7, సెప్టెంబర్ 2024, శనివారం
23వ సామాన్య ఆదివారం
2, సెప్టెంబర్ 2024, సోమవారం
1 కొరింతి 2:1-5, లూకా 4:16-30
1 కొరింతి 2:1-5, లూకా 4:16-30
తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్ధనామందిరమునకు వెళ్లెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా, యెషయా ప్రవక్త గ్రంధమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. "ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను." దీనిని చదివి యేసు గ్రంధమును మూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరు, ఆయనవంక తేరిచూచుచుండగా, ఆయన వారితో "నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది"అని పలికెను. అది వినిన ప్రజలందరు దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి "యితడు యోసేపు కుమారుడు కాడా ?" అని చెప్పుకొనసాగిరి. అంతట యేసు వారితో 'ఓ వైద్యుడా! నీకు నీవే చికిత్స చేసికొనుము అను సామెతను చెప్పి, "నీవు కఫర్నాములో ఏ యే కార్యములు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములనెల్ల ఇచట నీ స్వదేశంలో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలీయా కాలమున మూడు సంవత్సరములు ఆరు మాసములు అనావృష్టివలన దేశమంతట గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు యిస్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సరేఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలీయా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో యిస్రాయేలీయులలో చాలామంది కుష్ఠ రోగులు ఉన్నను, సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరును స్వస్థత పొందలేదు" అని పలికెను. అపుడు ప్రార్ధనామందిరములోని ప్రజలు అందరు యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకునెట్టుకొని పోయి, తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొనివెళ్ళి, అచట నుండి తలక్రిందుగా పడత్రోయతలచిరి. కాని యేసు వారి మధ్య నుండి తొలగి తనదారిన తాను వెళ్లిపోయెను.
మొదటి పఠనములో మానవ జ్ఞానము నిష్ఫలమైనదని పౌలుగారు తెలియజేస్తున్నారు. పౌలుగారుప్రసంగాలు కేవలం దేవుని వాక్యమే. మనం కూడా పౌలులాగా వాక్యంలో క్రీస్తును చూపించాలి. లోక జ్ఞానాన్ని ప్రదర్శించే ప్రయత్నం పౌలు ఎన్నడు చేయలేదు.
మన విశ్వాసము, మనుషుల జ్ఞానమును ఆధారము చేసికొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని యుండవలెను. ఈ రోజుల్లో ఆకర్షణీయమైన మాటలు చెప్పే బోధకులున్నారు. కానీ పవిత్రాత్మ చే నడపబడి దేవుని శక్తి వ్యక్తమయ్యే బోధకులు తక్కువగా ఉన్నారు.. మానవ జ్ఞానానికి దారి తియ్యని మాటలకు ఆకర్షితులై ఎంతో మంది విశ్వాసంలో తప్పు దోవ పడుతున్నారు.
ఓ తండ్రి, పది సంవత్సరాల కొడుకు బస్సు ప్రయాణం చేస్తున్నారు. మాములుగా చిన్న పిల్లలు అడిగే ప్రశ్నలు ఎక్కడ? ఎప్పుడు?ఎందుకు? ఏమిటి? ఇలా ఆ అబ్బాయి తండ్రిని ఎన్నో ప్రశ్నలు అడిగాడు. చివరికి డాడీ రోడ్డుకు వేసే తారును దేనితో తయారు చేస్తారు? అని అడిగాడు. తండ్రి కొద్దిగా కొపంతో బాబు నీవు ఈ రోజు నన్నడిగిన ప్రశ్నల్లో ఇది 999 వ ప్రశ్న. దయచేసి కొంత సేపు నన్ను వదిలెయ్యి అంటూ. నేను గనుక మా నాన్నను యిన్ని ప్రశ్నలను అడిగి ఉంటె నాకేమయ్యేది? అని అనుకున్నాడు. కొడుకు కొద్దిసేపు ఆలోచించి నా ప్రశ్నలకు చాలావరకు నాకు సమాధానాలు నాకు తెలిసేవి అన్నాడు. ఈ లోక జ్ఞానం చూసి, విని తెలుసుకునేలా ఉంటుంది. కానీ పరలోక సంబంధమైన జ్ఞానము పవిత్రాత్మ మాత్రమే ఒసగుతుంది.
ఇవి అద్భుతం ద్వారా నిరూపిస్తున్నారు. అపవిత్రాత్మలు సైతం క్రీస్తు వాక్కుకు లోబడి ఉన్నవి . అధికారపూర్వమైన హెచ్చరిక రాగానే అపవిత్రాత్మ వెళ్ళిపోతుంది. సువార్తలో ఈ అద్భుతాన్ని చూసి ప్రజలు క్రీస్తు అధికారాన్ని అంగీకరించారు. ఇలా గుర్తుల ద్వారా వచ్చిన విశ్వాసం గొప్పది చూసి విశ్వసించిన వారికంటే చూడక విశ్వసించిన వారు ధ్యనులు. ఆ ధన్యతను మనకు ప్రసాదించమని విశ్వాసంలో బలపడేలా దీవించమని ఈనాడు ప్రత్యేకంగా ప్రార్ధించుదాం. ఆమెన్
ఫా. రాజు సాలి OCD
31, ఆగస్టు 2024, శనివారం
22 వ సామాన్య ఆదివారం
మత్తయి 25: 14-30
మత్తయి 25: 14-30
"ఒకడు దూరదేశమునకు ప్రయాణమై పోవుచు సేవకులను పిలిచి, తన ఆస్తిని వారికి అప్పగించెను. వారివారి సామర్ధ్యమును బట్టి ఒకనికి ఐదు లక్షలు వరహాలను, మరియొకనికి రెండు లక్షలు వరహాలను, ఇంకొకనికి ఒక లక్ష వరహాలను ఇచ్చివెళ్లెను. ఐదులక్షల వరహాలను పొందిన వాడు వెంటనే వెళ్లి వ్యాపారముచేసి మరియైదు లక్షలు సంపాదించెను. అట్లే రెండు లక్షలు వరహాలను పొందినవాడు మరి రెండు లక్షలను సంపాదించెను. కాని ఒక లక్ష వరహాలను పొందినవాడు వెళ్లి నేలను త్రవ్వి తన యజమానుని ద్రవ్యమును దాచెను. చాలకాలము గడిచిన తరువాత ఆ సేవకుల యజమానుడు తిరిగివచ్చి, వారితో లెక్కలు సరిచూచుకొననారంభించేను. ఐదులక్షల వరహాలను పొందిన సేవకుడు మరి ఐదు లక్షల వరహాలనుతెచ్చి , స్వామీ! తమరు నాకు అయిదు లక్షల వరహాలను ఇచ్చితిరి. ఇదిగో ! మరి ఐదు లక్షలు సంపాదించితిని అనెను. అపుడు ఆ యజమానుడు వానితో మంచిది, నీవు ఉత్తముడవు. నమ్మినబంటువు. స్వల్పవిషయములందు శ్రద్ధవహించితివి. కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో నీవు పాలుపంచుకొనుము అనెను. రెండు లక్షల వరహాలను పొందినవాడు వచ్చి, స్వామీ! మీరు రెండు లక్షల వరహాలను ఇచ్చితిరిగదా! ఇదిగో! మరి రెండు లక్షలు సంపాదించితిని అనెను. అప్పుడు ఆ యజమానుడు అతనితో , మంచిది, నీవు ఉత్తముడవు. నమ్మినబంటువు. స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి. కనుక అనేక విషములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో పాలుపంచుకొనుము అనెను. పిదప ఒక లక్ష వరహాలను పొందిన వాడు వచ్చి, అయ్యా ! నీవు కఠినుడవని నేను ఎరుగుదును. నీవు నాటనిచోట కోయువాడవు. విత్తనములను చల్లనిచోట పంట కూర్చుకొనువాడవు. కనుక నేను భయపడి, వెళ్లి నీ లక్ష వరహాలను భూమిలో దాచితిని. ఇదిగో నీ ధనమును నీవు తీసికొనుము అని పలికెను. అపుడు ఆ యజమానుడు వానితో , ఓరీ దుష్ట సేవకా! సోమరీ! నేను నాటనిచోట పంటకోయువాడననియు, విత్తనములు చల్లనిచోట పంట కూర్చుకొనువాడననియు నీవు ఎరుగుదువు కదా! అట్లయిన నా ధనమును వడ్డీకిచ్చియుండవలసినది. నేను తిరిగివచ్చినపుడు వడ్డీతో సహా సొమ్ము పుచ్చుకొనియుందునుగదా! అని పలికి సేవకులతో ఆ లక్ష వరహాలను వీనినుండి తీసివేసి పది లక్షల వరహాలు కలవానికి ఈయుడు. ఉన్న ప్రతివానికి ఇంకను ఈయబడును. అపుడు అతనికి సమృద్ధికలుగును. లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు ఏడ్చుచు పండ్లు కోరుకుకొందురు అని పలికెను.
క్రీస్తు నాధుని యందు ప్రియ విశ్వాసులారా ఈనాటి మొదటి పఠనంలో మనము మన జీవితాలను పరిశీలించుకోవాలి అని ప్రభువు మనకు బోధిస్తున్నాడు. దేవుని పిలుపు పొందక ముందు, దేవుని ప్రజలలాగా మనము ఎన్నుకొనక ముందు, మనం ఎలా ఉన్నాము అని మనము ఆలోచించాలి. మనలో చాల మందిని చూసినట్లయితే వివేకవంతులు, శక్తివంతులు సాంఘికంగా ఉన్నత జీవనము కలవారము కొందమందిమే. ఇది సత్యం ప్రియా విశ్వాసులారా లోకముచే బలహీనులుగా, అల్పముగా, నీచముగా విలువలేని వారిగా ఉన్న మనలను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు మనలను తన ప్రేమ చేత గొప్పవారినిగా చేస్తాడు. చాలా మందిని మనం చూస్తున్నాము, ఎన్నో బలహీనతలు వాటితో పాటు, ఎన్నో పాపకార్యాలు చేస్తూ దేవునికి, కుటుంబానికి దూరంగా జీవిస్తున్నారు. సంఘంలో, కుటుంబంలో చాలా మంది నీచముగా విలువలేని వారీగా జీవిస్తున్నాము. అలాంటి వారి మాటలకు ఏ విలువ ఉండటం లేదు. విలువ లేని జీవితాలు జీవిస్తూ, అల్పులుగా మారి పోతున్నారు.
ఈలోక పాప జీవితంలో మ్రగ్గుచున్న వారిని, బలహీనులుగా భావింపబడువారిని ఆయన ఎన్నిక చేసుకొని మనలను క్రీస్తుతో ఏకము చేసి, క్రీస్తు ద్వారా మనలను నీతిమంతులుగా, పరిశుద్దులుగా, విముక్తులుగా దేవుడు చేసాడు. మనం బలహీనులము, అల్పులము, విలువలేని వారము కాబట్టి దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనవలదు. గొప్పలు చెప్పదలచినవాడు ప్రభువు చేసిన గొప్ప కార్యాలను గూర్చి చెప్పవలయును. కానీ ప్రియ విశ్వాసులారా ! మనలో చాలామంది గర్వంతో, స్వార్ధంతో, అవివేకంతో, పొగరుతో దేవుడూ చేసిన గొప్ప కార్యములను మర్చిపోయి జీవిస్తున్నారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా మనం ఎలా ఉన్నాము, దేవుని గూర్చి గొప్పలు చెప్పుకుంటున్నామా! లేదా? ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ఈనాటి సువిశేష పఠనంలో ఒక యజమాని తన సేవకులను గురించి తెలియజేస్తున్నాడు. ఆ యజమానుడు తన సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్ధ్యము బట్టి వారిలో ఓకనికి ఐదు లక్షలు, మరియొకనికి రెండు లక్షలు, ఇంకొకనికి ఒక లక్ష వరహాలను ఇచ్చెను. ఈ ఉపమానము ద్వారా దేవుడు మనకు ఏమి తెలియజేస్తున్నాడు అంటే ప్రభువు కూడా మన మన సామర్ధ్యము బట్టి, మనకు ఎన్నో గొప్ప బాధ్యతలను, గొప్ప విషయములను మనకు అప్పగిస్తుంటాడు. మనలో ఎంత మందిమి శ్రమించి, కష్టపడి దేవుడిచ్చిన బాధ్యతలను నెరవేర్చుతున్నాము? ఎంత మందిమి ఉత్తముడైన దేవుని నమ్మినబంటుగా స్వల్ప విషయములందు శ్రద్ధ వహించుచున్నాము. చాల మందిమి ఉత్తమ జీవితం జీవించలేక పోతున్నాం. నమ్మకమైన వారీగా ఉండలేక పోతున్నాం, స్వల్ప విషయలందు శ్రద్ధ తీసుకోలేక పోతున్నాం.
ప్రియ విశ్వాసులారా దేవుడు మన సామర్ధ్యమును బట్టి ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తిని మనకు దయచేస్తున్నాడు. కాని మనము సోమరితనంతో లేక భయంతో, స్వార్ధంతో గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం. శ్రద్దగా జీవించలేకపోతున్నాం. ఎవరైతే దేవుడిచ్చిన వరాలను అనుగ్రహాలను ఉపయోగిస్తారో వాడుకలో ఉంచుతారో వారిని అధికముగా దీవిస్తాడు. ఉన్న ప్రతి వానికి ఇంకను ఈయబడును, లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. కాబట్టి ప్రియ విశ్వాసులారా మనకు ఉన్న ప్రతి దానికి దేవుని కొరకై ఉపయోగించుదాం. అప్పుడు మనకు సమృద్ధి కలుగుతుంది.
ప్రార్ధన : నీతిమంతుడైన దేవా! మేము బలహీనులము, అవివేకులము విలువలేని వారము కాని నీ ప్రేమ ద్వారా మమ్ము నీతిమంతులుగాను, పరిశుద్దులుగాను విముక్తులుగాను చేసి మా సామర్ద్యములను బట్టి మమ్ము దీవించి వరములను అనుగ్రహములను దయచేసి వాటి ద్వారా మేము ఉత్తమ జీవితం జీవించే భాగ్యం మాకు దయజేసిరివి మాకున్న సమాస్థానాన్ని నీ కొరకు ఉపయోగించే భాగ్యమును మాకు దయచేయండి. ఆమెన్
24, ఆగస్టు 2024, శనివారం
21వ సామాన్య ఆదివారం
23, ఆగస్టు 2024, శుక్రవారం
దర్శన గ్రంథము 21:9- 14 యోహాను1:45-51
పునీత బర్తలోమయి అపోస్తులుడు
దర్శన గ్రంథము 21:9- 14 యోహాను1:45-51
ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడినవానిని మేముకనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు" అని చెప్పెను. "నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా? అని నతనయేలు అడుగగా, "వచ్చి చూడుము" అని ఫిలిప్పు పలికెను. నతనయేలు తన యొద్దకు వచ్చుటను చూచి, అతనిని గూర్చి యేసు "ఇదిగో!కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు" అని చెప్పెను. "మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు?" అని నతనయేలు అడుగగా యేసు, "ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే, నీవు అంజూరపుచెట్టు క్రింద ఉండుటను నేను చూచితిని" అని సమాధానమిచ్చెను. "బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు" అని నతనయేలు పలికెను. "నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటే గొప్పకార్యములను నీవు చూడగలవు" అని యేసు చెప్పెను. ఇంకను, "మీరు పరమండలము తెరువబడుటయు, దేవునిదూతలు మనుష్యకుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని పలికెను.
ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు మనం పునీత బర్తలోమియో గారి పండుగను కొనియాడుకుంటున్నాము. పునీత బర్తలోమయి గారు పన్నెండు మంది శిష్యులలో ఒకరు. ఈయన గలిలియాలోని కానా గ్రామ నివాసి. వీరికి మరో పేరు నతనయేలు. నతనయేలు పవిత్ర జీవితం గడుపుతున్న యూదుడు. ఆయన రక్షకుడి రాకకోసం నిత్యం ప్రార్ధనలు చేసే భక్తుడు. ఫిలిప్పుగారికి ఆప్తమితృడు. అదేవిధంగా బాప్తిస్మ యోహాను శిష్యుడు. ఫిలిప్పు గారు మేము మెస్సియ్యను కనుగొంటిమి అని చెప్పగానే నతనయేలు యేసు ప్రభువును కలుసుకునేందుకు ఫిలిప్పు గారితో పాటు బయలు దేరాడు. యేసు ప్రభువు వారిని చూడగానే ఇదిగో కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు అని అంటున్నాడు. నతనయేలు అనగా నిష్కళంకమైన నిజాయితీ కలవాడని అర్ధం. నతనయేలు బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. క్రీస్తు కొరకు ఎదురు చూసి ఆయనను కనుకొని ఆయన కొరకు జీవిస్తూ, ఆయన క్రీస్తు సేవ చేసి, క్రీస్తు ప్రభువుని సాక్షిగా తన ప్రాణమును ధారపోసి రక్త సాక్షిగా మరణించాడు.
క్రిస్తునాధుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా పవిత్ర నగరమైన యెరూషలేమును గూర్చి వింటున్నాం. ఆ యెరూషలేము నగరము ఒక అమూల్యమైన రత్నము వలెను, సూర్యకాంతమణి వలెను. స్ఫటికము వలే స్వచ్ఛముగను ఆ నగరము ప్రకాశించెను అని ఆ యెరూషలేము యొక్క విశిష్టతను వింటున్నాం. పండ్రెండు ద్వారములు. వాటిపై పండ్రెండు మంది దేవదూతలు, ఆ ద్వారములపై పండ్రెండు గోత్రముల పేర్లు వ్రాయబడినవి అని అదే విధంగా ఒక్కొక్క ప్రక్కకు మూడేసి ద్వారములు ఉండెను. తూర్పున మూడు, దక్షిణమున మూడు ఉత్తమున మూడు పశ్చిమమున మూడు అన్ని కలిపి పండెండు ద్వారములు, ఆ నగరపు గోడ 12 శిలలపై నిర్మింపబడినది. ఆ రాళ్లపై క్రీస్తు ప్రభువుని పండ్రెండు మంది అపొస్తలుల పేర్లు వ్రాయబడి ఉన్నవి..
ప్రియా విశ్వాసులారా 12 అనే సంఖ్య పరిపూర్ణతకు గుర్తు, అధికారానికి గుర్తు, పండ్రెండు యిస్రాయేలీయుల తెగలు, పండ్రెండు మంది అపోస్తులులు, పండ్రెండు ద్వారములు, పండ్రెండు పునాదులు ఇక్కడ 12 అంటే దేవుని చిత్తం పరిపూర్ణము అని అర్ధం. ఎంతో మంది ఆ నూతన యెరూషలేములో చేరాలని, ప్రవేశించాలని ప్రయత్నించారు. ఇప్పుడు క్రైస్తవులమైన మనం ఆ అందమైన దేవుని రాజ్యంలో చేరాలంటే దేవుని అనుసరించి, మంచి మార్గంలో నడవాలి అప్పుడు ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాము.
ఈనాటి సువిశేష పఠనంలో దేవుడు క్రీస్తు ప్రభువు తన వద్దకు వచ్చుచున్న నతనయేలును చూసి ఇదిగో కపటము లేని నిజమైం యిస్రాయేలీయుడు అని చెప్పాడు. ఈనాడు మనం వాక్యంలో వింటున్నాము. ఫిలిప్పు ఎప్పుడైతే నతనయేలును కలిసి మేము మెస్సియ్యను కనుగొంటిమి . ఆయన యేసు నజరేతు నివాసి అని చెప్పగానే అక్కడ నుండి మంచి ఏదైనా రాగలదా ? అని నతనయేలు అనగానే వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికాడు.
ప్రియా విశ్వాసులారా మన సంఘలలో మన జీవితాలలో మన కుటుంబాలలో మనం నిజమైన మెస్సియ్యను కనుగొనాలంటే మనము కూడా దేవుని సన్నిధానానికి వచ్చి చూసి ఆయన గొప్ప కార్యాలు, మహిమ శాంతిని అనుభవించాలి. క్రీస్తు చెంతకు రావాలి. నతనయేలు క్రీస్తు ప్రభుని చెంతకు వచ్చి, ఆ దేవుని అనుభవించి, క్రీస్తు ప్రభువునితో బోధకుడా నీవు దేవుని కుమారుడవు యిస్రాయేలు రాజువు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మనం మన జీవితాలలో, నీ , నా మన అనుభవం ఏమిటి? ఆ నజరేయుడైన యేసును అనుభవిస్తున్నామా! ఆయన దేవుని కుమారుడని, యిస్రాయేలు రాజు అని గుర్తించగలుగుతున్నామా! లేదా ! ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ప్రార్ధన: ప్రేమమయుడవైన దేవా నీవు దేవుని కుమారుడవు, లోక రక్షకుడవు, యిస్రాయేలు రాజువు. మేము నీవద్దకు వచ్చి మిమ్ము ప్రేమిస్తూ, సేవిస్తూ నిన్ను మా జీవితాలలో తెలుసుకొనే భాగ్యం మాకు దయచేయండి. నతనయేలు మిమ్ము తెలుసుకొని, నీ శిష్యుడుగా మారి, నీ వాక్యాన్ని లోకాన బోధించి ఒక గొప్ప పునీతుడుగా మారినట్లు మేము కూడా మారె భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి OCD
యెహెఙ్కేలు 37:1-14 మత్తయి 22:34-40
యెహెఙ్కేలు 37:1-14 మత్తయి 22:34-40
22, ఆగస్టు 2024, గురువారం
యెహెఙ్కేలు 36:23-28 మత్తయి 22:1-14
యెహెఙ్కేలు 36:23-28 మత్తయి 22:1-14
యేసు ప్రజలకు మరల ఉపమానరీతిగా ప్రసంగింప ఆరంభించెను. "పరలోక రాజ్యము ఇట్లున్నది : ఓక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరిరండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను కాని, వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచే అతడు, ఇదిగో! నా విందు సిద్దపరుపబడినది. ఎద్దులను, క్రొవ్విన దూడలును వధింపబడినవి. అంతయు సిద్ధముగా ఉన్నది. కనుక విందుకు రెండు అని మరియొకమారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. కాని పిలువబడినవారు దానిని లక్ష్య పెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరి యొకడు తన వ్యాపారమునకు వెళ్లెను. తక్కినవారు అతని సేవకులను పట్టుకొని కొట్టిచంపిరి. అపుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హత మార్చి వారి పట్టణమును తగులబెట్టించెను. అంతట, తన సేవకులను పిలిచి నా విందు సిద్ధముగా ఉన్నది. కాని , నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులుకారు. ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి, కనపడిన వారినందరిని పిలుచుకొనిరండు అని పంపెను. ఆ సేవకులు పురవీధుల లోనికి వెళ్లి మంచి , చేడు తేడా లేక తమ కంటపడిన వారినందరను తీసికొనివచ్చిరి. ఆ కళ్యాణమండపము అతిథులతో నిండెను. అతిధులను చూచుటకు రాజు లోనికి వెళ్లి, వివాహవస్త్రము లేని వానిని ఒకనిని చూచి మిత్రమా! వివాహవస్త్రములేకయే నీవిచటికి ఎట్లు వచ్చితివి? అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించియుండెను. అపుడు ఆ రాజు తన సేవకులతో ఇతనిని కాలు సేతులు కట్టి వెలుపల నున్న చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు విలపించుచు పండ్లు కోరుకుకొందురు అనెను. పిలువబడిన వారు అనేకులు కాని , ఎన్నుకొనబడినవారు కొందరే."
క్రిస్తునాధుని యందు ప్రియమైన విశ్వాసులారా! ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఇలా అంటున్నాడు. మీరు మీ పాప జీవితముల ద్వారా అనేక జాతుల మధ్య నా మహానామమునకు అపకీర్తి తెచ్చిరి. కాబట్టి నా నామము పవిత్రమైనది అని అన్య జాతులకు తెలియజేస్తాను అని ప్రభువు తెలియజేస్తున్నాడు. నేను పవిత్రుడను అని జనులు తెలుసుకుంటారు. అది మీ ద్వారానే అని ప్రభువు అంటున్నాడు. పవిత్ర జలమును చల్లి మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను. కాబట్టి ప్రియ విశ్వాసులారా దేవుని పవిత్ర జలంతో మన పాపములను మాలిన్యములను దేవుడు శుద్ధి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పాపాల ద్వారా మనం పవిత్రమైన దేవుని మహా నామమును అపవిత్రం చేస్తున్నాం. దేవుడు మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు. మన తండ్రి పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు మనందరిలో పరిశుద్ధాత్మను అనగా తన ఆత్మను మనలో ఉంచుతాడు.
దేవుడు అంటున్నాడు, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. మనలో చాలా మంది రాతి గుండెను కలిగి ఉన్నాం. మనలో చాలా మందికి దైవ ప్రేమ లేదు, సోదర ప్రేమలేదు, స్వార్ధం, గర్వం, అసూయ అనేవి ఎక్కువైపోతున్నవి. మనుషుల మధ్య బంధాలు కూడా తగ్గిపోతున్నాయి. అందుకే దేవుడంటున్నాడు. మీలో నా ఆత్మను ఉంచి నాఆజ్ఞలను పాటించునట్లు చేయుదును. ఏమిటి దేవుని ఆజ్ఞలు అంటే అవి దైవ ప్రేమ సోదర ప్రేమ మీద ఆధారపడి ఉంటాయి. నీ దేవుణ్ణి ప్రేమించు నీ పొరుగు వానిని ప్రేమించు ఇవే దేవుని ఆజ్ఞల సారాంశం. ప్రియ విశ్వాసులారా మనందరం దేవుని బిడ్డలుగా దేవుని ఆత్మతో నింపబడి పవిత్రులుగా జీవించడానికి ప్రయత్నించుదాం. అప్పుడు మనము దేవుని ప్రజలం అవుతాము. ఆయన మన ప్రభువు అవుతాడు.
ఈనాటి సువిశేష పఠనములో యేసు క్రీస్తు ప్రభువు పరలోక రాజ్యము ఇలా ఉన్నది. అని ఉపమానాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాడు. సిద్ధపరచిన పెండ్లి విందుకు రండి అని ఆహ్వానిస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా దేవుడు పరలోక రాజ్యపు విందునకు మనందరిని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు ఎన్నుకొని ఆహ్వానిస్తున్న, వారు మాత్రం ఆ విందుకు రావడం లేదు. దేవుడు తన సేవకులను పంపి మనందరిని ఆహ్వానిస్తున్నాడు. అనేక సార్లు దేవుడు తన సేవకులను పంపినప్పటికీ చాల మంది ఆ ఆహ్వానాన్ని అర్ధం చేసుకోలేక ఆ విందుకు రాలేకపోతున్నారు. అదేవిధంగా దేవుడు తన సేవకులను ఈనాడు మనందరి దగ్గరకు పంపిస్తున్నాడు. మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఎంతమందిమి సిద్ధంగా ఉన్నాము, ఆ పరలోక రాజ్యపు విందులో పాల్గొనడానికి ఆత్మ పరిశీలన చేసుకుందాం.
పిలువబడినవారు ఆహ్వానాన్ని లక్ష్య పెట్టకుండా, అంటే లెక్క చేయకుండా ఉన్నారు. మరి ఈనాడు నీవు నేను మనందరం దేవుని ఆహ్వానాన్ని స్వీకరించుచున్నామా లేదా ఆలోచించండి. లేదా అయోగ్యులుగా మారిపోతున్నామా? నీకు నాకు వివాహ వస్త్రము లేకపోతే దేవుడు నిన్ను నన్ను చీకటిలోకి త్రోసివేస్తాడు. ఏమిటి వివాహ వస్త్రం అంటే అది మన సిద్ధపాటు, మరియు పవిత్రత. మన జీవితాలలో, మన విశ్వాసపు ప్రయాణంలో ఈ విధమైన సిద్ధపాటు, అవిత్రత లేకపోతే మనం కూడా చీకటిలోనికి త్రోసివేయబడతాం. కాబట్టి విశ్వాసులారా ధ్యానించండి, ఆలోచించండి మనం ఎలా ఉన్నాం. కేవలం పిలువబడిన వారిలా ఉన్నామా లేదా ఎన్నుకొనబడిన వారిలా ఉన్నామా ? ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ప్రార్ధన: పవిత్రుడవైన దేవా, నా పాప జీవితము ద్వారా నీ పవిత్ర నామమును అపవిత్రం చేసి నీకు ద్రోహము చేసి ఉన్నాము. మమ్ము క్షమించండి. ప్రభువా మాలో ఉన్న రాతి గుండెను తొలగించండి. మీ ఆత్మతో మమ్ము నింపండి మాంసపు గుండెను నాకు ప్రసాదించండి. మాకు పవిత్రతను, పవిత్ర జీవితమును జీవించే భాగ్యము మాకు దయచేయండి. మేము ఎన్నుకొనబడిన వారిగా ఉండే భాగ్యం మాకు ప్రసాదించండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి OCD
21, ఆగస్టు 2024, బుధవారం
యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16
యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16
"పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది: ఒక యజమానుడు తన ద్రాక్షతోటలో పని చేయుటకు పని వారలకై ప్రాతః కాలమున బయలు దేరెను. అతడు రోజునకు ఒక దీనారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందం చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు తొమ్మిది గంటల సమయమున బయటకు వెళ్లి అంగడి వీధిలో పని కొరకు వేచియున్న కొందరిని చూచి,'మీరు నా తోటకు వెళ్లి పని చేయుడు. న్యాయముగా రావలసిన వేతనమును ఇచ్చెదను' అనెను. వారు అటులనే వెళ్లిరి. తిరిగి పండ్రెండు గంటలకు మరల మధ్యాహ్నం మూడుగంటలకు ఆ యజమానుడు అట్లే మరి కొందరు పని వారిని పంపెను. రమారమి సాయంకాలము ఐదుగంటల సమయమున వెళ్లి, సంత వీధిలో ఇంకను నిలిచియున్నవారిని చూచి , మీరు ఏల రోజంతయు పని పాటులు లేక ఇచట నిలిచియున్నారు? అని ప్రశ్నించెను. మమ్మెవరు కూలికి పిలువలేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతట ఆ యజమానుడు అటులైన మీరు కూడ నా ద్రాక్ష తోటలో పనిచేయుటకు వెళ్లుడు అనెను. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పని చేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి, తొలుత వచ్చిన వారి వరకు వారివారి కూలినిమ్ము అనెను. అటులనే సాయంత్రం అయిదు గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలకొక దీనారము లభించెను. తొలుత పనిలో ప్రవేశించినవారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి. కాని, వారుకూడ తలకొక దీనారమునే పొందిరి. వారు దానిని తీసుకొని, యజమానునితో 'పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును, చిట్ట చివర ఒక గంట మాత్రమే పనిలో వంగినవారికిని, సమానముగా కూలి నిచ్చితివేమి'? అని గొణుగుచు పలికిరి. అంతట యజమానుడు వారిలో నొకనిని చూచి, మిత్రమా! నేను నీకు అన్యాయము చేయలేదు. దినమునకు ఒక దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసికొనిపొమ్ము. నీకు ఇచ్చినంత కడపటివానికిని ఇచ్చుట నా యిష్టము. నా ధనమును నా యిచ్ఛవచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీ కంటగింపుగానున్నదా?'అని పలికెను. ఇట్లే మొదటివారు కడపటి వారగుదురు. కడపటివారు మొదటివారగుదురురు" అని యేసు పలికెను.
క్రీస్తు నాధుని యందు ప్రియమైన విశ్వాసులారా ఈనాటి మొదట పఠనంలో దేవుడు తన ప్రవక్తను పంపుతూ యిస్రాయేలు కాపరులను ఖండిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజులను ఖండించు అని తన ప్రవక్తను పంపిస్తున్నాడు. మీకు అనర్ధము తప్పదు అని వారికి తెలియజేస్తున్నాడు. ఎందుకు దేవుడు వారిని అంటే కాపరులను, రాజులను ఖండిస్తున్నాడు అంటే కాపరులు మందను వెదకటం లేదు. అంతే కాకుండా వారు తమ కడుపు నింపుకొనుచున్నారే గాని మందను మేపటం లేదు. గొర్రెలను పట్టించుకొనుట లేదు. అందుకు దేవుడు అంటున్నాడు నేను మీ నుండి గొఱ్ఱెలను కాపాడుదును. నేనే నా మందను వెదకెదను. వానిని గూర్చి జాగ్రత్త పడెదను అని తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తున్నాడు.
ప్రియ విశ్వాసులారా ఇక్కడ కాపరులు అంటే దైవ సేవ చేస్తున్న గురువులు, దైవాంకితులు దేవుని చేత ఎన్నుకోనబడి దైవసేవ చేసేవారు అదే విధంగా గొర్రెలు అంటే ప్రజలు దేవుడు గురువులను కాపరులుగా తన మందయినా ప్రజలను మంచి మార్గములో నడిపించమని ఎన్నుకొంటే వారు మాత్రం వారు తమ కడుపు మాత్రమే నింపుకుంటున్నారు. అదే దేవుని ఆవేదన. దైవ ప్రజలను మేపుట లేదు . దేవుని ప్రజలు పాపపు మార్గంలో పడి కొట్టుమిట్టాడుతుంటే వారిని చూసి కూడా పట్టించుకోవడం లేదు. వారు అనేక సమస్యలతో , ఇబ్బందులతో, కష్టాలతో కన్నీళ్లతో గాయపడి ఉన్నప్పుడు వారికి దేవుని వాక్కుతో కట్టు కట్టడం లేదు. ప్రక్కకు తప్పుకొనిన వారు అంటే చేదు అలవాటుల వలన, చేడు క్రియలను, చేడు ఆలోచనల ద్వారా విశ్వాసులు అవిశ్వాసులుగా మారి ప్రక్కకు తప్పుకొని పోతున్నారు. అది చూసి కూడా కాపరులు వారిని తిరిగి మందలోనికి నడిపించలేక పోతున్నారు. అంతేకాకుండా వారి పట్ల కఠినముగా ప్రవర్తించుచున్నారు.
ఇదే ఈనాటి సమాజంలోకూడా జరుగుతుంది. కాపరులు తమ కడుపునింపుకుంటున్నారు. తమకు అప్పగించబడిన విశ్వాసులను అస్సలు పట్టించుకోవండ లేదు. వారిని కని పెట్టుకొని ఉండటం లేదు. వారు తాము మంచి మార్గంలో నడువకుండా మంచి మార్గంలో నడిచే విశ్వాసులను తమ మాటల ద్వారా అసత్యపు బోధల ద్వారా చెల్లా చెదురు చేస్తున్నారు. ఎవరైన చేడు మార్గంలో పోతుంటే వారిని సన్మార్గంలో నడిపించలేకపోతున్నారు. వారి గాయాలను మాన్పకుండా వారు తమ విశ్వాసులను అనేక విధములుగా గాయ పరుస్తున్నారు. విశ్వాసుల పట్ల మృదువుగా ప్రవర్తించడం లేదు. ఇది నిజమా ? కాదా? ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ఈనాటి సువిశేష పఠనములో మనం దేవుని యొక్క ఉదారతను తెలుసుకుంటున్నాం. దేవుడు పరలోక రాజ్యంను ద్రాక్షతోట, కూలీల పోలికలతో వివరించాడు. అనేక సమయాలలో అనేక మందిని దేవుడు తన తోటకు పని నిమిత్తము పంపుతున్నారు. దేవుడు మనందరిని తన రాజ్య విస్తరణకు పనివారిగా ఎన్నుకుంటున్నారు. అందరి పట్ల ఉదారత, సమానత్వాన్ని దేవుడు చూపిస్తున్నారు. దేవునికి అందరు అర్హులే. కడపటి వారు మొదటివారగుదురు, మొదటివారు కడపటి వారగుదురు అంటే అర్ధం ఏమిటంటే మనం ఏ స్థితిలో ఉన్న దేవుడు మనలను దీవించి యోగ్యులును చేస్తాడు, మనం చివరి వారిగా ఉన్న మనలను మొదటి వారీగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి మనం దేవుని రాజ్యాల విస్తారణకై శ్రమించడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని దయను పొందుటకు సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ప్రార్ధన: దేవా మమ్ము అందరిని ఒక కాపరులుగా ఎన్నుకున్నావు. తండ్రిగా, తల్లిగా , బిడ్డగా విశ్వాసిగా మేము కూడా కాపరులుగా జీవించడానికి శక్తిని దయ చేయండి. మాకు అప్పగించిన , మా బిడ్డలను మా కుటుంబాలను , సంఘస్తులను మంచి మార్గంలో నడిపించడానికి శక్తిని దయ చేయండి. మమ్ము మంచి కాపరులుగా మార్చండి. నీవలె ఉదారత కలిగి అందరిని ప్రేమించి జీవించే భాగ్యం దయచేయండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి OCD
19, ఆగస్టు 2024, సోమవారం
యెహెఙ్కేలు 28:1-10, మత్తయి 19:23-30
యెహెఙ్కేలు 28:1-10, మత్తయి 19:23-30
సామాన్యకాలపు 5 వ ఆదివారం
సామాన్యకాలపు 5 వ ఆదివారం యెషయా 6:1-6 1కొరింథీయన్స్ 15:3-8,11 లూకా 5:1-11 క్రీస్తునాదునియందు ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా ...