21, సెప్టెంబర్ 2024, శనివారం

25 వ సామాన్య ఆదివారము

25 వ సామాన్య ఆదివారము

సొలొమోను జ్ఞాన గ్రంధము 2 : 12 , 17 - 20 

యాకోబు 3 : 16 - 4 : 3 

మార్కు 9 : 30 - 37 

క్రిస్తునాధుని యందు ప్రియ సహోదరి సహోదరులారా !


ఈనాడు తల్లి తిరుసభ 25 వ సామాన్య కాలపు ఆదివారములోనికి ప్రవేశిస్తుంది.  ఈనాటి మూడు దివ్యగ్రంధ పట్టణాలు కూడా మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి అని ఆత్మపరిశీలన చేసుకోమని మనలను అందరిని కూడా ఆహ్వానిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే మన యొక్క బుద్ధి ప్రవర్తనలు ఏ విధంగా ఉంటున్నాయి అని మనలను మనము ప్రశ్నించుకోవలసిన సమయము. ఎందుకంటే ఈనాటి సువిశేష పఠనంలో మనము రెండు అంశాలను చూస్తున్నాము. యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు తాను పొందబోయెటువంటి సిలువ మరణమును అటుపిమ్మట జరగబోయే పునరుత్తాన్ని గురించి ప్రభు తన యొక్క శిష్యులకు వివరిస్తూ ఉంటున్నారు. కానీ శిష్యులు మాత్రం మనలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. అంటే ఎవరు ప్రథముడు అని తమలో తాము వాదించుకుంటున్నారు. యేసు పలికిన మాటలను వారు గ్రహించలేక పోతున్నారు.

 ఆ సమయములో యేసు వారికి ఒక గొప్ప ఉదాహరణను చెప్పడానికి ఈ విధంగా వారితో పలుకుతున్నారు. (మార్కు 9 : 37 ) "ఇట్టి చిన్నబిడ్డలలో ఒకనిని స్వీకరించువాడు నన్నును స్వీకరించు వాడు అగును. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు"అని ప్రభువు పలుకుతున్నాడు. తమలో తం,యూ ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నవారికి ఒక గుణపాఠాన్ని ఒక చిన్న బిడ్డ ద్వారా వారికీ విశిదీకరిస్తున్నారు. అంటే చిన్న బిడ్డలు ఏ విధంగా అయితే ఒకరి పై ఆధారపడి జీవిస్తారో, నిర్మల మనసు కలిగి ఉంటారో, చెప్పిన మాటకు విధేయులై ఉంటారో, అలాగా మీరును మరీనా తప్ప మీలో ఎవడును  గొప్పవాడు కాదు అని ప్రభు వారికి తెలియచేస్తున్నారు. ఆ చిన్న బిడ్డలవలె మనము జీవించాలి అంటే మనము ఎం చేయాలి అంటే మన యొక్క జీవిత విధానాన్ని మనము మార్చుకోవాలి. ఎపుడు కూడా దుస్తుల వాలే కాకుండా నీతిమంతులుగా మనయొక్క జీవితాన్ని మనము గడపాలి. యేసు ప్రభువు తన యొక్క జీవితము ద్వారా మనకు మనము ఏ విధంగా జీవించాలి అని మనకు నేర్పిస్తూ ఉన్నారు. 

ఈనాటి మొదటి పఠనంలో మనము చూస్తున్నాము.యేసు ప్రభు తన యొక్క సిలువ మరణాన్ని గురించి సంబందించిన విషయములను మనము చూస్తున్నాము. సో. జ్ఞాన  2 : 18 -20  వచనాలలో మనము చూస్తున్నాము. క్రూరముగా అవమానింతుము, హింసింతుము, పరీక్షకు గురిచేయుదము, ఇతని సహన భావమెంత గొప్పదో పర్రెక్షించి చూతము అని యేసును గూర్చిన పలుకులను మనము చూస్తున్నాము. యేసు ప్రభు తనయొక్క సిలువ మరణము పొందెబోయే ముందు ఈ విధముగా అనేకమైన అవమానాలు, హింసలు, నిందలు పొందియున్నారు. కానీ చివరిగా యేసు పలికినటువంటి పలుకులు (లూకా 23 : 34 ) "తండ్రి వీరు ఏమిచేయుచున్నారో వీరికి తెలియడంలేదు, వీరిని క్షమించుము" అని వారిని క్షమించి వారికై ప్రార్ధన చేస్తున్నారు. మనము కుడి మన యొక్క జీవితంలో ఎపుడు కూడా  ఒకరి పట్ల కఠినంగా కాకుండా ప్రేమ కలిగి జీవించాలి అని ప్రభు తన యొక్క జీవితం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. 


ఒక మానవునిగా మన జీవితంలో అనేకమైన అవసరాలను మనము ఎదుర్కొంటు ఉంటాము. వాటిని మనము చేరుకోవాలి అంటే అనేకమైనటువంటి మార్గాలగుండా ప్రయాణిస్తాము. అది మంచిమార్గమే కానీ చెడు మార్గమే కానీ.   ఈనాటి రెండొవ పఠనంలో మనము చూస్తున్నాము మానవుల మధ్య కలహాలు అనేవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి? వాటికి గల కారణము ఎవరు? అసలు మనము చేయవలసిన పని ఏంటీ అని చూస్తున్నాము. యాకోబు 4:1 వచనంలో చూస్తున్నాము. మానవుల మధ్య అనేకమైనటువంటి భేదములు ఎలా పుడుతున్నాయి అంటే అది కేవలము మనలో ఉన్నటువంటి వ్యామోహములనుండి. అనేకమైనటువంటి కోరికలు, ఆశలు, ఆశయాలు ఉండడం ద్వారా వాటిని పరిపూర్తి చేసుకోవడానికి మన పొరుగువానికి హాని తలపెట్టడానికి కూడా మనము వెనుదిరగడంలేదు. అనేకమైన యుద్ధములు చేస్తున్నాం కానీ మనము చేయవలసిన పని మాత్రం చేయడంలేదు. ఏంటి అంటే మనకు కావలసిన వాటికోడం దేవునికి ప్రార్ధించడం లేదు. యాకోబు 4 : 2 -3  వచనాలలో మనము వింటున్నాం, మీరు కావలసినవి మీరు పొందలేక పోతున్నారు అంటే మీరు దేవునితో ఐక్యమై జీవించటంలేదు అని.  మనయొక్క జీవితంలో మనకు కావలసిన వాటిని కానీ కావలసిన వారిని గని మనము సంపాదించుకోవాలి అంటే అది కేవలము దేవునితో ఐక్యమై జీవించడం ద్వారా మాత్రమే అని  నంటే నీతిమంతమైన మార్గమున ఒక నీతిమంతునిగా మెలగడం ద్వారా జరుగుతున్నది. 

నీతిమంతుని యొక్క లక్షణాలను మనము చూస్తున్నాం. స్నాతి ప్రథముడిగా ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి, మృదుమనసు కలిగి ఉండాలి. అంటే ఒక మాటలో చేపల అంటే క్రీస్తు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా మనము కుడి ఉండాలి. కానీ మనము ఏ విధంగా ఉంటున్నాం? విభుంనమైనటువంటి స్వభావము కలిగి ఉంటున్నాం.సువిశేష పఠనంలో మనము చూస్తున్నాం. క్రీస్తు తరువాత తాను స్థాపించబోయే రాజ్యాన్ని తన శిష్యులు కొనసాగించాలి అన్న ఉదేశ్యముతో వారికి తనను గురించి తాను చెప్పుకుంటూ ఉంటే శిష్యులు మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. వారిలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. యేసును అర్ధంచేసుకోలేక ఉంటున్నారు.    

మరి మనము మన యొక్క జీవితంలో యేసును అర్ధం చేసుకొని జీవిస్తున్నామా ? తండ్రి దేవుని యొక్క ఆలోచనలను మనం అర్ధం చేసుకోవాలి అంటే ముందుగా మనము ఎం చేయాలి అంటే మనలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని తొలగించుకొని అందరితో కలిసి ఏకత్వంగ జీవించాలి. అందరికి భిన్నంగా ఉన్నట్లయితే మన జీవితంలో మనమే కలహాలు సృష్టించుకున్నవాళ్ళం అవుతాం. అలా కాకుండా అందరితో కలిసి ఉన్నట్లయితే మనము దేవుని చేరగలుగుతాం. తనయొక్క శిష్యులు ఆయనతో కలిసి ఉన్నప్పటికీ ఆయనను అర్ధం చేసుకొనలేకపోయారు. ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానం యేసుయొక్క ఆలోచనలకూ అతీతంగా ఉంటూ ఉన్నాయి. మనము కూడా కొన్నిసార్లు ఈ విధంగా దేవుని యొక్క ఆలోచనలకూ విభిన్నంగా ప్రవర్థిస్తూఉంటాం. కారణము  విధేయత లేకపోవడం. కాబట్టి మనము దేవునితో కలిసి జీవించాలి అంటే విధేయత కలిగి జీవించాలి. చిన్న బిడ్డల వాలే మారు మనసు కలిగి ఉండాలి.



ఎడిత్ స్టెయిన్ కార్మెల్ భవన్

జానంపేట 

 బ్రదర్. పవన్ కుమార్ ఓ. సి. 

25వ సామాన్య ఆదివారం

25వ సామాన్య ఆదివారం 
సొలోమోను జ్ఞాన గ్రంధం 2:12,17-20, యాకోబు 3:16-4:3, మార్కు 9:30-37

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మానవుని యొక్క అత్యాశ, అసూయ, స్వార్థం మరియు దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరు అనేటటువంటి అంశములను గురించి బోధిస్తున్నారు. చాలా సందర్భాలలో వ్యక్తులు కీర్తి ప్రతిష్టల కొరకై ప్రాకులాడుచుంటారు, ధనాశ కలిగి జీవిస్తుంటారు. స్వార్థానికి, స్వలాభానికి ప్రాముఖ్యతనిస్తూ అనేక రకాలైన అక్రమ మార్గాలను అనుసరిస్తుంటారు. మానవుల యొక్క అత్యాశ ప్రమాదకరమైనది దాని వలన చాలామంది ప్రాణాలను, బంధువులను, స్నేహితులను కోల్పోతూ జీవిస్తుంటారు.
ఈనాటి మొదటి పఠణంలో నీతిమంతుడు అనుభవించేటటువంటి బాధలను గురించి తెలియచేయబడినది. కొందరు వ్యక్తులు (చెడును ప్రేమించేటటువంటివారు) ఒక నీతిమంతుని యొక్క పీడను వదిలించుకోవడానికి, ఆయన కొరకై ఉచ్చులు పన్నుచున్నారు. ఎందుకనగా ఆయన వారితప్పిదములను వేలెత్తి చూపారు. వారు ధర్మశాస్త్రమును, పూర్వుల సాంప్రదాయమును పాటించట్లేదని తెలిపాడు  అందుకే ఏ విధంగానైనా ఆయన్ను నాశనం చేయాలనుకున్నారు. ఇది ప్రతి ఒక్కరిలో జరిగేటటువంటి సంఘటన ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇతరులను సరి చేయుటకు ప్రయత్నిస్తూ ఉంటామో, వారి అధర్మాన్ని ఖండిస్తామో అప్పుడు వారు మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. 
ఇర్మియ ప్రవక్త ఇశ్రాయేలీయులకు దేవుని హెచ్చరికలు తెలియజేసినప్పుడు అప్పటి ప్రజలు ఇర్మియా ప్రవక్తను ఎలాగైనా తుద ముట్టించాలని భావించారు. బప్తిస్మ యోహాను, హేరోదు రాజు, హెరోదియాలను హెచ్చరించినప్పుడు వారికి అది నచ్చలేదు అందుకని హెరోదియా, బప్తిస్మ యోహాను యొక్క తలను బహుమతిగా కోరింది. మనం కూడా ఎవరినైనా సరిచేయాలి అని భావించి ఇతరులకు వారి తప్పిదములు తెలియచేసిన అందరూ దానిని సహృదయంతో తీసుకోరు దానికి ప్రతిఫలంగా మనకి వ్యతిరేకంగా ఉంటారు. ఈనాటి మొదటి పఠణంలో కూడా కొంతమంది వ్యక్తులు నీతిమంతుని యొక్క జీవితము నచ్చక అతడిని శిక్షించాలని భావించారు. దేవుడు అతడిని కాపాడతారా? లేదా? అని కూడా ఎదురుచూస్తున్నారు. నిజమైన సేవకుడు ఈ నీతిమంతుడు. అతడు అధర్మాన్ని ఖండిస్తూ ప్రజలకు న్యాయాన్ని చేకూరుస్తూ వారి సేవకై అనేక విధాలుగా పాటుపడ్డాడు. 
మనం కూడా ఈ సేవకుని వలె మంచి జరిగినా,లేదా చెడు జరిగిన ఎదుటివారి యొక్క ఆ ధర్మాన్ని ఖండించుటకు సిద్ధంగా ఉండాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత యాకోబు గారు స్వార్ధమును, అసూయలను విడిచివేయాలని తెలుపుచున్నారు. స్వార్థము, అసూయలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సర్వ విధముల నీచ కార్యములు జరుగును అని తెలిపారు. అసూయవలనే కయినూ తన యొక్క సోదరుడిని చంపేశాడు. స్వార్థం వలననే సౌలు దేవుడి మాటను పెడచెవిన పెట్టాడు. మనందరం దివ్యమైన వివేకముతో నింపబడినప్పుడు శాంతితో- సమాధానముతో కనికర హృదయముతో జీవించుతాం. ఎటువంటి పక్షపాతమును చూపించము.
ఈనాటి సువిశేష భాగములో శిష్యులు తమలో తాము ఎవరు గొప్పవారు అని వాదించు కొంటున్నారు. ఏసుప్రభు శత్రువులను జయించి యూదా ప్రజలకు స్వాతంత్రాన్ని సంపాదించి,శాంతి సంపదలతో తలతూగే ఒక రాజ్యమును భూలోకంలో స్థాపించబోతున్నారు కాబట్టి ఆయన యొక్క రాజ్యములో ఈ పనిని ఇద్దరు శిష్యులు ఎవరు ప్రథమ స్థానాన్ని అధిష్టించి అధికారాన్ని చలాయించవచ్చని దాని కొరకు శిష్యులు ఒకరిని ఒకరు వాదించుకుంటున్నారు. పేతురు నేనే గొప్పవాడని భావించి ఉండవచ్చు ఎందుకంటే ఏసుప్రభు ఆయన మీద తన సంఘమును నిర్మిస్తానన్నారు కాబట్టి. యోహాను కూడా గొప్పవాడని భావించి ఉండవచ్చు ఎందుకంటే ఏసుప్రభు శిష్యులలో మిక్కిలిగా ప్రేమింపబడినటువంటి వ్యక్తి. 
ఫిలిప్పు కూడా గొప్పవాడని భావించి ఉండవచ్చు ఎందుకంటే నిర్జన ప్రదేశంలో అద్భుతం చేయుటకు ప్రభువు ఫిలిప్పుని మొదట అడిగారు కాబట్టి.
యూదా ఇస్కారియాతో గొప్పవాడని భావించి ఉండొచ్చు ఎందుకంటే ఆయన దగ్గరే ధనము ఉన్నది కాబట్టి. 
ఈ విధముగా శిష్యులలో ఒకరితో ఒకరు తమలో తాము ఎవరు గొప్పవారని వాదించు కొనుచుండగా ప్రభువు గొప్పవాడు కాదల్చినవాడు అందరిలో చివరివాడై, సేవకుడిగా ఉండాలి అని తెలుపుచున్నారు. ప్రభు ఈ విధంగా అంటున్నారు" నేను మీ వద్దకు సేవకునిగానే వచ్చి ఉన్నాను" (లూకా 22:26-27). తన శిష్యులు కూడా తన వలే సేవకు రూపం దాల్చాలని ప్రభువు భావించారు. ఎవడు మొదటి వాడు కావాలనుకుంటున్నాడో వాడు అందరిలో చివరివాడై అందరికీ సేవకుడిగా ఉండాలి అని అన్నారు (మార్కు 9:35). మనం సేవకులుగా మారాలంటే ముందుగా మనలో ఉన్న స్వార్ధాన్ని-గర్వాన్ని చంపుకోవాలి. వినయము అనే సుగుణమును మనలో అలవర్చుకొని జీవించాలి అందుకనే ఏసుప్రభు గొప్పవాడు కాదల్చినవాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడిగా మారాలని పలుకుచు ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి, ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరు స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అని అనెను.
చిన్న బిడ్డను స్వీకరించుట అనగా ఆ చిన్న బిడ్డలలో ఉన్నటువంటి లక్షణములను మనము కలిగి జీవించుట. చిన్న బిడ్డలకు అధికార వ్యామోహం ఉండదు. వారికి సమాజంలో పలుకుబడి ఉండదు. పేరు ప్రఖ్యాతులకు ఎక్కువ ఆసక్తి చూపరు. వారు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరితో కలిసిమెలిసి కల్మషం లేని వ్యక్తులుగా జీవిస్తారు అదేవిధంగా వారు ప్రతినిత్యం సహాయం కొరకు వేరే వారి మీద ఆధారపడి ఉంటారు. చిన్న బిడ్డలకు ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు వారిని అంతగా పట్టించుకోరు. ఈ చిన్న బిడ్డల వలె శిష్యులు ఎటువంటి అధికార ఆశావ్యామోహం లేకుండా తమ్ము తాము తగ్గించుకొని అందరికీ సేవ చేయాలి అన్నది ప్రభువు యొక్క కోరిక. ధనం ఉంటే గొప్పవారు కారు, పేరు ప్రఖ్యాతలు ఉంటే గొప్పవారు కారు కానీ దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరంటే ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తారో, వినయము కలిగి జీవిస్తారో, సేవా దృక్పథంతో జీవిస్తారో వారి. క్రీస్తు ప్రభువు ఈ లోకంలో మనందరికీ ఒక సుమాతృకను చూపించారు ఆయన గొప్పవాడైనప్పటికిని, సేవకుని వలె మన మధ్య  వినయంతో అందరితో కలిసి మెలిసి జీవించారు. మనం కూడా మనలో స్వార్థం విడిచి ఏసుప్రభు వలే ఇతరులకు సహాయం చేస్తూ ప్రేమను పంచుతూ జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనందరం ఎటువంటి అత్యాశకు గురికాకుండా ఉండాలి. దేవుని దృష్టిలో గొప్ప వారిగా జీవించటానికి ప్రతినిత్యము వినయము, సేవ, ప్రేమ కలిగి జీవించడానికి ప్రయత్నించాలి
Fr. Bala Yesu OCD

20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

25 వ సామాన్య ఆదివారము

25 వ సామాన్య ఆదివారము 

సొలొమోను జ్ఞాన గ్రంధము 2:17-20, 
యాకోబు 3:16-18, 4:1-3
మార్కు 9:30-37

క్రీస్తునాధుని యందు ప్రియ సహోదరీ సహోదరులారా ఈనాటి మూడు పఠణాలను గ్రహించినట్లయితే మూడు పఠణాలు కూడా మనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక బోధనలు లేదా అంశాలను ఇస్తున్నాయి.  అదేమిటంటే ధర్మంతో నిలబడటం నిజమైనటువంటి జ్ఞానాన్ని మరియు శాంతిని సూచించటం, అంతే కాకుండా దేవుని సేవ చేయడంలో నిజమైన గొప్పతనం ఏమిటో మనకందరికి కూడా క్లుప్తంగా వివరిస్తున్నాయి.
 ముందుగా మొదటి పఠణాని మనం గ్రహించినట్లయితే సొలోమోను జ్ఞాన గ్రంథము రెండవ అధ్యాయము 17 నుండి 20 వచనాలనలలో ధర్మాత్మునిపై లేదా పుణ్యాత్ములపై దుర్మార్గులు చేసేటువంటి కుట్రలు మరియు వారి వంకర బుద్ధులను చూపిస్తున్నాయి. వారు నిజమైన ధర్మాన్ని ద్వేషించటమే కాకుండా, ధర్మాన్ని పాటించే వారిని కూడా ఎగతాళి చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని దూషించడమే కాకుండా దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచే వారందరిని కూడా వారు అవమాన పరుస్తున్నారు. ఇక్కడ ధర్మంతో కూడిన వ్యక్తిని మరియు అతని యొక్క నిజాయితీని కూడా పరీక్షించాలని పన్నాగం పొందుతున్నారు.
అంతేకాకుండా వారు మంచిగా జీవించే వ్యక్తులను,  వారి విశ్వాసాన్ని, వారికి దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకానికి వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే మంచివారిని నాశనం చేయాలని, దేవుని దూషించాలని చూస్తుంటారో వారందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడని మరియు మంచివాని పట్ల దేవుని దయ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ, దేవునికి దగ్గరగా నివసించే వారికి ఎప్పుడు కష్టాలు, బాధలు మరియు అవమానాలు వస్తూనే ఉంటాయి. అటువంటి సమయాలలో మంచివారు దేవునికి దగ్గరగా జీవించినట్లయితే కచ్చితంగా దేవుని చేత దీవించబడతాడు అని మొదటి పఠనం మనకు అందరికీ కూడా తెలియజేస్తుంది. మరి రెండవ పఠనని చూసినట్లయితే యాకోబు రాసినటువంటి లేక మూడవ అధ్యయం ముఖ్యంగా 16 వ వచనంలో చూస్తున్నాము. ఎక్కడైతే ఈర్ష మరియు స్వార్థం ఉంటుందో అక్కడ ఎప్పుడూ అల్లకల్లోలం ఉంటుంది.  అంతేకాకుండా చెడు పనులు,  చెడు వ్యసనాలు  ఉంటాయి, కానీ యాకోబు గారు ఏమి చెబుతున్నారంటే మనకు ఉండవలసినటువంటి మంచి జ్ఞానాన్ని గురించి వివరిస్తున్నాడు. దేవుని నుండి వచ్చే జ్ఞానం ఎంతో స్వచ్ఛమైనది ఎందుకంటే అది శాంతిని మరియు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇది క్రైస్తవుల మైనటువంటి మనకందరికీ కూడా ఒక గొప్ప గుణపాటాన్ని నేర్పిస్తుంది. ఎందుకంటే నిజమైన జ్ఞానం అనేది స్వార్థం, ఈర్ష మరియు అసంతృప్తితో కూడింది కాదు, కానీ జ్ఞానం అనేది ఎప్పుడు ఇతరుల మేలు కోరుకునేది. అంతేకాకుండా, ఎప్పుడు ఒకరికి మేలు చేసేదే కానీ కీడు చేసేది కాదు అని పునిత యాకోబు గారు మనకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. చివరిగా విశేష పఠణని గమనించినట్లయితే, ఏసుప్రభు శిష్యుల మధ్య వచ్చినటువంటి గొప్పతనం యొక్క చర్చల గురించి తెలియజేస్తుంది. గొప్పతనం అంటే మన గురించి మనం గొప్పలు చెప్పుకోవటం కాదు,  కానీ నేటి సమాజంలో మనం చూస్తూనము. మనం ఏదైనా ఒక చిన్న మంచి పని చేస్తే దాని పదిమంది దగ్గర గొప్పలు చెప్పుకుంటమో, అదేవిధంగా ఈనాడు శిష్యులు కూడా వారిలో వారు నేను గొప్పవాడిని నేను గొప్ప వాడిని అని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు, వారి మాటలను ఆలకించినటువంటి క్రీస్తు ప్రభువు వారితో ఈ విధంగా అంటున్నారు. ఒక చిన్న పిల్లవాని ఉదాహరణగా తీసుకొని అంటున్నాడు, మీలో ఎవరైనా గొప్పవాడు కాదల్చిన  వాడు ముందుగా సేవకుని వలే జీవించాలని, ఎప్పుడైతే నీవు సేవకుని వాలే జీవిస్తావో అప్పుడే నీవు గొప్పవాడిగా పరిగణింప పడతావని క్రీస్తు ప్రభు అంటున్నారు. ఎందుకు ఏసుప్రభువు ఈ విధంగా అంటున్నారు అంటే గొప్పతనం అనేది ఏమిటంటే కేవలం సేవ చేయటం. మరి ఈ సేవ చేయాలంటే మనలను మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే అలా మనలని మనం తగ్గించుకొని జీవించగలుగుతామో అప్పుడే మనం దేవుని చేత ఆశీర్వదించబడి గొప్పవాడిగా పరిగణింపబడతామని క్రీస్తు ప్రభువు సువిశేష పఠనంలో సెలవిస్తున్నాడు. 
కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా మన జీవితాలలో కూడా అనేకసార్లు తప్పుడు మార్గాలలో ప్రయాణించి, తప్పుడు ఆలోచనలతో జీవించి, నేనే గొప్పవాని అని బ్రతుకుతుంటాము, అటువంటి వారందరికీ కూడా ఈనాటి మూడు పఠణాలు ఒక గొప్ప గుణపాటాని నేర్పిస్తున్నాయి. కాబట్టి ఇప్పటినుండి దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని, ఎప్పుడు మంచినే ఎంచుకుంటూ ఉండాలని ఈ దివ్య బలి పూజలో భక్తి విశ్వాసాలతోటి ప్రార్థించుకుందాం.  ఆమెన్.

ఫా. జ్వాహాన్నెస్ OCD

14, సెప్టెంబర్ 2024, శనివారం

24 సామాన్య ఆదివారం


యెషయా 50: 4-9, యాకోబు 2:14-18, మార్కు 8: 27-35

ఈనాటి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క సేవకుల/ శిష్యుల జీవితం గురించి తెలుపుచున్నది. ప్రభువు యొక్క శిష్యులు ఏ విధంగా ఉండాలి అన్నది ప్రధానమైన అంశం. ఈనాటి మొదటి పఠణంలో యెషయా ప్రవక్త బాథామయ సేవకుని గురించి తెలియజేస్తున్నారు. ఈ యొక్క సేవకుని యొక్క గీతము ముఖ్యంగా మూడు అంశాలు చూస్తున్నాం. మొదటిగా దేవుడు సేవకుని ఎన్నుకొనుట. 
రెండవదిగా సేవకుడు తన యొక్క జీవితమును సేవ కొరకు త్యాగం చేయుట.
మూడవదిగా, ఏ విధముగా దేవుడు తనను ఆపదల నుండి కాపాడతారు అంశమును తెలుపుచున్నారు. తండ్రి తన సేవకుని ఎన్నుకొని, బోధించుటకు  కావలసినటువంటి అనుగ్రహమును దయ చేస్తున్నారు. ఈ యొక్క సేవకుడు తన యొక్క పరిచర్య జీవితంలో అనేక రకములైనటువంటి నిందలు భరించవలసి ఉంటుంది అయినప్పటికీ వాటిని ధైర్యంతో దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతూ భరించారు. అన్యాయంగా ఆయనను బాధించినప్పటికీ, నేరము మోపినప్పటికీ ఆయన మాత్రం అన్నిటినీ మౌనంగా భరించారు ఎందుకనగా చివరి రోజును తన తరపున దేవుడు పోరాడుతారు అని నమ్మకం. ఈ సేవకుని గీతం ఏసుప్రభు యొక్క జీవితమునకు అక్షరాల వర్తిస్తుంది. మెస్సయ్య కొరకే ఈ యొక్క గీతము రాయబడి ఉన్నది. ఏసుక్రీస్తు ప్రభువు ఏ విధముగా శ్రమలను అనుభవించి మరణించబోతున్నారో, ఆయన పరిచర్య ఎలా సాగినదో, ఎలాగ తండ్రి మీద ఆధారపడ్డారో అంతయు కూడా ఈ గీతం ద్వారా అర్థమవుచున్నది.
ఈ మొదటి పఠణం ద్వారా మనం గ్రహించవలసిన సత్యము ఏమిటంటే.బాదామయ సేవకుడు ఏ విధముగానయితే తాను తన యొక్క బాధ్యతను నెరవేరుస్తూ తన ప్రాణములను త్యాగం చేశారో మరియు దేవుడు తనకు సహాయం చేస్తారని నమ్మకం ఉంచారు. మనం కూడా అదే విధంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత యాకోబు గారు దేవుని ప్రజల యొక్క జీవితం ఏ విధంగా ఉండాలో తెలిపారు అదేంటంటే విశ్వాసము దానికి తగినటువంటి క్రియలు రెండు కూడా క్రైస్తవుల యొక్క జీవితంలో ఉండాలి.  కేవలము విశ్వాసం మాత్రమే కాదు కలిగి ఉండవలసినది, విశ్వాసముతో పాటు క్రియలు కూడా ఉండాలి. అబ్రహాము ఏ విధముగానయితే విశ్వాసము కలిగి తన యొక్క విశ్వాసానికి తగినటువంటి క్రియలను ప్రదర్శించి ఉన్నారో అదేవిధంగా ఎవరైతే దేవుడిని అనుసరిస్తున్నాం అని చెప్పుకుంటున్నారో వారందరూ కూడా విశ్వాసానికి తగినటువంటి క్రియలు కలిగి ఉండాలి అప్పుడే మన క్రైస్తవ జీవితమనేది యదార్థం అవుతున్నది. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు అన్యుల యొక్క ప్రాంతంలో (కైసరియా ఫిలిప్పి) తాను ఎవరు అనే అంశమును గురించి ప్రజలు తెలుసుకున్నారా? లేదా అని ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకొనుట నిమిత్తమై ఏసుప్రభు ఈప్రశ్న అడుగుతున్నారు. 
ఈ సువిశేష భాగములో ఏసుప్రభు  ప్రశ్నను రెండు విధాలుగా అడగటం చూస్తున్నాం.
మొదటి ప్రశ్న ఏసుప్రభు తన శిష్యులు తన గురించి ఏమని అనుకుంటున్నారు అడుగుచున్నారు. 
రెండవ ప్రశ్న ఏసుప్రభు ప్రజలు తన గురించి ఏమని భావిస్తున్నారు అని అడిగారు.మొదటి ప్రశ్నకు సమాధానం యేసు ప్రభువును గూర్చి కొందరు బాప్తిస్మ యోహానని, కొందరు ఏలియా అని మరికొందరు ప్రవక్తలలో ఒకరిని భావించారు. ఎందుకంటే ఏసుప్రభు యొక్క పరిచర్య జీవితం ప్రజలలో ఒక నూతన అనుభూతిని కలిగించినది. ఆయన సత్యమును ప్రకటించారు, అన్యాయమును ఎదిరించారు, పేదల తరుపున పోరాడారు, మరణించిన వారిని జీవంతో లేపారు అందుకని ప్రజలు ప్రభువును గురించి ఒక్కొక్క భిన్న అభిప్రాయమును కలిగి ఉన్నారు. అదే ప్రశ్న తన శిష్యులను అడగగా పేతురు గారు మాత్రము నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు అని సాక్ష్యం ఇచ్చారు. ఇది సాక్షాత్తు దేవుడై తనకు ఎరుక పరిచారు. అదేవిధంగా పేతురు గారికి యేసుప్రభుతో ఉన్నటువంటి అనుభవమును బట్టి, ఆయన చూసిన కార్యములుబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయము ప్రభువునకు తెలియజేశారు. ఈరోజు మనందరం కూడా ధ్యానించవలసినటువంటి అంశం ఏమిటంటే యేసు ప్రభువు గురించి మనకు ఎలాంటి అభిప్రాయం ఉన్నది. ఆయనను మెస్సయ్యగా అంగీకరిస్తున్నామా. మన రక్షకునిగా తెలుసుకుంటున్నామా. ఆయన మన దేవుడు అని, ఆయన చూపించినటువంటి బాటలో మనం నడుస్తూ ఉన్నామా?. ఏసుప్రభువుని వెంబడించేటటువంటి శిష్యులకు ఉండవలసినటువంటి మూడు ప్రధానమైనటువంటి లక్షణములు గురించి ప్రభువు తెలుపుచున్నారు. నన్ను అనుసరింప గోరువాడు తనను తాను పరిత్యజించుకొని, సిలువను ఎత్తుకొని, అనుసరించవలెను అని ప్రభువు పలికారు. మొట్టమొదటిగా ప్రభువుని అనుసరించేటటువంటి పరిత్యజించుకొనే మనసు కలిగి ఉండాలి అనగా ప్రభువు కొరకు దేనినైనా విడిచి పెట్టే మనసు ఉండాలి. అదేవిధంగా సిలువ ఎత్తుకొని అనుసరించమని తెలిపారు అనగా బాధలను కష్టాలను ప్రేమతో చేకుని అనుసరించాలి. ప్రభువును వెంబడించుట అనగా ఆయన బోధన ప్రకారము జీవించుట ఆయన నడిచిన మార్గంలో నడుచుట. మన యొక్క విశ్వాస జీవితంలో ప్రభువుని ఆధ్యాత్మికంగా తెలుసుకొని ఆయనకు సాక్షులుగా జీవించాలి ఆయన ఒక బాటలో నడవాలి. ప్రభు యొక్క సేవా జీవితంలో ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే మన యొక్క విశ్వాసము క్రియలు ఒకే విధంగా ఉంటాయి

