సామాన్యకాలపు ఇరవై ఆరోవ ఆదివారం
సంఖ్యకాండము 11:25-29, యాకోబు 5:1-6
మార్కు 9:38-43, 45, 47-48.
క్రీస్తునాధునియయందు ప్రియ సహోదరి సహోదరులారా మరియు ప్రియమైనటువంటి భక్తులరా, ఈనాటి మూడు పఠణాలను మనం గ్రహించి ధ్యానిస్తే, మూడు పఠణాలు కూడా మనకు తెలియజేస్తున్నా అంశం ఏమిటంటే, మూడు ప్రధానమైనటువంటి విషయలను గురించి మనకు క్లుప్తంగా వివరిస్తున్నాయి, అవి ఏమిటంటే దేవుని కృప, అయన తీర్పు మరియు మన తప్పులను సరిదిద్దుకోని. దేవుని బాటలో ప్రయాణిస్తూ, మనం చేసినటువంటి పాపాలను వదలిపెట్టి, ఇతరులను ప్రేమతో దేవుని చెంతకు తీసుకోని రావాలని ఆహ్వానిస్తున్నాయి.
ముందుగా దేవుని కృప, తీర్పు మరియు మన తప్పులను సరిదిద్దుకోవడం అంటే ఏమిటి అని మనం ముందుగా గ్రహించాలి. అసలు దేవుని కృప అంటే ఏమిటి.
దేవుని కృప అనేది మనం సాదించుకోలేని, సంపాదించుకోలేని దివ్యమైనటువంటి లేదా పవిత్రమైనటువంటి వరం. ఈ వరం మనకందరికీ కూడా దేవుని ప్రేమ, కరుణ మరియు పాపముల నుండి విముక్తి పొందే వరం. బైబిల్ గ్రంథ ప్రకారం దేవుని కృపకు సంబంధించిన ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు ఉన్నాయి. వాటి ద్వారా మనం దేవుని కృప ఏ విధంగా మన జీవితాలను మారుస్తుందో అర్థం చేసుకోవచ్చు.
రో్మీయులకు వ్రాసిన లేక 5:8 వచనంలో చూస్తున్నాము.మనము పాపులమై యుండగా క్రీస్తు మన కోసము చనిపోయెను. ఈ వాక్యము మనకు దేవుని కృపను ఆవిధంగా మనపై ఉందొ తెలియజేస్తుంది. మనం పాపులమై ఉండి దేవుని నుండి దూరంగా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు మనకోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనందరి కోసం తాను ప్రాణత్యాగం చేశాడు. ఈ కృప మన బలహీనతల మధ్యన, దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మనతో ఉందని గుర్తుచేస్తుంది. అందుకే
2 కొరింథీయులకు వ్రాసిన లేక 12:9 వచనంలో క్రీస్తు ప్రభు అంటున్నారు. నా కృప నీకు సరిపడును. అంటే ఈ వాక్యము దేవుని కృపను మరింత స్పష్టంగా వివరిస్తుంది. మన బలహీనతలలోనూ, సమస్యలలోనూ, దేవుని కృప మనకు ఆధారంగా నిలుస్తుంది. అది మనకు అర్హత లేకున్నా కూడా దేవుడు మన మీద చూపించే దయ మరియు అయన కృప మన పాపాలకు క్షమాపణ ఇచ్చి కొత్త జీవితని అందిస్తుంది. దేవునితో సన్నిహిత సంబంధాన్ని అందిస్తుంది. అదే నిజమైన క్రైస్తవుని యొక్క జీవితం.
మొదటి పఠనని చుసినట్లయితే దేవుడు ఇజ్రాయెల ప్రజలను ఏవిధంగా బానిసత్వ జీవితం నుండి దేవుడు తన ప్రజల పట్ల చూపించినటువంటి కృపను తెలియజేస్తుంది. వారు చేసినటువంటి తప్పులను క్షమించి వారిపై తన కృపను ఎంతగానో చూపిస్తూ, వారిని అన్ని కష్టాలనుండి కాపాడుతు, వారికీ వచ్చినటువంటి కష్టాలను దూరం చేస్తూ, వారికీ అన్ని మేలులను దయచేస్తున్నారు. ఏ విధంగా అంటే తన ఆత్మ శక్తిని వారిపై పంపి తన కృపను అందజేస్తున్నాడు. అదేవిధంగా మన జీవితాలలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, మనం కూడా అందరిలాగా దేవునిపై కోపం చూపించకుండా ఓపికతో ఎదురుచూసినట్లుతే అయన కృప ఎప్పుడు మనతో ఉంటుందని మొదటి పఠనం మనకు తెలియజేస్తుంది.
రెండొవ పఠనము యాకోబు వ్రాసిన లేక 5:1-6 లో దేవుడు ధనికులను హెచ్చరించడం గురించి చూస్తున్నాము అది ఏ విధంగా అంటే నీకు ఉన్నా సంపాదలను ని స్వార్ధం కొరకు ఉపయోగించకుండా ఇతరులకు మేలు చేసే విధంగా ఉపయోగించమని ఆలా ఉపయోగించడం ద్వారా దేవుని చేత ఆశీర్వాడింపబడతావని లేకపోతే దేవుని నుండి శిక్షను పొందుతావని మనకందరికి కూడా తెలియజేస్తున్నాడు, ఇక్కడ ఒక క్రైస్తవునిగా మనం చూడవలసిందేమిటంటే, మనం సర్వస్వాన్ని సంపాదించినా, అది దేవుని యోగ్యమైన విధంగా వాడకపోతే అది వ్యర్థమేనని చూసిస్తుంది. అది ఆవిధంగా అంటే లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభము ఉండదో అలాగే మనకు ఎన్ని ఆస్తిపాస్తులున్న అది దేవునికి ఇష్టనుసారంగా లేకపోతె ప్రయోజనము లేదు. ఎందుకంటే పాపాలు, అత్యాశ, ఇతరుల బాధలను పట్టించుకోకపోవడం వంటివి అన్నీ కూడా దేవుని ఖండనకు దారితీస్తాయి. కాబట్టి మన సంపదలను న్యాయంగా ఉపయోగించాలి, ఇతరుల పట్ల మనము దయ చూపించి ప్రేమను నా అనుకోని చూపించాలని రెండొవ పఠనం మనకి నేర్పిస్తుంది.
చివరిగా సువిశేష పఠనని గమనించినట్లయితే, క్రీస్తు ప్రభు
శిష్యులకు నేర్పించినటువంటి కొన్ని సత్యాలు మరియు ముఖ్యమైనటువంటి గుణపాఠాల గురించి తెలియజేస్తుంది. అప్పుడైతే యోహాను యేసు దగ్గరకు వచ్చి యేసుతో మాట్లాడడో అప్పుడే, యేసు తన శిష్యులకు కొన్ని ముఖ్యమైన మరియు కీలకమైన సందేశాల్ని అందించాడు. అది ఆవిధంగా అంటే పాపం ఎంత హానికరమో, దానితో మెలగడంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో పూస గుచ్చినట్లు స్పష్టంగా వివరించాడు.
మొదటిది ఇతరులను అంగీకరించడం ఎందుకంటే యోహాను యేసు దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు, ఒక వ్యక్తి మీ పేరిట దయ్యాలను వెళ్లగొడుతున్నాడు, అతను మనతో ఉండలేదు కాబట్టి మేము అతడు చేసేటువంటి పనిని మేము ఆపివేసితిమి అని చెప్పినప్పుడు. అందుకు క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం మనకందరికి కూడా అత్యునతమైన గుణపాఠాన్ని నేర్పిస్తుంది. యేసు అన్నాడు, ఎందుకంటే క్రీస్తు ప్రభు అంటున్నారు నన్ను విరోధించడం లేనివాడు మనకు అనుకూలం అని. ఇది మనకు ఏమి నేర్పిస్తుంది అంటే ఇతరులు దేవుని పట్ల చేసేటువంటి సేవాలను మనస్ఫూర్తిగా అంగీకరించడం అంతే కాకుండా వాళ్లు మన తోటి వారు కాకపోయినా దేవుని సేవ చేయడానికి వారిని మనం అంగీకరించడం ముఖ్యమని తెలియజేస్తుంది. మరి రెండొవది పాపం పట్ల దూరంగా ఉండటం (9:42-48) అంటే యేసు మనకు నేర్పిస్తున్నారు పాపం మన జీవితాలను ఏవిధంగా నాశనం చేస్తుందో తెలియజేస్తున్నాడు. ఎలాగంటే నీ చెయ్యి నీకు పాపం చేయడానికి దారితీస్తే దానిని తెగనరుకుము, నీ కాలు లేదా కన్ను నీకు విరుద్ధముగా పాపానికి దారితీస్తే దానిని తీసివెయుము అని అంటున్నారు యేసు ప్రభు. ఇక్కడ యేసు ఇచ్చిన సందేశం మనకు ఎంత ప్రాముఖ్యమైనదిగా గుర్తించాలి. ఎందుకంటే మొదటిగా పాపం మనకు ఆనందాని కలిగించవచ్చు, కానీ అది మన ఆత్మను మరియు మనకు దేవునితో ఉన్నటువంటి సన్నిహితని దూరం చేస్తూ, నాశనం చేస్తుంది. కాబట్టి యేసు చెప్పిన విధంగా మన జీవితంలో పాపం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని. మనకు ఎన్ని సోదనలు, కష్టాలు వచ్చినప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉండి అయన బాటలో నడవడానికి, అయన చేపినటువంటి మాటలను అలకిస్తూ జీవించాలని సువిశేష పఠనం మనలను హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రియా సహోదరి సహోదలారా, ఈ నాటి మూడు పఠనలను కూడా మనం గుర్తుచేసుకుంటూ దేవుడు ఆవిధమైనటువంటి సందేశని మనకు ఇస్తున్నాడని మనం గ్రహించాలి. ఒక క్రైస్తవునిగా మనం జీవిత విధానం ఆవిధంగా ఉంది దేవునికి ఇస్టనుసారంగా ఉందా లేకపోతే మనకు ఇష్టమొచ్చినట్లు మనం జీవిస్తునామా అని ఆలోసించుకోవాలి. ఎందుకంటే దేవుని కృపను, అయన ప్రేమను పొందుకోవాలంటే. మనం అందరము కూడా దేవుని దారిలో నడుస్తూ, మన పాపాలను విడిచిపెట్టి దేవునికి దగ్గరగా అవాలని ప్రార్ధించుకుందాము.
Fr. Johannes OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి