2, నవంబర్ 2024, శనివారం

31 వ సామాన్య ఆదివారము

31 వ సామాన్య ఆదివారము 
ద్వితియెపదేశకాండము 6:2-6
హెబ్రీయులు 7:23-28
మార్కు 12:28-34
            ప్రియా దేవుని బిడ్డలరా ఈ రోజు మనమందరము కూడా 31వ ఆదివారంలోనికి ప్రవేశించి యున్నాము. ఈనాటి మూడు పఠనలు కూడా మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తాయి అదేమిటంటే దేవుని పట్ల భయభక్తులను  చూపించటం, యేసు క్రీస్తు ద్వారా క్షమాపణ పొందటం మరియు జీవిత కాలం ప్రేమతో జీవించడం వంటి వాటి గురించి తెలియజేస్తుంది. ఈ ప్రేమ మరియు భక్తి మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందంటే మనము దేవుని దగ్గరకు  మరింతగా చేరడానికి, ఆయన అనుగ్రహంలో నివసించడానికి ఉపయోగపడతాయి.

 మొదటిపఠనములో ద్వితియెపదేశకాండం గురించి మనం వింటున్నాం. దేవుడు మానవులయినటువంటి మనందరికి కూడా  అయన ప్రేమనిచ్చి, ఆయన ఆజ్ఞలను ఎల్లపుడు మన జీవితాలలో  పాటించాలని పిలుపునిచ్చాడు. ఎందుకంటే దేవుని వాక్యం నీ  దేవుడైన యావేను   నీ పూర్ణ హృదయంతో , ఆత్మతో ప్రేమించుము అని చెబుతున్నాడు, దీని ద్వారా మనమందరమూ కేవలం హృదయం గానీ లేదా మనసు గానీ కాకుండా సంపూర్ణంగా దేవుని పట్ల ప్రేమను చూపించాలని చెప్పబడుతుంది. ఈ ప్రేమ మనం పాటించేటువంటి ఆజ్ఞల ద్వారా, మన ప్రేమ దేవుని దగ్గర వ్యక్తమవుతుంది. మనం దేవుని వాక్కును లేదా అయన మాటలను మన హృదయాలలో నిలిపి, ప్రతి సందర్భంలో ఆయనను అనుసరించడంలో మన బలాన్ని పెంచుకోవాలని  ఈ మొదటిపఠనం తెలియజేస్తుంది.

      రెండొవ పఠనములో హెబ్రియులకు వ్రాసిన లేఖలో యేసు క్రీస్తు మనకందరికూడా ఒక గొప్ప శాశ్వత యాజకుడు అని. ఆయన మన కొరకు తన జీవితన్నే  శాశ్వతంగా త్యాగం చేసి, దేవుని దగ్గర లేదా అయన సన్నిధిలో మనకు ప్రత్యక్ష ప్రతినిధిగా ఉంటాడని, అంటే అయన యాజకత్వం వలన మనకు శాంతి మరియు విముక్తి లభిస్తుంది. క్రీస్తుప్రభువు  యొక్క త్యాగం ద్వారా మన జీవిత పాపాలకు నిరంతర క్షమాపణను మరియు మన రక్షణకు మార్గం చూపిస్తుందని రెండొవ పఠనము తెలియజేస్తుంది. 

                  చివరిగా సువిశేష పఠనములో రెండు ఆజ్ఞలా గురించి  అందరికి క్లుప్తంగా వివరిస్తున్నాడు, అ రెండు ఆజ్ఞలు ఏమిటంటే దేవుని పట్ల ప్రేమ మరియు సాటి మనువుని పట్ల ప్రేమ.

   ముందుగా మొదటిది దేవుని పట్ల ప్రేమను మనం చుసినట్లయితే, దేవుని పట్ల సంపూర్ణ ప్రేమను చూపించటం యేసు మొదటగా చెప్పిన ఆజ్ఞ, ఎందుకంటే నీ దేవుని సంపూర్ణ హృదయంతో, ఆత్మతో మరియు బలంతో ప్రేమించుము అని అంటున్నారు. ఏ విధంగానంటే ఇది మనము  దేవుని పట్ల కలిగి ఉండాల్సిన భక్తి మరియు విధేయతను సూచిస్తుంది. దేవునితో ప్రేమ బంధం అనేది మన జీవితంలో కలగలిపి ఉండాలి. ఈ ప్రేమతో మనం దేవుని ఆజ్ఞలను గౌరవిస్తూ, ఆయన మార్గంలో నడవగలుగుతాము. అంతే కాకుండా యేసు క్రీస్తు చెప్పినటువంటి ఈ ప్రేమ కేవలం మాటలలోనే కాకుండా మన  జీవితాలలో కూడా ఉండాలని అంటున్నారు. ఇది మొదటి ఆజ్ఞ.
మరి రెండొవ ఆజ్ఞ ఏమిటంటే మానవుని పట్ల ప్రేమ: ఈ ఆజ్ఞ అనేది మన చుట్టూ ఉన్నవారిని, మనలను ఇష్టపడేవారిని లేదా మనలను ఇష్టపడని వారిని, మన స్నేహితులకే కాకుండా ప్రతీ ఒక్కరిని ప్రేమించడం అనేది క్రైస్తవుల జీవితంలో మరియు ధర్మంలో ప్రధానమైనది. మనము ఏ  విధంగానైతే దేవుని ప్రేమను అనుభవిస్తామో అదే విధమైనటువంటి ప్రేమను ఇతరులకు పంచడంలోనే ఈ ఆజ్ఞ అనేది ఉంటుంది.

      కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా ఈ మూడు పఠనలు కూడా క్రైస్తవులమైనటువంటి మనకి దైవభక్తిని, యేసు యొక్క శాశ్వత యాజకత్వాన్ని మరియు మానవుని జీవితంలో ప్రేమను ఒక దేవుని పోలి  అనుసరించడానికి ఆహ్వానిస్తున్నాయి. దేవుని ప్రేమలో జీవిస్తూ, యేసు ద్వారా శాంతి పొందుతూ, మన హృదయంలోని ప్రేమను ఇతరులకు పంచుకోవడం ద్వారా మనం నిజమైన క్రైస్తవులమని  నిరూపించవచ్చు.

ఫా.  జ్వాహాన్నెస్  OCD 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...