2, ఏప్రిల్ 2022, శనివారం
తపస్సుకాల 5 వ ఆదివారం
26, మార్చి 2022, శనివారం
తపస్సు కాల 4 వ ఆదివారం
తపస్సు కాల 4 వ ఆదివారం
యెహోషువ 5: 9, 10-12 , 2వ కొరింతి 5: 17-21 , లూకా 15: 1-3, 11-32.
ఈ నాటి ఆదివారమును తల్లి శ్రీసభ ఆనందించు ఆదివారం అని ప్రకటిస్తుంది.
-రాబోయేటటువంటి పునరుత్తానా రోజులను స్మరించుకొని మనందరం సంతోషంతో ఉండాలని ఈ ఆదివారం యొక్క ఉద్దేశం.
-ఈనాటి మూడు దివ్య పఠనాలు కూడా ఆనందించుటను గురించి బోధిస్తున్నాయి.
-తపస్సుకాలపు నాల్గొవ ఆదివారంలోకి ప్రవేశించాం ఇక కొన్ని రోజులలో ప్రభువు యొక్క సిలువ శ్రమలు, మరణ పునరుత్తానం లో బాగస్తులమై జీవించ బోతున్నాం కాబట్టి మనం ఆనందించాలి.
-మనకు మేలు జరుగుతుందని ఆనందించాలి, మనం రక్షణ పొందే గడియ ఆసన్నమగుచున్నదని ఆనందించాలి.
-ప్రతి ఒక్కరం ఆనందంగా ఉండాలని కోరుకుంటాం అందుకోసం రోజు చాల ప్రయత్నం చేస్తుంటాం.
-మనందరం మన యొక్క కుటుంబాలలో ఆనందంగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ శ్రమలు అనుభవించారు.
-మనము ఈ తప్పస్సుకాలములో దేవునితో మరియు తోటి మానవునితో సక్యపడి జీవించాలి అప్పుడు మనలో నిజమైన సంతోషం ఉంటుంది.
- ఈనాటి మొదటి పఠనంలో ఇశ్రాయేలు ప్రజలు స్వేచ్ఛతో ఆనందంగా చేసుకున్న పండుగను గురించి చదువుతున్నాం.
-దేవుడు ఇశ్రాయేలుకు స్వేచ్ఛనిచ్చిన పండుగ వారు ఆనందంగా కొనియాడుచున్నారు.
-మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత భూమికి ప్రయాణం చేయసాగారు. ఆయన తరువాత ఇశ్రాయేలును వాగ్దత భూమికి నడిపించింది యెహోషువ ప్రవక్తయే.
-మోషే కేవలం ఇశ్రాయేలీయులను వాగ్దత భూమికి దగ్గరకు మాత్రమే వారిని నడిపించారు, కానాను ప్రాంతంలో ఆయన అడుగు పెట్టలేదు. తన శిష్యుడైన యెహోషువ మాత్రమే ప్రజల తోటి అందు ప్రవేశించారు .
-యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత భూమిలో ప్రవేశించిన ప్రదేశానికి “గిల్గాలు” అనే పేరు వచ్చింది.
-గిల్గాలు అంటే పన్నెండు రాళ్ల వృత్తం అని అర్థం. ఈ పన్నెండు రాళ్లూ యాకుబు యొక్క 12 మంది కుమారులయొక్క జాతులకు చిహ్నం గా ఉన్నవి. యెహోషువ 4 :2 -3 .
-ఈ పన్నెండు రాళ్లతో దేవుని యొక్క బలిపీఠమును నిర్మిస్తున్నారు. ఈ రాళ్లు ఎందుకంటే దేవుడు చేసిన మేలు తలంచు కోవటానికి ఇశ్రాయేలు ప్రజలు దివ్యమందసంతో యోర్దాను నది దాటేటప్పుడు దేవుడి వారికి ఆరిన నేలను చేశారు. నదిలో నడిచి వెళ్ళుటకు దేవుడు మార్గం సిద్ధంచేశారు. ఆయన మేలులు గుర్తుంచుకొనటంకు ఈ బలిపీఠం నిర్మిస్తున్నారు. యెహోషువ 4 :7 .
-ఈ పన్నెండు జాతులలో దేవుడు తన ప్రజలను నియమించెను, వారిని తన బిడ్డలుగా ఎన్నుకొనెను.
వాగ్దత భూమిలో ఇశ్రాయేలు ప్రజలు ఆనందంతో జరుపుకున్న తోలి పాస్కా పండుగ గురించి వింటున్నాం.
-యావే దేవుడు అంటున్నారు " నాటి అపకీర్తిని నేను మీనుండి తొలగించితిని" అని చెపుతున్నారు.
-వారియొక్క అపకీర్తి ఏమిటంటే సున్నతి పొందక పోవడమే యెహోషువ 5: 4 - 5.
-ఐగుప్తు దాటినా తరువాత ఎడారిలో జన్మించిన వారు సున్నతి పొందలేదు. యూదులు దేవుని బిడ్డలుగా ఉండుటకు సున్నతి చాల అవసరం. ఆది 17 : 10 -11 .
-సున్నతి చేయుట ద్వారా వారందరు అబ్రహం సంతతిగా పరిగణించబడతారు. దీనివలన దేవుని యొక్క మన్ననను పొందుచున్నారు.
-ఈ అపకీర్తి అంటే ప్రజలయొక్క దురాలోచనలు దేవుడు తొలగించారు. ఎప్పుడెప్పుడు ఐగుప్తుకు తిరిగి వెళ్లాలన్న ఆలోచనలను అన్నింటిని దేవుడు తొలగించారు. ఇంకొక విధంగా చెప్పాలంటే అపకీర్తి అంటే బానిసలుగా వున్నవారికి స్వేచ్ఛనిచ్చి గౌరవించటం .
-దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చి వారికి ఒక గుర్తింపునిచ్చారు. దానివలన వారియొక్క అపకీర్తి అంతా తొలగి పోయింది.
-మన జీవితాలలో ఉన్న అపకీర్తిని కూడా దేవుడు తొలగించి మనల్ని రక్షిస్తాడు.
-వాగ్దత భూమిలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతో ఆనందంగా తోలి పంటను రుచి చూశారు.
-అక్కడ మన్నా ఆగిపోయినది. ఎందుకంటే ఇక వాగ్దత భూమిలో పండించే పంట సమృద్ధిగా ఉంటుంది కాబట్టి దేవుడు మన్నాను ఆపివేశారు . దేవుడు వారికి ఎటువంటి కొరత రాకుండా చూస్తారు.
-ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆనందం చూస్తున్నాం.
-ఈ నాటి రెండవ పఠనంలో మనం క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి అని పలుకుచున్నారు.
-మనందరం క్రొత్త వాళ్లమైతే చాల సంతోషంగా, మంచిగా ఉంటుంది. మనయొక్క కుటుంబ సభ్యులకు అలాగే దేవునికి ఆనందంగా ఉంటుంది.
-మనం నిజంగా క్రీస్తునందు జీవిస్తే నూతన సృష్టిగా చేయబడతాం. కొరింతు సంఘంలోని ప్రజలు దేవుణ్ణి నమ్ముకొని జ్ఞాన స్నానం పొందటం ద్వారా ఒక నూతన సృష్టిగా చేయబడుచున్నారు. మనం దేవుని యందు ఉంటే మన జీవితాలు కూడా మారుతాయి.
-దానికి నిదర్శనం పౌలు గారి జీవితమే. గలతీ 2 : 20 ఇక నాలో జీవించేది నేను కాదు క్రీస్తుయే అని పౌలు గారు పలుకుచున్నారు.
-క్రీస్తునందు ఎవరైనా ఉండాలంటే ఈ లోకంలో వున్న చెడును విడిచిపెట్టి దేవుడిని వెంబడించాలి.
-క్రీస్తునందు ఉండాలంటే మనలో పరిత్యజించుకునే లక్షణం ఉండాలి. ఆయన యందు ఉండటం కోసం ఏదైనా త్యాగం చేసే గుణం మనలో ఉండాలి.
-క్రైస్తవులుగా మనం క్రొత్తవ్యక్తులుగా మారడానికి మన యొక్క సొంత శక్తి ప్రయత్నం కాదు కానీ తండ్రి దేవుడు మనమీద చూపిన దయవలనే అది కారణం.
-పౌలు గారు తనకు దేవుడు అప్పచెప్పిన పరిచర్యగురించి కూడా తెలుపుచున్నారు. క్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మానవులతో ఏర్పరిచిన సఖ్యత గురించి భోదించటమే దేవుడిచ్చిన పని అని తెలుపుచున్నారు.
-సఖ్య పడి జీవించమని పౌలుగారు పలుకుచున్నారు. 2 కొరింతి 5: 20.
సఖ్య పడితే దేవునికి ఇష్టమే మన పొరుగువారికి ఇష్టమే ఇద్దరుకూడా సంతోషంగా ఉండగలరు.
-మనం సఖ్య పడాలంటే దేవుని యందు ఉండాలి. ఆయన యందు లేకపోతె మన జీవితాలు మారవు.
-మోషే 40 రోజులు దేవుని యందు ఉన్నారు ఆయన ముఖం ప్రకాశవంతంగా మారింది.
-పేతురు దేవునియందు ఉన్నారు. ఆయన జీవితం మారిపోయింది .
-జక్కయ్య జీవితం, వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ, వీరి జీవితాలు మారిపోయాయి.
మనం కూడా క్రీస్తునందు జీవిస్తే మనం కూడా మారతాం. కానీ మనం ఎక్కువగా క్రీస్తునందు జీవించము. ఆయన యొక్క సాన్నిధ్యం మనలను మార్చివేస్తుంది. పౌలుగారి యొక్క జీవితమును మార్చివేసింది.
-క్రీస్తునందు జీవించాలంటే ఇహలోక వాంఛలకు దూరంగా ఉండాలి అప్పుడు దేవునియందు మనం ఉండగలం.
-ధనికుడైన యువకుడు క్రీస్తులో ఉండకుండా ధనం వెంబడి పోయాడు. యేసు ప్రభువుయొక్క శిష్యులు తనతో ఉన్నారు, కాబట్టి సామాన్యులైన వారి జీవితాలు చాలా మారిపోయాయి.
-క్రీస్తునందు మనం కూడా జీవిస్తే మనం నూతన వారిగా చేయబడతాం. పాతవి నశించి క్రొత్తవి ఏర్పడతాయి. కాబట్టి క్రీస్తునందు జీవిస్తే నూతన జీవితం, నూతన ఆలోచనలు, మాటలు అన్ని ఉంటాయి.
-ఈనాటి సువిశేష పఠనంలో దేవుని యొక్క గొప్ప ఆనందం గురించి వింటున్నాం.
కేవలం తండ్రియొక్క ఆనందం మాత్రమే కాదు ఇక్కడ మనం చూసేది తప్పిపోయిన కుమారుడి ఆనందం కూడా ఎందుకంటే నిరాకరించిన తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి కుమారుణ్ణి ఏమి అనకుండా ఆయన్ను స్వీకరించారు, అందుకు కుమారుడు చాల ఆనందంగా ఉన్నారు.
-లూకా సువార్త 15 వ అధ్యాయం మొత్తం కూడా తప్పిపోయిన వాటిగురించి భోదిస్తుంది.
-తప్పిపోయిన గొర్రె
-తప్పిపోయిన నాణెము
-తప్పిపోయిన కుమారుడు.
-తప్పిపోయిన గొర్రె, నాణెముల ఉపమానములు తప్పిపోయిన కుమారిని ఉపమానంకు ఒక వ్యత్యాసం ఉంది.
-తప్పిపోయిన గొర్రె, మరియు నాణెముల ఉపమానాలతో స్వయంగా దేవుడే, యజమానుడే వాటిని వెదకుచున్నారు కానీ తప్పి పోయిన కుమారుని యొక్క ఉపమానంలో తండ్రి కుమారుని వెదకటం లేదు, కుమారునికి స్వేచ్ఛనిచ్చారు. తనయొక్క స్వేచ్ఛ జీవితంలో కుమారుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నారు. మిగతా వాటికన్నా మానవుణ్ణి దేవుడు ఎక్కువగా ప్రేమించారు. అందుకే స్వేచ్ఛనిచ్చి ఎప్పుడు తన చెంతకు పశ్చాత్తాప పడి తిరిగి వస్తాడని ఎదురు చూశారు, తండ్రి.
-ఈ సువార్త పఠనంలో చాల విషయాలు మనం ధ్యానించుకోవచ్చు దేవుని యొక్క గొప్ప దయా హృదయం మనకు ఇక్కడ అర్థమగుచున్నది దేవుడు మనలను ఎంతగా క్షమిస్తారో తెలుస్తుంది.
తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో మూడు ముఖ్యమైన పాత్రలున్నాయి.
-తండ్రి- అనంత ప్రేమ కలిగిన తండ్రి
-చిన్నకుమారుడు -తప్పిపోయిన కుమారుడు.
-పెద్దకుమారుడు -నటించే పెద్దకుమారుడు
-కొన్ని సందర్భాలలో ఈ ముగ్గురు వ్యక్తులు పోలినవారంగా మనందరం ఉంటాం.
-ఈ ఉపమానం ప్రభువు తెలుపుటకు కారణం ఏమిటంటే పరిసయ్యులు సద్దుకయ్యలు తాము నీతిమంతులమని చెప్పుకొనుచు పశ్చాత్తాప పడకుండా ఇతరులను హీనంగా చూస్తున్నారు కాబట్టి దేవుడు పాపులను సుంకరులను ఎలాగా ఆదరిస్తారో ఈ యొక్క ఉపమానం ద్వారా తెలియచేస్తున్నారు.
-ఆ నాటి యుద్ధ సమాజంలో అలాగే నేటి ఆధునిక యుగంలో మూడు వర్గాల ప్రజలను సూచిస్తున్నాయి ఈ మూడు పాత్రలు.
తమ పాపాలకు పశ్చాత్తాప పడి దేవుని చెంతకు తిరిగి వచ్చిన పాపాత్ములు -చిన్న కుమారునికి సూచనగా ఉన్నారు.
-పశ్చాత్తాపంతో తన చెంతకు తిరిగి వచ్చి క్షమించమని కోరినప్పుడు వెంటనే క్షమించి తన చెంత చేర్చుకోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్న దేవుణ్ణి -తండ్రికి సువార్తలో సూచనగా ఉంది.
-మూడవ పాత్ర దారులు - మేము మాత్రమే నీతిమంతులమని చెప్పుకొనే యూదులు పెద్దకుమారునికి సూచనగా ఉన్నాయి. యూదులు ఎప్పుడు కూడా విమర్షించే వారే దేవుని దయను, ప్రేమను సరిగా అర్థం చేసుకోకుండా ఆయన్ను విమర్షించారు, నిందించారు.
ఈ మూడు పాత్రలను గురించి తెలుసుకుందాం.
చిన్నకుమారుడు- చిన్న కుమారుణ్ణి మనం తప్పి పోయిన కుమారునిగా పిలుస్తున్నాం.
చిన్నకుమారుడు తండ్రి నుండి స్వేచ్ఛను కోరుకొని తన తండ్రి సంపదనుండి తన హక్కుగా రావలసిన మూడవ వంతు వాటాను బలవంతంగా పంచుకొని వెళ్ళాడు.
-తండ్రియొక్క విలువను, ప్రేమను, ఆయన చూపించే ఆ యొక్క ఆదరణను గ్రహించలేకుండా చిన్న కుమారుడు తండ్రితో వున్న భందమును తెంచుకొని తన యొక్క సొంత ఆనందాలు అనుభవించటానికి దూరంగా వెళ్లుచున్నాడు, తండ్రి ప్రేమను తిరస్కరించి వెళ్తున్నాడు.
-జల్సా చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతూ, తన ఆస్తినంతా పోగొట్టుకొని చివరికి ఒక హీనమైన పని చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎవ్వరుకూడా ఏమి ఇవ్వలేదు అంత దురదృష్టకరమైన స్థితి 15 : 16 .
-తనకు ధనమున్న క్షణంలో ఏమి గుర్తుకు రాలేదు. తన తండ్రి కూడా గుర్తుకు రాలేదు. కానీ అన్ని కోల్పోయిన్నప్పుడు తండ్రి గుర్తుకు వస్తున్నాడు.
-మనజీవితంలో కూడా చాలా మందికి డబ్బున్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. చిన్న కుమారుని వలే జీవిస్తాం.
తనయొక్క హీన స్థితిలో కను విప్పు కలిగెను అని 17 వ వచనంలో చెప్పబడింది.
-ఈ కనువిప్పు మనలో కూడా కలగాలి. నేను ఎలాంటి తప్పు చేశానని కనువిప్పు కలిగింది . కనువిప్పు అంటే చేసిన తప్పు తెలుసుకోవడమే.
-చేసిన తప్పు మనస్సుకు గుర్తుకు వచ్చి చిన్న కుమారుడు పశ్చాత్తాప పడుచున్నాడు. తన తండ్రి యొక్క ప్రేమను గుర్తించుకుంటున్నారు, ఆయన చేసిన పాపలు క్షమించాలని కోరుకుంటానని ఆలోచన చేస్తున్నాడు.
-మనజీవితంలో తండ్రిని కాదని స్వేచ్ఛగా జీవించాలనుకుంటే మన జీవితాలు కూడా దారుణంగా మారతాయి. చిన్న కుమారుడి జీవితం తండ్రితో వున్నప్పుడు ఒక విధంగా ఉంది తండ్రితో లేనప్పుడు ఇంకొక విధంగా ఉంది. ఆయన ఆకలితో అలమటించారు. తండ్రి దగ్గర అంతా సమృద్ధిగా పొందాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి విలువ తెలుసుకోలేదు.
-ఈ చిన్న కుమారుడు తానూ పాపం చేశానని గ్రహించి తండ్రి చెంతకు వెళ్లుచున్నాడు.
18 వ వచనంలో "వాడు లేచి " తండ్రి వద్దకు వెళ్లాలనుకున్నాడు మనం నడవాలంటే ముందుగా కూర్చున్న స్థలం నుంచి లేవాలి.
-మనం ఎక్కడ నుండి లేవాలంటే మన పాపపు స్థితి, వ్యసనాల నుండి లేవాలి. మనయొక్క చెడు గుణాలనుండి లేవాలి . పొరుగు వారితో సఖ్య పడటానికి కూడా లేచి నడవాలి, మనయొక్క దీన స్థితి నుండి లేవాలి అప్పుడు దేవునితో పొరుగు వారితో సక్యపడి మంచి జీవితం జీవించాలి.
చిన్న కుమారునికి తండ్రి మీద ఉన్న నమ్మకం వల్లనే ఆయన చెంతకు తిరిగి రావాలను కున్నాడు. మనం కూడా తిరిగి రావాలి. తిరిగి రావాలంటే
-దేవునితో కలిసి ఉండటానికి తిరిగి రావాలి
-కుటుంబ సభ్యులతో కలిసి ఉండుటకు తిరిగి రావాలి
-భార్య, భర్తతో, కలిసి ఉండటానికి తిరిగి రావాలి.
అందుకే దేవుడు ఇప్పుడైనా తిరిగి రమ్మంటున్నారు. యావేలు 2 : 12 -13 .
-చిన్న కుమారుడు- తప్పిపోయాడు -తన యొక్క సొంత ఆలోచనలవల్ల, జల్సాల వల్ల తప్పిపోయాడు. తండ్రిని అర్థం చేసుకోవడంలో తప్పిపోయాడు -తండ్రిని ప్రేమించుటలో తప్పిపోయాడు, తండ్రని గౌరవించుటలో తప్పిపోయాడు. తనయొక్క బాధ్యతలు నిర్వహించుటలో తప్పిపోయాడు- విధేయత చూపటంలో తప్పిపోయాడు.
-మనం కూడా చాలా విషయాలలో తప్పిపోతున్నాం;
-ప్రార్థించుటలో తప్పిపోతున్నాం.
-ఈ లోక కోరికలకు తప్పిపోతున్నాం.
-దేవుని సన్నిధికి రావటంలో తప్పిపోతున్నాం. ఇంకా చాలా విషయాలలో తప్పిపోతున్నాం.
-చిన్న కుమారునిలో వున్నా గొప్ప లక్షణం ఏమిటంటే తండ్రి చెంతకు తిరిగి రావాలనుకోవడం, సఖ్య పడి క్షమించమని అడగటం. మనకు నచ్చిన విధంగా మనం జీవించి పాపము చేసిన సందర్భంలో పాపాలకు పశ్చాత్తాప పడి దేవుని చెంతకు తిరిగి వచ్చి క్రొత్త జీవితం జీవించాలి.
-చిన్నవాని వలే మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవితమును సరిచేసుకొని జీవించాలి. మనలో ఎలాంటి మార్పు అవసరమో అని మనకు తెలిస్తే మన జీవితాలు మనం మార్చుకోవచ్చు.
2. తండ్రి - దేవుడు
-తనను కాదని వెళ్లిపోయిన కుమారున్ని తండ్రి క్షమించాడు ఆదరించాడు.
-తండ్రియొక్క సహనంకు, ప్రేమకు ఎలాంటి హద్దులు లేవు తన కుమారునికి మేలిమి వస్త్రాలు ఇవ్వమని చెప్పుచున్నారు.
-తన కూమారుని పట్ల అనంతమైన ప్రేమను దయను చూపిస్తున్నారు ఆయన దయ కుమారుని యొక్క అన్ని పాపాలను మరచి పోతుంది.
-తండ్రి కూమారునికి స్వేచ్ఛనిచ్చారు, ఆస్తిని పంచిపెట్టారు, కుమారుడు ఏది కావాలన్నా తండ్రి ఇచ్చారు, అది ఆయన యొక్క గొప్పతనం.
-తండ్రి కుమారుని యొక్క రాక కోసమై, కూమారుని హృదయ పరివర్తన కోసమై ఎంతో ఎదురు చూశారు. తన బిడ్డలయెడల ఆయన ప్రేమ అలాంటిది.
-తండ్రి ప్రేమ అర్థం చేసుకునే ప్రేమ -దేవుని ప్రేమ క్షమించే ప్రేమ -దేవుని మనస్సు స్వీకరించే మనస్సు.
-కుమారుడు పలికినది ఒకే ఒకమాట "తండ్రి నీకును పరలోకంకు విరుద్ధంగా పాపం చేశాను అన్నాడు. అది కూడా తండ్రి సరిగ్గా విన్నాడో లేదో కానీ కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తనను బిడ్డలాగే స్వీకరించి ఆయన్ను గౌరవించి విందు చేస్తూ ఆనందమును వ్యక్తం చేస్తున్నారు.
-మనం కూడా దేవునివలె మంచి మనస్సు ఉండాలి. క్షమించమని అడిగిన వారిని క్షమించి స్వీకరించాలి.
3. పెద్ద కుమారుడు - ఆయన నటించే కుమారుడు
వాస్తవానికి ఆయన తండ్రి దగ్గర రోజు గడిపినప్పటికీ తండ్రి హృదయం తెలుసుకోలేక పోయాడు.
-తమ్ముడు యొక్క రాకను అంగీకరించలేక పోయాడు. ఆయన అనుకోని వుండవచు, మళ్లి ఆస్తి తీసుకొని పోవటానికి వచ్చాడని. తమ్ముడి పట్ల ఈర్ష జీవిస్తున్నాడు. జీవిస్తున్నాడు.
-పెద్దవానికి తండ్రి పట్లగాని, తమ్ముడి పట్ల గాని నిజమైన ప్రేమలేదు అతడు ఇద్దరినీ నిందించాడు. ఇద్దరి మీద కోపపడుచున్నాడు. కనీసం ఇంటిలోకి రావటానికి కూడా ఇష్టం లేకున్నాడు.
-పెద్దకుమారుడు తండ్రి దగ్గర ఒకే ఇంటిలో జీవించిన తండ్రి మనస్సుకు దూరంగా ఉన్నాడు.
-పరిసయ్యులు సద్దుకయ్యలు అందరుకూడా దేవుని చేత ఎన్నుకొనబడి ప్రజలని దేవుని ఇష్టమైన బిడ్డలని చెప్పుకునే వారే. వాస్తవానికి వారు దేవుని హృదయానికి దూరంగా జీవించేవారే, ఇతరులను అంగీకరించకుండా జీవించేవారు.
-మన సమాజంలో కూడా ఇలాంటి మూడు పత్రాలు కలిగిన వారిని మనం చూస్తున్నాం. మరి ఈనాడు మనం ఎవరిని పోలి జీవిస్తున్నాం ?
-క్షమించే తండ్రినా?
-చేసిన తప్పులు తెలుసుకొని తిరిగి వచ్చిన చిన్నవాడినా?
-తండ్రిని అర్థం చేసుకోకుండా నిందించే పెద్దవాడినా?
-మనం దేవుని చెంతకు మరలి వస్తే, సఖ్య పడి జీవిస్తే, హృదయం పరివర్తనం చెందితే అందరూ ఆనందిస్తారు.
Rev. Fr. Bala Yesu OCD
తపస్సు కాల 4 వ ఆదివారం (మానవునితో సఖ్యత - హృదయ పరివర్తనం -దేవునితో సఖ్యత)
మానవునితో
సఖ్యత - హృదయ పరివర్తనం -దేవునితో సఖ్యత
మొదటి
పఠనం: ఐగుప్తు అపకీర్తిని దేవుడు మన నుండి తొలగిస్తాడు . అంటే దాస్యాత్వం నుండి మనలను
విమోచించి స్వతంత్రులుగా జీవించే వారిగా మనందరిని
తీర్చిదిద్దుతాడు.
రెండవ
పఠనం , క్రీస్తునందు జీవిస్తే, క్రీస్తు మనలను తనతో సఖ్యపరచుకొని
నూతన సృష్టిగా మనలను మారుస్తాడు
1.
తండ్రి నుండి దూరంగా వెళ్ళడం
2.మన పాపపు స్థితిని గ్రహించి
తండ్రి చెంతకు తిరిగి రావడం
3.నూతన
సృష్టి – ఉత్సవం
తప్పిపోయన కుమారుడు ఎంతో
హీనా స్థితికి దిగజారుడు,కడుపు నింపుకోవడానికి
పందులు తిను పొట్టు మాత్రమే గతి, అన్నపుడు గుర్తుకొచ్చింది తండ్రి ప్రేమ. అప్పుడు తండ్రి నుండి తాను అనుభవించిన రాజసం, వైభవం, జాగ్రత్త, అనురాగం ఒక్కోక్కటి గుర్తుతెచ్చుకొని, నెమరు వేసుకుంటూ
బోరున ఏడువసాగాడు. ఇక అనుకున్నాడు: నా తండ్రి వద్ద ఎందరో
పనివారికి పుష్టిగా భోజనం దొరుకుతుంది కాని ఇక్కడ నేను ఆకలికి మల మల మాడుచున్న.(లూకా 15
;17 ) ఈలాగున తన పాపపు
స్థితిని గ్రహించాడు. ఇక లాభం లేదు! నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్లి,తండ్రి నేను పరలోకమునకును , నీకును ద్రోహం చేశాను ఇప్పుడు నేను ని కుమారుడను
అని అసలు అనిపించోకోదగను. నీ పని వారిలో ఒక్కరిగా
పెట్టుకోనుము అని చెప్పెదనని , ఆలోచించుకుంటూ
తండ్రి వద్దకు బయలుదేరెను.(లూకా 15 ;19). తన తండ్రి చెంతకు తిరిగి
వచ్చెను. తన తండ్రి చెంతకు తిరిగి రావాలి అనేది ఓ గొప్ప అభినందనీయ నిర్ణయం. ఎందుకు అంటే ఈ నిర్ణయం
ద్వారా తన తండ్రితో మరల జీవించాలి అనుకున్నాడు.
తన తండ్రి ప్రేమను తనివితీరా అనుభవించాలి అనుకున్నాడు. తన తండ్రి సాన్నిధ్యంతో తండ్రి
వద్ద ఉండాలి అనుకున్నాడు.
కాని
పెద్ద కుమారుడు తండ్రి సాన్నిధ్యంలో ఉన్న కానీ తండ్రికి దూరంగా జీవిస్తున్నాడు
ఇది ఎంతో దుర్లభమైన జీవితం. అటు తండ్రితో,
ఇటు
తమ్ముడితో సఖ్యత లేదు. స్వార్థం, నిరాకరణ, అసూయా అనే దుర్గుణాలతో నిండి ఉన్నాడు. ఇతరుల శ్రేయస్సును, ఎదుగుదలను మరు మనసును, తట్టుకోలేక పోయాడు.
ఈరోజు
మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను చిన్న కుమారుడని
పోలి ఉన్నానా, పెద్ద కుమారుడని పోలి
ఉన్ననా ?,పెద్దకుమారుడి లాగా ఈర్షతో
జీవిస్తే , జీవితానికి ఒక అర్ధం ఇవ్వలేం.
జీవితంలో నిజమైన సంతోషాన్ని పొందలేము,తండ్రి దేవుని ప్రేమను అనుభవించలేం. కాని చిన్న
కుమారుడిలాగా మన పాపపు స్థితిని గ్రహించి, పశ్చాత్తాపపడి హృదయ పరివర్తనం చెంది, దేవుని వద్దకు తిరిగి వస్తే
దేవుని అనుగ్రహాలు, అవధులు లేని ప్రేమని ,కరుణని
పొందగలం.
19, మార్చి 2022, శనివారం
తపస్సు కాలం 3 వ ఆదివారం(2)
తపస్సు కాలం 3 వ ఆదివారం
నిర్గమ 3: 1-8, 13-15, 1 : కొరింతి 10: 1-6 , 10-12 , లూకా 13 : 1-9
ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క ఓర్పు, సహనం గురించి తెలుపుచున్నాయి.
-ప్రజల యొక్క హృదయ పరివర్తనంకై దేవుడు మానవాళి పట్ల ఎంత ఓర్పుగా ఉన్నారో తెలుపుచున్నవి.
-దేవుడు మానవులను అర్థం చేసుకొని వారియొక్క దీనస్థితికి జాలిపడి వారిపట్ల సహనంతో మెలగుతారు.
-ఓర్పుగా ఉండటం దేవునియొక్క సహజ లక్షణం. అది దేవుని గొప్ప లక్షణం. తప్పు చేసిన వెంటనే దేవుడు శిక్ష వేయరు. ఎందుకంటే సృష్టి ప్రారంభంలోనే ఆదాము అవ్వ తప్పు చేసిన సరే తన యొక్క మనస్సు బాధపెట్టిన సరే వారే వస్తారని, క్షమించమని అడుగుతారని దేవుడు సహనంతో ఎదురు చూస్తున్నారు. మరియొక సారి వారు రాకపోయే సరికి దేవుడే వారిని వెదకుచు వారిపట్ల సహనంతో ఉంటున్నారు.
-ఇశ్రాయేలీయులయొక్క మార్పు కోసం కూడా దేవుడు ఎంతో ఆశగా సహనంతో ఉంటున్నారు. అందుకు కాబట్టే ప్రవక్తల తర్వాత ప్రవక్తలను పంపుతున్నారు.
-దేవుని వలే మనకు కూడా సహనం కావాలి. ఏవిధంగానైతే రైతు పంట కోసం ఎలాగ సహనంతో ఉంటారో మనం కూడా మన పొరుగు వారి మార్పుకోసం సహనంతో ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ఓర్పు కలిగి జీవించాలి.
-పునీత అగస్టీను గారి తల్లి కుమారుడి కోసం భర్త కోసం వారియొక్క మార్పుకోసం ఎన్నో సంవత్సరాలు సహనంగా ఉన్నారు.
ఈనాటి మొదటి పఠనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల చూపినటువంటి గొప్ప దయను గురించి చెప్పబడినది.
-మోషే ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఎన్నుకొంటూ, దేవుడి వరిపట్ల తనయొక్క దయను చూపిస్తున్నారు.
-మోషే ప్రవక్త ఎప్పుడైతే దేవుని కొండయైన హోరేబు దగ్గరకు వచ్చారో అప్పుడు అతనిని దేవుడు ఎన్నుకొంటున్నారు.
-దైవ పిలుపు ఎప్పుడు వస్తుందో ఎలాగ వస్తుందో ఎవరికి తెలియదు.
-దైవ పిలుపునందుకొన్నది ఎందుకంటే దేవుని ప్రజలను నడిపించుటకు. ప్రజల యొక్క జీవితంలో పాపం యొక్క ఆవశ్యకతను తెలిపి, వారు దేవుని వైపు మరల్చే లాగ చేయుటమే దైవ ఇలుపు ఉద్దేశం .
-ఈనాటి మొదటి పతనం ద్వారా దేవుడు చాల విషయాలు మనకు తెలియచేస్తున్నారు.
1. మనం దేవుని దగ్గరకు వస్తే మన జీవితాలు మారిపోతాయి. మోషే ప్రవక్త దేవుని కొండయైన హోరేబు వద్దకు వచ్చారు. దేవుడున్న స్థలంకు వచ్చిన్నప్పుడు దేవుడు తనను ఎన్నుకుంటున్నారు, ఆయన ఎన్నిక ప్రత్యేకమైనది.
-దేవుడు మోషేకు దైవ పిలుపును అందచేస్తున్నారు. మోషే జీవితంలో ఒక గొప్ప మలుపు కలిగేలా దేవుడు చేస్తున్నారు.
- మోషేను అనేక మందికి నాయకుడిగా చేస్తున్నారు. ఆయన జీవితాన్ని మార్చుతున్నారు.
-ఆయనకు దేవుడు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. తన ద్వారా ద్వారా బానిసత్వంలో ఉన్న ప్రజలకు స్వేచ్ఛనిస్తానన్నారు.
- దేవునికి దగ్గరగా వచ్చిన వారి జీవితాలు చాలా మారిపోయాయి. జక్కయ్య యేసయ్యను చూడాలని వచ్చారు అప్పుడు ఆయన జీవితం మార్చబడుతుంది.
-నతానియేలు దేవుని దగ్గరకు వచ్చారు దైవపీలుపును పొందుకున్నారు.
-మోషే దేవుని యొక్క స్థలం దగ్గరకు వచ్చారు దేవుని పని కోసం ఎన్నుకొనబడినారు.
- మనం దేవుని దగ్గరకు వస్తే దేవుడు మన దగ్గరికి వస్తారు. యాకోబు 4 :8 .
-మనం కూడా దేవునిదగ్గరకు రావాలి నిర్మలమైన మనసు కలిగి దేవుని దగ్గరకు వస్తే దేవుడు మనలను కూడా మార్చుతారు. అదేవిధంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాలను మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి.
2. దేవుడు కనులారా ప్రజలయొక్క బాధలను చూశారు అని నిర్గమ 3 :7 వ వచనంలో చెప్పబడింది. ఈ మాట యొక్క అర్థమేమిటంటే ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన పాపాలకు పశ్చాత్తాప పడ్డారని వారిలో హృదయ పరివర్తనం చోటు చేసుకుందని, వారు దేవుని వైపు మరలినారని అర్థం. ఎన్నో సంవత్సరాలుగా వారు మారతారని దేవుడు ఎదురుచూసిన సమయం వచ్చినదని కాబట్టియే వారిని విముక్తులను చేయుటకు దేవుడు వారికోసం మోషే ను ఎన్నుకొంటున్నారు.
-మన జీవితాల నుండి దేవుడు అదేవిధంగా హృదయ పరివర్తనం కోసం ఎదురు చూస్తున్నారు.
-దయ, కనికరం కలిగిన దేవుడు ప్రజల దగ్గరగా ఉంటూ వారి జీవిత మనుగడను పరిశీలిస్తు వారి మార్పుకోసం ఎంతో ఎదురుచూస్తాడు.
3. దేవుడు మోషేతో అన్నారు ఇప్పుడు నీవున్న స్థలం పవిత్రమైనది నీ చెప్పులు విప్పుము అంటున్నారు.
- విడవటం అంటే కేవలం చెప్పులు మాత్రమే కాదు పాపమును కూడా విడిచిపెట్టడం.
చాలామందికి దేవునియొక్క స్థలం పవిత్రత విలువ తెలియటంలేదు. అందుకే దేవాలయాన్ని ఎలాపడితే అలా వాడుతున్నారు.
- దేవాలయంలో మొబైల్స్ వాడటం, ఎక్కువగా ముచ్చట్లు పెట్టడం చేస్తుంటారు. ఇవన్నీకూడా మనం తరుచుగా దేవాలయంలో చేస్తుంటాం ఎందుకంటే మనకు నిజంగా దేవునియొక్క పవిత్రత విలువ తెలియటం లేదు.
4. మోషే ప్రవక్త దేవుడి పేరు అడుగుచున్నారు.
“నేను ఉన్నవాడను” అని దేవుడు సమాధానం ఇస్తున్నారు.
ఉన్నవాడను అంటే అన్ని సమయాలలో వున్న దేవుడు.
-సృష్టి కాక మునుపే ఉన్నవాడు.
-సృష్టిని చేసినప్పుడు ఉన్నవాడు.
-సృష్టిని నడిపిస్తున్నప్పుడు వున్నవాడు.
-మన సంతోషంలో ఉన్నవాడు.
-మన భాదలలో ఉన్నవాడు.
-మన నిరాశలలో, సమస్యలలో ఉన్నవాడు.
- తన ప్రజలకి ఎప్పుడు దగ్గరగా ఉన్నవాడు, వారిని రక్షించుటకు వున్నవాడు అని భావం. ఆయన నిద్రపోయే వ్యక్తికాదు.
-యావే దేవుడు తనను తాను వున్నవాడనని సంబోధించుకుంటున్నారు. యేసు క్రీస్తుప్రభుని ఇమ్మానుయేలు అంటున్నారు అనగా దేవుడు మనతో ఉన్నారు అని అర్థం. మత్తయి 1 :22- 23 .
-యేసుప్రభువు అంటున్నారు ఎల్లప్పుడూ మీతో ఉండుటకు మీకు నేనొక ఆదరణ కర్తను పంపిస్తాను అని. యోహను 14: 16-17.
- ఈ మూడు వాక్యాలలో దేవుడు తనను తాను ఉన్నవాడనని సంభోదించుకుంటున్నారు. -
-మన దేవుడు మనతో ఉండేవారు కాబట్టియే వారిని ప్రత్యేకంగా మనం అంటిపెట్టుకొని జీవించాలి.
-దేవుడు తన పేరు తెలియచేయటం ఒక గొప్ప విశేషం. మనం ఒక వ్యక్తి పేరు చెబితే వారి గురించి మొత్తం తెలుసుకుంటాం. వారియొక్క వ్యక్తిత్వం, స్వభావం అన్నియు. దేవుని పేరు తెలియ చేయటం ద్వార దేవునికి గొప్ప స్వభావం, ఓర్పు కలిగిన స్వభావం తెలుస్తుంది.
-యావే దేవుడు మోషేతో "నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, దేవుడను అని చెప్పుచున్నారు. అంటే దేవుడు వీరికి చేసిన వాగ్దానాలను జ్ఞప్తికి ఉంచుకొని వాటిని నెరవేర్చేదేవుడు , ప్రజల మధ్య నివసించే దేవుడని తెలియ చేయుటకు ప్రభువు ఈవిదంగా పలుకుచున్నారు.
-ఈ నాటి రెండవ పఠనంలో పౌలుగారు కొరింతు ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పిదాలు మల్లి చేయరాదని హెచ్చరిస్తున్నారు.
-పౌలుగారు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన మేలులన్నీ వివరిస్తున్నారు. ప్రభువైన యావే దేవుడు 40 సంవత్సరాలు మేఘము క్రింద ఎటువంటి ఇబ్బంది లేకుండా కాచికాపాడారు.
-ఎర్ర సముద్రం దాటుటకు మార్గం సిద్ధం చేశారు, ఎడారిలో వారికీ ఆహారం, నీరు సమృద్ధిగా ఇచ్చారు.
-దేవుడు వారియొక్క జీవితంలో ఎటువంటి కొరత లేకుండా కంటికి రెప్పలా కాపాడిన కానీ ఇంకా వారిలో కొంతమంది దేవునికి విరుద్ధంగా పాపం చేశారు. అవిశ్వాసులుగా జీవించారు. వారిలో చాలామంది వాగ్దానా భూమికి చేరలేదు అని పౌలుగారు వివరించారు.
- ఇశ్రాయేలు ప్రజలు పడిపోయిన విధంగా కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలని పౌలుగారు తెలుపుచున్నారు.
-మనం జాగ్రత్తగా ఉంటే పడిపోకుండా ఉంటాం. చాల సందర్భాలలో జాగ్రత్తగా చూసుకొని నడువు అని చెబుతారు ఎందుకంటే మనం జాగ్రత్తగా నడిస్తే గమ్యం చేరతాం. ఎటువంటి ప్రమాదంలో పడిపోకుండా.
-మనయొక్క ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాస జీవితంలో మనం కూడా జాగ్రత్తగా ఉంటే
పాపంలో పడిపోము దేవుని అంటిపెట్టుకొని జీవిస్తాం .
-మనకన్నా ముందుగా జీవించిన వారు మనకు ఎప్పుడు సుమాత్రుకగా ఉంటారు కొంతమంది మంచి ఉదాహరణగా ఉంటారు. కొందరు చెడుకు ఉదాహరణగా ఉంటారు అంటే అలాంటి చెడు జీవితం జీవించకూడదు అనుటకు ఉదాహరణగా ఉంటారు.
-ఇశ్రాయేలు ప్రజలకు ఉదాహరణగా పౌలుగారు చెప్పినప్పుడు మనందరి జీవితాలను పరిశీలించుకోమంటున్నారు వారి వలె కాకుండా మనం కూడా మంచి విశ్వాసులుగా ఉండుటకు ప్రయత్నయం చేయాలి.
-దేవుని సొంత ప్రజలమని ఎవ్వరు అధిక విశ్వాసం వ్యక్త పరచకుండా మనల్ని మనం తగ్గించుకొని మన యొక్క జీవితంలో వినయం కలిగి జీవించాలి.
- ఈనాటి సువిశేష పఠనంలో యేసుప్రభువు మనందరి యొక్క హృదయ పరివర్తనం కోసం ఎంత సహనంగా ఉంటున్నారో అర్థమగుచున్నది.
-మన మందరం పాపాత్ములమే అందరుకూడా దేవుని శిక్షకు పాత్రులే కానీ దేవుడు మనందరి హృదయ పరివర్తనం కోసం ఇంకా మనలను సజీవులుగా ఉంచుతున్నారు మనయొక్క మార్పుకై.
-యేసుప్రభువు తానూ సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు చెప్పిన మొదటి ప్రసంగం "కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది, హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసించమని ప్రభువు ప్రసంగించారు. మార్కు 1 : 15 .
-ప్రస్తుత సమాజంలో చాల మంది హృదయ పరివర్తన కోసం ఎదురుచూస్తుంటారు.
-ఒక భార్య తన భర్త వ్యసనాలు మానుకొని జీవించాలనుకొంటుంది.
-ఒక తల్లి తన బిడ్డ చెడు మార్గం విడిచి పెట్టి మంచి మార్గమును అనుసరించాలని కోరుకుంటుంది.
-అలాగే మనం పని చేసే చోట మన యాజమానుడు మరలనుకుంటాం.
-తల్లిదండ్రలు మారాలని బిడ్డలు, బిడ్డలు మారాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు.
-మనం పొరుగువారియొక్క హృదయ పరివర్తనంకోసం ఎదురుచూస్తున్నట్లు దేవుడు మనయొక్క హృదయ పరివర్తనం చెందటానికి ఎదురుచూస్తున్నారు.
-మనయొక్క పనుల్లో మార్పు ఉండాలి, ప్రార్థించే విధానంలో మార్పు ఉండాలి, మాట్లాడే విధానంలో మార్పు ఉండాలి, ఇతరులతో జీవించే విధానంలో అన్ని విషయాలలో హృదయ పరివర్తనం అవసరం. హృదయ పరివర్తనం క్రొత్త జీవితానికి నాంది.
హృదయ పరివర్తనం చెందాలంటే రాతిగా వున్న హృదయం మాంసపు ముద్దలాగా మారాలి. యెహెఙ్కేలు 36 :26.
-హృదయ పరివర్తనం చెందనిచో మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. లూకా 13 : 5 .
-దేవునియొక్క ప్రేమ మనపై దిగిరావాలంటే మనలో హృదయ పరివర్తనం చోటుచేసుకోవాలి.
-యేసుప్రభువు అంటున్నారు హృదయ పరివర్తనం అవసరం లేని 99 గొర్రెల కంటే హృదయ పరివర్తనం అవసరమున్న ఒక్క గొర్రె చాలు అని లూకా 15: 7.
-మనం హృదయ పరివర్తనం చెందుటకు దేవుడు చాల అవకాశాలను ఇస్తుంటారు. మన కన్నా మంచిగా ఉన్నవారు చనిపోయి మనం మాత్రమే బ్రతికి ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి నాకు కూడా మరణం వస్తుంది, నేను ఇలా ఉంటె పరలోకంలో ప్రవేశించను అందుకే నా జీవితం మార్చుకోవాలి అనే ఆలోచన చేయాలి.
-మన యొక్క పాపపు జీవితం నుండి హృదయ పరివర్తన చెందాలి.
-మనయొక్క అపద్దపు సాక్ష్యములనుండి, మనయొక్క కపట వేష ధారమునుండి, మనయొక్క అన్యాయపు మార్గాలనుండి, మనయొక్క ఇహలోక వంచాలనుండి మనం హృదయ పరివర్తనం చెందాలి.
-యేసుప్రభువు రెండు ఉదాహరణలను తీసుకుంటున్నారు, పిలాతు గలిలీయులను చంపిన విధానము మరియు సిలోయము బురుజు కూలి మరణించినవారు.
-పిలాతు గలిలీయ దేశస్తులు బలులు అర్పించేటప్పుడు వారిని హత మార్చాడు. విప్లవం లేవదీసే గలిలీయులను పిలాతు నాశనం చేశారు. చనిపోయిన వారు మిగతా వారికంటే పాపాత్ములు కారు అని తెలుపుచున్నారు.
-సిలోయము బురుజు కూలి 18 మంది చనిపోయారు అలా మరణించిన వారు మిగతా వారికంటే పాపాత్ములు కారు అని ప్రభువు తెలుపుచున్నారు.
-ఈ రెండు సంఘటనలు అనుకోకుండా హఠాత్తుగా జరిగినవి. కాబట్టి వారు హృదయ పరివర్తనం చెందారో లేరో తెలియదు కానీ ఇది మన జీవితాలకు ఒక హెచ్చరిక.
- మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మనం మారాలి అని ప్రభువు తెలుపుచున్నారు.
- హృదయ పరివర్తనం అందరికి అవసరమే కాబట్టి దేవుడిచ్చిన తపస్సు కాలంలో హృదయ పరివర్తనం చెంది జీవించాలి.
-రెండవ సంఘటన అత్తి చెట్టును చూపిస్తూ ప్రభువు మన పట్ల ఎంత సహనంగా ఉంటున్నారో తెలియ చేస్తున్నారు.
మన జీవితాలు ఫలించటానికి దేవుడు ఎంతో ఓపికగా ఎదురుచూస్తుంటారు. దేవుని అనుగ్రహాలు దొరుకుతున్నాయి అయినా ఇంకా ఫలించుటలేదు.
-అత్తి చెట్టును ఇశ్రాయేలు ప్రజలకు పోలికగా ఉంది. హోషేయ 9 : 10, మీకా 7 : 1, యిర్మీయా 8 : 13, 24 : 1 -10.
- దేవుడు ఆశించిన విధంగా వారు ప్రతి ఫలించలేదు. దేవుడు వారిని ఐగుప్తు దాస్యం నుండి విమోచించి, శత్రువుల నుండి రక్షించి వారి సొంత భూమినిచ్చారు అయినా కానీ వారు విగ్రహారాధనను పాల్పడి ఆశించిన ఫలములు ఇవ్వలేదు. నిర్గమ 32 : 1 -10 .
-వాస్తవానికి అత్తి చెట్టు సంవత్సరానికి మూడుసార్లు ఫలముల నివ్వాలి కానీ ఇక్కడ మూడు సంవత్సరములు ఎటువంటి ఫలముల నివ్వలేదు.
-ఆ చెట్టు ఫలించటానికి యజమానుడు అన్ని సకాలంలో ఇచ్చారు అయినా మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం కనీసం మూడవ సంవత్సరం ఎటువంటి ఫలితం నివ్వలేదు.
-అన్ని చేసినప్పుడు అది ఫలము ఇవ్వక పొతే మనం కూడా నిరాశ చెందుతాం. యజమానుడు మాత్రమే సహనంతో మూడు సంవత్సరములు ఎదురు చూశారు.
-మూడు సంవత్సరాలు ఎదురు చూడటం అనేది ఎందుకంటే ఇజ్రాయెలీలు బానిసత్వంలోనికి వెళ్ళకముందు మూడు సంవత్సరాలు హృదయ పరివర్తనం చెందమన్నారు.
-బాప్తిస్మ యోహాను మూడు సంవత్సరాలు పరిచర్య, అలాగే యేసుప్రభువు యొక్క మూడు సంవత్సరములు బహిరంగ సువార్త వ్యాప్తి కూడా హృదయ పరివర్తనకోసమే ప్రభువు ఎదురు చూశారు కాబట్టి మనం ఫలించాలి.
- మనం దేవుని యొక్క వాక్యం ఆలకించి అనుసరించి జీవించి ఫలించే వారిలాగా ఉండాలి దాని కోసం దేవుడు ఎదురుచూస్తున్నారు.
-దేవుని వలె ఒకరిపట్ల ఒకరు సహనం కలిగి జీవించి హృదయ పరివర్తనం చెందుదాం. క్రొత్త జీవితం జీవించుదాం.
Rev. Fr. Bala Yesu OCD
18, మార్చి 2022, శుక్రవారం
తపస్సు కాల 3 వ ఆదివారం
తపస్సు కాల 3 వ ఆదివారం
నిర్గ 3:1-8,13-15 1 కోరింథీ 10:1-6, 10-12 లూకా 13:1-9
క్రీస్తు నాధుని యందు ప్రియమైన విశ్వాసులారా !ఈ నాడు మన తల్లి అయిన తిరుసభ తపస్సు కాల మూడవ ఆదివారంలోనికి ప్రవేశిస్తుంది. అయితే ఈనాటి మూడు దివ్య గ్రంధ పఠనాలను ధ్యానించినట్లయితే ముఖ్యముగా హృదయపరివర్తన గూర్చి భోధిస్తున్నాయి.
మొదటి పఠనములో మోషే ప్రవక్తను యిస్రాయేలీయుల బానిసత్వం నుండి విడిపించుటకై ఎన్నుకుంటున్నాడు. ఇతని ద్వారానే తమ పూర్వులు కొలిచినటువంటి యావే దేవుని గూర్చి తెలియ చేస్తున్నాడు.
రెండవ పఠనములో మనం చూస్తే ఈలోక సంబంధమైన విషయములపై , వస్తువులపై విగ్రహములపై మన మనస్సులను లగ్నం చేయక, ఆధ్యాత్మిక శిలయగు యేసు క్రీస్తునందు జాగ్రత్త కలిగి జీవించాలి అని తెలియజేస్తుంది.
సువిశేష పఠనములో మనం చూస్తే, హృదయ పరివర్తనం గురించి మరియు ఫలభరితమైన జీవితం గురించి భోదిస్తుంది.
మొదటి పఠనం :-
ఈనాటి మొదటి పఠనములో ముఖ్యముగా మోషే ప్రవక్త ఎన్నికను మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు మోషేను ఎన్నుకున్నాడంటే, యిస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో రాజు బానిసత్వంలో మునిగిపోయి ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు. వారిని ఎంతో ఘోరంగా చూసెడివారు. వారిని బానిసలుగా ఎంచి ఇటుకలు చేయడానికి ఇల్లు కట్టడానికి ఇలా ఎన్నో రకాలుగా వారిని వాడుకుంటూ చిత్ర హింసలకు గురిచేసెడివారు. నిర్గ 2:23. అటువంటి సమయంలో యిస్రాయేలు ప్రజలు దేవుని సహాయాన్ని అర్ధించారు. అప్పుడు ఆర్తనాదాలు దేవుని చెవిన పడి వారిని రక్షించడానికి ఈ మోషే ప్రవక్తను ఒక పనిముట్టుగా ఉపయోగించుకున్నాడు.
మోషే జీవితాన్ని మనం చూసినట్లయితే, నిర్గ 3:1 లో ఇతను తన మామ అయినటువంటి యిత్రో మందలను మేపెడివాడు. తనకంటూ ఏమి లేదు. తన మామ దగ్గర సేవకుడుగా జీవించాడు. తన గొర్రెల నిమిత్తం మోషే హోరెబు కొండకు వెళ్ళాడు. ఈ హోరెబు కొండ అంటే దేవుని కొండ అని అర్ధం. దేవుడు నివసించే ప్రదేశమునకు దేవుని చేత కొండకు నడిపింపబడ్డాడు. ఎప్పుడైతే మోషే ఆ కొండ దగ్గరికి వచ్చాడో అక్కడ దేవుని సాక్షాత్కారాన్ని చూసాడు. నిర్గ 3:2. అక్కడ ఒక పొదనడిమి నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కారించేను. యోష 6:1-2 లో చూస్తే ప్రభువు ఉన్నతమైన సింహాసనము పై ఆసీనుడై ఉండెను. అతనికి పై భాగమున జ్వలించుచున్న సెరాఫీము దేవ దూతలు నిల్చియుండిరి అని చదువుచున్నాం. అదే విధంగా సమువేలు కూడా దేవుని దర్శనములు ఎప్పుడు లభించుచునే ఉండెను. 1 సమూ 3:21. ఇలా ఎంతో మందికి దేవుడు ప్రత్యక్షమవుతూ ఆయన యొక్క మహిమను తెలియ చేస్తున్నాడు.
ఎందుకు దేవుడు తన పనికి ఎంతో మందిని పిలుస్తున్నాడు? 1. శ్రమలలో ఉన్న వారికి విడుదల కలుగ చేయడానికి.(నిర్గ 3:7-8) 2. పాపములో ఉన్న వారిని దేవుని మార్గంలో నడిపించడానికి (యోనా 3:4-6) 3. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి (నిర్గ 3:14)
దేవుని యొక్క చిత్తం నెరవేర్చడమంటే, దేవుని గూర్చి భోధించాలి. కానీ ఈ సమాజంలో మనం చూస్తే ఎంతో మంది దేవుని మాటలను వినడానికి, దేవుని చెంతకు రావడానికి, ఆయనను గురించి భోదించదానికి వెనకాడుచున్నారు. మోషే ప్రవక్త జీవితంలో చూస్తే ఆయన దేవుని మాట శిరస్సా వహించి 1. ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో ఉన్నవాడైన దేవుని గురించి తెలియ చేశాడు. 2. ఫరో రాజు దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క ప్రణాళికను అతనికి తెలియజేసి ఎన్నో విపత్తుల తర్వాత ప్రజలను ఐగుప్తు దేశం నుండి కానాను దేశమునకు తీసుకెళ్ళాడు. 3. దేవుని ఆజ్ఞలను వారికి అందించాడు. 4. వారి గురించి ప్రార్దన చేశాడు.
ఈనాడు నీవు నేను కూడా క్రైస్తవులుగా పిలవబడుతున్నాం. క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరిస్తున్నవాడు. కాబట్టి మనం కూడా మోషే ప్రవక్తవలే , ఇంకా ఇతర ప్రవక్తల వలె దేవుని మాట శిరస్సా వహించి, దానిని పఠిస్తూ, పాటిస్తూ దానిని ఇతరులకు పంచుదాం. దేవుని యొక్క ప్రేమను ప్రణాళికను తెలియచేద్దాం.
సువిశేష పఠనం లూకా 13: 1-13
ఈనాటి సువిశేష పఠనం ముఖ్యంగా హృదయ పరివర్తన గురించి తెలియచేస్తుంది. దేవుడు ఎలాగా వారిపై జాలి చూపిస్తున్నాడు. తన కరుణను తెలియచేస్తున్నాడని తెలుపుతుంది. అయితే ఈ సువార్త పఠనం లూకా 12 వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. ఎందుకంటే లూకా 12 వ అధ్యాయంలో మొదటి మూడు వచనములలోకపట ప్రవర్తనను గూర్చి జాగరూపులై ఉండాలి అంటున్నాడు.
4 నుండి 7 వ వచనములలో ఎవరికి మనం భయ పడాలి. ఎవరికి భయ పడకూడదని తెలుపుచున్నాడు. మనం ఎవరికి భయ పడాలి అంటే మన శరీరమును నాశనం చేయు వారికి భయపడకూడదు. కానీ మిమ్ము చంపి నరక కూపములో పడవేయగల వానికి భయ పడాలి అని తెలుపుచున్నాడు.
8 వ వచనం నుండి 12 వ వచనములలో దేవునికి బహిరంగ సాక్షులుగా మారాలి అని భోదిస్తున్నారు. అట్టి వాడిని దేవదూతల ఎదుట అంగీకరించును, వారు ఎట్లు మాట్లాడవలయునో పవిత్రాత్మ ద్వారా తెలుపబడును.
ఇలా జీవించుటద్వారా ఈ లోక సంబంధమైన విషయములపై , లోకాశలపై చింతించక దేవుని రాజ్యమును, నీతిని వెదుకుతారు అప్పుడు వారికి అన్నియు సమకూర్చబడును అని 13 వ వచనం నుండి 31 వరకు తెలుపుచున్నది.
మరి ఎందుకు దేవుడు తన రాజ్యమును ఇస్తాడు అంటే ఇది తన ఇష్టం ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము దానిని చేద పురుగులు తినివేయవు. లూకా 12:32-33.
ఈ రాజ్యం కోసం ప్రతి ఒక్క సేవకుడు సిద్ధ పాటు కలిగి జీవించాలి. లూకా 12:32. ఎందుకంటే మనుష్య కుమారుడు ఏ గడియాలో వస్తాడో తెలియదు. లూకా 12:40. ఈ సిద్ద పాటు ద్వార ప్రతి ఒక్క సేవకుడు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తాడు. లూకా 12:43. అలా జీవించనిచో తన యజమాని చేతిలో కొరడా దెబ్బలతో కఠిన శిక్ష ఉంటుంది. లూకా 12: 47-48.
అప్పుడు తమ జీవితంలో విభేదాలు ఏర్పాడుతాయి. ఈ విభేదాలు ద్వార తండ్రి కుమారున్నీ, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను , కుమార్తె తల్లీని, అత్త కోడలని, కోడలు అత్తని ఎదురిస్తారు. లూకా 12:53. ఇలా జరగకుండా ఒకరినొకరు సఖ్యత కలిగి జీవించినట్లయితే దేవుని శిక్షకు అర్హులు కాక ప్రేమకు పాత్రులవుతారు.
ఇప్పుడు మనం సువిశేష పఠనం క్లుప్తంగా పరిశీలిద్దాం. ఈనాటి సువిశేష పఠనం ఒకే అంశము గురించి చర్చించిన రెండు భాగాలుగా విభజింపబడింది. 1. ఇతరులను వ్రేలుఎత్తి చూపడం 2.మనల్ని మనం మార్చుకోవడం.
1. ఇతరులను వ్రేలెత్తి చూపడం : హృదయ కాఠిన్యం :- మొదటి వచనంలో చూస్తే, కొంత మంది యేసు ప్రభువు దగ్గరికి కొంత మంది వచ్చి గలీలియా విదేశీయలను చంపిన వదంతులను తెలియ చేస్తున్నారు. అప్పుడు యసు , గలిలీయా సిలోము బురుజు కూలి ప్రజల మరణం వారికి తెలియ చేస్తూ , హృదయ పరివర్తన చెందనిచో అందరు అట్లే నాశన మగుదురు అని చెప్పుచున్నారు. లూకా 13:1-5.
అయితే ఇక్కడ పిలాతు గలీలియ దేశీయులను ఎందుకు చంపిస్తున్నాడంటే, సలోమోను కాలంలో పిలాతు ఒక నూతన జెరుషలేమును నిర్మించాలి అనుకున్నప్పుడు ఆ ప్రజల దగ్గరకు వెళ్ళి వారు దేవునికి సొమ్ములో కొంత భాగం పిలాతుకు ఇవ్వాలని వార్తనందించాడు. కానీ ప్రజలు దానికి అంగీకరించలేదు. అటువంటి సమయంలో పిలాతు తన సైనికులను వారి దగ్గరకు మారు వేషంలో పంపించి బలులు అర్పించు సమయంలో వారి మీద పడి చంపించేశాడు.
అదే విధంగా శిలోయములో మరణించిన ప్రజల జీవితాలలో చూస్తే అక్కడ కాల వైపరీత్యం వల్ల అక్కడ నిర్మించినటువంటి బురుజు కూలి మరణిస్తున్నారు. అయితే మరణం ఎప్పుడు, ఎలాగా , ఎటువంటి సమయంలో సంభవిస్తుందో తెలియదు. కాబట్టి దానికంటే ముందు మనం మార్పుచెందాలి.
అయితే ఇక్కడ ప్రజల ఏ విధంగానైతే గలీలియ ప్రజల మరణంను వ్రేలెత్తి చూపకుండా, దేవుని యొక్క రాకడ కోసం సిద్దపాటు కలిగి జీవించాలి. అప్పుడే మనం హృదయ పరి వర్తనం చెంది మారు మనస్సు పొందుతాం.
ఆమోసు 1:3,6,9,11,13 వచనములలో మనం చూస్తే అక్కడ ప్రజలపై జాలి లేకుండా దమాస్కు , గాజా , తూరు ప్రజలు తరచూ పాపం చిసిరి కాన నేను వారిని దండించి తీరుతాను అని దేవుడు పలుకుచున్నారు. వారు ఏమి చేస్తున్నారంటే
ఆమోదు ప్రజలు గిలాదు గర్భవతుల కడుపులు చీల్చివేశారు. ఆమోసు 1:13
మోవాబు ప్రజలు ఏదోము రాజు ఎముకలను బుగ్గి అగునట్లు కాల్చి వేశారు. ఆమోసు 2:1-2
యూదా ప్రజలు దేవుని ఉపదేశములను తృణీకరించారు. ఆజ్ఞలను పాటింపలేదు. ఆమోసు 2:4-5 వారి పితరులు కొలచిన దేవతలను కొలిచి అపమార్గము పట్టారు.
యిస్రాయేలు ప్రజలు బాకీలు తీర్చలేని సజ్జనులను చెప్పుల జోడు కరీదు కూడా చేయలేని పేదలను బానిసలుగా అమ్మివేశారు. ఆమో 2:6
ఈ ఆమోను, మోవాబు , యూద యిస్రాయేలు ప్రజలు ఇతరులను ఎలాగైనా నాశనం చేయాలని పూనుకొని ఇంత ఘోర పాపానికి ఒడి గట్టారు. మరి అటువంటి వారి మీదకు నిప్పులు కురిపింతును అని పలుకుచున్నారు. వారి హృదయంలో కాఠిన్యం కారణముగానే వారు ఇంత పాపానికి ఒడి గట్టారు.
యవేలు 2:12 లో ప్రభువు ఇట్లనుచున్నాడు. ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు మీ బట్టలు చించుకొనుట చాలదు. మీ గుండెలను వ్రయ్యలు చేసి కొనుడు అంటున్నాడు.
కాబట్టి తపస్సు కాలంలో నీవు నేను దేవుని చెంతకు పూర్ణ హృదయముతో వచ్చి మనం చేసిన పాపములను ఒప్పు కోవాలి అప్పుడే దేవుడు మనలను దీవిస్తాడు.
ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో కాల విపత్తుల ద్వారా భూకంపము, రోగములు, సునామీ వర్షము , కరొన ఎంతో మంది మరణిస్తున్నారు. ఇలా మరణించడం వారి తప్పిదముల వల్ల కాదు కానీ ఈ లోక వైపరీత్యాల వల్ల జరుగుతుంది అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇదే మొదటి భాగంలో దేవుడు అనేది. ఆట్లు చంపబడిన గలీలియ వాసులకంటే, శీలోయము బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరుషలేము నివాసులకంటే ఎక్కువ పాపులని, అపరాధులని ఎంచుచున్నారా?అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఇతరులను నిందించకుండా సిద్దపాటు కలిగి పాశ్చాత్తాపములో దేవుని చెంతకు తిరిగి రావాలి.
2. మనల్ని మనం మార్చుకోవాలి :-
ఇక్కడ రెండవ భాగంలో అంజూరపు చెట్టు గురించి తెలియచేస్తున్నాడు. అయితే ఈ అంజూరపు చెట్టును యూదా ప్రజలకు ఉదాహరణగా తీసుకొనుచున్నాడు యేసు ప్రభువు లూకా 13:6 లో చూస్తే ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించేను అంటున్నాడు. ఇక్కడ ద్రాక్ష తోట అంటే ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమును సూచిస్తుంది. దేవుడు ఈ లోకములో ఉన్నటువంటిలో కెల్ల యూదా ప్రజలను ప్రత్యేకంగా ఎన్నుకోంటున్నారు. ఎందుకంటే వారికి సురక్షితమైన జీవితాన్ని ఇవ్వడానికి. ఈ సురక్షిత జీవితం ద్వార వారు ఎప్పుడు దేవునికి వినయ విధేయత చూపిస్తూ, పండ్లు అను మంచి పనులను వారి నుండి ఆశించాలనుకున్నాడు. కానీ వారు ఎప్పుడు వారి స్వార్ధం కోసమే జీవిస్తూ, దేవునికి దూరంగా వెళ్ళి పోతున్నారు. ఆది కాండం 2:1 లో ఈ విధంగా ఆకాశం భూమి సమస్త వస్తువులతో సంపూర్ణంగా రూపొందెను అని తెలుపుచున్నాడు. ఇదంతా సృష్టించిన తరువాత దేవుడైన యావే ఏదేనులో తూర్పుగా ఒక తోట వేసి అందులో తాను సృజించిన నరుని ఉంచాడు. ఆదికాండం 2:8. వారు సంతోషముగా జీవించుటకు, తినుటకు తియ్యని పండ్లనిచ్చు చెట్లను ఆ తోటలో పెరుగునట్లు చేశాడు. తరువాత నరుని సంతోషం కోసం స్త్రీని సృష్టించాడు.
దేవుడైన యావే వారిని సృష్టించిన తరువాత ఈ నేలపై అన్ని రకాలైన మృగములను , పక్షులను సృజించి వాటిపై మానవునికి ఆధికారాన్ని కలుగజేశాడు. దేవుడు వారిని ఎంతో ప్రేమించి ముందుగా 1. ఈ లోకాన్ని సృష్టించి,2. సమస్త వస్తువులను రూపొందిచాడు, 3. వారు నివసించుటకు ఏదేను తోటను ఎన్నుకొన్నాడు. 4. ఆ తోటలో నరునికి నివాసం ఏర్పరిచాడు. 4. రుచికరమైన పండ్లనిచ్చాడు. 6. ఆయన సంతోషం కోసం స్త్రీని సృష్టించాడు,7. తరువాత వారికి అన్నింటిమీద ఆధికారం కల్పించాడు.
దేవుడు ఇన్ని చేసిన కానీ దేవుడు చెప్పిన మాటకు విరుద్దముగా జీవించారు. వారిని తినవద్దని చెప్పిన పండును తిన్నారు. దీని ద్వారా వారిని ఆ తోట నుండి పంపివేస్తున్నాడు.
మరి ఈనాడు సువిశేష పఠనంలో దేవుడు అంజూరపు చెట్టు పై తన అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. తన తోట మాలితో ఇదిగో నేను మూడెండ్లనుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చు చున్నాను. కాని నాకు ఏమియు దొరకలేదు అంటున్నాడు. దేవుడు దేవుడు ఎన్నోసార్లు మనం మారుమనస్సు పొందాలని ఎదురుచూశాడు కానీ మనం మాత్రం మారు మనస్సు పొందకుండా స్వార్ధపు జీవితాన్ని దూరంగా వేదలిపోతున్నాం. యోష 1: 2 లో చూస్తే " భూమి, ఆకాశములారా! వినుడు, నేను పెంచి పెద్ద చేసిన ప్రజలే నన్ను విడనాడిరి అంటున్నాడు. దేవుడు ఎంతో బాధతో ఆకాశము, పక్షులతో మాట్లాడుతున్నారు. తనతో ఉండటానికి మానవుణ్ణి సృష్టిస్తే మనం మాత్రం మన స్వార్ధం కోసం చూసుకుంటున్నాం.
తరువాత వచనంలో దీనిని నరికి వేయుడు (లూకా 13:7 ) ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అని అంటున్నాడు.
అప్పుడు తోటమాలి తన యజమానికి ప్రార్ధన చేస్తున్నాడు. అయ్యా !ఇంకొక యేడు ఓపిక పట్టుడు అంటున్నాడు. పాత నిబందనలో చూసినట్లయితే అబ్రహాము గారు దేవుడు సొదొము, గోమోర్ర ప్రజల పాపం పెరిగిపోయినప్పుడు దానిని నాశనం చేయపునుకొనినప్పుడు అబ్రహాము గారికి దాని గురించి వివరించాడు. ఎందుకంటే, 1. సర్వ శక్తి వంతమైన ఒక మహా జాతి ఇతని వల్ల ఏర్పడుతుంది. 2. భూమండలమందంతట సకల జాతి జనులు దీవెనలు పొందుతారు.
మరి ఆటువంటి వ్యక్తికి దేవుడు తన ప్రణాళికను తెలియజేస్తున్నాడు. అప్పుడు అబ్రహాము ప్రభువుకి ఆరు సార్లు ప్రార్దన చేయుచున్నాడు. వారికి శిక్ష ఎలాగైనా పడకుండా చూడాలని 50 మంది నుండి 45 కు చేశాడు, 45 నుండి 40 కి చేశాడు, 40 నుండి 30 కి, 30 నుండి 20 కి , 20 నుండి 10 కి చేసి వారిని ఎలాగైనా రక్షించాలని ఎంతో ధైర్యం చేశాడు. కానీ వారి పాపం వలన వారిని అగ్ని దహించి వేసింది.
ఈనాటి సువిశేష పఠనంలో కూడా ఇలాంటి సన్నివేశాన్ని చూస్తున్నాం. యజమానుడు అనే యావే దేవుడు, తోటమాలి అనే యేసుప్రభువుకు అంజూరపు చెట్టు అనే జనాంగాన్ని యిచ్చియున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలు మరిచిపోతూ ఇష్టానుసారంగా జీవిస్తూ హృదయ పరివర్తనం చెందకుండా పశ్చత్తాపపడకుండా దేవుని నుండి దూరమైపోతున్న వారికోసం ప్రార్థన చేస్తున్నాడు లూకా 13:8; అయ్యా ఇంకొక ఏడు ఓపికపట్టుడు నేను దీని చుట్టూ పాదుచేసి, ఎరువు వేసెదను అంటున్నాడు.
పాదుచేయటం అంటే యేసుప్రభువు మూడు సంవత్సరములు తన శ్రమలు, మరణము, మరియు పునరుత్తానముల ద్వారా ప్రతి ఒక్కరికి రక్షణ కలుగుతుంది అని తెలియజేసాడు.
దేవుడంటున్నాడు యెషయా 14:18 నేను మిమల్ని ఆనాధులుగా విడిచిపెట్టను. నేను మీ యొద్దకు వత్తును. మన దేవుడు ఫలభరితముగా ఉన్న మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయనకు ఎప్పుడు అంటుకట్టుకొని జీవించు బిడ్డలుగా మారుస్తాడు.నేను ద్రాక్షావల్లిని మీరు నా కొమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను వాని యందు ఉందును అతడు అధికముగా ఫలించును యోహాను 15:5.
ఎరువు వేయటం :-
యేసుప్రభువు తన జీవితం ద్వారా మనకు దృఢతవాన్ని కలుగచేస్తునాడు. ఇది ఎలాంటి ఎరువు అంటే ప్రార్ధన అనే ఎరువు, ఉపవాసం అనే ఎరువు, ధన రుణ అనే ఎరువు, క్షమాపణ అనే ఎరువు, వినయం అనే ఎరువు, విశ్వాసం అనే ఎరువు.
ఇలాంటి ఎరువుల ద్వారా దేవుడు మనలో హృదయ పరివర్తన కలిగించి మనలను ఫలవంతముగా చేస్తుంటాడు. ఇలా ఫలవంతంగా మారిన మనము ఇతరులకు ఆహారముగా మారుతుంటాము. దీని ద్వారా ఇతరులకు మంచికార్యాలు చేస్తూ దేవునికి సాక్షులుగా జీవిస్తుంటాం. ముందు చూపినట్లుగా కపట ప్రవర్తనను మార్చుకొని జాగరూకులై ఉంటూ ఈలోక సంబంధమైన వ్యక్తులకు, వస్తువులకు భయపడకుండా ఎన్నో శ్రమలు అనుభవించినాకూడా సిద్ధపాటు జీవితాన్ని కలిగి జీవిస్తూ దేవునికి బహిరంగ సాక్షులుగా జీవిద్దాం. ఆలా జీవించనిచో ఈ అంజూరపు చెట్టును ఏవిధంగానైతే ఫలించకపోతే కొట్టి పారవేస్తారో మన జీవితంకూడా అదేవిధంగా జరుగుతుంది.ఈ నాటి రెండొవ పఠనంలో కూడా పునీత పౌలుగారు అదే బోధిస్తున్నారు.
రెండవ పఠనము :-1 కొరింతు 10 : 1-6 , 10 - 12
మన పూర్వులు మేఘముక్రింద ఉండినపుడు వారు సముద్రమును దాటి సురక్షితముగా అవతలకి చేరారు కానీ వారు ఎప్పుడైతే దేవునిమీద సణుగుకొని దేవునికి విరుద్ధముగా జీవించారో విగ్రహములను ఆరాదించారో, వ్యభిచరించారో అప్పుడు 25 వేలు మంది మరణించారు. పాము కాటుతో ఎంతోమంది మరణించారు కాబట్టి ఈ చిట్టచివరి రోజులలో తపస్సు కాల రోజులలో ప్రార్ధన, ఉపవాసం, దాన ధర్మ క్రియలను పాటించు రోజులలో మనం దేవునితో, దేవుని సన్నిధిలో మనం మన నివాసాన్ని దేవునితో ఏర్పరుచుకొని, ఆయనకు వినయ, విధేయతను చూపిస్తూ జాగ్రత్తగా అయన యొక్క రక్షణ ప్రణాలికను మన సాక్షపు జీవితం ద్వారా తెలియజేయాలి అప్పుడే మన జీవితం ఫలవంతమవుతుంది.
బ్రదర్ . జోసెఫ్ మారియో ఓ.సి.డి.
12, మార్చి 2022, శనివారం
తపస్సు కాలం 2 వ ఆదివారం
తపస్సు కాలం 2 వ ఆదివారం
తపస్సు కాల రెండవ ఆదివారము
తపస్సు కాల రెండవ ఆదివారము
ఆది 15 : 5 -12 , 17 -18, ఫిలిపీ త్రీ:17 - 4 :1, లూకా 9 :28 -36.
క్రీస్తునాదునియందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించాలి అని తెలియచేస్తున్నాయి. తల్లి శ్రీ సభ మనలనందరిని కూడా ప్రార్థన శక్తి ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించాలని ఆహ్వానిస్తున్నాయి.
మొదటి పఠనంలో విశ్వాసమున తండ్రి అయిన అబ్రాహామును రెండు విషయాలలో తన మాట మీద గురి ఉంచమని దేవుడు కోరుతున్నాడు.1) నీకు ఒక గొప్ప బహుమానం ఇస్తాను అని దేవుడు పలుకుతున్నాడు 2) అబ్రాహాము సంతతికి భూమిని దారాదత్తం చేస్తానని దేవుడు అబ్రాహామును వాగ్దానం చేస్తున్నాడు
1) నీకు ఒక గొప్ప బహుమానం ఇస్తాను అని దేవుడు పలుకుతున్నాడు: దీనికి అబ్రాహాము, ప్రభు నువ్వు నాకు ఏమి ఈయగలవు నేను బిడ్డలు లేని వాడిని, నీవు నాకు సంతానం కలిగించలేదు అంటున్నాడు.ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అబ్రాహాము తనను తాను అనుమానించుకుంటున్నాడు, నేను ముసలివాడను నాకు సంతాన ప్రాప్తి లేదు అని అపనమ్మకం అబ్రాహాము వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అబ్రాహామును దేవుడు కల్దియా దేశం నుండి పిలిచి తనను ఒక గొప్ప మహాజాతిగా తీర్చిదిద్దుతాను, నిన్ను దీవించేవారిని దివిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను, నీ ద్వారా నేను సమస్త జాతి జనులను దివిస్తాను అని వాగ్దానం చేసిన మాటలను మరచిపోయి కూడా అబ్రహాము దేవుని మీద ఈ విధంగా పలికియున్నాడు.
అప్పుడు దేవుడు అబ్రాహాముతో నీకు పుట్టినవాడే నీకు వారసుడవుతాడు అతడి సంతానం నక్షత్రములవలె అవుతుందని చెప్పినపుడు అబ్రాహాము నమ్మాడు, ఆయన నమ్మకాన్ని బట్టి దేవుడు అబ్రాహామును నీతిమంతునిగా చేసాడు.
2) దేవుడు అతని సంతతికి భూమిని దారాదత్తం చేస్తానని వాగ్దానం చేయుట:
దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం, అబ్రాహాము దేవుడు తన యొక్క సంతతికి ఇస్తానన్న భూమిని తండ్రి దేవుడు మాట తప్పకుండా ఇస్తాను అని మాటిచ్చి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత, అబ్రాహాము దేవుని యెక్క మాటను విశ్వసముతో నమ్మాడు. విశ్వస ఒప్పందాన్ని 15వ అద్యాయములో చూస్తున్నాము. దేవునిపై నమ్మకము ఉంచితే మనకు కావలిసినదంత దేవుడు మనకు ఇస్తాడని, మొదటి పఠనము మనకు తెలియజేస్తుంది.
3) సువిశేష పఠనము
ఈ యొక్క పఠనంలో క్రీస్తు యొక్క దివ్యరూపం దాల్చడం, క్రీస్తు యొక్క వస్త్రములు తెల్లగా ప్రకాశించడం మరియు ఆయనతో పాటు మరో ఇద్దరు దివ్య వ్యక్తులు మోషే మరియు ఏలీయా కనబడ్డారు అన్న విషయాన్ని తెలియపరచటం మనము చూస్తున్నాము. ఈ యొక్క ముగ్గురు వ్యక్తులుకూడా
1) మోషే: మంచి నాయకుడు పుణ్యాత్ముడు, దేవుని యొక్క ముఖాన్ని ముఖ్య ముఖీగా చూసినవాడు, అంతే కాకుండా దేవుని యొక్క ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి వాగ్దాన భూమివైపు నడిపించటం కూడా చూస్తున్నాము.
2) ఏలీయా: ఏలీయా అంటేనే ఒక గొప్ప మహాశక్తి పేరు పొందిన వాడు, దేవునితో సంబాషించిన వ్యక్తి, ఏలీయా, బాలు ప్రవక్తలను మట్టు పెట్టి దేవుని యొక్క కీర్తిని అందరికి పరిచయం చేసినవాడు. ఈయన అనేక అద్భుత కార్యములను, మనము రాజుల రెండవ గ్రంధములో చూస్తున్నాము. ఈయన మరణించకుండానే పరలోకమునకు కొనిపోబడినట్లు మనం రాజుల రెండవ గ్రంధంలో చూస్తున్నాము.
దేవుని ధర్మ శాస్త్ర చట్టాల ప్రతినిధిగా మోషేను, ప్రవచనాల ప్రతినిధిగా ఏలీయాను ఉన్న వారి ముందు క్రీస్తు దివ్యరూపం ధరిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా క్రీస్తు పొందబోయేటటువంటి శ్రమలను , కష్టాలను మరియు బాధలను సిలువ మరణము గురించి క్రీస్తుతో సంభాషించటం చూస్తున్నాము.
వీటినన్నిటిని గ్రహించినటువంటి పేతురు క్రీస్తు దగ్గరకు వచ్చి మనము ఇక్కడ ఉండుట సమంజసము అందుకని మీకు, మోషే మరియు ఏలీయాకు గుడారములను నిర్మిస్తాం అని పేతురు క్రీస్తు ప్రభువుతో పలుకుచున్నాడు. ఇది ఇలా ఉండగా ఆకాశము నుండి తండ్రి దేవుడు ఈయన నా కుమారుడు ఈయనను చూచి నేను ఆనందించుచున్నాను, ఈయనను ఆలకించండి అని దేవుడు మనల్ని ఆదేశిస్తునాడు, అంటే క్రీస్తు చెప్పిన ప్రతిమాటను కూడా పాటిస్తూ, అనుసరిస్తూ, జీవించాలని తండ్రి దేవుడు మననందరికి తెలియజేస్తున్నాడు.
కాబట్టి ప్రియాయమైన క్రైస్తవ విశ్వాసులారా ఈ నాటి పఠనాలు అన్ని కూడా మానవులమైన మనం, ఎటువంటి స్థితిలో ఉన్నాకూడా క్రీస్తు యొక్క మార్గములో పయనిస్తూ, క్రీస్తుయొక్క అనుచరులుగా జీవించాలని మరియు దేవుడు మనందరిని కూడా అయొక్క బాటలో నడపాలని , ఆశీర్వదించాలని ఈ నాటి దివ్యబలి పూజలో పాల్గొందము.
Br.Simon
4, మార్చి 2022, శుక్రవారం
తపస్సుకాలం మొదటి ఆదివారం (2)
తపస్సుకాలం మొదటి ఆదివారం
ద్వితీ 26:4-10, రోమి 10:8-13, లూకా 4:1-13
ఈనాటి దివ్య పఠనాలు విశ్వాస జీవితంలో ఎదురయ్యే శోధనలు గురించి భోధిస్తున్నాయి. ఈనాటి తపస్సు కాల మొదటి వారంలోనే శోధనలు గురించి మాట్లాడుటకు గల కారణమేమంటే శోధనలు అందరి జీవితంలో సర్వ సాధారణం. కేవలం యేసు ప్రభువు యొక్క జీవితంలో మాత్రమే కాదు, శోధనలు వచ్చింది.
సృష్టి ప్రారంభం నుండి దేవునితో కలిసి, దేవుని కొరకు జీవించే దేవుని ప్రజలకు శోధనలు ఎదురయ్యాయి. శోధనలు ఏదురైనప్పుడు సాతాను బంధాలకు లొంగకుండా దైవ శక్తితో, ప్రార్ధనాయుదంతో శోధనలు జయించాలని నేడు ప్రభువు మనకు తెలియజేస్తున్నారు.
ఈ 40 రోజులు పాటు ఎంతో మంది ఉపవాస, ప్రార్ధన ధాన ధర్మల ద్వారా పుణ్యకార్యాలు చేస్తుంటారు. ఆయితే ఇలాంటి మంచి కార్యాలు చేసేటప్పుడు మనలో ఎదురయ్యే శోధనలకు పడిపోకుండా జీవించాలన్నదే దేవుడు మనకు నేర్పించేది.
శోధనలు జయించినప్పుడే మనం యొక్క నిజమైన విశ్వాసం, అనుసరణ ఎలాంటిది అని తెలుస్తుంది. పేతురు గారు తాను వ్రాసిన మొదటి లేఖ 1:7 వచనంలో బంగారం కన్నా విలువైన మీ విశ్వాసం పరీక్షించబడాలి అని తెలుపుచున్నారు.
సైతానుడే మన జీవితంలో శోధనలు పెడతాడు యాకోబు 1:13. మన యొక్క విశ్వాస జీవితంలో సైతానుతో పోరాడాలి మనం చేసే ఉపవాసం, ప్రార్ధన ధాన ధర్మాల ద్వారా సైతాను శక్తిపై విజయం సాధించాలి.
ఈ నలభై రోజుల తపస్సు కాల యాత్ర మనందరిలో దైవ శక్తిని నిపుతుంది. ఏ విధంగానైతే యేసు ప్రభువు సైతాను శక్తిని జయించారో అలాగే 40 రోజులు జీవితం ద్వారా మన యొక్క బలహీనతలను మనం అధిగమించాలి, వ్యాసనాలను విడిచిపెట్టాలి, పుణ్య మార్గంను అనుసరించాలి.
సైతాను యొక్క శోధనలు జయించడానికి మనందరికీ ప్రార్ధన శక్తి అవసరం. శోధన జయింప అను క్షణం ప్రార్ధించమని ప్రభువు పలికారు. మత్తయి 26:41.
ప్రార్ధన వలన మనం దేవునితో ఐక్యమై ఆయన యొక్క సహకారం పొందగలం, ఉపవాసం ద్వారా శారీరక వాంఛలను, ఐహికాకర్షణలను మనం అదుపులో వుంచుకోగలం అదే విధంగా త్యాగ జీవితం ద్వారా మన యొక్క స్వార్ధాన్ని త్యజించి తోటి సోదరులకు సహాయ పడగలం.
ఈనాటి మొదటి పఠనంలో దేవుడు చేసిన మేలులకు ప్రతీ ఫలంగా మొదటి ఫలములను దేవునికి సమర్పించే అంశం గురించి భోధిస్తుంది.
తమ యొక్క పంటలో మొదటి ఫలములు దేవునికి సమార్పించే ముందు దేవునిపట్ల తమకున్న విశ్వాసాన్ని భక్తి, శ్రద్దలతో ప్రకటించాలని మోషే ప్రవక్త యిస్రాయేలియులకు తెలుపుచున్నారు. మోషే ప్రవక్త దేవుని యొక్క గొప్పతనం గురించి అలాగే ఏ విధంగా దేవుడు యిస్రాయేలుణు ప్రేమించి బయటకు తీసుకొని వచ్చారు అనే అంశం గురించి తెలుపుచున్నారు. ప్రభువైన దేవుడు వారి కోసం చేసిన మహాత్కార్యాలు అని వివరిస్తున్నారు.
ఆరాము దేశంలో లాబాను వద్ద అనేక సంవత్సరాలు సేవలు చేయడం వలన యాకోబుకు ఆరామియుడు అనే పేరు వచ్చింది. యాకోబు యొక్క వంశము ఎలాగ వృద్ది చెందినది అని మరొకసారి వివరిస్తున్నారు ప్రవక్త.
యిస్రాయేలుప్రజలు బానిసత్వంలో ఉండి దేవునికి మొరపెట్టిన్నప్పుడు దేవుడువారిని కాపాడారు. వారిని తన యొక్క ప్రజలుగా స్వీకరించి వారిని నడిపించారు. ఎడారిలో 40 సంవత్సరాల ప్రయాణంలో తోడుగా నీడగా ఉండి పాలు తేనెలు జాలు వారు నేలను బాహుమానంగా ఇచ్చారు. అన్నీ చేసిన దేవునికి ప్రధమ ఫలములు సమర్పించు అని మోషే అంటున్నారు.
దేవునికి సమర్పించే ఆ ప్రధమ ఫలములు వారిపట్ల దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత వెల్లడి చేయుటయే. దేవుడు కేవలం వారిని బానిసత్వం నుండి బయటకు తీసుకొని రావడమే కాదు చేసింది, వారి యొక్క విశ్వాస జీవితంలో ఎదురయ్యే శోధనలలో వారిని బలపరిచారు దేవుడు. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు వారికి చేశారు. అందుకే ప్రధమ పంటను సమర్పించాలి.
మొదటి ఫలమును బలి పీఠము ముందుంచిన సమయంలో యావే దేవుడు చేసిన గోప్ప కార్యాలు అన్నీ ఉచ్ఛరించాలి. ఆ మహత్తర కార్యలేమిటంటే యిస్రాయేలును దేవుని బిడ్డలుగా ఒక ప్రజగా చేసిన మహత్తర కార్యాలు.
1. మెసపటోమియా నుండి కానాను దేశంకు అలాగే ఐగుప్తుకు ప్రయాణం. అబ్రహాము నుండి యిస్రాయేలు ప్రజలు వాగ్దత్త భూమి చేరుకొను సమయం వరకు.
2. ఐగుప్తు నుండి యిస్రాయేలు స్వేచ్ఛ స్వతంత్రులను చేసిన కార్యం, బానిసత్వం నుండి బయటకు తెచ్చిన కార్యము.
3. యిస్రాయేలుతో సినాయి వద్ద చేసుకున్న ఓడంబడిక
4. దేవుని యొక్క వాగ్దాన భూమినిచ్చుట - పాలు తేనెలు జాలు వారు దేశం
5. దేవుడు వారి పట్ల దయ చూపుతూ తోడుగా ఉండే కార్యం
6. దేవున్ని తండ్రిగా కలిగిన గొప్ప అద్భుతం. యిస్రాయేలుకు దేవుడు మంచి దేశంను కానుకగా ఇచ్చినందుకు దేవుని ఓడంబడికకు బద్దులై వారు ప్రతి సంవత్సరం దేవునికి కృతజ్ఞతలను ప్రధమ ఫలములు సమర్పించుట ద్వారా తెలిపేవారు. వాస్తవానికి యిస్రాయేలు ప్రజలు ఈ విధంగా సమర్పించుట ద్వారా వారు దేవున్ని జ్ఞాపక పరుచుకొంటున్నారు. అలాగే దేవుడు ఎలాగ వారిని అభివృద్ది పరిచారో అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. దేవుడు సమృద్దిగా ఇచ్చిన విధానం గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
ఈ తపస్సు కాలంలో అడుగు పెట్టిన మనము కూడా యిస్రాయేలు ప్రజల జీవితం నుండి నేర్చుకోవాలి.
1. మనం కూడా అంధకారం నుండి వెలుగులోనికి ప్రయాణం చేయాలి. బానిసత్వం నుండి స్వేచ్ఛ లోనికి వెళ్ళాలి. పాపం నుండి పుణ్య మార్గం అనుసరించాలి.
2. దేవునితో కలిసి జీవిస్తామని, దేవునికొరకు అన్నీ సమర్పించి జీవిస్తామని నిర్ణయం తీసుకోవాలి. దేవునితో ఓడంబడిక చేసుకోవాలి.
3. దేవుడిచ్చిన దివ్య సత్ప్రసాదంను స్వీకరిస్తూ దేవున్ని కలిగి జీవించాలి.
4. దేవుడు మన కోసం సిద్దం చేసిన పరలోక రాజ్యంకు అర్హత కలిగి జీవించాలి.
5. దేవుడు చేసిన మేలులకు ఎల్లప్పుడు కృతజ్ఞులై జీవించాలి. చాలా సందర్భాలలో మనం దేవునికి ఆయన చేసిన మేలులకు ప్రధమ ఫలాలను సమర్పించం. దేవునికి ఇవ్వాలనుకునే సమయంలోమనకు శోధనలు వస్తాయి. ఇంత ఖరీదైనది, మెలిమయినది దేవునికి ఇవ్వలా , వద్దా అనే సందేహాలు, శోధనలు వస్తాయి వాటిలో మనం మునిగిపోతాం.
దేవునికి ఇవ్వాల్సిన సమయంలో ఇచ్చుటకు మనం సిద్ధంగా ఉండాలి. చాల మందిలో మనం ఇచ్చేది దేవునికే గా ఏది ఇస్తే ఏముందిలే అని ఆలోచిస్తారు.
1. మనం ప్రధమ సమయం దేవునికి ఇవ్వాలి - ఎందుకంటె దేవుడే మనకు మరొక రోజును సమర్పించారు కాబట్టి ప్రధమ సమయం అంటే ఉదయం లేచిన సమయం.
ప్రధమ ఫలములు - కూరగాయలు , కాయ పండ్లు అధే విధంగా ఏదైతే ప్రధామముగా వస్తుందో దానిని ప్రభువునకు సమర్పించాలి. సమార్పించేముందు దేవుడు చేసిన గొప్ప కార్యాలు గుర్తుకు తెచ్చుకోవాలి.
రెండవ పఠనంలో పునీత పౌలు గారు యూద మాతము క్రైస్తవులుగా మారిన వారికి ఒక విధమైన భోధన చేస్తున్నారు. మళ్ళీ విశ్వాస జీవితంలో యూద మతంలోనికి వెళ్లాలనే శోధన నుండి బయటకు రావాలని పౌలుగారు వారికి భోధన చేస్తున్నారు. మోషే ప్రవక్త ఇచ్చిన శాసనములకు బద్దులై జీవించాలనే శోధన నుండి బయటకు రావాలని పౌలు గారు తెలియ జేస్తున్నారు.
యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పు కుంటే ఆయన మృతులలో నుండి లేచాడని విశ్వసిస్తే నీవు రక్షించ బడుదువు అని అన్నారు.
పాలు గారు మనంతట మనం నీతిమంతులం కాలేము కానీ హృదయములో దేవుని విశ్వసించి జీవిస్తే ఆయన యొక్క కృప ఫలితమున నీతిమంతులము అవుతాము అని తెలుపుచున్నారు.
యేసు క్రీస్తు నందున్న విశ్వాసంను మాటల ద్వారా క్రియాల ద్వారా మరియు మన యొక్క జీవితం ద్వారా వెల్లడించాలి. ఆయనను విశ్వసించే వారు సిగ్గుపడనవసరం లేదు ఎందుకంటే ఆయనయె లోక రక్షకుడు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఎవరు కూడా బాధపడనవసరం లేదు.
దేవుడు ఒక్కడే కాబట్టి ఆయనను అందరు విశ్వసించి జీవించాలి. ప్రభువుకు ప్రార్ధించుట ద్వారా దీవెనలు సమృద్దిగా దొరుకుతాయని పౌలు గారు తెలుపుచున్నారు. యేసు క్రీస్తు నామమున ప్రార్ధించే వారు అందరు రక్షింపబడుతారు.
కావున మన యొక్క విశ్వాస జీవితంలో యేసు ప్రభువు యొక్క పునరుత్థానంను ఆయన దేవుడని అందరు కూడా బహిరంగంగా ఒప్పుకొంటూ మన యొక్క జీవితం ద్వారా దానిని చాటి చెప్పాలి.
మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు కూడా యేసు క్రీస్తు ప్రభువును ప్రకటించాలి. మన యొక్క జీవితం ద్వారా మిగతా వారికి మన క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి.
ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు ఎదుర్కొన్న శోధనల గురించి మనం వింటున్నాము. యేసు ప్రభువు తండ్రి యొక్క కార్యమును కొనసాగించుటకు ముందు 40 రోజులు ఏకాంతంగా ఉపవాసం, ప్రార్ధన చేస్తూ ఎడారిలో తండ్రితో గడిపారు. యేసు ప్రభువు యొక్క శోధనలు మూడు విధాలుగా వర్ణించబడ్డాయి.
ఎందుకని మూడు శోధనలనే ప్రత్యేకంగా తెలుపుచున్నారు అంటే ఈ మూడూ శోధనల గురించి పాత నిబంధన గ్రంధంలో వింటున్నాం.
సైతాను యేసు ప్రభువును శోధించినప్పుడు ప్రతిసారీ పాత నిబందన యొక్క వాక్యం ద్వారా సైతాను యేసు ప్రభువును శోధిస్తుంది. ఇది ఎందుకంటే పూర్వ నిబందన గ్రంధంలో యిస్రాయేలు ప్రజలు ఎడారిలో మూడు ముఖ్యమైన శోధనలు గురియయ్యారు ఆ మూడు సందర్భలలో వారు విఫలమైయ్యారు.
ఇవే మూడు శోధనలు నూతన యిస్రాయేలు అయిన యేసు క్రీస్తును కూడా సైతాను పడవేయాలనుకున్నది. తండ్రికి దగ్గరైయె కొద్ది అమనం జీవితంలో సైతానుడు ప్రవేశించి మనలను ఆయన నుండి పడవేయాలనుకుంటాడు. అందుకే శోధిస్తుంటాడు.
ఈ సువిశేషం గమనించినట్లయితే ఇక్కడ చాలా విషయాలు అర్ధమవుతాయి. మొదటిగా యేసు ప్రభువు పవిత్రాత్మ పరిపూర్ణుడాయేను. ఎప్పుడైతే యోర్ధనులో బాప్తిస్మమం పొందారో అప్పుడు మరొక సారి తండ్రి దేవుడు, పవిత్రాత్మ దేవుడు మానవ దైవ స్వభావం కలిగిన క్రీస్తు ప్రభువును బలపరిచారు.
ఆత్మ ప్రేరణ వలన ఏడారికి నడిపింపబడ్డాడు. ఎందుకు ఎడారికి నడిపించబడ్డారు అంటే ఎడారి విశాలవంతమైన స్థలం, నిశబ్దంతో కూడిన స్థలం, దేవునికి యొక్క సాన్నిధ్యం అనుభవించుటకు వీలుగా ఉన్న స్థలం. అందుకే దేవుడు ఎన్నుకొన్నారు. ఏకాంతంగా ఉంటూ ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా తనను తాను దైవ కార్యంకు సిద్ధం చేసుకోవడానికి అక్కడకి వెళ్లారు.
రెండవది యిస్రాయేలు ప్రజలు ఎడారిలో కలిగిన శోధనల్లో పడి పోయారు. వారి యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలో శోదనల్లో పడి దేవున్ని విస్మరించారు. అదే ఎడారి ప్రాంతంలో మానవునిగా జన్మించిన క్రీస్తు ప్రభువు శోధనలు జయించుటకు అక్కడకు నడిపించబడ్డారు.
యేసు ప్రభువును సైతాను 40 రోజులు శోధించుచుండెను. పవిత్ర గ్రంధంలో చూసిన వాక్యాలు బట్టి సైతానుడు రెండవ సారి యేసు ప్రభువును తుదముట్టించాలను కుంటున్నాడు. బాల యేసు గా జన్మించినప్పుడు సైతాను హెరోధును శోధించి, ప్రేరేపించి చంపాలనుకున్నాడు. కానీ విలుపడలేదు. ఇప్పుడు మరొకసారి యేసు ప్రభువును తన యొక్క తండ్రి కార్యం నుండి సంపూర్ణంగా వైదొలగే లాగా చేయాలనుకుంది. అందుకే శోధిస్తుంది.
సైతానుడు మనల్ని కూడా ఈ 40 రోజుల్లోనే ఎక్కువగా శోధిస్తాడు. మరీ ముఖ్యంగా దీక్ష తీసుకున్న వారిని ఎందుకంటే వారు దైవ ప్రేరణ వలన దీక్ష తీసుకున్నారు, కాబట్టి వారిని ఆటకం పరుచుటకు సైతానుడు శోధిస్తాడు.
ఎవరినైతే దేవుడు తన యొక్క పనికోసం వినియోగించుకుంటున్నారో వారి జీవితాలను 40 రోజులలో దేవుడు ఎంచుకుంటున్నారు. నోవా యొక్క జీవితం 40 రోజుల వర్షంతో మారింది. మోషే సినాయి పర్వత మీద 40 రోజులు ప్రార్ధనా అనుభవం ద్వారా మారిపోయారు.
ఏలియా దేవుడు ఒసగిన 40 రోజులు రొట్టెద్వారా మారిపోయారు, 40 రోజులు విశ్వాస ప్రార్ధన ద్వారా నినివే పట్టణ వాసులు మారిపోయారు. 40 రోజులు ఉపవాస ప్రార్ధన ద్వారా యేసు ప్రభువు దేవుని శక్తిచే క్రొత్తగా నింపబడుతున్నారు. ఈ 40 రోజుల్లో తండ్రి, పవిత్రాత్మ యేసు ప్రభువును తన పని కోసం సిద్దం చేశారు, క్రొత్తగా చేశారు, బలవంతుణ్ణి చేశారు.
యేసు ప్రభువు యొక్క మొదటి శోధన:
ఆహరం గురించి, శారీరక వాంఛ గురించి - మనం ఎక్కడ బలహీనులమో అక్కడే సైతాను ఎక్కువగా శోధిస్తుంది. యేసు ప్రభువు 40 వది రోజులు ఉపవాసం చేశారు. ఆకలితో ఉన్నారు అందుకే అక్కడ శోధించింది.
పూర్వ వేదంలో ఇశ్రాయేలు ప్రజలు ఆకలికి సంబంధించిన శోధన ఎదురైనప్పుడు మోషేను దూషించి దేవునికి పాపం చేశారు. దేవుడు అప్పుడు వారికి మన్నాను ఒసగుతూ నేర్పించిన పాఠమేమిటంటే కేవలము రొట్టెవలనే కాదు, కానీ దేవుని యొక్క వాక్యం వలన కూడా జీవిస్తారని తెలిపారు. ద్వితీ 8: 3 , నిర్గమ16:2-3 భోజనము గురించి.
శరీరానికి సంభందించిన శోధనలలో మనం చాలా సార్లు పడిపోతాం. మన పంచేంద్రియాల పంచేంద్రియాలు వలన పడిపోయే సమ్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవాలి.
ఈ మొదటి శోధన తన యొక్క దైవత్వంను నిరూపించుటకు సైతాను శోదిస్తున్నాడు. వాస్తవానికి సైతాను యేసుప్రభువు తన యొక్క శక్తులను తన సొంత అవసరాలకు వినియోగించు కుంటాడా లేదా అని శోధించింది. అయితే ప్రభువు శారీరక వాంఛలకు లొంగకుండా తన యొక్క శక్తిని స్వంత లాభం కోసం వాడలేదు. యేసు ప్రభువు ఈ లోక శారీరక సుఖాల వలన సంతృప్తి చెందరు, ఆయన యొక్క నిజమైన ఆనందం తండ్రిని సంతృప్తి పరచటం, తండ్రి యొక్క కార్యం నెరవేర్చుటయే.
రెండవ శోధన- అధికారం గురించి
ఈలోక సామ్రాజ్యాలను చూపించి తనను ఆరాధిస్తే అటువంటి సామ్రాజ్యాలను సైతాను ఇస్తానని యేసుతో అంటున్నారు.యేసుప్రభువు యొక్క సిలువ మార్గాన్ని అడ్డుకోవాలనుకున్నది. మత్తయి16: 22 . ఈలోకంలోనే ఆయన్ను ఉంచి తనకు లోబరుచుకోవాలనుకున్నది సైతాను.
ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఇతర దేవుళ్లను ఆరాధించారు. ఎడారిగుండా వారిని ఆదిపిన ఎవుణ్ణి వారు మరిచిపోయారు. ఒక బంగారు దూడను ఆరాధించారు నిర్గమ 32:16 , విగ్రహ ఆరాధనా చేశారు. ఇక్కడ వీరు విగ్రహ ఆరాధన చేయటం మాత్రమే కాదు దేవునికి చెందవలసిన స్తానం ప్రాముఖ్యత వస్తువులకు ఇస్తున్నారు.
అధికారం కోసం మనం కొన్నిసార్లు ఏదైనా చేస్తాం ఎక్కడికైనా వెళతాం. కానీ యేసు ప్రభువు అందుకు ఒప్పుకోలేదు లోక సంపదలు అన్నింటిని కంటే దేవుడే ముఖ్యమని ఆయన మీదనే జీవించాలని తెలియచేస్తున్నారు. అధికారం కోసం కొన్నిసార్లు ఎవరి కళ్ళైనా మొక్కుతాం ఎంతకైనా దిగజారతాం. కానీ ఇక్కడ ప్రభువు నేర్పించేది ఏమిటంటే, అధికారం కోసం సంపదల కోసం దేవుడిని విడిచిపెట్టకూడదు.
మూడవ శోధన దేవుడ్ని పరీక్షకు గురిచేయుట
యిస్రాయేలు ప్రజలు దేవుడ్ని అనేకసార్లు పరీక్షించారు, ఆయన శక్తిని పరీక్షించారు. యేసు ప్రభువు కింద పడితే ఏమి కాదని, దుఃఖమని సైతాను ఎవుని శక్తిని పరీక్షించింది. యిస్రాయేలు ప్రజలు దేవుడ్ని మస్సా, మెర్రిబ్బాల వద్ద పరీక్షించారు. నిర్గమ17: 1-7, దేవుడు మనతో ఉన్నాడా లేడా అని. యేసుప్రభువు ఎన్నడును దైవ శక్తిని పరీక్షించలేదు ఆయనకు తండ్రి మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది కాబట్టియే దేవుడ్ని పరీక్షించలేదు.
మనయొక్క విశ్వాస జీవితంలో శోధనలు వచిన్నపుడు దేవుడ్ని చాల సార్లు పరీక్షిస్తాం. దేవుడా నీవు నాకు వరం ఇస్తేనే గుడికి వస్తాం అని పరీక్షిస్తాం. పరీక్షలో మంచి మార్కులు వస్తే గుణదలకు వస్తానని పరీక్షిస్తాం. ఇంకా చాల విధాలుగా మనం దేవుడ్ని పరీక్షిస్తాం. అన్నిటి కన్నా కావలసినది దేవుడ్ని పరీక్షించటం కాదు దేవుని మీద ఆధారపడి జీవించుట, ఆయనయందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించుట.
కాబట్టి మనయొక్క విశ్వాస జీవితంలో శోదనలు వచ్చినప్పుడు, దైవశక్తితో ప్రార్థనతో వాటిని జయించుదాం.
-యేసు ప్రభువు వారు అన్ని చోట్ల శోధించబడ్డారు. అయినా కూడా సైతానుకు లొంగలేదు.
పవిత్ర గ్రంథంలో శోధించబడినవారు
-ఆదాము శోధించబడ్డారు, సైతానుకు పడిపోయాడు.
-అబ్రాహాము శోధించబడ్డాడు, సైతానును జయించాడు.
-ఇశ్రాయేలియులు సైతాను మాయలో పడ్డారు.
-దావీదు శోధించబడ్డారు ఆయనకూడా పడిపోయారు కొన్నిసందర్భాలలో.
-సొలొమోను, సంసోను శోధించబడ్డారు వారుకూడా పడిపోయారు.
-యేసు ప్రభువు కూడా శోధించబడినప్పటికిని సైతాను వలలో చిక్కుకొనక అన్ని శోధనలు జయించారు.
-మన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు మనం కూడా శోధనలు జయించాలి.
-మనయొక్క శక్తిని మించి మనం శోధించబడం. (1 కొ రింతి 10:13), కాబట్టి దైవ శక్తితో శోధనలు ఎదుర్కొందాం. దేవునికి సాక్షులై జీవించుదాం.
-మనకు వచ్చే శోధనలలో దేవుడి మీద ఆధారపడి జీవిస్తూ మనయొక్క విశ్వాస జీవితమును కొనసాగించుదాం.
-మన జీవితంలో ఒక దాని తరువాత ఒక శోధన వస్తూనే ఉంటుంది. వాటన్నిటిని దైవశక్తితో జయించుదాం.
Rev. Fr. Bala Yesu OCDమార్కు 6 : 14 – 29
February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...