20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

25 వ సామాన్య ఆదివారము

25 వ సామాన్య ఆదివారము 

సొలొమోను జ్ఞాన గ్రంధము 2:17-20, 
యాకోబు 3:16-18, 4:1-3
మార్కు 9:30-37

క్రీస్తునాధుని యందు ప్రియ సహోదరీ సహోదరులారా ఈనాటి మూడు పఠణాలను గ్రహించినట్లయితే మూడు పఠణాలు కూడా మనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక బోధనలు లేదా అంశాలను ఇస్తున్నాయి.  అదేమిటంటే ధర్మంతో నిలబడటం నిజమైనటువంటి జ్ఞానాన్ని మరియు శాంతిని సూచించటం, అంతే కాకుండా దేవుని సేవ చేయడంలో నిజమైన గొప్పతనం ఏమిటో మనకందరికి కూడా క్లుప్తంగా వివరిస్తున్నాయి.
 ముందుగా మొదటి పఠణాని మనం గ్రహించినట్లయితే సొలోమోను జ్ఞాన గ్రంథము రెండవ అధ్యాయము 17 నుండి 20 వచనాలనలలో ధర్మాత్మునిపై లేదా పుణ్యాత్ములపై దుర్మార్గులు చేసేటువంటి కుట్రలు మరియు వారి వంకర బుద్ధులను చూపిస్తున్నాయి. వారు నిజమైన ధర్మాన్ని ద్వేషించటమే కాకుండా, ధర్మాన్ని పాటించే వారిని కూడా ఎగతాళి చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని దూషించడమే కాకుండా దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచే వారందరిని కూడా వారు అవమాన పరుస్తున్నారు. ఇక్కడ ధర్మంతో కూడిన వ్యక్తిని మరియు అతని యొక్క నిజాయితీని కూడా పరీక్షించాలని పన్నాగం పొందుతున్నారు.
అంతేకాకుండా వారు మంచిగా జీవించే వ్యక్తులను,  వారి విశ్వాసాన్ని, వారికి దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకానికి వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే మంచివారిని నాశనం చేయాలని, దేవుని దూషించాలని చూస్తుంటారో వారందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడని మరియు మంచివాని పట్ల దేవుని దయ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ, దేవునికి దగ్గరగా నివసించే వారికి ఎప్పుడు కష్టాలు, బాధలు మరియు అవమానాలు వస్తూనే ఉంటాయి. అటువంటి సమయాలలో మంచివారు దేవునికి దగ్గరగా జీవించినట్లయితే కచ్చితంగా దేవుని చేత దీవించబడతాడు అని మొదటి పఠనం మనకు అందరికీ కూడా తెలియజేస్తుంది. మరి రెండవ పఠనని చూసినట్లయితే యాకోబు రాసినటువంటి లేక మూడవ అధ్యయం ముఖ్యంగా 16 వ వచనంలో చూస్తున్నాము. ఎక్కడైతే ఈర్ష మరియు స్వార్థం ఉంటుందో అక్కడ ఎప్పుడూ అల్లకల్లోలం ఉంటుంది.  అంతేకాకుండా చెడు పనులు,  చెడు వ్యసనాలు  ఉంటాయి, కానీ యాకోబు గారు ఏమి చెబుతున్నారంటే మనకు ఉండవలసినటువంటి మంచి జ్ఞానాన్ని గురించి వివరిస్తున్నాడు. దేవుని నుండి వచ్చే జ్ఞానం ఎంతో స్వచ్ఛమైనది ఎందుకంటే అది శాంతిని మరియు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇది క్రైస్తవుల మైనటువంటి మనకందరికీ కూడా ఒక గొప్ప గుణపాటాన్ని నేర్పిస్తుంది. ఎందుకంటే నిజమైన జ్ఞానం అనేది స్వార్థం, ఈర్ష మరియు అసంతృప్తితో కూడింది కాదు, కానీ జ్ఞానం అనేది ఎప్పుడు ఇతరుల మేలు కోరుకునేది. అంతేకాకుండా, ఎప్పుడు ఒకరికి మేలు చేసేదే కానీ కీడు చేసేది కాదు అని పునిత యాకోబు గారు మనకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. చివరిగా విశేష పఠణని గమనించినట్లయితే, ఏసుప్రభు శిష్యుల మధ్య వచ్చినటువంటి గొప్పతనం యొక్క చర్చల గురించి తెలియజేస్తుంది. గొప్పతనం అంటే మన గురించి మనం గొప్పలు చెప్పుకోవటం కాదు,  కానీ నేటి సమాజంలో మనం చూస్తూనము. మనం ఏదైనా ఒక చిన్న మంచి పని చేస్తే దాని పదిమంది దగ్గర గొప్పలు చెప్పుకుంటమో, అదేవిధంగా ఈనాడు శిష్యులు కూడా వారిలో వారు నేను గొప్పవాడిని నేను గొప్ప వాడిని అని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు, వారి మాటలను ఆలకించినటువంటి క్రీస్తు ప్రభువు వారితో ఈ విధంగా అంటున్నారు. ఒక చిన్న పిల్లవాని ఉదాహరణగా తీసుకొని అంటున్నాడు, మీలో ఎవరైనా గొప్పవాడు కాదల్చిన  వాడు ముందుగా సేవకుని వలే జీవించాలని, ఎప్పుడైతే నీవు సేవకుని వాలే జీవిస్తావో అప్పుడే నీవు గొప్పవాడిగా పరిగణింప పడతావని క్రీస్తు ప్రభు అంటున్నారు. ఎందుకు ఏసుప్రభువు ఈ విధంగా అంటున్నారు అంటే గొప్పతనం అనేది ఏమిటంటే కేవలం సేవ చేయటం. మరి ఈ సేవ చేయాలంటే మనలను మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే అలా మనలని మనం తగ్గించుకొని జీవించగలుగుతామో అప్పుడే మనం దేవుని చేత ఆశీర్వదించబడి గొప్పవాడిగా పరిగణింపబడతామని క్రీస్తు ప్రభువు సువిశేష పఠనంలో సెలవిస్తున్నాడు. 
కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా మన జీవితాలలో కూడా అనేకసార్లు తప్పుడు మార్గాలలో ప్రయాణించి, తప్పుడు ఆలోచనలతో జీవించి, నేనే గొప్పవాని అని బ్రతుకుతుంటాము, అటువంటి వారందరికీ కూడా ఈనాటి మూడు పఠణాలు ఒక గొప్ప గుణపాటాని నేర్పిస్తున్నాయి. కాబట్టి ఇప్పటినుండి దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని, ఎప్పుడు మంచినే ఎంచుకుంటూ ఉండాలని ఈ దివ్య బలి పూజలో భక్తి విశ్వాసాలతోటి ప్రార్థించుకుందాం.  ఆమెన్.

ఫా. జ్వాహాన్నెస్ OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...