి తెలుపుచున్నది. ప్రభువు యొక్క శిష్యులు ఏ విధంగా ఉండాలి అన్నది ప్రధానమైన అంశం. ఈనాటి మొదటి పఠణంలో యెషయా ప్రవక్త బాథామయ సేవకుని గురించి తెలియజేస్తున్నారు. ఈ యొక్క సేవకుని యొక్క గీతము ముఖ్యంగా మూడు అంశాలు చూస్తున్నాం. మొదటిగా దేవుడు సేవకుని ఎన్నుకొనుట. 
రెండవదిగా సేవకుడు తన యొక్క జీవితమును సేవ కొరకు త్యాగం చేయుట.
మూడవదిగా, ఏ విధముగా దేవుడు తనను ఆపదల నుండి కాపాడతారు అంశమును తెలుపుచున్నారు. తండ్రి తన సేవకుని ఎన్నుకొని, బోధించుటకు  కావలసినటువంటి అనుగ్రహమును దయ చేస్తున్నారు. ఈ యొక్క సేవకుడు తన యొక్క పరిచర్య జీవితంలో అనేక రకములైనటువంటి నిందలు భరించవలసి ఉంటుంది అయినప్పటికీ వాటిని ధైర్యంతో దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతూ భరించారు. అన్యాయంగా ఆయనను బాధించినప్పటికీ, నేరము మోపినప్పటికీ ఆయన మాత్రం అన్నిటినీ మౌనంగా భరించారు ఎందుకనగా చివరి రోజును తన తరపున దేవుడు పోరాడుతారు అని నమ్మకం. ఈ సేవకుని గీతం ఏసుప్రభు యొక్క జీవితమునకు అక్షరాల వర్తిస్తుంది. మెస్సయ్య కొరకే ఈ యొక్క గీతము రాయబడి ఉన్నది. ఏసుక్రీస్తు ప్రభువు ఏ విధముగా శ్రమలను అనుభవించి మరణించబోతున్నారో, ఆయన పరిచర్య ఎలా సాగినదో, ఎలాగ తండ్రి మీద ఆధారపడ్డారో అంతయు కూడా ఈ గీతం ద్వారా అర్థమవుచున్నది.
ఈ మొదటి పఠణం ద్వారా మనం గ్రహించవలసిన సత్యము ఏమిటంటే.బాదామయ సేవకుడు ఏ విధముగానయితే తాను తన యొక్క బాధ్యతను నెరవేరుస్తూ తన ప్రాణములను త్యాగం చేశారో మరియు దేవుడు తనకు సహాయం చేస్తారని నమ్మకం ఉంచారు. మనం కూడా అదే విధంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత యాకోబు గారు దేవుని ప్రజల యొక్క జీవితం ఏ విధంగా ఉండాలో తెలిపారు అదేంటంటే విశ్వాసము దానికి తగినటువంటి క్రియలు రెండు కూడా క్రైస్తవుల యొక్క జీవితంలో ఉండాలి.  కేవలము విశ్వాసం మాత్రమే కాదు కలిగి ఉండవలసినది, విశ్వాసముతో పాటు క్రియలు కూడా ఉండాలి. అబ్రహాము ఏ విధముగానయితే విశ్వాసము కలిగి తన యొక్క విశ్వాసానికి తగినటువంటి క్రియలను ప్రదర్శించి ఉన్నారో అదేవిధంగా ఎవరైతే దేవుడిని అనుసరిస్తున్నాం అని చెప్పుకుంటున్నారో వారందరూ కూడా విశ్వాసానికి తగినటువంటి క్రియలు కలిగి ఉండాలి అప్పుడే మన క్రైస్తవ జీవితమనేది యదార్థం అవుతున్నది. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు అన్యుల యొక్క ప్రాంతంలో (కైసరియా ఫిలిప్పి) తాను ఎవరు అనే అంశమును గురించి ప్రజలు తెలుసుకున్నారా? లేదా అని ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకొనుట నిమిత్తమై ఏసుప్రభు ఈప్రశ్న అడుగుతున్నారు. 
ఈ సువిశేష భాగములో ఏసుప్రభు  ప్రశ్నను రెండు విధాలుగా అడగటం చూస్తున్నాం.
మొదటి ప్రశ్న ఏసుప్రభు తన శిష్యులు తన గురించి ఏమని అనుకుంటున్నారు అడుగుచున్నారు. 
రెండవ ప్రశ్న ఏసుప్రభు ప్రజలు తన గురించి ఏమని భావిస్తున్నారు అని అడిగారు.మొదటి ప్రశ్నకు సమాధానం యేసు ప్రభువును గూర్చి కొందరు బాప్తిస్మ యోహానని, కొందరు ఏలియా అని మరికొందరు ప్రవక్తలలో ఒకరిని భావించారు. ఎందుకంటే ఏసుప్రభు యొక్క పరిచర్య జీవితం ప్రజలలో ఒక నూతన అనుభూతిని కలిగించినది. ఆయన సత్యమును ప్రకటించారు, అన్యాయమును ఎదిరించారు, పేదల తరుపున పోరాడారు, మరణించిన వారిని జీవంతో లేపారు అందుకని ప్రజలు ప్రభువును గురించి ఒక్కొక్క భిన్న అభిప్రాయమును కలిగి ఉన్నారు. అదే ప్రశ్న తన శిష్యులను అడగగా పేతురు గారు మాత్రము నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు అని సాక్ష్యం ఇచ్చారు. ఇది సాక్షాత్తు దేవుడై తనకు ఎరుక పరిచారు. అదేవిధంగా పేతురు గారికి యేసుప్రభుతో ఉన్నటువంటి అనుభవమును బట్టి, ఆయన చూసిన కార్యములుబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయము ప్రభువునకు తెలియజేశారు. ఈరోజు మనందరం కూడా ధ్యానించవలసినటువంటి అంశం ఏమిటంటే యేసు ప్రభువు గురించి మనకు ఎలాంటి అభిప్రాయం ఉన్నది. ఆయనను మెస్సయ్యగా అంగీకరిస్తున్నామా. మన రక్షకునిగా తెలుసుకుంటున్నామా. ఆయన మన దేవుడు అని, ఆయన చూపించినటువంటి బాటలో మనం నడుస్తూ ఉన్నామా?. ఏసుప్రభువుని వెంబడించేటటువంటి శిష్యులకు ఉండవలసినటువంటి మూడు ప్రధానమైనటువంటి లక్షణములు గురించి ప్రభువు తెలుపుచున్నారు. నన్ను అనుసరింప గోరువాడు తనను తాను పరిత్యజించుకొని, సిలువను ఎత్తుకొని, అనుసరించవలెను అని ప్రభువు పలికారు. మొట్టమొదటిగా ప్రభువుని అనుసరించేటటువంటి పరిత్యజించుకొనే మనసు కలిగి ఉండాలి అనగా ప్రభువు కొరకు దేనినైనా విడిచి పెట్టే మనసు ఉండాలి. అదేవిధంగా సిలువ ఎత్తుకొని అనుసరించమని తెలిపారు అనగా బాధలను కష్టాలను ప్రేమతో చేకుని అనుసరించాలి. ప్రభువును వెంబడించుట అనగా ఆయన బోధన ప్రకారము జీవించుట ఆయన నడిచిన మార్గంలో నడుచుట. మన యొక్క విశ్వాస జీవితంలో ప్రభువుని ఆధ్యాత్మికంగా తెలుసుకొని ఆయనకు సాక్షులుగా జీవించాలి ఆయన ఒక బాటలో నడవాలి. ప్రభు యొక్క సేవా జీవితంలో ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే మన యొక్క విశ్వాసము క్రియలు ఒకే విధంగా ఉంటాయి

Fr. Bala Yesu OCD

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26 ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ...