19, ఆగస్టు 2024, సోమవారం
యెహెఙ్కేలు 28:1-10, మత్తయి 19:23-30
మత్తయి 19: 16-22
మత్తయి 19: 16-22
అంతట ఒక యువకుడు యేసుని సమీపించి, "బోధకుడా! నిత్యజీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పనియేమి?" అని ప్రశ్నించెను. "మంచిని గూర్చి నన్నేల ప్రశ్నించెదవు మంచివాడు దేవుడు ఒక్కడే. నిత్యజీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము" అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి?" అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, "నరహత్య చేయకుము. వ్యభిచరింపకుము. దొంగిలింపకుము. అబద్ధసాక్ష్యములు పలుకకుము. తల్లితండ్రులను గౌరవింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము" అనెను. అంతట అతడు యేసుతో "ఇవన్నియు ఆచరించుచుంటిని. ఇంకను నాకు లోటు ఏమి?" అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్లి నీ ఆస్తిని అమ్మి, బీదలకు దానము చేయుము. అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము" అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపదగలవాడగుటచే, ఈ మాట విని బాధతో వెళ్లిపోయెను.
ధ్యానము : నిత్య జీవము పొందుటకు నేను చేయ వలసిన మంచి పని ఏమిటి ప్రభువా? అని అడిగిన ధనికుడైన యువకునికి, దేవుడు మాత్రమే మంచి వాడు అని ప్రభువు తేటతెల్లం చేస్తున్నారు. ఎందుకు దేవుడు ఒక్కడే మంచివాడు? అంటే ఆయన ఎప్పుడు మంచినే చేస్తాడు, మానవుని వలే దురాలోచనలు, చేడు పనులు, హత్యలు, దొంగతనాలు, అబద్దాలు, మోసాలు, కపటము, స్వార్ధం, లేక మానవునిలో కనపడే ఏ చేడు భావన దేవునిలో ఉండదు. ఆయన సకల సద్గుణాల నిధి. ఇతరుల ఉన్నతిని కోరువాడు. ఆయన ప్రేమామయుడు. పునీత పౌలు, యోహానులు చెప్పినట్లు ఆయన ప్రేమ. ప్రేమ సమస్తమును భరిస్తుంది. కాని మానవుడు తనకు వ్యతిరేకముగా ఏదైనా జరిగితే ఓర్చుకోలేడు. దేవుడు ఈ ఆజ్ఞలు మనకు ఇవ్వడం వలన మనం కూడా అయన వలే ఉండాలని కోరుతున్నాడు. కేవలం మానవ స్వభావం కాక దైవిక స్వభావం మనలో ఉండాలని కోరుకుంటున్నారు.
యేసు ప్రభువు ఆ యువకునితో నిత్య జీవం పొందుటకు దైవాజ్ఞలను ఆచరింపమని చెబుతున్నారు. యువకునికి ఉన్న కోరిక నిత్య జీవం పొందాలని. యువకుడు అడిగినది యేసు ప్రభువును. కేవలం యేసు ప్రభువు మాత్రమే నిత్య జీవం ఇవ్వగలడు. కాని నిత్య జీవం ఇచ్చే ప్రభువు, దేవుని ఆజ్ఞలను పాటించు అని చెబుతున్నాడు. దేవుని ఆజ్ఞలు మనలను నిత్య జీవం పొందుటకు అర్హులను చేస్తాయి. దేవుని ఆజ్ఞలు ఏమి? అని యువకుడు ప్రభువును అడుగుతున్నాడు. యేసు ప్రభువు ఆ యువకునికి నిత్య జీవితానికి మనలను అర్హులను చేసే దేవుని ఆజ్ఞలను వివరిస్తున్నాడు. అవి ఏమిటి అంటే నరహత్య చేయకుండా ఉండటం, వ్యభిచరించకుండా ఉండటం, దొంకిలింపకుండా ఉండటం, అబద్ద సాక్ష్యములు చెప్పకుండా ఉండటం, తల్లితండ్రులను గౌరవించడం, ఒక వ్యక్తి తనను తాను ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించడం ఇవి ఒక వ్యక్తిని నిత్యజీవం పొందేలా చేస్తాయి. ఇవి కేవలం మనలను నిత్య జీవం పొందేలానే కాక దేవుని మనస్సును కలిగి ఉండేలా చేస్తాయి. మనలను దేవునికి ఇష్టమైన వారిగా చేస్తాయి.
ఆ యువకుడు ఈ ఆజ్ఞలన్నిటిని చిన్నప్పటి నుండి పాటిస్తున్నాను అని చెబుతున్నాడు. కాని ఆ యువకునిలో ఎదో ఓక లోపం ఉన్నది అని ఆ యువకునికి అనిపిస్తుంది. ఎందుకు ఆ యువకుడు అలా అనుకుంటున్నాడు అంటే నిత్యజీవాన్ని ఇచ్చే ఈ ఆజ్ఞలను ఆ యువకుడు పరిపూర్తిగా పాటించి ఉండడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలలో నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని చెబుతున్నాయి. ఈ యువకుడు నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను అని అన్నప్పటికీ, ప్రభువు, నీవు పరిపూర్ణుడవు కాగోరినచో నీవు నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము అని అంటున్నాడు. అంటే ఈ యువకుడు తనతో పాటు ఉన్నటువంటి పేదలను పట్టించుకోలేదు. ఈ లోపం ఈ యువకునిలో ఉన్నది. అదే విధంగా తన ఆస్తిని వదులుకోవడానికి ఇష్ట పడటం లేదు, తన ఆస్తిని నిత్య జీవం కంటే ఎక్కువగా ఆ యువకుడు ప్రేమించాడు. కనుకనే ఆ యువకుడు బాధతో వెళ్ళిపోతున్నాడు. తన ఆస్తిని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడుటలేదు. యేసు ప్రభువు పరలోకంలో ఆస్తిని కూడపెట్టుకొనే మార్గం చూపిన కేవలం ఈలోకం ఆస్తుల మీదనే ఆ యువకుడు ధ్యాస పెట్టాడు.
దేవునితో సంభాషణ: ప్రభువా నేను కూడా యువకుని వలే నిత్య జీవం పొందాలనే ఆశ కలిగి ఉన్నాను. మీ గురించి విన్నప్పుడు, మీ గురించి చదివినప్పుడు, మీరు మాత్రమే ఈ నిత్య జీవం ఇవ్వగలరని తెలుసుకున్నాను. మీరు మాత్రమే ఇవ్వగలిగే ఆ నిత్య జీవం పొందాలని అనుకుంటాను. కాని ఆ నిత్య జీవం పొందుటకు నన్ను అర్హున్నీ చేసేటువంటి మీ అజ్ఞాలను నేను పాటించుటలో అనేక సార్లు విఫలం చెందుతున్నాను. నన్ను నేను ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించుటలో విఫలం చెందాను. ఇతరులు గొప్పగా ఉండే ఓర్చుకోలేకపోయాను. అనేకసార్లు మీ అజ్ఞలను పాటించుటలో పూర్తిగా విఫలం అయ్యిపోయాను. నన్ను నేను ప్రేమించాను, అభిమానించాను, వృద్ధిలోకి రావాలని కాంక్షించాను, కాని ఇతరులను అలా చూడలేక పోయాను. నిన్ను అనుసరించాలని, నీ వలె ఉండాలని, నిత్య జీవం పొందాలని అనుకుంటున్నాను. ఈ లోక విషయాలు, ఆస్తుల మీదనే నా మనసును కేంద్రీకరించాను కాని నీ వలె తండ్రి చిత్తము మీద నా మనస్సును పెట్టలేక పోతున్నాను.
ప్రార్ధన: ప్రేమమయుడవైన ప్రభువా! మీరు నిత్య జీవం పొందుటకు మమ్ములను అర్హులను చేయుటకు మేము చేయవలసిన క్రియలను మాకు తెలియజేస్తున్నారు. మీరు ఇచ్చిన ఆజ్ఞలను అన్నింటిని పాటించుటకు కావలసిన అనుగ్రహాలు మాకు దయచేయండి. పరలోకంలో ఆస్తిని కూడపెట్టుటకు ఈ లోకంలో ఏమి కోల్పోవుటకైనను సిద్దపడే మనస్సును మాకు ఇవ్వండి. నన్ను నేను ప్రేమించుకొనునట్లు ఇతరులను ప్రేమించుటకు, మీవలె సకల సుగుణాలు కలిగి ఉండుటకు కావలసిన అనుగ్రహాలు మాకు దయచేసి, మేము తండ్రి వలే పరిపూర్ణులమగుటకు కావలసిన అనుగ్రహములు దయచేయండి. ఆమెన్
17, ఆగస్టు 2024, శనివారం
20 వ సామాన్య ఆదివారం
20 వ సామాన్య ఆదివారం
సామెతల గ్రంధం 9:1-6 ఎఫెసీ 5: 15-20 యోహాను 6: 51-58
ఈనాటి మొదటి పఠనంలో విజ్ఞానమను స్త్రీ మూర్తి ప్రజలను "రమ్ము నేను తయారు చేసిన భోజనమును ఆరగింపుము. జ్ఞానము లేని వారు ఇచ్చటకు రెండు అని ఆహ్వానిస్తుంది. మూర్ఖత్వమును విడనాడి బ్రతుకుడు. విజ్ఞాన పథమున నడువుడు అని మనం మొదటి పఠనంలో విటున్నాం. ప్రియ విశ్వాసులారా జ్ఞానము లేని వారు ఇచటకు రెండు అని విజ్ఞానమను స్త్రీ మూర్తి పిలిచినట్లే దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. మనలను దేవుని వాక్కు అనే భోజనమును ఆరగించమని ఆహ్వానిస్తున్నారు. మానవుడు కేవలం, రొట్టె వలెనే కాక దేవుని నోటి నుండి వచ్చు వాక్కు వలన జీవించును. ఇది అక్షరాల సత్యం. కానీ చాలా మంది ఇంకా మూర్ఖత్వంలోనే జీవిస్తున్నారు. అజ్ఞానములోనే ఉండిపోతున్నారు. నా యొద్దకు రెండు అని పిలిచిన దేవుని మాటను వినలేక పోతున్నారు. దేవుని విజ్ఞాన మార్గంలో నడవమని ఆహ్వానిస్తుంది. మనము జ్ఞానము కలిగిన వారిగా జీవించి విజ్ఞాన పథంలో జీవించుదాం.
ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారము నేనే. అదే విధంగా ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నాశరీరమే అని క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నాడు.
అదే విధంగా నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువారు నిత్యజీవము పొందును. నేను వారి యందు వారు నాయందు ఉండును. నేను తండ్రి మూలమున జీవించునట్లే నన్ను భుజించువాడు నా మూలమున ఎల్లప్పుడును జీవించును. ఇది గొప్ప భాగ్యం మానవులమైన మనందరికీ.
కాబట్టి ప్రియ విశ్వాసులారా మనం నిత్య జీవం పొందాలంటే , మనం మనము దేవుని యందు ఉండాలంటే దేవుని శరీర రక్తాలను నిత్యం స్వికరించాలి. మరి క్రీస్తు ప్రభువుని శరీర రక్తలను స్వీకరించాలంటే పరిశుద్ధతతో జీవించాలి. దేవుని చిత్తాను సారం నీవు నేను మనందరం ఆ ప్రభుని చిత్తం తెలుసుకొని జీవించాలి. పవిత్రతతో నింపబడాలి.
మనం ఏమి చేయాలంటే? దేవుని పిలుపును , ఆహ్వానాన్ని విని దేవుని దగ్గరకు వెళ్ళాలి. దేవుని యొక్క జ్ఞానమును, జ్ఞాన ఫలములను పొంది దేవుని వాక్కుతోను శరీర రక్తములతోను నింపబడాలి. మన మూర్ఖత్వాన్ని తొలగించమని ఆ దేవుని జ్ఞానము కొరకు ప్రార్ధించాలి. నిత్య జీవం, పొందాలంటే మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని విడనాడి దేవుని త్రోవలో నడవాలి. దేవునితో నిత్యం కలకాలం జీవించడానికి ప్రయత్నించుదాం.
ప్రార్ధన: ప్రేమ మయుడైన దేవా మేము ముర్ఖులం, మా మూర్ఖత్వంలో, అజ్ఞానంలో జీవిస్తున్నాం. నీ జ్ఞానమును, జ్ఞానవరములను పవిత్రత్మను మాపై కుమ్మరించి విజ్ఞానముతో నింపుము, నిత్యం నీ త్రోవలో నడుస్తూ నిత్య జీవం పొందే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.
ఫా. సురేష్ కొలకలూరి OCD
యెహెఙ్కేలు 18:1-10. 13,30-32 మత్తయి 19:13-15
యెహెఙ్కేలు 18:1-10. 13,30-32 మత్తయి 19:13-15
ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులుచాచి ప్రార్ధింపుమని యేసు వద్దకు తీసుకొని రాగా, శిష్యులు వారిని ఆటంకపరచిరి. "చిన్న బిడ్డలను నాయొద్దకు రానిండు. వారలను ఆటంక పరపకుడు. ఏలయన, అట్టి వారిదే పరలోక రాజ్యము" అని పలికిరి, వారి మీద చేతులుంచి యేసు అచట నుండి వెడలిపోయెను.
ప్రియమైన మిత్రులారా ఈనాటి మొదటి పఠనం యెహెఙ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అంటున్నాడు. ఎవ్వరు చేసిన పాపములకు వారే శిక్షను అనుభవిస్తారు అని దేవుడు చెప్పిన సందేశాన్ని వారికి వినిపిస్తున్నాడు . అదే విధంగా సత్పురుషుడు చిత్తశుద్ధితో దేవుని చట్టాలను విధులను పాటించును కనుక అతడు కాలకాలము బ్రతుకును అని దేవుడు పలుకుచున్నాడు. ఎవరైతే న్యాయపరులుగాను, ధర్మ పరులుగాను, జీవిస్తారో వారు దేవుని కృపను పొందుతారని వింటున్నాం. అదే విధంగా ఎవరైతే దుష్ట కార్యాలను పాల్పడుతారో వారు ఖచ్చితముగా చచ్చును. వారి చావునకు వారే బాధ్యులు, అని దేవుడు వారితో చెబుతూ ఎవరు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగదు అని అంటున్నాడు. మన నుండి మన దేవుడు కోరుకొనినది హృదయ పరివర్తన చెంది, పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు అంటున్నాడు.
ప్రియ విశ్వాసులారా దేవుడు మనలను మన పాపపు క్రియల నుండి పాపపు ఆలోచనలనుండి మారు మనస్సు పొంది, మన పాపముల నుండి వైదొలగాలని ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. మనం పాపంలోనే, పాపం చేస్తూ మరణించడం దేవునికి అసలు ఇష్టం లేదు అదేవిధంగా దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. మీ మీ క్రియలను బట్టి, మీరు శిక్షను పొందుతారు అని చెబుతున్నాడు. మరి మనము ఎలాంటి క్రియలు చేస్తున్నాము. ఎలాంటి పనులు చేస్తున్నాము ఆలోచించండి. మనం చిత్త శుద్దితో న్యాయంగా, ధర్మంగా దేవుని ఆజ్ఞలు పాటించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాని మన మనలో చాలా మంది దుష్ట బుద్దితో, దుష్ట కార్యములకు పాల్పడుతున్నాం. దేవుని ఆజ్ఞలను పాటించడం లేదు. మరి ఈరోజు మన నుండి దేవుడు ఏమి అడుగుతున్నాడు అంటే మీ పాత పాపపు జీవితమును విడిచి పెట్టి నూత్న మనసును, నూత్న హృదయమును పొందుకోండి అంటున్నాడు. మనం మన పాపపు , చీకటి , చేడు, దుష్ట కార్యాలను వదలి నూత్న జీవితము పొందడానికి సిద్ధముగా ఉన్నామా? లేదా? ఇంకా పాపములోనే ఉండి జీవిస్తూ, పాపములో మరణిస్తామో ఆలోచించండి. ఇంకా పాపములోనే ఉండి మనము చనిపోయినట్లయితే మనం దేవుని సంతోష పెట్టినవారము కాదు. మనము దేవుని దుఃఖ పరిచినవారము అవుతాం. కాబట్టి మన జీవితాలు దేవుని చిత్తానుసారాం జీవించడానికి మంచిగా జీవించడానికి ప్రయత్నించుదాం.
ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం. ఎప్పుడైతె శిష్యులు యేసు వద్దకు వచ్చి త్మమ బిడ్డలను దీవింపమని అడిగిన వారిని ఆటంకపరచడం చూశాడో అప్పుడు శిష్యులతో చిన్న బిడ్డలను నాయొద్దకు రానివ్వండి. వారిని ఆటంకపరచకండి అట్టి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి వారిని దీవించాడు. ప్రియ విశ్వాసులారా మనం మన మనస్సు నందు చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చిన్న బిడ్డలలో గర్వం, స్వార్ధం, అహంకారం, కోపం, క్రోధం, మొహం, దుష్టత్వం ఇలాంటివి ఏవి వారికి ఉండవు. వారు నిర్మలంగా, పరిశుద్ధంగా, ప్రేమ, మంచి మనస్సుతో ఇతరులను గౌరవిస్తూ వారి తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తుంటారు. ప్రియ విశ్వాసులారా మరి మనం నిర్మలమైన , పరిశుద్ధమైన స్వచ్ఛమైన మనస్సులతో ఉంటేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. దేవుని రాజ్యాన్ని పొందగలం. కాబట్టి దేవునికి ప్రార్థిస్తే చిన్నపిల్లల మనస్తత్వం పొందుటకు ప్రయత్నించుదాం.
ప్రార్ధన : పరిశుద్దుడైన దేవా మేము మా పాపపు ఆలోచనలతో పాపము క్రియలు చేస్తూ మా పాపాలలోజీవిస్తున్నాం. దయగల దేవా నీవు అంటున్నాము. పాపాత్ములు మరణించుటలో నీకు సంతోషం లేదని, ప్రభువా నాకు పాప మన్నింపును దయ చేయండి. నా దుష్ట క్రియల నుండి వైదొలగడానికి, శక్తిని బలాన్ని నాకు దయచేయండి. మంచిగా జీవిస్తూ నీ ఆజ్ఞలను పాటించే నూత్న హృదయాన్ని నాకు దయచేయండి. నిన్ను సంతోష పెట్టె బిడ్డగా నేను జీవించేలాగా నన్ను మార్చుము తండ్రి. ఆమెన్.
ఫా . సురేష్ కొలకలూరి OCD
15, ఆగస్టు 2024, గురువారం
యెహెఙ్కేలు 16:1-15, 60,63 మత్తయి 19:3-12
యెహెఙ్కేలు 16:1-15, 60,63 మత్తయి 19:3-12 (ఆగస్టు 16,2024)
యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి "ఏ కారణము చేతనైన ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా?" అని ప్రశ్నించిరి. "ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీరు చదువలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని, తండ్రిని, విడిచి తన భార్యను హత్తుకొనియుండును. వారు ఇరువురు ఏక శరీరులై యుందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక, ఏకశరీరులైయున్నారు. దేవుడు జతపరచిన జంటను మానవమాతృడు వేరుపరుపరాదు" అని యేసు పలికెను. "అటులైన విడాకుల పత్రమునిచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఏలఆజ్ఞాపించెను?" అని పరిసయ్యులు తిరిగి పశ్నించిరి. "మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించెనే కాని, ఆరంభమునుండి ఇట్లు లేదు వ్యభిచార కారణమున తప్ప, తన భార్యను విడనాడి మరియొకతెను వివాహమాడువాడు వ్యభిచారియగును" అని యేసు ప్రత్యుత్తర మిచ్చెను. అప్పుడు శిష్యులు, "భార్య, భర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహమాడకుండుటయే మెలుతరము" అనిరి. అందుకు యేసు "దైవానుగ్రహము కలవారికేగాని మరెవ్వరికిని ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు. మరికొందరు పరులచే నంపుసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్యము నిమిత్తమై తమకు తాము నపుంసకులు అయిన వారును కొందరున్నారు. గ్రహింపగలిగినవాడు గ్రహించునుగాక!" అని పలికెను.
ప్రియ విశ్వాసులారా ఈనాటి మొదటి పఠనంలో యావే ప్రభువు యెరూషలేముతో ఇట్లు చెప్పుచున్నాను. మీరు నాకు ద్రోహము చేసిరి. నాకు ఇష్టము లేని హేయమైన కార్యములు మీరు చేస్తున్నారు. అని యెరూషలేము వాసులకు యెహెఙ్కేలు ప్రవక్తతో ద్వారా తెలియజేస్తున్నాడు. ఒక గొప్ప వివాహ బంధం ద్వారా దేవుడు తనకు తన ప్రజలకు ఉన్న బంధాన్ని గురించి తెలియచేస్తున్నాడు. అది ఏమిటంటే దేవుడు ఎన్నోత్యాగాలు చేస్తు, ఎన్నో దీవెనలు ఇస్తు, ఎంతో కష్టపడుతు మనపై దయచూపుతున్నారు. మనకు అనురాగంతో పరిచర్యలు చేస్తున్నాడు. ప్రభువు చెబుతున్నాడు. నిన్ను నా వస్త్రముతో కప్పి నీకు మాట ఇచ్చితిని, నేను నీతో వివాహ బంధము చేసుకొనగా నీవు నా దానవైతివి. నేను నా కీర్తినినీకు ప్రసాదించితిని. కాని నీ సౌదర్యము వలన కీర్తి వలన నీకు తలతీరిగినది. నీవు నీచెంతకు వచ్చిన వారందరితో వ్యభిచరించితివి.
ప్రియ మిత్రులారా ఒక భర్త భార్యకోసం ఎన్నోత్యాగాలు, కష్టాలు, ఇబ్బందులు ప్రేమతో భరిస్తూ కష్టపడుతూ ఉంటె, ఎంతో అనురాగంతో ఆప్యాయంగా పరిచర్యలు చేస్తూ ఉంటె, భార్య మాత్రం భర్తకు అన్యాయం చేస్తుంది. ఇక్కడ భర్త అంటే (దేవుడు) యావే ప్రభువు. అదేవిధంగా భార్య అంటే యెరూషలేము వాసులందరు. మనమందరికి ఈ ఉపమానం ద్వారా దేవుడు తన బాధను ప్రేమను మనందరికీ అర్ధం అయ్యేలాగా చెబుతున్నాడు. మరి ఇక్కడ వ్యభిచారం అంటే అన్య దేవుళ్లను ఆరాధించడం. దేవుణ్ణి మర్చిపోయి అన్యదేవతలను మ్రొక్కుతున్నా వారు అని అర్ధం.
ప్రియ మిత్రులారా ఏ బంధంలోనైన విశ్వాసనీయత ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ఎంతో విశ్వాసంతో, ప్రేమతో ఉండాలి. దేవుడు ఈ విషయమును వివాహబంధము ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు నేను నీ అపరాధమును, నీ తప్పులెల్ల క్షమిస్తున్నాను అని, అంటే దేవుడు మనకు తెలియజేసేది ఏమిటంటే ఆయన మన పాపములను తప్పిదములను అన్నింటిని క్షమించే దేవుడు. మరి మనము మన బంధాలలో ఒకరి పట్ల ఒకరము ఈవిధమైన ప్రేమ, క్షమ, విశ్వసనీయత కలిగివుండాలి. కలిగి ఉండటానికి మనందరం ప్రయత్నించాలి.
అదేవిధంగా ఈనాటి సువిశేష పఠనంలో చూస్తే పరిసయ్యులు యేసును శోధించడానికి, ఆయనను పరీక్షించడానికి వచ్చి ఏకారణము చేతనైన భార్యను పరిత్యజించుట తగునా అని ప్రశ్నించారు. ప్రభువు వారికి భార్య భర్తలు ఇరువురు వివాహం ద్వారా ఒకరినొకరు హత్తుకొని ఏక శరీరులైరి అని చెబుతూ ఒక సత్యాన్ని వారికి తెలియజేస్తున్నాడు. దేవుడు జత పరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరుపరాదు అని అంటున్నాడు. అప్పుడు వారు మోషే ఎలా విడాకుల పత్రం ఇచ్చి భార్యను వదిలి వేయవచ్చునని ఆజ్ఞాపించాడు అని అంటున్నారు. అందుకు యేసు ప్రభువు,మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ మీ భార్యలను మీరు విడనాడుటకు అనుమతించేనే కాని ఆరంభము నుండి అలా లేదు. భార్యను వ్యభిచార కారణమున తప్ప ఇంక దేనివలనైనను విడనాడి మరియొకతెను వివాహమాడు వాడు వ్యభిచారియగును అని చెప్పాడు.
ప్రియ మిత్రులారా వివాహ బంధం అన్ని బంధాల కంటే ఎంతో గొప్ప బంధం. మనం మొదటి పఠనములో వింటున్నాం. ఎన్ని కష్టాలు వచ్చిన , ఎన్ని బాధలు వచ్చిన ఎన్నో తప్పులు చేసిన దేవుడు అవి అన్ని క్షమించి మనలను స్వీకరిస్తున్నారు. అదే విధంగా మనం కూడా ఆయన ప్రేమను మర్చిపోకూడదు. మనం ఎవ్వరు కూడా ఏ కుటుంబాన్ని విడదియ్యకూడదు. ఏ బంధంలో లేని గొప్ప తనం ఈ వివాహ బంధంలో ఉంది. ఒకరికొకరు ఏ విధంగా బ్రతుకుతారో మనకు తెలుసు. అదే విధముగా మనము కూడా క్రీస్తు కొరకు బ్రతకాలి. రెండవది వివాహం లేకుండా ఉండాలంటే, జీవించాలంటే ఎలా సాధ్యము అంటే క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు "దైవానుగ్రహము కలవారికె గాని మరెవ్వరికిని ఇది సాధ్యపడదు. అదే విధంగా కొందరు పుటుక్కుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు. మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుతున్నారు. పరలోక రాజ్యం నిమిత్తమై తమను తాము నపుంసకులుగా చేసుకున్నవారు కొందరున్నారు. వారెవ్వరు అంటే గురువులు , కన్యస్త్రీలు బ్రహ్మచారులుగా దేవుని కొరకు జీవించేవారు. ప్రియ విశ్వాసులారా ఏది చెయ్యాలన్న దైవానుగ్రహం ఉండాలి. మరి మన కుటుంబ లేక సన్యాసం జీవితాలలో ప్రభుని అనుగ్రహం ఉందా? లేకపోతే దైవానుగ్రహాల కోసం ప్రార్ధించుదాం.
ప్రార్ధన: ప్రేమామయుడా! నీవు ప్రతినిత్యం మమ్ము నీ ప్రేమతో నింపుతూ నిన్ను వెంబడించాలి అని పిలుస్తున్నావు. మా కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావు. కానీ మేము మా అజ్ఞానము వలన అవి మరచి లోక వస్తువుల కోసం పొరుగువారి పట్ల ప్రేమ దయ క్షమ విశ్వసనీయత చూపలేక పోతున్నాం. మమ్ము మన్నించి నీ దైవానుగ్రహములు మాపై, మా కుటుంబాలపై కుమ్మరించండి. ఆమెన్
14, ఆగస్టు 2024, బుధవారం
మరియమాత మోక్షరోపణ పండుగ
మరియమాత మోక్షరోపణ పండుగ
దర్శన గ్రంథం 11:19,12:1-6,10 1కొరింతి 15:20-27 లూకా 1:39-56
ఈరోజు మనం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వ తేదీ ప్రతి భారతియునికి చాలా ముఖ్యమైన రోజు. ఎందరో త్యాగాల ఫలితముగా భారత దేశానికి స్వతంత్రం వచ్చింది. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి మనము చేయాలి. మన దేశ నాయకుల కొరకు మనం ప్రార్ధన చేయాలి. మన దేశ నాయకులు అలాగే మన దేశ ప్రజలు ఎవరికీ బానిసలు కాకుండా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించేలాగా ఉండాలని ప్రార్ధన చేద్దాం.
ఈనాటి మొదటి పఠనంలో మరియ తల్లి గురించిన గొప్ప దర్శనం మనము వింటున్నాము. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై పండ్రెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండుచులాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. ఆమె ప్రసవించగా ఆమె శిశువు దేవుని వద్దకును, ఆయన సింహాసనము వద్దకును తీసుకొనిపోబడెను. అప్పుడు ఒక స్వరము ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి యున్నది. ఆయన మెస్సియా. ప్రియ విశ్వాసులారా దేవుని రక్షణ ప్రణాళికలో మరియ మాత ఎంతో గొప్ప పాత్ర వహించింది. మానవాళి రక్షణలో మరియమాత చూపిన విశ్వాసం, త్యాగం, ప్రేమ ఎంతో ఘనమైనది. దేవుని యొక్క పిలుపును విశ్వాసంతో స్వీకరించి నేను ప్రభుని దాసురాలను అంటూ తనను తాను ప్రభుని చిత్తానికి సమర్పించుకున్నది. తద్వారా దేవుని తల్లిగా మారి దైవ కుమారుడైన యేసుకు జన్మనిచ్చి, తన ప్రేమను త్యాగాన్ని ప్రదర్శించింది. కనుకనే దేవుడు ఆమెను గొప్ప సర్పము నుండి రక్షించాడు. ఆమెను మరణము నుండి రక్షించాడు. ఈలోక మరణము తర్వాత మరియతల్లిని ఆత్మశరీరములతో పరలోక నిత్యా నివాసంలోనికి తీసుకొని వెళ్ళాడు.
రెండవ పఠనం: మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని, ధ్రువ పరుచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రధముడనుట సత్యము, నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు అని వింటున్నాం. మితృలారా మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని క్రీస్తు ప్రభువు నిరూపిస్తున్నాడు. తనకు జన్మ నిచ్చిన పవిత్ర మూర్తియైన మరియమాతను దేవుడు ఆత్మ శరీరములతో మోక్షమునకు లేవనెత్తాడు అనుటలో ఏ సందేహం లేదు. మృత్యువునే నాశనము చేయగలిగిన శక్తి గల వాడు మన దేవుడు అని వాక్యం సెలవిస్తుంది.
క్రీస్తు ప్రభువు మోక్షరోహణం తర్వాత యేసు క్రీస్తు ప్రభువు తన తల్లియైన మరియమ్మను ఆయన మహిమతో భాగస్తులుగా ఉండుటకు మరియమ్మను మోక్షరోపణం, మోక్షమునకు తీసుకొని పోతున్నాడు.
సువిశేష పఠనములో మరియా తల్లి ఎలిజబెతమ్మను దర్శించుట మరియు మరియమ్మ స్తోత్రగీతము గురించి వింటున్నాం. మరియతల్లి ఉన్నచోట ప్రతి వ్యక్తి కూడా పవిత్రాత్మతో నింపబడుతారు. మరియ తల్లి వందన వచనము ఎలిజబెతమ్మ చెవిలో పడగానే, ఆమె పవిత్రాత్మతో పరిపూర్ణురాలాయెను. అదేవిధంగా ఆమె అంటుంది. మరియమ్మ "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీవు నా ప్రభుని తల్లివి, నీవు ధన్యురాలవు. అప్పుడు మరియతల్లి దేవునికి స్తుతిగీతము పాడుతుంది. దేవుడు తనకు చేసిన గొప్ప కార్యములకు ఆమె ఎంతో సంతోష పడుతు, సర్వశక్తిమంతుడు నా యెడల గొప్ప కార్యములు చేసెను. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరములు వరకు ఉండును. మరియు ఆయన దీనులను లేవనెత్తును అంటు దేవుణ్ణి స్తుతించింది.
ప్రియ విశ్వాసులారా మనం దేవుని యొక్క సందేశాన్ని విన్నప్పుడు పవిత్రాత్మతో నింపబడుతున్నామా? ఎలిజబెతమ్మ వలె మనము కూడా మరియతల్లి, దేవుని తల్లి అని చెప్పగలుగుతున్నామా? మరియతల్లి మోక్షరోపణ పండుగ మనకు తెలియజేసేది ఏమిటంటే ఒక రోజు నువ్వు, నేను మనమందరం కూడా మరియతల్లి వలే పరలోకానికి ఆత్మ శరీరంతో ఎత్త బడతాము అని కాబట్టి మరియతల్లి వలె జీవించడానికి ప్రయత్నించుదాం.
ప్రార్ధన : సర్వశక్తివంతుడైన దేవా నీవు మమ్ము స్వాతంత్రులుగా చెయ్యడానికి ఈలోకానికి వచ్చావు. మేము ఈ రోజు మా దేశ స్వతంత్ర దినోత్సవాన్ని కొనియాడుకుంటున్నాం. కానీ ఇంకా చాలా చోట్ల ప్రజలు పేదరికం అన్యాయం హింసలకు బానిసలుగా ఉన్నారు. నీవు సర్వశక్తివంతుడవు , దయ కనికరం గలవాడవు కాబట్టి అలా బానిసలుగా ఉన్న ప్రజలకు విముక్తి విడుదలను దయచేయ్యండి. ఈ లోక రాజకీయ నాయకుల్ని మీ శక్తితో నడిపించండి. ఈరోజు మరియతల్లి మోక్షరోపణ పండుగ జరుపుకొనుచుండగా మా అందరికి కూడా విడుదలను దయచేయండి. ఈ లోకానికి, లోకవస్తువులకు, శరీరానికి, పాపానికి బానిసలైన మమ్ము మీ నిత్యా రక్షంలోనికి ఎత్తబడే భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి OCD
యెహెఙ్కేలు 9: 1-7, 10:18-22 మత్తయి 18:15-20
యెహెఙ్కేలు 9: 1-7, 10:18-22 మత్తయి 18:15-20
"నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన యెడల నీవు వెళ్లి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ది చెప్పుము. నీ మాటలు అతడాలకించిన యెడల వానిని నీవు సంపాదించుకొనిన వాడవగుదువు. నీ మాటలు అతడు ఆలకింపని యెడల ఒకరిద్దరిని నీ వెంట తీసుకొనిపొమ్ము. ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. వారి మాట కూడ వినని యెడల సంఘమునకు తెలుపుము, ఆ సంఘమును కూడ అతడు లెక్కింపని యెడల, వానిని అవిశ్వాసునిగా, సుంకరిగ పరిగణింపుము. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోక మందు బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోక మందు విప్పబడునని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి అడిగినను, పరలోక మందుండు నా తండ్రి వారికి దానినొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలన, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను" అనెను.
క్రిస్తునాధుని యందు ప్రియమైన విశ్వాసులారా ఈనాడు మనము పునీత మాక్సి మిలియాన్ మేరీ కోల్బె గారిని స్మరించుకుంటున్నాము. ఈ పునీతుడు ఎంతో ప్రేమతో, దేవుని సేవ చేసిన గురువు. ప్రతి నిత్యం దైవ ప్రేమను పంచిన పునీతుడు. దేవుని ఆజ్ఞలన్ని దైవ ప్రేమ, సోదర ప్రేమ అనే రెండు ఆజ్ఞల మీద ఆధారపడిఉన్నాయి. దైవ ప్రేమతో నింపబడి, దైవ ప్రేమలో ఎదిగిన వ్యక్తి ఈయన. తన పొరుగువారి కోసం తన ప్రాణమును ధారపోయువాని కంటే గొప్పవాడు ఎవడును లేడు అని క్రీస్తు ప్రభువు అని చెప్పిన వాక్యాన్ని ధ్యానిస్తూ తన పొరుగు వానిని రక్షించడానికి వేరే వ్యక్తి మరణ శిక్షను తాను తీసుకొని ఆ వ్యక్తి కోసం ప్రాణమును అర్పించిన వ్యక్తి. గొప్ప వేద సాక్షి, దైవ ప్రేమ మానవ ప్రేమతో నిండిన వ్యక్తి ఈ పునీతుడు.
ప్రియ విశ్వాసులారా ఈ లోకంలో చాలా మందికి దైవ భయం లేదు, దైవ ప్రేమను కూడా అర్ధం చేసుకోలేక పోతున్నారు. మనము నిజముగా దైవ ప్రేమ కలిగిఉన్నామా? మనకు దైవ భయం ఉన్నదా? ఆలోచించండి. సోదర ప్రేమ ఈ లోకం ప్రజలు తమ తోబుట్టువులనే ప్రేమించలేకపోతున్నారు. అటువంటి మనం ఎలా పొరుగువారికి ప్రేమించగలం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజం చెప్పాలంటే దైవ ప్రేమ నీ నా హృదయంలో లేకపోయినట్లయితే మనకు సోదర ప్రేమ లేనట్టే. మన దేవుడి ప్రేమామయుడు, ప్రేమ నిధి ఆయన బిడ్డలుగా ప్రేమ కలిగి పునీత మాక్సిమిలియన్ గారి వలె జీవించడానికి ప్రయత్నించుదాం.
ఈనాటి మొదటి పఠనంలో మనము వింటున్నాం. యెరూషలేములో ఉన్న ప్రజల పాపములకుగాను దేవుడు తన దూతలను పంపి వారిని శిక్షిస్తున్నాడు. యెహెఙ్కేలు ప్రవక్త ఈ దర్శనాన్ని చూస్తూన్నాడు. దేవుడు తన దూతను పంపుచు అంటున్నాడు. "నీవు యెరూషలేము నగరమంతట సంచరించి పట్టణమున జరుగుచున్న హేయమైన కార్యములకుగాను సంతాపము చెందు వారి నొసటిపై ముద్ర వేయుము. దూతలారా మీరు నగరంలోని వెళ్లి అందరిని వధింపుడు. ఎవరి మీద జాలి చూపకుడు. ఎవ్వరిని వదలి వేయకుడు అని చెబుతూ తమ నొసటి మీద గురుతు ఉన్న వారిని మాత్రము ముట్టుకోనకుడు అని ఆజ్ఞాపించాడు.
ప్రియ విశ్వాసులారా ఎందుకు దేవుడు వారిని చంపుతున్నాడు అంటే ఆ ప్రజలు యిస్రాయేలీయులు ఘోరమైన పాపములు చేశారు. వారు ఇతరులకు చెడు చేస్తున్నారు. దేవుడు వారిని శిక్షిస్తున్నాడు. కాని వారి పాపములు ఒప్పుకొని వారి తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపం చెందువారిని దేవుడు రక్షిస్తున్నాడు. దీని ద్వారా మనందరం ఏమి తెలుసుకోవాలంటే అంతిమ దినమున దేవుడు తన దూతలను పంపి మనలను, మన పాపక్రియలకుగాను మన చెడు క్రియలకుగాను మనలను జాలి, దయ లేకుండా శిక్షిస్తాడు. మరి ఆయన దయను పొందాలంటే మనము పాపపు, చేడు జీవితాన్ని విడిచి పెట్టి, పశ్చాత్తాపంతో దేవుని చెంతకు రావాలి. మిత్రులారా ఒకసారి ఆలోచించండి మన జీవితాలు, మన పనులు, మన మాటలు ఎలా ఉన్నాయి. ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుని మన్నింపును కోరుకుందాం.
ఈనాటి సువిశేష పఠనంలో మనం మన సోదరుని ఎలా సరిదిద్దుకోవాలిఅనే విషయాన్ని మనం వింటున్నాం. నేటి సమాజంలో మనం చుస్తే చాలా మంది చాలా రకాలైన తప్పులను చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, అవివేకం వాళ్ళ కొంతమంది తప్పులు చేస్తుంటే, కొంత మంది స్వార్ధ బుద్దితో, కొంత మంది స్వలాభాల కోసం, మరి కొంత మంది డబ్బు కోసం, ఆస్తుల కోసం ఎలా ఎన్నోరకాలైన వాటి కోసం తప్పులు చేస్తున్నారు. క్రీస్తు ప్రభువు ఈనాటి సువిశేషంలో నీ సోదరుడు నీకు విరుద్ధంగా తప్పు చేస్తే నీవు అతని దగ్గరికి వెళ్లి ప్రేమతో మాట్లాడి, తన తప్పును ఆ వ్యక్తికి అర్ధమైయ్యేలా చెప్పు అంటున్నాడు. ఈనాడు ప్రజలు తప్పు చేసిన వ్యక్తితో తప్ప అందరికి చెబుతారు. ఆమె లేదా అతను ఇలా చేసాడు, అలా చేశారు అని చెబుతుంటారు. అలా చెయ్యడం వలన మనం వారికి ఇంకా చెడ్డవారిగా చేస్తుంటాం. ఆలోచించండి. నీవు చెప్పినట్టు వినకపోతే ఇంకో ఇద్దరినీ తీసుకెళ్లి మాట్లాడు అది కూడా వినకపోతే సంఘానికి చెప్పు అప్పటికి వినకపోతే అతన్నీ అవిశ్వాసిగా పరిగణించు అని ప్రభువు చెబుతున్నారు. వారి కోసం మనము ప్రార్ధించాలి. ఏక మనస్కులై మనమందరం ప్రార్ధిస్తే దేవుడు మన ప్రార్ధనల ద్వారా ఎంతోమంది జీవితాలను మార్చుతాడు. మనమందరం గుర్తుంచుకోవలసినది ఏమిటంటే మన మాటల వల్లకానిది మన ప్రార్థన వల్ల ఖచ్చితముగా జరుగుతుంది కాబట్టి ప్రతినిత్యం ప్రార్ధించి ఆత్మలను రక్షించడానికి ప్రయత్నించుదాం.
ప్రార్ధన :తండ్రియైన దేవా ఈనాటి వాక్యం ద్వారా సోదర ప్రేమ మరియు దైవ భయం దైవ ప్రేమను కలిగి జీవించాలని మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. దేవా ఎన్నో సార్లు మేము నీ పట్ల భయ భక్తులు లేకుండా మా తప్పిదములతో, పాప స్థితిలో చెడు పనులలో ప్రయాణించాము. కాని ఈ రోజు నీ వాక్యం ద్వారా మా తప్పులు తెలుసుకొని పశ్చాత్తాప పడుతున్నాము. నిన్ను ప్రేమిస్తూ, నా పొరుగువారిని ప్రేమిస్తూ, వారి మంచి కోసం క్షేమం కోసం తపిస్తూ, ప్రార్ధిస్తూ పునీత మాక్సిమిలియన్ కోల్బె వలె జీవించే భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి OCD
12, ఆగస్టు 2024, సోమవారం
యెహెఙ్కేలు 2:8-3:4 మత్తయి 18:1-5,10,12-14
యెహెఙ్కేలు 2:8-3:4 మత్తయి 18:1-5,10,12-14
ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, "పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవ్వడు?" అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, "మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందింననే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిజముగా నేను మీతో వక్కాణించు చున్నాను. కాబట్టి తనను తాను తగ్గించు కొని ఈ బాలుని వలె వినమ్రుడుగ రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్న వానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు." ఈ చిన్నవారిలో ఎవ్వరిని త్రుణికరింపకుడు. ఏలన వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." ఒకడు తనకున్న నూరు గొఱ్ఱెలలో ఒకటి తప్పిపోయినచో, తక్కిన తొంబది తొమ్మదింటిని ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పొడా? అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన తొమ్మది తొమ్మిదింటి కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసి బాలురలో ఏ ఒక్కడైన నాశనమగుట పరలోక మందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలిసికొనుడు."
క్రిస్తునాధుని యందు ప్రియా మిత్రులారా దేవుడు ఈనాడు యెహెఙ్కేలు ప్రవక్తకు తన మాటలను వినిపించుచున్నాడు. ఆ ప్రవక్తతో దేవుడు అంటున్నాడు నీవు యిస్రాయేలు వలె తిరుగుబాటు చేయవలదు. అలాగే నీవు ఈ గ్రంథపు చుట్టను భుజించి యిస్రాయేలియుల వద్దకు వెళ్లి వారితో మాటలాడుము" అని చెబుతున్నాడు. ఎప్పుడైతే యెహెఙ్కేలు ప్రవక్త నోరు తెరిచాడో అప్పుడు దేవుడు అతనితో నేను నీకు ఇచ్చు ఈ గ్రంధపు చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుము అని అంటున్నాడు. అదేవిధంగా యెహెఙ్కేలు దానిని భుజింపగా అది తేనెవలె మధురముగా ఉన్నది.
మిత్రులారా! దేవుడు ఎప్పుడు తన వాక్కును, తాన్ మాటలను వాగ్ధానాలను మనకు వినిపిస్తూనే ఉంటాడు. మరి మనము వినగలుగుతున్నామా? దేవుని వాక్కును ఆలకిస్తున్నామా? ఈనాడు యెహెఙ్కేలు దేవుని వాక్కును భుజింపగా అది ఆయన నోటికి తేనె వలే మధురంగా ఉన్నది, నీవు నేను దేవుని వాక్కును, దైవ గ్రంథాన్ని ధ్యానించగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని మనము రోజు వింటూ, చదువుతూ, ధ్యానిస్తూ, పాటిస్తూ ఉంటె నీవును నేను మనందరం కూడా ఆ వాక్యపు రుచిని చూడగలం. వాక్యంతో మన హృదయాలను నింపుకోవాలి. మనందరం వాక్యంతో నింపబడితే మనము కూడా ప్రజలకు దేవుని వాక్యమును బోధించగలం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం హృదయంలో నింపుకోవడానికి ప్రయత్నించుదాం.
ఈనాటి సువిశేషంలో శిష్యులు యేసు ప్రభువును " పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవ్వడు?" అని అడుగుతున్నారు. క్రీస్తు ప్రభువు తనను తాను తగ్గించుకొని చిన్న బాలుని వలె మారినవాడే పరలోకరాజ్యములో గొప్పవాడు. ప్రతి ఒక్కరు గొప్ప వారు కావాలని, గొప్పగా జీవించాలని అందరి కంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. గొప్ప స్థాయిలో గొప్పవారిగానే ఉండాలని ప్రయత్నిస్తారు. అదే విధంగా ఆ ఆశ శిష్యులలో కూడా ఇప్పుడు కలిగింది. వారు పరలోకములో గొప్ప వారిగా ఉండాలని కోరుకుంటున్నారు. మనము ఈ లోకంలో కాదు పరలోకరాజ్యంలో గొప్పగా ఉండాలి. తనను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పగా పరిగణించబడతాడు. పరలోకరాజ్యంలో గొప్పవాడు ఎవడో దేవుడు తన శిష్యులకు తెలియపరిచారు. మనం ఈ తగ్గింపు జీవితం జీవిస్తున్నామా? లోకంలో మనము చూసినట్లయితే, గర్వం స్వార్ధం ఎక్కువైపోతున్నాయి. ఎవరు తనను తాను తగ్గించుకోలేక పోతున్నారు. గొప్పలు చెప్పుకోవడం, ఇతరులను చిన్న చూపుచూడటం ఎక్కువైపోతోంది. ఏ బంధమైన నిలబడాలంటే, కలకాలం సంతోషంగా ఉండాలంటే ఉండవలసిన ఓకె ఒక గుణం తగ్గింపు గుణం. ఎవ్వరు తగ్గించుకోగలుగుతారు అంటే తనను తాను అర్ధం చేసుకుంటారో వారే! కొన్ని సార్లుమన తగ్గింపు జీవితం మనలో ఉన్న గర్వాన్ని తగ్గిస్తుంది. మన తగ్గింపు మనస్తత్వం మనలను గొప్పవారిగా చేస్తుంది.త్రోవ తప్పిన గొర్రె ఉపమానములో దేవుడు చెప్పిన గొప్ప సందేశం ఏమిటంటే మనలో చాలా మంది గర్వంతో, స్వార్ధంతో, అజ్ఞానముతో దేవునికి దూరమై పోతున్నాము. మరి ఇది దేవుని చిత్తముకాదు. దేవుడు ఒక గొప్ప కాపరిగా తనను తాను తగ్గించుకొని త్రోవ తప్పిన మనకొరకు వెదుకుతూ వచ్చి మనలను రక్షించాడు. కాబట్టి ప్రియ మిత్రులారా మనం మంచి మార్గంలో దేవుణ్ణి అనుసరిస్తున్నామా లేదా త్రోవ తప్పిన గొర్రెవలె ఉన్నామా! ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రతినిత్యం తగ్గింపు మనస్సుతో దేవుని త్రోవలో క్రీస్తు వలె తగ్గింపు మనస్సుతో దేవుని వెంబడించడానికి ప్రయత్నించుదాం.
ప్రార్థన:ప్రభువైన దేవా నీ వాక్కుతో మమ్ము పోషించు నీవు మానవుడు రొట్టెవలనే కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని అన్నావు కదా ప్రభూ. నీ వాక్కును భుజించి, ధ్యానించి, సత్య త్రోవలో నీ సత్యపు వెలుగులో నడచి నిన్ను చేరి, నన్ను నేను తగ్గించుకొని జీవించే భాగ్యాన్ని మాకు దయ చేయండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి OCD
11, ఆగస్టు 2024, ఆదివారం
యెహెఙ్కేలు 1:2-5, 24-25 మత్తయి 17:22-27
యెహెఙ్కేలు 1:2-5, 24-25 మత్తయి 17:22-27
పిమ్మట వారు గలిలీయలో తిరుగుచుండగ యేసు "మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగింపబడ బోవుచున్నాడు. వారు ఆయనను చంపుదురు. కాని, మూడవ దినమున లేపబడును" అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి. అంతట వారు కఫర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్ను వసూలు చేయువారు పేతురు దగ్గరకు వచ్చి, "మీ గురువు పన్ను చెల్లింపడా? అని ప్రశ్నింపగ, "చెల్లించును" అని పేతురు ప్రత్యుత్తర మిచ్చెను. అతడింటికి వచ్చిన వెంటనే యేసు "సీమోను! నీ కేమి తోచుచున్నది? భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్ను వసూలు చేయుచున్నారు? తమ పుత్రుల నుండియా? ఇతరుల నుండియా?" అని ప్రశ్నించెను. పేతురు అందుకు "ఇతరుల నుండియే" అని ప్రత్యుత్తర మిచ్చెను. "అయితే పుత్రులు దీనికి బద్దులుకారు గదా! వారు మనలను అన్యధా భావింప కుండుటకై నీవు సముద్రమునకు వెళ్లి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరచినపుడు అందొక నాణెమును చూతువు. దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము" అని యేసు సీమోనును ఆదేశించెను.
ప్రియ విశ్వాసులారా! ఈనాడు మొదటి పఠనంలో యావే దేవుడు బూసి కుమారుడైన యహేఙ్కేలు అనే యాజకునికి ప్రభుని వాణి ప్రత్యక్షమయ్యెను. ప్రభుని హస్తము అతని మీదికి వచ్చెను. ప్రియ మిత్రులారా యహేఙ్కేలుకు దేవుడు తన సింహాసనం గూర్చి గొప్ప దర్శనము ఇస్తున్నాడు. అదేవిధంగా యెహెఙ్కేలు దేవుని దూతలను, ప్రభుని యొక్క సింహాసనము, సింహాసనము పై కూర్చొని ఉన్నా దేవుణ్ణి చూసి, ప్రభుని యొక్క తేజస్సు అతని చుట్టూ ఉన్న కాంతి మిరుమిట్లు గొలుపుతుండగా, నేలపై బోరగిలబడగానే ప్రభుని స్వరమును ఆయన విన్నాడు. ప్రియ మిత్రులారా దేవుడు ప్రతి నిత్యం తనను ప్రేమించి, సేవించి తనను తెలుసుకోవాలి అని ఎదురు చూసేవారికి తన దర్శనాన్ని ఇస్తుంటాడు. మరి మన జీవితంలో ఎంత మంది దేవుని దర్శనం పొందుకుంటున్నాం. ఎంత మంది దేవుని దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడైతే మనము ఆయన స్వరాన్ని వింటామో అప్పుడు దర్శనాన్ని ఇస్తాడు. అంతేకాదు ప్రతి దివ్య బలి పూజలో దేవుడు తన దివ్య దర్శనాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు, దీనిని మనము గ్రహించగలుగుతున్నామా! ఆత్మ పరిశీలన చేసుకుందాం.
సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తన శిష్యులకు తన మరణ పునరుత్తనాల గురించి చెప్పడం విని శిష్యులు మిక్కిలి దుఃఖించుచున్నారు. స్నేహితులారా క్రీస్తు ప్రభుని మరణ పునరుత్తనాల ద్వారా మనము రక్షణము పొందియున్నాము. మన కోసం మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు మన క్రీస్తు ప్రభువు. ఆనాడు చాలా మంది పెద్దలు ప్రధానర్చకులు, పరిసయ్యులు క్రీస్తు ప్రభువుని దేవుని కుమారునిగా గుర్తించలేక చీకటిలో, పాపములో జీవిస్తుండేవారు. అందుకనే క్రీస్తుని పట్టుకొని, హింసించి అతి క్రూరంగా చంపిన, దేవుడు మాత్రం వారిని క్షమించాడు. రెండవది ఏమిటంటే వారు క్రీస్తు ప్రభువుని దగ్గరకు వచ్చి అడగకుండా ఆయన శిష్యులతో అంటున్నారు. మీ గురువు దేవాలయపు పన్ను చెల్లింపడా ? అని, అంటే వారు యేసు ప్రభువుని దేవుని కుమారుడు అని గుర్తించలేక పోయారు. కాని క్రీస్తు ప్రభువు ఎంతో బాధ్యతతో పేతురుతో ఇట్లు అంటున్నాడు. నీవు సముద్రమునకు వెళ్లి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరవగానే నీకొక నాణెము కనిపిస్తుంది. దానిని మన ఇద్దరికొరకు సుంకముగా చెల్లింపుము.
ప్రియా విశ్వాసులారా ఈనాడు మనలో ఎంత మంది దేవుని దర్శనాన్ని పొందగలుగుతున్నాం? మనలో ఎంతమంది క్రీస్తు ప్రభుని దేవుని కుమారునిగా గుర్తించగలుగుతున్నాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ప్రార్ధన : దేవా మా జీవితాలలో మేము కూడా నీ దర్శనాన్ని పొందే భాగ్యాన్ని ఇచ్చే దేవుడవు. ప్రభువా ! నీ మరణ పునరుత్తనాల ద్వారా నీవిచ్చిన రక్షణను మేము ప్రతినిత్యం గుర్తించుకుంటూ మేము నిన్ను ప్రేమించి, సేవించి నీ పరలోక దర్శనం పొందే భాగ్యము మాకు దయచేయండి. ఆమెన్ .
ఫా. సురేష్ కొలకలూరి OCD
నిత్య జీవము ఎలా వస్తుంది
యోహాను 6: 22-29 మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...