Fr. Bala Yesu OCD

24 వ సామాన్య ఆదివారము

24 వ సామాన్య ఆదివారము

యెషయా 50 : 5 - 9 
యాకోబు 2 : 14 - 18 
మార్కు 8 : 27 - 35
క్రిస్తునాధుని యందు ప్రియా సహోదరి సహోదరులారా ! 
ఈనాడు తల్లి తిరుసభ 24 వ సామాన్య ఆదివారమును కొనియాడుచియున్నది. ఈనాటి మూడు దివ్య గ్రంథ పఠణములు యేసు మార్గమే మన మార్గము అనే అంశమును ధ్యానించమని తల్లి తిరుసభ మనలను అందరిని ఆహ్వానిస్తుంది. ఈనాటి సువిశేష పఠనములో యేసు ప్రభు మూడు విషయాలను తెలియపరుస్తూ, ధ్యానించమని మనలని అందరిని కూడా ఆహ్వానిస్తున్నారు. 
1 . బాధలు
2 . మరణం
  3 . పునరుత్ధానం

బాధలు రెండు రకములు. “మొదటిగా మనిషి కొనితెచ్చుకొనేవి”.  ఏ విధంగా అంటే దేవునికి అవియధేయతగ ప్రవర్తించటం ద్వారా, లేక పాప మార్గములో నడవడం వలన బాధలు కష్టాలు వ్యాధులు మన జీవితంలోనికి వస్తాయి. మనకు పరిశుద్ధ గ్రంధములో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఎవరైతే దేవునికి ఎదురు సమాధానం చెప్పడం ద్వార వారికి బాధలు కష్టాల లోనికి నెట్టబడతారు.   (సంఖ్య 12) లో మిరియం, మోషే, అహరోనులు సోదరి. ఆమె ఏరికోరి వ్యాధిని కొనితెచ్చుకున్నది. ఒకరోజు మిరియం తన సోదరులు దేవునితో సంభాషించడం చూచి, తాను మనసులో గొణుగుకొవడం మొదలుపెట్టింది. ఇది గ్రహించిన యావె దేవుడు తనకు బుద్ధి చెప్పడానికి తనకు భయంకరమైనటువంటి కుస్తీ రోగాన్ని తనకు ఇస్తూ ఉన్నాడు. ఇదే కదా ఏరికోరి జీవితంలో కష్టాలను కొని తెచ్చుకోవడం అంటే?
 రెండొవదిగా “దేవుడు ఒసగిన కష్టాలు”. దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయడానికి దేవుడు ఒసగిన కష్టాలు. యేసు ప్రభువు తన యొక్క జీవితంలో కష్టాలను బాధలను యావె దేవుడు ఇచ్చాడు. దేనికోసం అంటే మనందరికీ రక్షణ తీసుకొని రావడంకోసం. క్రైస్తవ జీవితంలో ఎదుర్కొనే కష్టాలు వ్యక్తి గతమైన కష్టాలు కావు, కానీ పరోపకారమైన కష్టము. ఎందుకు అంటే మన కష్టాలు ఇతరులకు జీవమును ఇచ్చే విధంగా ఉంటుంది కాబట్టి క్రైస్తవ బాధలు అనేవి పరోపకారమైన ఇబ్బందులు. యేసు ప్రభువు బాధలు కష్టాలు గురించి కొత్త అర్ధాన్ని ఇస్తున్నారు. ఏ విధంగా అంటే యేసు ప్రభు జన్మించక ముందు వరకు బాధలు కష్టాలు ప్రజల జీవితంలో మనం చేసిన పాపాలకి లేదా మన తల్లిదండ్రుల చేసిన పాపాలకి మనం ఈ బాధలను మన జీవితంలో వస్తాయని ఇశ్రాయేలు ప్రజలు నమ్మేవారు. కానీ యేసు ప్రభు బాధలకు కష్టాలకు కొత్త అర్ధాన్ని ఇచ్చాడు.ఈ కొత్త అర్ధం, మనకు అర్ధం కావాలంటే (యోహాను 9 :1 - 3) లో మనము చూస్తున్నాం. పుట్టి గ్రుడ్డివానికి దృష్టిదానం. అపుడు శిష్యులు ఈ విధంగా అడుగుతున్నారు, బోధకుడా ! వీడు గ్రుడ్డివాముగా పుట్టుటకు ఎవడు చేసిన పాపము? వీడా? వీని తల్లిదండ్రుల? అని యేసుని అడిగిరి. అందుకు యేసు వీడు కానీ వేడు తల్లిదండ్రులుగానీ పాపము చేయలేదు. దేవుని యొక్క కార్యము వీనియందు భయాలుపడుటకై వీడు గ్రుడ్డివానిగా పుట్టెను. యేసు దీనికి ఇచ్చిన అర్ధం ఏమిటంటే బాధలు కష్టాలు మానవుని జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే. వాటిని మానవుడు విశ్వాసం ద్వారా స్వీకరించాలి. 

మరణం.
యేసు ప్రభు సువిశేష పఠనములో మరణము గురించి ప్రస్తావించారు. మనిషిని మనం రెండు విధాలుగా చంపవచ్చు
శారీరకంగా 
మానసికంగా.
శారీరకంగా అంటే పొడచుట , నరుకుట, విషప్రయోగం   మరియు పలువిధములుగా మనిషిని చంపవచ్చు. రెండొవదిగా మానసికంగా మన మాటలద్వారా క్రియలద్వారా మనిషిని చంపవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే మనిషిని బ్రతికి ఉండగానే చంపేయడం. 
మానసికంగా  ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో శారీరక మరణానికి ముందు మానసికంగా పలువిధాలుగా మరనిస్తున్నాడు. . 
1 . ప్రత్యక్షంగా పొగుడుతూ పరోక్షంగా కించ పరిచేటువంటి క్రియల ద్వారా. 
2 . ఓక వ్యక్తి దగ్గర మేలులు పొంది, అతని నాశనము కోరుట ద్వారా 
3 . ఓక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకొని  అతనికి వ్యతిరేకముగా చేయుటద్వారా 
4 . నమ్మించి మోసము చేయుట ద్వారా 
ఇటువంటి పనుల ద్వార మనము మానసికంగా అనేక మందిని నిర్జీవులుగా మారుస్తాము.  

పునరుతానము
భారతదేశంలో మనకు అనేకమైన మతాలు ఉన్నవి. ఉదారణకు , హిందువులు, బౌద్దులు, ముస్లింలు, సిక్కులు, జైనులు ఇలా అనేకమైన మతాలు ఉన్నవి. బౌద్దులకు - గౌతమ బుద్దుడు, ముస్లింలకు - మొహమ్మద్, సిక్కులకు - గురునానక్, జైనులకు - వర్ధమాన మహావీర, హిందువులకు - ఎవరు లేరు. వీరి అందరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదు నేను చనిపోయి మళ్ళీ తిరిగి మరణము నుండి లేవబడతాను అని, అలా చెప్పింది కేవలం సజీవుడయినా యేసు ప్రభు. క్రైస్తవ మతానికి వ్యవస్థాపకుడు.ఇదే క్రైస్తవత్వంలో ఉన్నటువంటి విశిష్టత , మరి ఏ మతమునకు లేనటువంటి ప్రత్యేకత. సువిశేష పఠనములో యేసు ప్రభు ఒక ప్రశ్ననే రెండు విధాలుగా అడుగుతున్నారు. 
1 . యేసు ప్రభు తన శిష్యులను ప్రజలు తనను గురించి ఎవరు అని భావించుచున్నారు అని అడిగారు? 
2 . యేసు తన శిష్యులను నేను ఎవరని మీరు భావించుచున్న్నారు? అని అడిగారు.  
ఈ రెండు ప్రశ్నల మధ్య తేడా ఏమిటంటే
1 . మనిషి గురించి తెలుసుకొనుట,  
2 మనిషిని తెలుసుకొనుట.
యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే దేవాలయానికి రావడం అవసరంలేదు ఎందుకంటే 
a . పరిశుద్ద గ్రంధము చదివి యేసును తెలుసుకొనుట. 
b . పుస్తకాలను చదివి తెలుసుకోవచ్చు. 
c. లేకపోతే ఇపుడు మన సెల్ ఫోన్ ద్వారా యేసును గురించి ఎక్కడ పుట్టారో ఎం చేసారో తెలుసుకోవచ్చు. 
కానీ మనం యేసును తెలుసుకోవాలంటే దేవాలయానికి రావాలి. 
1 . ప్రార్ధన - పునీత అవిలాపురి తెరేస్సమ్మగారు ప్రార్ధన గురించి ఇలా చెబుతున్నారు. ప్రార్థన అనేది మనకు తెలిసిన వారితో స్నేహపూర్వక సంభాషణ. పునీత పేతురు గారు కూడా తన యొక్క జీవితంలో యేసు ప్రభుని గురించి ఎరిగియున్నాడు కాబట్టి యేసు అడిగిన వెంటనే “నీవు నిజమైన క్రీస్తువు” అని ప్రత్యుత్తరము యిచ్చియున్నాడు. ఇది కేవలం తన యొక్క ఆత్మసంబంధంతో చెప్పగలిగియున్నాడు. 
రెండొవ పఠనంలో మనము చూస్తున్నాం మనయొక్క విశ్వాసం కేవలం మాటల రూపంలో మాత్రమే కాకుండా చేతల రూపంలో ఉండాలని యాకోబు గారు మనకు తెలియపరుస్తున్నారు. పేతురు ఏ విధంగా అయితే దేవునితో ఆత్మీకసంబంధం ఏర్పరచుకొని తనయొక్క విశ్వాసాన్ని బలపరచుకున్నాడో అదేవిధంగా మనం కూడా మన యొక్క విశ్వాసంలో ధృడపడాలి. అంటే అది కేవలం మాట ద్వారా మాత్రమే కాకుండా మనయొక్క చేతల ద్వారా మనము ధ్రువపరుస్తూ ఉండాలి. 
   


బ్రదర్. రవి నరెడ్ల ఓ.సి.డి

7, సెప్టెంబర్ 2024, శనివారం

23వ సామాన్య ఆదివారం

23వ సామాన్య ఆదివారం 
యెషయా 35:4-7, యాకోబు 2: 1-5, మార్కు 7: 31- 37
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మెస్సయ్య కాలములో జరిగినటువంటి అద్భుతములను గురించి బోధిస్తున్నారు. దేవుడు సకల మానవాళికి శారీరక స్వస్థతను మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక స్వస్థతను వసగుతారు అనే అంశమును  కూడా తెలుపుచున్నవి.
ఈనాటి మొదటి పఠణంలో యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలలో నమ్మకమును, ఊరటను, సంతోషమును ఇచ్చే మాటలు పలుకుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని, వారు బాబిలోనియా బానిసత్వం నుండి బయటకు తీసుకుని రాబడతున్నారని ప్రవక్త తెలుపుచున్నారు. అనేక సంవత్సరాల సుదీర్ఘ బానిసత్వం జీవితం గడిపిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు సొంత భూమి యెరుషలేముకు  తిరిగి వచ్చినపుడు వారిలో ఒక విధమైన భయం ఉండేది ఎందుకనగా ఆ యొక్క ప్రాంతమును ఏదోమీయులు అప్పటికే ఆక్రమించి ఉన్నారు ఈ సందర్భంలో యెషయా దేవుడు తన ప్రజలను నడిపిస్తారు అని తెలిపారు. ఆయన తన ప్రజలను తానే నాయకుడిగా ఉండి నడిపించిన సందర్భంలో వారి మధ్య అనేక అద్భుతములు చేస్తారు అని తెలుపుతున్నారు. ఎవరైతే ఆయన యొక్క సహాయం కొరకు ఎదురుచూస్తూ ఉన్నారో మరీ ముఖ్యంగా అంధులకు, చెవిటి వారికి, మూగవారికి, నడవలేనటువంటి వారికి దేవుడు స్వస్థత ప్రసాదిస్తారు. ఇశ్రాయేలీయులు యెరూషలేమునకు తిరిగి రావటం ద్వారా దేవుడు వారిని దీవిస్తారని తెలుపుచున్నారు దానికి అనుగుణంగా వారిని ఎవరికిని భయపడవలసిన అవసరంలేదు అని తెలిపారు.  యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలుపుచున్న ఇంకొక అంశము ఏమిటంటే వారిని శత్రువుల నుండి కాపాడుతానని అభయమిస్తున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత యాకోబు గారు దేవుని యొక్క అనుచరులు అందరికి గుర్తు చేసే అంశం ఏమిటంటే వారు తమ తోటి వారిని ఎల్లప్పుడూ గౌరవించుకుని జీవించాలి.  ధనికులైన, పేదవారైనా ఎలాంటి వారైనా సరే భేదాభిప్రాయములు లేకుండా సరి సమానంగా చూడాలి. కొన్ని కొన్ని సందర్భాలలో ఎవరికైతే అంగవైకల్యం ఉన్నదో వారిని ఈ సమాజం చిన్న చూపు చూస్తుంటుంది అందుకే యాకోబు గారు క్రీస్తుని వెంబడించు వారు క్రీస్తువలె అందరిని కూడా సోదరభావంతో చూడాలని, ఎటువంటి వ్యత్యాసాలు చూపించవద్దని తెలుపుతున్నారు.
ఈ సమాజంలో చాలా సందర్భాలలో మనము మంచి వస్త్రాలు ధరించిన వారికి, ఆస్తిపాస్తులు ఉన్నవారికి ఇచ్చే గౌరవము ఒక విధంగా ఉంటుంది అలాగే పేదవారికి ఇచ్చే గౌరవం ఇంకో విధంగా ఉంటుంది అందుకే యాకోబు గారు గుర్తు చేస్తున్నారు మీరు క్రీస్తు నందు విశ్వాసము గలవారు కదా? ఇటువంటి వ్యత్యాసము చూపించకూడదు. ఈ లోకంలో పేదవారైనప్పటికీ వారి యొక్క విశ్వాసములో ధనికులై ఉండవచ్చు. 
లాజరు ఈ లోకంలో పేదవాడు గానే జీవించాడు కానీ ఆయన దేవుని రాజ్యంలో ప్రవేశించారు. బహుశా ఆయన యొక్క విశ్వాసము గొప్పదై ఉండవచ్చు. దేవుడు పేదవారిని తన రాజ్యములో ప్రవేశించుటకు వారికి ప్రత్యేక అనుగ్రహం దయ చేశారు. పేదవారు అనగా దేవుని మీద ఆధారపడి జీవించేవారు. ధనికుడు ఈ లోకంలో సుఖ భోగాల అనుభవించాడు కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. ఆయన దేవుని మీద ఆధారపడి జీవించలేదు. కాబట్టి ఈ లోకంలో ఎటువంటి వ్యత్యాసములు క్రైస్తవులు చూపవలదని యాకోబు గారు పలికారు.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు మూగ చెవిటి వానికి స్వస్థతను ఇచ్చిన విధానమును చదువుకుంటున్నాము. సాధారణంగా ఎవరైతే వినలేరో వారు మాట్లాడలేరు కూడా. ఎందుకంటే వినగలిగితేనే మాట్లాడగలరు కాబట్టి. యూదుల యొక్క ఆచారము, నమ్మకం ప్రకారము ఒక వ్యక్తి అనారోగ్య పాలయ్యాడంటే అతడు పాపం చేశాడని అందుకే అలాంటి వారిని చిన్నచూపు చూస్తారు. అందుకే ఈ అద్భుతం చేసేటప్పుడు ఏసుప్రభు ఆ యొక్క మూగ చెవిటి వారిని ప్రక్కక తీసుకుని వెళ్ళచ్చు స్వస్థతను ప్రసాదిస్తున్నారు. ఏసుప్రభు ఈ యొక్క అద్భుతం చేయు సమయంలో ఏడు విషయాలను మనము గ్రహించాలి. 
1. ఆయనను సమూహము నుండి ప్రక్కకు తీసుకుని వెళ్తున్నారు. ఆయన బలహీనతులు గుర్తించిన ప్రభు అందరి ముందు తన యొక్క గౌరవమును కాపాడుతూ పక్కకు తీసుకుని వెళుతున్నారు.
2. ఏసుప్రభు తన వ్రేళ్ళు పెట్టుచున్నారు. ఆయన స్పర్శ తనలో ఉన్న అంగవైకల్యం తొలగించి దీవిస్తుంది.
3. ఉమ్మి దానిని నీటితో తాకుచున్నారు. ఉమ్ములో స్వస్థత ఉందని ఆనాటి ప్రజల యొక్క నమ్మకం అందుకే వారి యొక్క విశ్వాసమును ఇంకా బలపరుచుటకు ప్రభువు ఉమ్మి అతనిని స్వస్థపరుస్తున్నారు.
4. అతడి యొక్క నాలుకను తాకుచున్నారు. 
5. ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్థించారు.
6. నిట్టూర్చారు 
7. ఎఫాత అని తన  పలికారు. ఆయన మాటతో  నోరు తెరవబడినది.
ఈ యొక్క అద్భుతము ద్వారా దేవుడు తన ప్రజలను ఏ విధంగా బాధలలో నుండి కాపాడతారో తెలుపుచున్నారు అదేవిధంగా ప్రభువు యొక్క ప్రేమ అర్థమవుతుంది. ఈ యొక్క అద్భుతములో మనము గ్రహించవలసినటువంటి అంశములు ఏమిటి అంటే, దేవుని యొక్క మాట మనందరం కూడా శారీరకంగా వింటున్నామే కానీ ఆధ్యాత్మికంగా దేవుని యొక్క వాక్యమును విని దాని ప్రకారం గా నడుచుకోవడం లేదు. 
ఈ సువిశేషం లో ప్రభువు 'ఎఫాత' అనగానే తన యొక్క మూసుకొని ఉన్న చెవులు తెరవబడ్డాయి. అదే విధముగా దేవుడి యొక్క వాక్యము విన్న సందర్భంలో కూడా మన యొక్క హృదయాలు తెరవబడాలి. మన యొక్క కనులు తెరవబడాలి అప్పుడే మనము ఏది సత్యమమో గ్రహించగలుగుతాము. చాలా సందర్భాలలో మన యొక్క హృదయాలు ఆ యొక్క చెవిటివానివలె మూసుకొని పోతూ ఉంటాయి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయుట విన్నా కానీ సహాయం చేయకుండా ఉంటాం. చాలా సందర్భాలలో మనము మంచి చేయాలి అని వినినప్పటికీ కూడా దానిని వెననట్టుగానే ఉంటుంటాం దీనివలన మనము ఆధ్యాత్మికంగా ఎదగలేము దేవుని యొక్క దీవెనలు పొందలేము.  వినకపోవటం ద్వారానే ఈ లోకంలో చాలా సమస్యలు వస్తున్నాయి కుటుంబాలలో విడాకులు వస్తున్నాయి, వక్రమార్గాలను అనుసరిస్తున్నారు, చాలా తప్పులు చేస్తున్నారు ఎందుకంటే విని జీవితాన్ని సరి చేసుకోలేకపోతున్నారు కాబట్టి. మన జీవితంలో ప్రభువు మన మీద ఆసక్తి చూపుతుంది మన రక్షణ కొరకై ఇచ్చిన వాక్యమును ఆలకించి, ఆధ్యాత్మికంగా మన హృదయాలు తెరుచుకొని దేవుని యొక్క బాటలో నడవటానికి ప్రయత్నం చేయాలి.
Fr. Bala Yesu OCD

2, సెప్టెంబర్ 2024, సోమవారం

1 కొరింతి 2:1-5, లూకా 4:16-30

 1 కొరింతి 2:1-5, లూకా 4:16-30

తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్ధనామందిరమునకు వెళ్లెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా, యెషయా ప్రవక్త గ్రంధమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. "ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను." దీనిని చదివి యేసు గ్రంధమును మూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరు, ఆయనవంక తేరిచూచుచుండగా, ఆయన వారితో "నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది"అని  పలికెను. అది వినిన ప్రజలందరు దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి "యితడు యోసేపు కుమారుడు కాడా ?" అని చెప్పుకొనసాగిరి. అంతట యేసు వారితో 'ఓ వైద్యుడా! నీకు నీవే చికిత్స చేసికొనుము అను సామెతను చెప్పి, "నీవు కఫర్నాములో ఏ యే  కార్యములు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములనెల్ల ఇచట నీ స్వదేశంలో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలీయా కాలమున మూడు సంవత్సరములు ఆరు మాసములు అనావృష్టివలన దేశమంతట గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు యిస్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సరేఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలీయా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో యిస్రాయేలీయులలో చాలామంది కుష్ఠ రోగులు ఉన్నను, సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరును స్వస్థత పొందలేదు" అని పలికెను. అపుడు ప్రార్ధనామందిరములోని ప్రజలు అందరు యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకునెట్టుకొని పోయి, తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొనివెళ్ళి, అచట నుండి తలక్రిందుగా  పడత్రోయతలచిరి. కాని యేసు వారి మధ్య నుండి తొలగి తనదారిన తాను వెళ్లిపోయెను. 

మొదటి పఠనములో మానవ జ్ఞానము నిష్ఫలమైనదని పౌలుగారు తెలియజేస్తున్నారు. పౌలుగారుప్రసంగాలు కేవలం  దేవుని వాక్యమే. మనం కూడా పౌలులాగా వాక్యంలో క్రీస్తును చూపించాలి. లోక జ్ఞానాన్ని ప్రదర్శించే ప్రయత్నం పౌలు ఎన్నడు చేయలేదు. 

మన విశ్వాసము, మనుషుల జ్ఞానమును ఆధారము చేసికొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని యుండవలెను. ఈ రోజుల్లో ఆకర్షణీయమైన మాటలు చెప్పే బోధకులున్నారు. కానీ పవిత్రాత్మ చే నడపబడి దేవుని శక్తి వ్యక్తమయ్యే బోధకులు తక్కువగా ఉన్నారు.. మానవ జ్ఞానానికి దారి తియ్యని మాటలకు ఆకర్షితులై ఎంతో మంది విశ్వాసంలో తప్పు దోవ పడుతున్నారు. 

ఓ తండ్రి, పది సంవత్సరాల కొడుకు బస్సు ప్రయాణం చేస్తున్నారు. మాములుగా చిన్న పిల్లలు అడిగే ప్రశ్నలు ఎక్కడ? ఎప్పుడు?ఎందుకు?  ఏమిటి? ఇలా ఆ అబ్బాయి తండ్రిని ఎన్నో ప్రశ్నలు అడిగాడు. చివరికి డాడీ రోడ్డుకు వేసే తారును దేనితో తయారు చేస్తారు? అని అడిగాడు. తండ్రి కొద్దిగా కొపంతో బాబు నీవు  ఈ రోజు నన్నడిగిన ప్రశ్నల్లో ఇది 999 వ ప్రశ్న. దయచేసి కొంత సేపు నన్ను వదిలెయ్యి అంటూ. నేను గనుక మా నాన్నను యిన్ని ప్రశ్నలను అడిగి ఉంటె నాకేమయ్యేది? అని అనుకున్నాడు. కొడుకు కొద్దిసేపు ఆలోచించి నా ప్రశ్నలకు చాలావరకు నాకు సమాధానాలు నాకు తెలిసేవి అన్నాడు. ఈ లోక జ్ఞానం చూసి, విని తెలుసుకునేలా ఉంటుంది. కానీ పరలోక సంబంధమైన జ్ఞానము పవిత్రాత్మ మాత్రమే ఒసగుతుంది. 

ఇవి అద్భుతం ద్వారా నిరూపిస్తున్నారు. అపవిత్రాత్మలు సైతం క్రీస్తు వాక్కుకు లోబడి ఉన్నవి . అధికారపూర్వమైన హెచ్చరిక రాగానే  అపవిత్రాత్మ వెళ్ళిపోతుంది. సువార్తలో ఈ అద్భుతాన్ని చూసి ప్రజలు   క్రీస్తు అధికారాన్ని అంగీకరించారు. ఇలా గుర్తుల ద్వారా వచ్చిన విశ్వాసం గొప్పది  చూసి   విశ్వసించిన వారికంటే చూడక విశ్వసించిన వారు ధ్యనులు.  ఆ ధన్యతను మనకు ప్రసాదించమని విశ్వాసంలో బలపడేలా దీవించమని ఈనాడు ప్రత్యేకంగా ప్రార్ధించుదాం. ఆమెన్

ఫా. రాజు సాలి OCD

31, ఆగస్టు 2024, శనివారం

22 వ సామాన్య ఆదివారం

22 వ సామాన్య ఆదివారం 
ద్వితీయో 4:1-2,6-8, యాకోబు 1:17-18, 21-22, 27, మార్కు 7:1-8,14-15,21-23
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు ఒక నిజమైన మత ఆచరణ అనేది కేవలము నామమాత్రపు నియమ నిబంధనలను పాటించు మాత్రమే హృదయ శుద్ధితో, నీతితో, న్యాయంతో, ప్రేమతో దయతో కూడినదిగా ఉండాలని తెలుపుతున్నవి.
 మతమును పాటించుట అనేది కేవలం బాహ్య ఆచారాలు, సాంప్రదాయాలు పాటించుట మాత్రమే కాదు మతము అనగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుట, దేవునితో సంబంధం కలిగి జీవించుట, దేవునికి విధేయత చూపుట, దేవుడిని సంపూర్ణ హృదయముతో ఆరాధించి సేవించుట వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే దేవుడిని తెలుసుకుని ఆ దేవుని యొక్క ప్రేమను నలుగురికి పంచటమే నిజమైనటువంటి మతం యొక్క సారాంశం. మనందరం కూడా క్రైస్తవ మతము ఆచరిస్తూ ఉన్న కాబట్టి కేవలము ఈ యొక్క సాంప్రదాయాలు ఆచారాలు మాత్రమే కాకుండా వాటన్నిటికన్నా విలువైన దేవుడు చేయమని తెలిపిన క్రియలను చేయాలి.
ఈనాటి మొదటి పఠణంలో మోషే ప్రవక్త దేవుని యొక్క చట్టమును గురించి తెలుపుచూ దేవుని యొక్క గొప్పతనమును చాటి చెబుతున్నారు. ప్రజల యొక్క అభివృద్ధి కొరకు, నవజీవనం కొరకు, వారి శ్రేయస్సు కొరకు దేవుడు చట్టమును మోషే ద్వారా ప్రజలకు అందజేశారు. ఈయొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమిటంటే "మంచి జీవితమును దేవునితో తోటి ప్రజలతో జీవించుట". ప్రజల యొక్క జీవితము ఇష్టము వచ్చిన విధంగా కాకుండా వారి యొక్క జీవితం మంచి కొరకై ఉండులాగున ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, సహాయం చేసుకుంటూ, దేవుడిని తెలుసుకుని సేవించాలి అన్నది ప్రభువు యొక్క ఉద్దేశము. దేవుని చట్టము, విధులు మన జీవితంను సరి చేస్తుంటాయి. ఈ యొక్క చట్టము దేవుడే స్వయంగా, ఏదైతే మానవుల యొక్క ప్రయోజనమునకు ఉపయోగపడుతుందో దానిని మాత్రము మోషేతో రాయించారు. ఈ చట్టం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు కలుగు మూడు ప్రయోజనాలు మనము గ్రహించాలి; 
1. ఇశ్రాయేలు ప్రజలు మిగతా ప్రజల కన్నా భిన్నముగా జీవించుట కొరకే ఈ యొక్క చట్టమును దేవుడు ఏర్పరిచారు. (Their life must be something different from others. They were called to live a special life)
2. దేవుని చట్టము ఇశ్రాయేలు ప్రజలు గర్వించే లాగా చేస్తుంది. ఎందుకంటే దేవుడు వారితో ఒక ఒడంబడిక చేసుకుంటున్నారు ఇలాంటి ఒడంబడిక ఇంతకుముందు ఏ దేవుడు ఎవరితో చేసుకోలేదు కానీ మొదటిసారిగా యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఈ ఒడంబడిక చేస్తున్నారు.
3. ఇతర ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను చూసి ఆశ్చర్యవంతులుగా చేస్తుంది ఎందుకంటే కేవలం ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న దేవుడు మాత్రమే పిలిచిన వెంటనే స్పందిస్తారు వారికి ఎప్పుడూ దగ్గరలోనే ఉంటారు కాబట్టి ఈ యొక్క చట్టం ఇవ్వటం ద్వారా దాన్ని అనుసరించటం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తండ్రిగా మరియు ప్రజలు బిడ్డలుగా మారుచున్నారు.
 దేవుడు ప్రసాదించిన ఆజ్ఞలను పాటించిన యెడల మీరు బ్రతికెదరు అని మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క చట్టం అనగా మోషే ఇచ్చిన పది ఆజ్ఞలు మరియు బైబిల్ గ్రంధంలో ఉన్న మొదటి 5 పుస్తకాలు (ఆదికాండము నిర్గమకాండం లేవియాకాండం సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండము) వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి జీవిస్తారు. ప్రభువు, ఏ ఆజ్ఞలనైతే ఇచ్చి ఉన్నారో వాటిని తప్పనిసరిగా ఆచరించమని తెలుపుతూ ఇక వాటితో వేటిని కూడా జత చేయవద్దు అని తెలుపుచున్నారు ఎందుకంటే దేవుడు కన్నా అన్ని తెలిసినవారు ఎవరూ లేరు. దేవుడే స్వయముగా మన యొక్క మంచి కొరకు  ఏది ఉపయోగపడునో దానిని లిఖించి ఉన్నారు. మానవ మాతృల యొక్క జ్ఞానం చాలా తక్కువ కాబట్టి మనం ఏది కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు జత చేయకూడదు. ప్రభువు ప్రసాదించిన ఆజ్ఞలను మన యొక్క జీవితంలో ఈ లోకంలో ఉన్న వ్యక్తుల యొక్క జీవితం కన్నా భిన్నంగా చేస్తుంది.
ఈనాటి రెండవ పఠణంలో దేవుని యొక్క వాక్యమును కేవలము వినటం మాత్రమే కాక దానిని ఆచరింపమని తెలుపుచున్నారు. చెడు ప్రవర్తనను ఆలోచనలను విడిచి మంచిగా జీవించమని తెలుపుచున్నారు. మంచిగా జీవించుట కొరకు మన యొక్క హృదయము శుద్ధిగా ఉండాలి అప్పుడే మనం మంచిగా జీవించగలుగుతాం కాబట్టి విన్నటువంటి వాక్యం మనలను శుద్ధి చేయాలి. ఆ వాక్యము మన జీవితమును మంచి వైపు నడిపించాలి అప్పుడే మనందరం పవిత్రులుగా ఉండగలుగుతాం.
ఈనాటి సువిశేష భాగములో కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభువు యొక్క శిష్యులు చేతులు కడుగకుండ భుజించుట చూసి, వారు ఏసుప్రభువునకు ఫిర్యాదు చేస్తున్నారు. పూర్వులు చేతులు కడగకుండా భుజించలేదు అని  అదేవిధంగా ఇంకా పూర్వపు ఆచారాలను ఎన్నో పాటించేవారు అని తెలుపుచున్నాను దానికి ప్రతిఫలంగా ఏసుప్రభు, ఆచారములకన్నా, హృదయ శుద్ధి ముఖ్యమని తెలిపారు ఎందుకనగా ఉదయం సరిగా లేకపోతే జీవితం సరిగా ఉండదు. మన హృదయం మన జీవితమునకు కేంద్రంగా ఉంటుంది కాబట్టి హృదయము మంచిదైతే మనసు కూడా మంచిదవుతుంది అందుకే ప్రభువు బయట నుండి లోపలికి వెళ్లే దాని కన్నా లోపల నుండే బయటకు వచ్చేది ముఖ్యమైనది దానిని గురించి జాగ్రత్త వహించమని తెలుపుచున్నారు.
ఏసుప్రభు యొక్క కాలం నాటికి యూదుల యొక్క సాంప్రదాయాలు ఆచారాలు చాలా విపరీతంగా పెరిగాయి. సాధారణ ప్రజలు మోయలేనటువంటి మహా భారంగా ఈ యొక్క ఆచారాలు, సంప్రదాయాలు తయారయ్యాయి. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు బాహ్య శుద్ధికే ప్రాముఖ్యతను ఇచ్చారు కానీ హృదయ శుద్ధికి ప్రాముఖ్యత ఇవ్వలేదు ఎందుకంటే వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. వారు దేవుడిని ఆరాధించేది కేవలము వారి యొక్క పెదవుల ద్వారా మాత్రమే. (మార్కు 7: 1-8). దేవుడు ముఖ్యముగా కోరుకునేది మానవ హృదయం ఎందుకంటే విలువైనటువంటి అంశములన్నీ కూడా హృదయమునుండే పుట్టుకొని వస్తాయి మన హృదయము మంచిగా ఉండిన యెడల మన యొక్క జీవితం కూడా మంచిగానే ఉండును. బయటకు కంటికి బాగున్నదంతా లోపల బాగుండదు అలాగే బయట కంటికి బాగాలేనిది లోపలి కూడా బాగుండదు అని చెప్పలేము ఎందుకంటే మేడిపండు చూడటానికి బయట బాగానే ఉన్నా లోపల పురుగులు ఉంటాయి కాబట్టి బయట, లోపల ఒకే విధంగా మన స్వభావం ఉండాలి. 
మచ్చలు ఉన్న ఉల్లిపాయ బయటకు బాగుండదు కానీ పొరలు పొరలు తీయగా అది లోపల బాగుంటుంది. మన యొక్క జీవితంలో మనకి అందచందాలు ఉన్న, ఆచారాలు చట్టాలు పాటించినా హృదయం అనేది నిర్మలంగా లేకపోతే ఏమి చేసినా వ్యర్థమే కాబట్టి మనము బాహ్య శుద్ధి కాక అంతరంగిక శుద్ధిని అలవర్చుకోవాలి. 
మన యొక్క మతమును ఆచరించుటలో హృదయం అనేది చాలా ముఖ్యము కాబట్టి ఆ హృదయమును ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉంచుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ జీవించటానికి ప్రయత్నించుదాం.

Fr. Bala Yesu OCD

మత్తయి 25: 14-30

 మత్తయి 25: 14-30

"ఒకడు దూరదేశమునకు ప్రయాణమై పోవుచు సేవకులను పిలిచి, తన ఆస్తిని వారికి అప్పగించెను. వారివారి సామర్ధ్యమును బట్టి ఒకనికి ఐదు లక్షలు వరహాలను, మరియొకనికి రెండు లక్షలు వరహాలను, ఇంకొకనికి ఒక లక్ష వరహాలను ఇచ్చివెళ్లెను. ఐదులక్షల వరహాలను పొందిన వాడు వెంటనే వెళ్లి వ్యాపారముచేసి మరియైదు లక్షలు సంపాదించెను. అట్లే రెండు లక్షలు వరహాలను పొందినవాడు మరి రెండు లక్షలను సంపాదించెను.  కాని ఒక లక్ష వరహాలను పొందినవాడు వెళ్లి నేలను త్రవ్వి తన యజమానుని ద్రవ్యమును దాచెను. చాలకాలము గడిచిన తరువాత ఆ సేవకుల యజమానుడు తిరిగివచ్చి, వారితో లెక్కలు సరిచూచుకొననారంభించేను. ఐదులక్షల వరహాలను పొందిన సేవకుడు మరి ఐదు లక్షల వరహాలనుతెచ్చి , స్వామీ! తమరు  నాకు అయిదు లక్షల వరహాలను ఇచ్చితిరి. ఇదిగో ! మరి ఐదు లక్షలు సంపాదించితిని అనెను. అపుడు ఆ యజమానుడు వానితో మంచిది, నీవు ఉత్తముడవు. నమ్మినబంటువు. స్వల్పవిషయములందు శ్రద్ధవహించితివి. కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో నీవు పాలుపంచుకొనుము అనెను. రెండు లక్షల వరహాలను  పొందినవాడు వచ్చి, స్వామీ! మీరు రెండు లక్షల వరహాలను ఇచ్చితిరిగదా! ఇదిగో! మరి రెండు లక్షలు సంపాదించితిని అనెను. అప్పుడు ఆ యజమానుడు అతనితో , మంచిది, నీవు ఉత్తముడవు. నమ్మినబంటువు. స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి. కనుక అనేక విషములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో పాలుపంచుకొనుము అనెను. పిదప ఒక లక్ష వరహాలను పొందిన వాడు వచ్చి, అయ్యా ! నీవు కఠినుడవని నేను ఎరుగుదును. నీవు నాటనిచోట కోయువాడవు. విత్తనములను చల్లనిచోట పంట కూర్చుకొనువాడవు.  కనుక నేను భయపడి, వెళ్లి నీ లక్ష వరహాలను భూమిలో దాచితిని. ఇదిగో నీ ధనమును నీవు తీసికొనుము అని  పలికెను. అపుడు ఆ  యజమానుడు వానితో , ఓరీ దుష్ట సేవకా! సోమరీ! నేను నాటనిచోట పంటకోయువాడననియు, విత్తనములు చల్లనిచోట పంట కూర్చుకొనువాడననియు నీవు ఎరుగుదువు కదా! అట్లయిన నా ధనమును వడ్డీకిచ్చియుండవలసినది. నేను తిరిగివచ్చినపుడు వడ్డీతో సహా సొమ్ము పుచ్చుకొనియుందునుగదా! అని పలికి సేవకులతో ఆ లక్ష వరహాలను వీనినుండి తీసివేసి పది లక్షల వరహాలు కలవానికి ఈయుడు. ఉన్న ప్రతివానికి ఇంకను ఈయబడును. అపుడు అతనికి సమృద్ధికలుగును. లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు ఏడ్చుచు పండ్లు కోరుకుకొందురు అని పలికెను.  

క్రీస్తు నాధుని యందు ప్రియ విశ్వాసులారా ఈనాటి మొదటి పఠనంలో మనము మన జీవితాలను  పరిశీలించుకోవాలి అని ప్రభువు మనకు బోధిస్తున్నాడు. దేవుని పిలుపు పొందక ముందు, దేవుని ప్రజలలాగా మనము ఎన్నుకొనక ముందు, మనం ఎలా ఉన్నాము అని మనము ఆలోచించాలి. మనలో చాల మందిని  చూసినట్లయితే వివేకవంతులు, శక్తివంతులు సాంఘికంగా ఉన్నత జీవనము కలవారము కొందమందిమే. ఇది సత్యం ప్రియా విశ్వాసులారా లోకముచే బలహీనులుగా, అల్పముగా, నీచముగా విలువలేని వారిగా ఉన్న మనలను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు మనలను తన ప్రేమ చేత  గొప్పవారినిగా చేస్తాడు. చాలా మందిని మనం చూస్తున్నాము, ఎన్నో బలహీనతలు వాటితో పాటు, ఎన్నో పాపకార్యాలు చేస్తూ దేవునికి, కుటుంబానికి దూరంగా జీవిస్తున్నారు. సంఘంలో, కుటుంబంలో చాలా మంది నీచముగా విలువలేని వారీగా జీవిస్తున్నాము. అలాంటి వారి మాటలకు ఏ విలువ ఉండటం లేదు. విలువ లేని జీవితాలు జీవిస్తూ, అల్పులుగా  మారి పోతున్నారు. 

ఈలోక పాప జీవితంలో మ్రగ్గుచున్న వారిని, బలహీనులుగా భావింపబడువారిని ఆయన ఎన్నిక చేసుకొని మనలను క్రీస్తుతో ఏకము చేసి, క్రీస్తు ద్వారా మనలను నీతిమంతులుగా, పరిశుద్దులుగా, విముక్తులుగా దేవుడు చేసాడు. మనం బలహీనులము, అల్పులము, విలువలేని వారము కాబట్టి దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనవలదు. గొప్పలు చెప్పదలచినవాడు ప్రభువు చేసిన గొప్ప కార్యాలను గూర్చి చెప్పవలయును. కానీ ప్రియ విశ్వాసులారా ! మనలో చాలామంది  గర్వంతో, స్వార్ధంతో, అవివేకంతో, పొగరుతో దేవుడూ చేసిన గొప్ప కార్యములను మర్చిపోయి జీవిస్తున్నారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా మనం ఎలా ఉన్నాము, దేవుని గూర్చి గొప్పలు చెప్పుకుంటున్నామా!   లేదా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ఈనాటి సువిశేష పఠనంలో ఒక యజమాని తన సేవకులను గురించి తెలియజేస్తున్నాడు. ఆ యజమానుడు తన సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్ధ్యము బట్టి వారిలో  ఓకనికి  ఐదు లక్షలు, మరియొకనికి రెండు లక్షలు, ఇంకొకనికి ఒక లక్ష వరహాలను ఇచ్చెను. ఈ ఉపమానము ద్వారా  దేవుడు మనకు ఏమి తెలియజేస్తున్నాడు అంటే ప్రభువు కూడా మన మన సామర్ధ్యము  బట్టి, మనకు ఎన్నో గొప్ప బాధ్యతలను, గొప్ప విషయములను మనకు అప్పగిస్తుంటాడు. మనలో ఎంత మందిమి శ్రమించి, కష్టపడి దేవుడిచ్చిన బాధ్యతలను నెరవేర్చుతున్నాము? ఎంత మందిమి ఉత్తముడైన దేవుని నమ్మినబంటుగా స్వల్ప విషయములందు శ్రద్ధ వహించుచున్నాము. చాల మందిమి ఉత్తమ జీవితం జీవించలేక పోతున్నాం. నమ్మకమైన వారీగా ఉండలేక పోతున్నాం, స్వల్ప విషయలందు శ్రద్ధ తీసుకోలేక పోతున్నాం.  

ప్రియ విశ్వాసులారా దేవుడు మన సామర్ధ్యమును బట్టి ఎన్నో  గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తిని మనకు  దయచేస్తున్నాడు.  కాని మనము సోమరితనంతో లేక భయంతో, స్వార్ధంతో గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం.  శ్రద్దగా జీవించలేకపోతున్నాం. ఎవరైతే దేవుడిచ్చిన వరాలను అనుగ్రహాలను ఉపయోగిస్తారో వాడుకలో ఉంచుతారో వారిని అధికముగా దీవిస్తాడు.  ఉన్న ప్రతి వానికి ఇంకను ఈయబడును, లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. కాబట్టి ప్రియ విశ్వాసులారా      మనకు ఉన్న ప్రతి దానికి దేవుని కొరకై ఉపయోగించుదాం. అప్పుడు మనకు సమృద్ధి కలుగుతుంది. 

ప్రార్ధన : నీతిమంతుడైన దేవా! మేము బలహీనులము, అవివేకులము విలువలేని వారము  కాని నీ ప్రేమ ద్వారా  మమ్ము నీతిమంతులుగాను, పరిశుద్దులుగాను విముక్తులుగాను చేసి మా సామర్ద్యములను బట్టి మమ్ము దీవించి  వరములను అనుగ్రహములను దయచేసి వాటి ద్వారా మేము ఉత్తమ జీవితం జీవించే భాగ్యం మాకు దయజేసిరివి మాకున్న సమాస్థానాన్ని నీ కొరకు ఉపయోగించే భాగ్యమును  మాకు  దయచేయండి. ఆమెన్ 

24, ఆగస్టు 2024, శనివారం

21వ సామాన్య ఆదివారం

21వ సామాన్య ఆదివారం 
యెహోషువ 24:1-2,15-18, ఎఫేసీ 5:21-32, యోహాను 6: 61-70

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనములు మన యొక్క జీవితంలో తీసుకునే నిర్ణయం గురించి తెలుపుచున్నవి. గత నాలుగు ఆదివారాలుగా ఏసుప్రభువు దివ్యసప్రసాదం యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలుపుచు, దివ్య సత్ప్రసాదమును స్వీకరించుట ద్వారా కలుగు ప్రయోజనములను వివరిస్తూ ఈనాటి ఆదివారములో మనందరికీ కూడా ఈ దివ్య సత్ప్రసాద స్వీకరణను గురించి ఒక నిర్ణయం తీసుకొనమని తెలుపుచున్నారు.
మన యొక్క అనుదిన జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించే వరకు ఎన్నో రకాలైనటువంటి అంశాల మధ్య మనము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. ఉదాహరణకు ఏమి తినాలా? ఏమి త్రాగాలా, ఎలాంటి వస్త్రాలు ధరించాలి? ఎవరితో మాట్లాడాలి? ఎలా చదవాలి? ఎలా ప్రయాణం చేయాలి? ఎలా ప్రార్థించాలి?  ఆదివారం దేవాలయానికి వెళ్లాలా? ఈ విధంగా అనేక అంశాల గురించి మనందరం కూడా రోజు వివిధ రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. మనము తీసుకునేటటువంటి నిర్ణయము మీదే మన యొక్క జీవితము ఆధారపడి ఉంటుంది ఎందుకనగా మనము సరియైన నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాలు సంతోషంగా ఉంటాయి సరియైనటువంటి నిర్ణయం తీసుకోపోతే జీవితాంతం మనం బాధపడాల్సి వస్తూ ఉంటుంది.
 ఈనాటి మొదటి పఠణంలో యెహోషువా ప్రవక్త న్యాయాధిపతులను, పెద్దలను అందరినీ షెకెము వద్ద సమావేశపరచి ఏ దేవుడిని ఆరాధించాలో నిర్ణయం తీసుకొనమని తెలుపుచున్నారు. అన్య దైవములను పూజించాలా? లేక యావే దేవుడిని ఆరాధించాలా? అనే ఒక ప్రశ్న ఇశ్రాయేలు ప్రజల ముందు యెహోషువ ప్రవక్త ఉంచుతున్నారు. యెహోషువ దేవునితో సంభాషించారు, దేవుని యొక్క అద్భుత కార్యములు కనులారా చూసారు, దేవుడు రక్షించిన విధానమును ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నాడు , ఐగుప్తు బానిసత్వం నుండి స్వేచ్ఛను కలిగించిన విధానమును మననం చేసుకున్నారు అందుకనే ఆయన నేను నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధించుదము అని పలికారు. ఆయన తన జీవితంలో ఉత్తమ నిర్ణయం తీసుకున్నాడు. అదే సమయంలో అక్కడి ప్రజలందరూ కూడా  మమ్ము రక్షించినటువంటి యావే దేవుడిని మేము సేవింతుము అని పలికారు. ఈ మొదటి పఠణంలో ఎలాంటి దేవుడిని అనుసరించాలి అని వారు సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నారు. అన్యదైవములకు మరియు నిజమైన దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసంలో వారు నిజ దేవుని యొక్క గొప్పతనమును గ్రహించి యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తాము అని ఒక నిర్ణయం తీసుకున్నారు. 
ఒక నిర్ణయం మన జీవితాన్ని మార్చి వేస్తుంది.
 1. ఆదాము అవ్వ తీసుకున్నటువంటి, పండు తినాలి అని నిర్ణయం వారి జీవితంలో చాలా కోల్పోయేలాగా చేసింది.
2.అబ్రహాము యొక్క మంచి నిర్ణయం తనను విశ్వాసులకు తండ్రిగా చేసింది. 
3. ఏసావు  తప్పుడు నిర్ణయం తన యొక్క అధికారం, దీవెనలు కోల్పోయేలాగా చేసింది.
4. సౌలు యొక్క మూర్ఖ నిర్ణయం తన యొక్క పదవి కోల్పోయేలాగా చేసింది. 
5. మోషే ప్రవక్త యొక్క నిర్ణయం తనను నాయకుని చేసింది. 
6. దానియేలు యొక్క మంచి నిర్ణయం తనను దేవునికి సాక్షిగా చేసింది.
7. మరియ తల్లి తన జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయం ద్వారా మనకు రక్షకుడు తన ద్వారా జన్మించారు.
8. పేతురు తీసుకున్న నిర్ణయం తనను అపోస్తులలకు నాయకునిగా చేసింది. 
9. అననీయ సఫీరాల నిర్ణయం దేవుడిని మోసం చేసేలా చేసింది. 
వారు తీసుకున్నటువంటి నిర్ణయములను బట్టి వారి జీవితాన్ని యొక్క ప్రతిఫలం అనేది నిర్దేశించబడినది.
 చాలా సందర్భాలలో సరియైన నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం కాబట్టి ప్రార్థిస్తూ, దేవుని సహాయం కోరుతూ, మన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యొక్క కుటుంబము విధేయత కలిగిన కుటుంబం లాగా జీవించమని తెలుపుచున్నారు. వారు (భార్యా-భర్తలు) వివాహ రోజున దేవుని ముంగట తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఒకరి ఎడల ఒకరు పరస్పర ప్రేమ కలిగి, విధేయత కలిగి ఒక ఆదర్శవంతమైన దేవుని కుటుంబ జీవితమును ప్రేమానురాగములతో జీవించమని తెలుపుచున్నారు. దేవుని ముంగిట తీసుకున్న నిర్ణయములో వారు ఎల్లప్పుడూ కూడా విశ్వాస పాత్రులుగా ఉండాలి. తీసుకున్న నిర్ణయమునకు కట్టుబడి జీవించాలి.
ఈనాటి సువిశేష భాగములో అనేకమంది ప్రజలు ఏసుప్రభు యొక్క మాటలు విని ఈయన బోధనలు కఠినమైనవి అని పలికి ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు. ఏసుప్రభు ఇచ్చిన ఆహారమును భుజించారు, ఆయన యొక్క అద్భుత కార్యములు చూశారు అయినప్పటికీ కూడా వారిలో విశ్వాసము కలగలేదు. అనేకమంది శిష్యులు ఏసుప్రభును విడిచి వెళ్లి మరెన్నడను వెంబడింపరైరి. ఆ సమయములో ఏసుప్రభు తన 12 మంది శిష్యులను మీరు కూడా వెళ్లిపోయిదరా? అని అడగగా పేతురు, ప్రభువు మేము ఎవరి వద్దకు పోగలము "నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు" మేము నిన్నే అనుసరింతుము అని పలికెను. పేతురు తన యొక్క జీవితంలో ఒక సరైన నిర్ణయం తీసుకుంటున్నారు. దేవుని యొక్క శక్తిని గ్రహించిన వ్యక్తి, అద్భుత కార్యములు చూసిన వ్యక్తి, యేసు ప్రభువుని సజీవ దేవుని కుమారుడు ఒక మెస్సయ్య అని గుర్తించినటువంటి పేతురు మేము నిన్ను మాత్రమే అనుసరిస్తాము అని ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు.
మన యొక్క అనుదిన జీవితంలో కూడా అనేక సందర్భాలలో మనం సరైన నిర్ణయం తీసుకోక రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేసే వ్యక్తులుగా ద్వంద స్వభావం కలిగిన జీవితం జీవిస్తూ ఉంటాం. ఇటు క్రైస్తవ సాంప్రదాయాలు పాటిస్తాం అదేవిధంగా అటు ఇతర మతముల యొక్క ఆచారమును కూడా పాటిస్తూ ఉంటా కానీ నేడు ప్రభువు మనల్ని కూడా ఒక సరియైనటువంటి నిర్ణయం తీసుకొని మనం తెలుపుతున్నారు. మనలో నిజముగా దివ్యసప్రసాద అనుభూతి కలిగినట్లయితే మనం కూడా దేవుడిని అంటిపెట్టుకొని జీవించగలుగుతాం, ఆయన యొక్క శక్తిని గ్రహించగలుగుతాం కాబట్టి నా జీవితంలో సరైన నిర్ణయం తీసుకొని దివ్య బలి పూజలో పాల్గొని, దేవుని యొక్క దీవెనలు పొందాలి.
Fr. Bala Yesu OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...